
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నడికూడ: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిగిల్ల గ్రామానికి చెందిన మోకిడి దీపక్ (30)హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప నిచేస్తున్నాడు. బుధవారం ఉ దయం తన బైక్‌పై ప్ర యాణిస్తుండగా వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది.
పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
వరంగల్ క్రైం: ప్రతిభ ఉన్న పిల్లలను తల్లిదండ్రులు పోత్సహించి, వారి అభ్యున్నతికి కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన హసన్‌పర్తి సబ్ ఇన్‌స్పెక్టర్ దామెరుప్పుల దేవేందర్ కుమారుడు దామెరుప్పుల అక్షిత్‌ను సీపీ అభినందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన వేర్ ద మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్ రచనను అక్షిత్ తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో మూడు నిమిషాల్లో అనర్గళంగా చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా అక్షిత్‌తో పాటు ఎస్సై దేవేందర్, ఆయన సతీమణి స్వప్న, మెంటార్ కోమనేని రఘును సీపీ అభినందించారు.