క్యాడ్, క్యామ్ ల్యాబ్ ఎంతో ఉపయోగకరం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సి టీలోని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్(క్యాడ్) అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫ్యాక్చరింగ్(క్యామ్) ల్యాబ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. ల్యాబ్‌ను బుధవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక డిజైన్ ప్లానింగ్‌తో ఏర్పాటుచేసి ల్యాబ్ మెకానికల్ ఇంజనీరింగ్‌తో పాటు బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ మాట్లాడుతూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ రెండు విడతల్లో అందించిన కంప్యూటర్లతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు మనిషా, సాబూ, పద్మజ, రమణి, ముత్యం వంశీలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.రాధిక, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.నేతాజీ, లైబ్రరీ అసిస్టెంట్ డాక్టర్ ఎస్.సుజాత పాల్గొన్నారు.
కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి


