
టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు నైపుణ్యాలు పెంపొందించుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ సూచించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండోదఫా ఐదురోజుల పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రావు, కోర్సు కోఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు, రిసోర్స్‌పర్సన్లు, తదితరులు పాల్గొన్నారు.