కుటుంబ సభ్యులతో గడపండి
వరంగల్ క్రైం: ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సైలు జె.విల్సన్, పి.ప్రకాశ్‌రెడ్డి, ఆర్‌ఎస్సై కె.ప్రభాకర్, ఏఆర్‌ఎస్సైలు అబ్దుల్ రఫీక్, యం.రవి ఉన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, శ్రీనివాస్, ఏసీపీ, సురేంద్ర, ఆర్‌ఐ సతీశ్, ఆర్‌ఎస్సై శ్రవణ్‌కుమార్‌తో పాటు, ఇతర పోలీస్ సిబ్బంది, ఉద్యోగ విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం


