
‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025
శ్రీభద్రకాళికి వసంతోత్సవం
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి చతురన్తసేవ, సాయంత్రం విమానకసేవ (సర్వభూపాల వాహనసేవ) నిర్వహించారు. పూజాకార్యక్రమాలకు రాష్ట్ర కుమ్మరి కుల సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆమంచి నాగపరిమళ, శ్రీనివాస్ రావు దంపతులు, ఆమంచి రాజ్‌ప్రదీప్, అనసూయ, అనిల్ కార్తీక్, రాజేశ్వరి, ధర్మరాజు, వందన, అవునూరి రాంమూర్తి ప్రజాపతి, కుమారస్వామి, నాంపల్లి ప్రభాకర్, శ్రీనివాస్, రమేశ్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు.
జూపార్క్‌లో అభివృద్ధి
పనులకు శంకుస్థాపన
న్యూశాయంపేట : హనుమకొండ హంటర్‌రోడ్డులోని కాకతీయ జూ పార్క్‌లో కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన అంతర్గత రోడ్డు, సీసీ డ్రెయిన్ పనులకు గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్క్ సందర్శన కోసం వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. వర్షాకాలం వచ్చేలోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కోమల, రాజు, ఎఫ్‌ఆర్‌ఓ మయూరి, డీఈ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
శిల్పాల ప్రాంగణంలో
ఏర్పాట్ల పరిశీలన
ఖిలా వరంగల్: ప్రపంచ సుందరీమణులు ఈనెల 14న ఖిలావరంగల్ కోటకు రానున్న నేపథ్యంలో గురువారం శిల్పాల ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను విద్యుత్‌శాఖ అఽధికారులతో కలిసి టూరిజం జీఎం నాథన్ పరిశీలించారు. సౌండ్ అండ్ లైటింగ్ షోకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కోటకు వెళ్లే రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలను బల్దియా సిబ్బంది తొలగించారు. ఫ్లడ్‌లైట్ల నిర్వహణను పరిశీలించారు. కోటను సందర్శించిన వారిలో నోడల్ ఆఫీసర్ పుష్పలత రెడ్డి, వివిధ శాఖల అధికారులు శివాజీ, బండి నాగేశ్వర్‌రావు, మల్లికార్జున్, కుసుమ సూర్యకిరణ్, విజయ్, శ్రీకాంత్, అజయ్, కోట గైడ్ రవియాదవ్ తదితరులు ఉన్నారు.
‘సాక్షి ఎడిటర్ ఇంటిపై
పోలీసుల దాడికి ఖండన
నయీంనగర్: ఎలాంటి నోటీస్ లేకుండా విజయవాడలోని సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేసిన ఏపీ పోలీసుల తీరును ఖండిస్తున్నామని, ఈఘటనను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఉన్నత న్యాయస్థానాల దృష్టికి యూనియన్ ద్వారా తీసుకువెళ్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ కక్షపూరిత కుట్రలో భాగంగా సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారని పేర్కొన్నారు. అక్కడి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని జర్నలిస్టులను, ఎడిటర్లను నియంత్రించుకోవాలనుకోవడం మతి లేని చర్యగా భావిస్తున్నామని తెలిపారు. ఏపీ పోలీసుల తీరుపై అన్ని యూనియన్లు, ప్రెస్ క్లబ్‌లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
కాజీపేట: ఏళ్లుగా ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తున్న చెరువులు, ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన గుట్టలు, మట్టిగడ్డలు అక్రమార్కుల చేతిలో చిక్కి శల్యమైపోతున్నాయి. వీటిలోని మట్టి, మొరాన్ని ఇష్టారాజ్యంగా తవ్వుతుండడంతో ధ్వంసమవుతున్నాయి. స్థానిక అధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న బడా నాయకులు ఈ మొరం దందాలో భాగస్వాములు కావడం గమనార్హం. గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల్లోని కొన్ని గ్రామాల్లో మట్టి తరలింపు కోసం అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. గ్రామస్తులకు ఇష్టం లేకపోయినా కొందరు గ్రామపెద్దలే ఇందులో కీలకపాత్ర పోషిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వీరికి అధికారులు సహకరిస్తుండడంతో సామాన్యులు మిన్నకుండిపోతున్నారు.
ఏకంగా ఓ కమిటీ ఏర్పాటు..
నగరం చట్టూ పక్కల ఉన్న చెరువులు, గుట్టలనుంచి మట్టిని తరలించేందుకు కొంతమంది కాంట్రాక్టర్లు ఒక మాఫియాలా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమకొండ, ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తి చుట్టూ పక్కల మండలాల్లో జరుగుతున్న రియల్ వ్యాపారానికి ఈ మట్టి అవసరం కావడంతో వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో మట్టి తవ్వకాలకు అనుకూలంగా పంచాయతీ తీర్మానాలు చేయడం గమనార్హం.
పరోక్షంగా సహకరిస్తున్న అధికారులు..
రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో రియల్ వ్యాపారంలో సాగుతున్న మట్టి, మొరం దందాను అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. పది ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వెంచర్లు చేస్తున్న రియల్ వ్యాపారులు రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ధర్మసాగర్, మడికొండ, ఎలుకుర్తి, రాంపేట, అయోధ్యపురం, రాంపురం, సుబ్బయ్యపల్లె, సోమిడి, హసన్‌పర్తి, వేలేరు తదితర గ్రామాల శివారులో జరుగుతున్న రియల్ దందాలో రహదారుల కోసం వాడుతున్న మట్టిని చూస్తే ఆశ్యర్యపోయే పరిస్థితులు కనిపిస్తాయంటున్నారు. పరిశ్రమల అవసరాలకు కొత్తగా చేపట్టే నిర్మాణాలకు అవసరమైన మట్టిని ఇక్కడి నుంచే తరలిస్తున్నారు. లారీ మొరం రూ.6వేల నుంచి రూ.7,500ల వరకు విక్రయిస్తున్నారు. ఆసామికి మాత్రం రూ.2వేల లోపే నగదు ఇస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
