టేబుల్ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం
వరంగల్ క్రైం: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న నాల్గవ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో టేబుల్ టెన్నిస్ గెజిటెడ్ అధికారుల విభాగంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. అదేవిధంగా 55 ఏళ్ల గెజిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు జితేందర్‌రెడ్డి, మధుసూదన్ జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించారు.
కమిషనరేట్ హాకీ జట్టుకు కాంస్య పతకం
రామన్నపేట: హైదరాబాద్‌లో జరుగుతున్న రాష్ట్ర పోలీసుల తెలంగాణ స్టేట్ నాలుగో మీట్‌లో కమిషనరేట్‌కు చెందిన హాకీ జట్టు మూడో స్థానంలో నిలిచినట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఆర్‌ఐ ఉదయభాస్కర్ నాయకత్వంతో పాల్గొన్న ఈ జట్టు కాంస్య పతకం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.
రామన్నపేట: కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డులకు చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కళాకారులు 31 డిసెంబర్ 2025 నాటికి 30 సంవత్సరాల వయస్సు, 10 సంవత్సరాల అనుభవం, చేనేత డిజైనర్లు 31 డిసెంబర్ 2025 నాటికి 25 సంవత్సరాల వయస్సు, 5 సంవత్సరాల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల చేనేత కార్మికులు 31 మార్చి 2026 లోగా ఆయా జిల్లాల చేనేత, ఔళి శాఖ సహాయ సంచాలకులకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఎంపికై న వారికి జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేస్తుందని వివరించారు. మరిన్ని వివరాలకు http://handtex.telangana. gov.in సంప్రదించాలని సూచించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ సెనేట్‌హాల్‌లో ఈనెల 21, 22 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ వార్షిక సెషన్ నిర్వహించనున్నారు. హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రారంభ సభలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, విశిష్ట అతిథిగా కేయూవీసీ ప్రతాప్‌రెడ్డి, గౌరవ అతిథిగా కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, సోషల్ సైన్స్ డీన్ సురేశ్‌లాల్, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వెంకటరాజం తదితరులు హాజరుకానున్నారు. దివంగత ప్రొఫెసర్ బొబ్బిలి, సరోజనీ రేగాని, దీపక్ కుమార్ స్మారకోపన్యాసాలు ఉంటాయని లోకల్ సెక్రటరీ చిలువేరు రాజ్‌కుమార్ తెలిపారు.
కాజీపేట అర్బన్: కాజీపేట మండలం మడికొండలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులపై అనుచితంగా ప్రవర్తించిన డీసీఓ, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కంచర్ల వందనగౌడ్ తెలిపారు. మూడు బృందాలు శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో బాలల సంక్షేమం, రక్షణ చర్యల తీరును పరిశీలించాయి. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలోని విద్యార్థినులతో మాట్లాడారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, శ్రీనివాసనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రం, మల్లికాంబ మనోవికాస కేంద్రం, కంచర కుంటలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, అధికారులు తదితరులున్నారు.
టేబుల్ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం


