
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఈనెలాఖరులోగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్, కిచెన్‌షెడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. డీడబ్ల్యూఓ జయంతి, డీఈఓ వాసంతి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, సీడీపీఓలు, అధికారులు పాల్గొన్నారు.