
డెంగీ నియంత్రణ చర్యలు చేపట్టాలి
ఎంజీఎం: డెంగీ నియంత్రణకు ప్రతిఒక్కరూ చర్యలు చేపట్టాలని వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు సూచించారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎంజీఎం నర్సింగ్ కళాశాల నుంచి ఐఎంఏహాల్ వరకు నిర్వహించిన ర్యాలీని డీఎంహెచ్‌ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం జంక్షన్‌లో మానవహారం నిర్వహించిన అనంతరం ఐఎంఏ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో సాంబశివరావు మాట్లాడారు. ఈడిస్ దోమ పగటిపూట కుడితే డెంగీ వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధికారక దోమ నీటిలో వృద్ధి చెందుతుందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే 90 శాతం వ్యాధిని అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, లక్షణాలు ఉన్న వారిని గుర్తించి రక్త పరీక్షలు చేసి డెంగీ మరణాలను అరికట్టవచ్చని వైద్యాధికారులు, సిబ్బందికి తెలి పారు. జీడబ్ల్యూఎంసీ సీహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ అర్బన్ మలేరియా సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో డెంగీ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్, కొమురయ్య, ప్రో గ్రాం ఆఫీసర్లు ఆచార్య పతి, అర్చన, విజయకుమార్, మెడికల్ ఆఫీసర్ యశస్విని, జిల్లా మలేరియా అధికారి రజిని, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఇన్‌చార్జ్ ఏఎంఓ మాడిశెట్టి శ్రీనివాస్, సబ్ యూనిట్ ఆఫీసర్ నాగిరెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్లు సదానందం, రాజశేఖర్, నర్సమ్మ, మధుకర్, నర్సింగ్ కళాశాల ట్యూటర్ స్వర్ణలత, సీసీ నాగరాజు, వైద్య సిబ్బంది రాధాకృష్ణ, రత్నాకర్, కుమారస్వామి, చక్రపాణి, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.
వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు