
ఉద్యమ జీవి నల్లెల రాజయ్య
విద్యారణ్యపురి: ఉద్యమ జీవి నల్లెల రాజయ్య చిరస్మరణీయుడని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ అన్నారు. ఆదివారం హ నుమకొండ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్‌లో నిర్వహించిన ‘ప్రజల మనిషి నల్లెల రాజయ్య’ పుస్తకాన్ని ఆ యన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు. సి. చంద్ర ప్రధాన సంపాదకుడిగా, అనిశెట్టి రజిత, డాక్టర్ కెబి. చంద్రభాను, బిల్ల మహేందర్, పిట్ట సాంబయ్య, రౌతు అజయ్‌కుమార్ సంపాదకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో వ్యాసాల సంపుటి(పుస్తకం)ని రూపొందించారు. కేయూ రిటైర్డ్ ఆచార్యుడు బన్నఅయిలయ్య,ప్రముఖ కవి వీఆర్ విద్యార్థి, టీపీఎఫ్ కన్వీనర్ రమాదేవి మాట్లాడారు. కవి కోడం కుమారస్వామి పుస్తకాన్ని సమీక్షించారు. వ రంగల్ రచయితల సంఘం కార్యదర్శి దండ్రె రాజ మౌళి, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు భిక్షపతి, తిరుపతయ్య, సాంబయ్య, ఉదయ్‌సింగ్, మెట్టురవీ ందర్, జిడి. సారయ్య, మార్కశంకర్‌నారాయణ, కె. శంకర్‌రావు, వి. దిలీప్, బండారు సుజాత, బోనగిరి రాములు, ఎ. విద్యాదేవి, రాజేంద్రప్రసాద్, కుటుంబీకులు సుగుణ, వెన్నెల, సూర్య పాల్గొన్నారు.
● కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్