
పార్టీని బలోపేతం చేయండి
హసన్‌పర్తి: ‘రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలులో ముందుకు వెళ్తోంది.. ప్రచారంలో మాత్రం మనమంతా వెనుకబడి ఉన్నాం’ అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలే ఇందుకు కారణమన్నారు. గోపాలపురంలోని ఓ బాంక్వెట్ హాల్‌లో మంగళవారం హసన్‌పర్తి, ఐనవోలుతో పాటు 1, 2, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. సీనియర్లు, జూనియర్లు అంటూ ఇగో(అహం)లు వీడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి పునాదులని.. కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఆయా పదవులకు పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, కనపర్తి కిరణ్, పొన్నాల రఘు, గడ్డం శివరాం, కార్పొరేటర్లు సునీల్‌కుమార్, జక్కుల రజిత, అరుణకుమారి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ శేఖర్‌రావు, మాజీ సర్పంచ్ మదన్, శ్రీరాం, అనిల్, విజయ్ ఉన్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే
నాయిని రాజేందర్‌రెడ్డి