
టీచర్ల శిక్షణకు డీఆర్పీలు సిద్ధంగా ఉండాలి
విద్యారణ్యపురి: త్వరలో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల శిక్షణకు డిస్ట్రిక్ట్ రిసోర్స్‌పర్సన్ (డీఆర్పీ)లు సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి కోరారు. ఐదురోజులుగా హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాలవికాస్‌లో రాష్ట్రస్థాయిలో గణితం, సోషల్ స్టడీస్ జిల్లా రిసోర్స్‌పర్సన్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. సమావేశంలో ఎస్‌సీఈఆర్టీ కోర్సు కో–ఆర్డినేటర్లు ఎల్లయ్య, గణపతి, రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం అధ్యక్షుడు రథంగాపాణిరెడ్డి పాల్గొన్నారు.
రామప్పను సందర్శించిన
హనుమకొండ జడ్జి
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని హనుమకొండ జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి జస్టిస్ పట్టాభి రామారావు, ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా.. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్ వివరించగా.. రామప్ప శిల్పకళాసంపద బాగుందని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సై జక్కుల సతీశ్ ఉన్నారు.
నిట్ బీఓజీ చైర్‌పర్సన్‌గా
మోహన్‌రెడ్డి
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ బీఓజీ (బోర్డ్ ఆఫ్ గవర్నర్స్) చైర్‌పర్సన్‌గా పద్మశ్రీ డాక్టర్ బీ.వీ.ఆర్ మోహన్‌రెడ్డిని కేంద్ర మంత్రిత్వ శాఖ శుక్రవారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్నెళ్ల కాల పరిమితితో చైర్‌పర్సన్‌గా ఆయన కొనసాగుతారు. కాలపరిమితి అనంతరం నూతన చైర్‌పర్సన్ నియామకం జరిగేంత వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. నిట్ వరంగల్ విద్యా సంస్థలో విద్యార్థులకు పరిశ్రమల జ్ఞానం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంలో బీవీఆర్.మోహన్‌రెడ్డి నియామకం అవడం ఆనందంగా ఉందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు.
అధికారులకు అభినందనలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ విభాగం 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచినందుకు ఇటీవల హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికెట్లు డీఆర్డీఓ, డీపీఎంలకు అందజేశారు. ఈమేరకు శుక్రవారం డీఆర్డీఓ మేన శ్రీనివాస్, డీపీఎంలు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేసి అభినందించారు.

టీచర్ల శిక్షణకు డీఆర్పీలు సిద్ధంగా ఉండాలి

టీచర్ల శిక్షణకు డీఆర్పీలు సిద్ధంగా ఉండాలి

టీచర్ల శిక్షణకు డీఆర్పీలు సిద్ధంగా ఉండాలి