
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
– 10లోu
ఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒప్పుకుంది. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్‌గౌడ్‌కు సూచించింది. మొదటి ప్రయత్నంలో రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాడు. మళ్లీ ఎలేందర్‌గౌడ్‌ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్‌లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్తాన్‌తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది.
జనగామ: ‘బిడ్డా దేశం నీకోసం ఎదురు చూస్తోంది.. తుపాకీ ఎక్కుపెట్టు.. భరత మాత జోలికి వచ్చే ఉగ్రమూకల భరతం పట్టు’ అంటూ బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లికి చెందిన జవాన్ బేజాటి వెంకట్‌రెడ్డిని అతడి తల్లి నాగలక్ష్మి నిండు మనసుతో ఆశీర్వదించి సాగనంపారు. సెలవులపై గత నెల 30న స్వగ్రామానికి వచ్చిన వెంకట్‌రెడ్డి.. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి పిలుపు రావడంతో శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మీదుగా కశ్మీర్‌కు బయల్దేరాడు. 2005లో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్‌కు ఎంపికై న వెంకట్‌రెడ్డికి 2007లో మొదటి పోస్టింగ్‌లో జమ్మూకశ్మీర్ శాంతి భద్రతల విభాగంలో బాధ్యతలు అప్పగించారు. 2009–15 వరకు అస్సాంలో విధులు నిర్వహించగా.. ఉత్తమ సేవలకు 2014లో కామెండేషన్ డిస్క్‌తో సత్కరించారు. 140 కోట్ల భారత ప్రజలకు కాపలా ఉండే అవకాశం మా ఇంట్లో నుంచి కొడుకుకు రావడం తల్లిగా గర్విస్తున్నానంటూ ఆనంద భా ష్పాలతో నాగలక్ష్మి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఎవరెస్టు కన్నా ఎత్తయినవి ఆమె ఊహా శిఖరాలు.
సిందూరంకన్నా ఎరుపెక్కినవి ఆమె హృదయ జ్వాలలు. తనువును మోస్తున్న నేలకు, స్వేచ్ఛావాయువులను ఇచ్చిన భరత భూమికి సేవ చేయాలన్నదే ఆ తల్లుల సంకల్పం. అందుకనుగుణంగా వారి బిడ్డల్ని తీర్చిదిద్దారు. నిలువెల్లా దేశభక్తిని నూరిపోశారు. దేశసేవ కోసం సైన్యంలోకి పంపించిన ఓరుగల్లు మాతృమూర్తులే ఒక సైన్యం. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా దేశ సేవకు బిడ్డలను పంపిన పలువురు తల్లులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..
● భర్త మిలటరీలో
మరణించినా..
బిడ్డలను కూడా పంపిన
మరికొందరు..
● సరిహద్దు ప్రాంతాల్లో
సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లా యువత
● గర్వంగా ఫీలవుతున్న
మాతృమూర్తులు
నేడు అంతర్జాతీయ
మాతృ దినోత్సవం
జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్లయ్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 ఏళ్ల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్(వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన సియాచిన్‌లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ఉగ్రమూకలను తుదముట్టించే ‘ఆపరేషన్ సిందూర్’లో తన కొడుకు భాగస్వామి అవడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నట్లు తల్లి అన్నపూర్ణ చెబుతోంది.
న్యూస్‌రీల్
దేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన ఓరుగల్లు తల్లులు
కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి..
బిడ్డకు ఆశ్వీరాదం
ఆశయానికి
‘అమ్మ’
అండ..

ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025

ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025

ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025

ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025

ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025

ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025