అధికారులే దృష్టి సారించాలి..
నగరం చుట్టు పక్కల మండలాలనుంచి నిత్యం వందలాది లారీల్లో మట్టి తరలిస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి పట్టించుకోకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. అధికారులు నిఘా పెట్టి అక్రమ మొరం వ్యాపారాన్ని ఆపాలి.
– నార్లగిరి రామలింగం, మాజీ కార్పొరేటర్
నూతన వెంచర్లను పరిశీలించాలి..
నగరం చుట్టూ జరుగుతున్న నూతన రియల్ వెంచర్లలో అడుగిడితే వాస్తవ పరిస్థితి అవగతమవుతుంది. రాత్రి, పగలు తేడా లేకుండా నూతన వెంచర్లకు లారీలు మట్టితో వస్తున్నాయి. ఇదంతా సంబంధిత అధికారులకు కనిపించకపోవడం బాధాకరం.
– మర్రిపెల్లి సుధాకర్, ధర్మసాగర్
‘తలసేమియా’పై
అవగాహన కల్పించాలి
హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఎంజీఎం/హన్మకొండ చౌరస్తా: తలసేమియా వ్యా ధిపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రినుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.మదన్మోహన్‌రావుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. తలసేమియా జన్యు సంబంధమైన వ్యాధి అని, దీంతో బాధపడుతున్నవారి కుటుంబసభ్యులు తప్పకుండా జన్యు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధిగ్రస్తులకు తరచూ రక్త మార్పిడి అవసరమని, వీరి కోసం రెడ్‌క్రాస్ ఆవరణలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం డాక్టర్ గీత, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ దీప్తి, రామేశ్వరి, కౌముది, ఖాదర్ అబ్బాస్, రమేశ్, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
‘జల్ హి అమృత్’కు హాజరైన కమిషనర్
వరంగల్ అర్బన్ : సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అర్బన్ గవర్నెన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో మున్సిపల్ కమిషనర్లతో (జల్ హి అమృత్ అటల్ మిషన్ ఫర్ విజువనెన్స్ అండ్ అర్బన్ ఇన్ ట్రాన్స్‌ఫర్మేషన్) 2.0 కింద నిర్వహించిన ఒకరోజు శిక్షణ శిబిరం, కార్యశాలలో బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. జల్ హి అమృత్ 2.0 లక్ష్యం, మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగించడం ద్వారా నీటి నిర్వహణను మెరుగుపర్చడం, శుద్ధి కర్మాగారాల నిర్వహణకు సమర్థవంతంగా చేయించడం తదితర అంశాలపై శిక్షణ కొనసాగింది. అనంతరం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ నిర్వహిస్తున్న మురుగునీటి శుద్ధీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కాజీపేట ఏసీపీగా ప్రశాంత్‌రెడ్డి
వరంగల్ క్రైం : కాజీపేట సబ్ డివిజన్ ఏసీపీగా పింగిలి ప్రశాంత్‌రెడ్డిని నియమిస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాజీపేట ఏసీపీగా పనిచేసిన తిరుమల్ ఇటీవల హైదరాబాద్‌లోని హైడ్రా డీఎస్పీగా బదిలీ అయ్యారు. తెలంగాణ సైబర్ సెక్యురిటీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ప్రశాంత్‌రెడ్డి బదిలీపై కాజీపేట ఏసీపీగా వస్తున్నారు.
న్యూస్‌రీల్
నగరం చుట్టుపక్కల గ్రామాల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు
రియల్ వెంచర్లు, నిర్మాణాలకు విరివిగా వాడకం
రూ.కోట్లలో సాగుతున్న వ్యాపారం
రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోని అధికారులు
గ్రామాల్లో అనుకూలంగా తీర్మానాలు
లారీ మొరం రూ.6వేల నుంచి రూ.7,500ల వరకు విక్రయం
ఆసామికి ఇచ్చేది మాత్రం రూ.2వేలలోపే..
నిబంధనలు ఏంటంటే?
నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టిని తవ్వకూడదు.
ఒకవేళ రైతుల పొలాల్లోకి ఒండ్రుమట్టి అవసరమైతే నీటిపారుదల శాఖ అధికారులకు సూచనలు, సలహాల మేరకు రెండు నుంచి మూడు అడుగుల లోతు వరకు తవ్వకాలు జరపవచ్చు.
చెరువు కట్టలకు 100 అడుగుల దూరం వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.
ప్రైవేట్ భూముల్లో తవ్వకాలు చేయడానికి సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి.
జిల్లా అధికారులు ఇకనైనా స్పందించి మట్టితరలింపును అడ్డుకోవాలని పలువురు ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా

‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా

‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా

‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా

‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా

‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా

‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా

‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా

‘గ్రేటర్’ పరిధిలో జోరుగా మట్టి, మొరం దందా