అత్యవసర సమయాల్లో రెడ్ క్రాస్
హన్మకొండ అర్బన్: అత్యవసర సమయంలో రెడ్ క్రాస్ సేవలు ముందుంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ రెడ్ క్రాస్ భవన్‌లో వేడుకలను రెడ్‌క్రాస్ పాలకవర్గం ఘనంగా నిర్వహించింది. సొసైటీలోని తలసేమియా సెంటర్‌ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రం, తలసేమియా సెంటర్, జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా రక్తదాన శిబిరాల నిర్వహణ కేటగిరిలో కిట్స్ వరంగల్ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించి 540 యూనిట్ల రక్తం సేకరించి రెడ్ క్రాస్ రక్త కేంద్రానికి అందచేసినందుకు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సతీశ్‌చంద్రను సీపీ సన్‌ప్రీత్‌సింగ్, పాలకవర్గం శాలువా, షీల్డ్‌తో సత్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయచందర్‌రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ.శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, సుధాకర్ రెడ్డి, డాక్టర్ సంధ్యారాణి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ల రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, ప్రొఫెసర్ పాండురంగారావు, కన్సల్టింగ్ ఇంజనీర్ కె.సత్యనారాయణరావు, బన్ను ఆరోగ్య ది సేవా సొసైటీ ప్రతినిధులు వీరమళ్ల కిరణ్‌కుమారి, చంద్రజిత్‌డ్డి, రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులు, తలసేమియా బాధితులు, రెడ్ క్రాస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుళ్లకు సీపీ అభినందన
వరంగల్ క్రైం: అత్యధికసార్లు రక్తదానం చేసిన వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్ కన్నె రాజు, కేయూ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సుబేదారి రెడ్‌క్రాస్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కన్నె రాజు 37వ సారి, రవీందర్ 18వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేయగా.. వారిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు.
సీపీ సన్‌ప్రీత్ సింగ్


