
ఘనంగా తిరంగా యాత్ర
హన్మకొండ: ఆపరేషన్ సిందూర్ విజయంతో సైన్యానికి సంఘీభావంగా తిరంగా యాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, విద్యార్థులు భారత జాతీయ పతాకాన్ని చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు భారత్ సరైన జవాబు చెప్పిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.