
సివిల్ ఇంజనీరింగ్ బీఓఎస్‌గా శ్రీకాంత్
కేయూ క్యాంపస్: కాకతీయ యూ నివర్సిటీ సివిల్ ఇంజ నీరింగ్ విభా గం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా కాకతీయ ఇ నిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(కిట్స్),వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.శ్రీకాంత్‌ను నియమిస్తూ మంగళవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన కేయూ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫె సర్ డాక్టర్ సీహెచ్ రాధిక నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.వీసీ కె.ప్రతాప్‌రెడ్డి.. శ్రీకాంత్‌కు ఉత్తర్వులు అందజేశారు.