
మధ్యాహ్న భోజన పథకాన్ని ‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దు
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో ‘అక్షయపాత్ర’కు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్ డిమాండ్ చేశారు. ఆ దివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మ ధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్లకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో 20 ఏళ్లుగా మధ్యాహ్నభోజన కార్మికులు బిల్లులు సకాలంలో రాకపోయినా విద్యార్థులకు వంటచేసి పెడుతున్నారని అన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 14న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిడిగొండ రజిత, బాధ్యులు కె.శాంత, సుక్కుబాయి, కె.కవిత, స్వప్న, రాణి, విజయ, శారద,వసుంధర, తస్లీమ్, సరిత పాల్గొన్నారు.
‘పాలిసెట్’ ఏర్పాట్లు పూర్తి
రామన్నపేట: జిల్లాలో ఈనెల 13న (మంగళవారం) నిర్వహించనున్న పాలిసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూ డేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు, వ్యవసాయ, వెటర్నరీ డిప్లొ మా ప్రవేశాలకు నగరంలోని 12 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. వీటిలో 6,424 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, 11 గంటల తర్వాత అభ్యర్థులను అనుమతించరని సూచించారు.
నేటి గ్రేటర్ గ్రీవెన్స్ రద్దు
వరంగల్ : బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో సోమవారం(నేడు) నిర్వహించే గ్రేటర్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారణాలతో ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న ఆమె.. నగర ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇవ్వడానికి రాకూడదని సూచించారు.
సాధు రక్షణ సమితి రాష్ట్ర
అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ
నయీంనగర్: సాధు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా హనుమకొండకు చెందిన ల క్ష్మీనారాయణ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు అంబికేశ్వరానంద భా రతి ఈమేరకు ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గో సంరక్షణ, సాధు సంరక్షణ, గీతా సంరక్షణ, వేద సంరక్షణ, సనాతన పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని ‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దు