
సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు ముమ్మరం
కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 15నుంచి 26వతేదీ వరకు జరిగే సరస్వతీ నది పుష్కరాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ పేర్కొన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సబ్ కలెక్టక్ మయాంక్ సింగ్‌తో కలిసి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. సరస్వతీ(వీఐపీ) ఘాట్, సరస్వతీ మాతా విగ్రహం ఏర్పాటు, శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం పనులు పరిశీలించారు. టెంట్ సిటీ నిర్మాణానికి సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడారు. త్వరగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేటినుంచి సరస్వతిమాత విగ్రహం ఏర్పాటు పనులు జరుగుతుందని తెలిపారు. వీఐపీ ఘాట్ వద్ద తోరణ నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని ఎండోమెంట్ ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. తాగునీరు, భక్తులు దుస్తులు మార్చు గదులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈఓ మహేష్, ఇరిగేషన్ ఈఈ తిరుపతి రావు, డీపీఓ వీరభద్రయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్టీసీ డీఎం ఇందు, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, డీటీ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
10వ తేదీ వరకు పనులు పూర్తిచేయాలి