
పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం తగదు
హన్మకొండ అర్బన్: సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా చొరబడి సోదాలు చేయ డాన్ని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సాక్షి పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏపీ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను హరించేలా ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హితవు పలికారు. నిరసన కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇన్‌చార్జ్ గడ్డం రాజిరెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జ్ వర్ధెల్లి లింగయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్య, కోశాధికారి బోల్ల అమర్, రాష్ట్ర నాయకులు వల్లాల వెంకటరమణ, గాడిపెల్లి మధు, వేణుమాధవ్, యూనియన్ ప్రతినిఽధి తోట సుధాకర్, టీయూడబ్ల్యూజే –143 హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజ్‌కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకే శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు పిన్నా శివకుమార్, అబ్బు వెంకట్‌రెడ్డి, అల్లం రాజేష్ వర్మ, సదానందం, ఎలక్ట్రానిక్ మీడియా, ఫొటో జర్నలిస్టు సంఘాల నుంచి తిరుపతి, గొట్టె వెంకట్, సంపెట వెంకటేశ్వర్లు, వరప్రసాద్, ఐజేయూ – టీయూడబ్ల్యూజే జిల్లా నాయకుడు ఊటుకూరు సాయిరాం, సీనియర్ జర్నలిస్టులు అల్వాల సదాశివుడు, కోలా కృష్ణకుమార్ రెడ్డి, అహ్మద్, బత్తిని రాజేందర్, రమేష్, నరేందర్, వెంకటస్వామి, సుధాకర్, నాగరాజు, రమేష్, అనిల్, రాజిరెడ్డి, శ్రీనివాస్, డెస్క్ జర్నలిస్టులు మహేష్, ఓంకార్, రవికుమార్, అశోక్, రాజు, రమేష్, దాసరి బాబు, రాంచందర్ రావు, రామాచారి, శ్రావణ్, శ్రీనివాస్, మధుసూదన్, పాత్రికేయులు పాల్గొన్నారు.
జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన