‘సాస్కి’ ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమీక్ష
వరంగల్ అర్బన్ : స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (సాస్కి) ప్రతిపాదిత ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ సారా సమీక్షించారు. బుధవారం ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంనుంచి కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాస్కికి ప్రతిపాదనలైన ఫైనాన్సియల్, అర్బన్ గవర్నెన్స్, అర్బన్ ల్యాండ్ రిఫారమ్స్ తదితర 6 ప్రాజెక్ట్‌ల మీద సుదీర్ఘ చర్చ జరిగింది. నగరంలో చేపట్టనున్న ఆయా ప్రాజెక్టులకు సంబంధించి అదనపు సెక్రటరీ లేవనెత్తిన అంశాలకు కమిషనర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో డీటీసీపీ దేవేందర్ రెడ్డి, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సరఫరా భేష్
‘తాగు నీటి సరఫరా భేష్. 2025 స్ఫూర్తితో నూతన సంవత్సరంలో మరింత సమర్థవంతంగా నీటిని సరఫరా చేయాలి’ అని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి డివిజన్ల వారీగా అభివృద్ధి పనులపై సమీక్షించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
వివరాలు తెలుసుకున్న కేంద్ర అడిషనల్ డైరెక్టర్
సందేహాలు నివృత్తి చేసిన కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్


