
ఏసుక్రీస్తు అందరికీ దేవుడు
● దైవజనుడు పాల్సన్‌రాజ్
● ముగిసిన క్రీస్తు జ్యోతి ప్రార్థన పండుగలు
ధర్మసాగర్: సర్వమానవాళి కోసం భూలోకానికి వచ్చిన ఏసుక్రీస్తు ప్రజలందరికీ దేవుడని కరుణా పురం సొసైటీ ఆప్ క్రైస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్‌రాజ్ అన్నారు. ధర్మసాగర్ మండలం కరుణాపురంలో క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో 20వ క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం వార్షికోత్సవ ఐదు రోజుల ప్రార్థన పండుగలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో పాల్సన్‌రాజ్ మాట్లాడుతూ.. 2006లో ప్రారంభమైన క్రీస్తుజ్యోతి ప్రార్థన పండుగలు ప్రతి ఏటా కన్నుల పండువగా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. సొసైటీ జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాశ్ మాట్లాడుతూ క్రీస్తు జ్యోతి ప్రార్థన పండుగలకు వివిఽ ద రాష్ట్రాల నుంచి 5 రోజుల్లో లక్షకు పైగా తరలివచ్చి దీవెనలు పొందారని తెలిపారు. మందిరం పాస్టర్లు, సేవకులు, వలంటీర్స్, బ్రదర్స్, సిస్టర్స్, క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు.

ఏసుక్రీస్తు అందరికీ దేవుడు