‘న్యాక్‌’కు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

‘న్యాక్‌’కు సిద్ధం కావాలి

May 17 2025 7:11 AM | Updated on May 17 2025 7:11 AM

‘న్యా

‘న్యాక్‌’కు సిద్ధం కావాలి

కేయూ క్యాంపస్‌: నూతన గ్రేడింగ్‌ సిస్టంకు అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు న్యాక్‌కు సిద్ధం కావాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీ ఇంటర్నల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జి.షమిత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్కీమ్స్‌ అండ్‌ పాలసీస్‌ (సీఆర్‌ఐఎస్‌పీ) స్వచ్ఛంద సంస్థ వారి సెంటర్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిటీ అప్‌ గ్రాడ్యుయేషన్‌ అండ్‌ ఎక్స్‌లెన్స్‌ (చెక్‌)లో భాగంగా ఓయూ, ఎస్‌యూతో కేయూ అవగా హన ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. ఐక్యూఏసీ అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న 22 కళాశాలల ప్రతి నిధులతోను వీసీ మాట్లాడారు. మారుతున్న సూచనలకు అనుగుణంగా కళాశాలలు డేటా బేస్‌తో సిద్ధంగా ఉండాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం మాట్లాడుతూ న్యాక్‌ అక్రిడిటేషన్‌లో వస్తున్న మార్పులపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. సీడీసీ డీన్‌ పి.వరలక్ష్మి, అకడమిక్‌ మెంటార్‌ డాక్టర్‌ ఏవీ రావు, డాక్టర్‌ అచ్యుతాదేవి, సీఆర్‌ఐఎస్‌పీ స్టేట్‌ లీడ్‌ డాక్టర్‌ కె.రమ, ఆచార్య లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు.

పాఠ్యపుస్తకాల

పంపిణీ షురూ

విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి డీఈఓ వాసంతి శుక్రవారం ప్రారంభించారు. తొలిరోజు కాజీపేట మండలానికి 24,972 పాఠ్యపుస్తకాలు, కమలాపూర్‌ మండలానికి 15,932 పాఠ్యపుస్తకాలు అందించారు. ఆయా మండల విద్యాశాఖాఽధికారులు క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్ల ద్వారా పంపిణీ చేశారు. మిగిలిన మండలాలకు కూడా షెడ్యూల్‌ ప్రకారం చేరవేస్తారు. మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు చేరాక అక్కడి నుంచి హెచ్‌ఎంలు తమ పాఠశాలలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జూన్‌ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు అందజేస్తారు.

హోటళ్లకు

రూ.62 వేల జరిమానా

వరంగల్‌ అర్బన్‌: హనుమకొండలోని పలు హోటళ్లలో బల్దియా ప్రజారోగ్య విభాగం సిబ్బంది శుక్రవారం తనిఖీలు చేశారు. అపరిశుభ్రత, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని గుర్తించి రూ.62 వేల జరిమానా విధించి వసూలు చేసినట్లు సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి తెలిపారు. 51వ డివిజన్‌ ఎకై ్సజ్‌ కాలనీలోని నాటుకోడి చిట్టి గారెలు హోటల్‌కు రూ.30 వేలు, ట్రేడ్‌ లైసెన్‌్స్‌ లేకుండా నిర్వహిస్తున్న హంటర్‌ రోడ్డులోని కడాయి రెస్టారెంట్‌కు రూ.30 వేలు, నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ విక్రయిస్తున్న వెంకటసాయి కిరాణా షాపు యజమానికి రూ.2 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బంది అనిల్‌కుమార్‌, సంపత్‌రెడ్డి, నిరంజన్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి

హన్మకొండ: వరంగల్‌ అర్బన్‌ సహకార బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి సూచించారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని వరంగల్‌ అర్బన్‌ సహకార బ్యాంకులో శుక్రవారం జరిగిన బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సభ్యుడు సామాజిక బాధ్యతతో సహకార బ్యాంకు అభివద్ధికి తోడ్పడాలన్నారు. ప్రతి సభ్యుడు పొదుపుతోపాటు వాటాదనం చెల్లించడం ద్వారా బ్యాంకు పరపతి పెరుగుతుందని పేర్కొన్నారు. బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాద్‌, బ్యాంకు మేనేజర్‌ సురేందర్‌రెడ్డి, హనుమకొండ బ్యాంకు మేనేజర్‌ ప్రసాద్‌, గోపాలపురం బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, అధికారులు శ్రీనివాసరావు, కృష్ణవేణి, సంధ్యారాణి, బ్యాంకు వాటాదారులు, సభ్యులు పాల్గొన్నారు.

‘న్యాక్‌’కు సిద్ధం కావాలి
1
1/2

‘న్యాక్‌’కు సిద్ధం కావాలి

‘న్యాక్‌’కు సిద్ధం కావాలి
2
2/2

‘న్యాక్‌’కు సిద్ధం కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement