
నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి
వరంగల్ అర్బన్: ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. సోమవారం వరంగల్, హనుమకొండ ప్రధాన రోడ్లపై పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. మిస్‌వరల్డ్ పోటీలో పాల్గొంటున్న సుందరీమణులు బుధవారం వరంగల్, హనుమకొండలో పర్యటిస్తారని పలుమార్లు సూచించినా నిర్లక్ష్యంగా ఉండడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కొరత వల్ల పనులు పూర్తి కావడం లేదని సమాధానం ఇవ్వడంతో ఆమె సీరియస్ అయ్యారు. ముఖ్యంగా సెంట్రల్ మీడియన్లు, ప్రధాన కూడళ్లను శుభ్రంగా ఉండేలా చూడడంతోపాటు నగరమంతా సుందరీకరణ పనులపై దృష్టి సారించాలన్నారు. తనిఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, హెచ్‌ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్‌రెడ్డి ఉన్నారు.
బల్దియా కమిషనర్
అశ్విని తానాజీ వాకడే
అస్తవ్యస్త పారిశుద్ధ్యంపై ఆగ్రహం