గర్జన ఆగింది.. జ్ఞాపకం మిగిలింది | - | Sakshi
Sakshi News home page

గర్జన ఆగింది.. జ్ఞాపకం మిగిలింది

Feb 21 2026 8:13 AM | Updated on Feb 21 2026 8:13 AM

గర్జన

గర్జన ఆగింది.. జ్ఞాపకం మిగిలింది

పులి రావడానికి మరో రెండు నెలలు

న్యూశాయంపేట: గర్జనలతో పర్యాటకుల మది దోచిన శరణ్‌ (తెల్లపులి) మరణంతో జూపార్కులో వెలితి కనిపిస్తోంది. గంభీరమైన చూపులతో కట్టిపడేసే పులిని చూసేందుకు కాకతీయ జూ పార్కుకు పర్యాటకులు వచ్చేవారు. ఇప్పుడు పులి లేదని తెలిసి సందర్శకులు అనాసక్తి చూపుతున్నారు. పార్కులోని ఎన్‌క్లోజర్‌ బోసిపోయినట్లుగా కనిపిస్తోంది. పులి లేక పోవడంపై నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేపథ్యమిదే..

వరంగల్‌ జూపార్కుకు గతేడాది జూలైలో హైదరాబాద్‌ నెహ్రూ జువాలజికల్‌ పార్క్‌ నుంచి 13 ఏళ్ల వయస్సు ఉన్న తెల్లపులి(శరణ్‌)ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి జూలో పులి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వృద్ధాప్యంతో పాటు అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు తదితర అనారోగ్య సమస్యల కారణంగా.. ఈనెల 3న తెల్లవారుజామున మరణించిందని జూ అధికారులు చెబుతున్నారు. పులి మరణం కేవలం వృద్ధాప్యం వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సరైన అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణ లేకనే పులి మరణించిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

వెలవెలబోతున్న ఎన్‌క్లోజర్‌..

పులి లేకపోవడంతో జూ పార్క్‌ ఆదాయంపై ప్రభావం పడుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా పొరుగు జిల్లాల నుంచి వచ్చే జూ పార్క్‌ సందర్శకులు టికెట్‌ కౌంటర్‌ వద్దే పులి ఉందా? అని అడిగి లోపలికి వెళ్తున్నట్లు చెబుతున్నారు. పులి లేదనడంతో పెదవి విరుస్తున్నారు. కేంద్ర జూ అథారిటీ నిబంధనలు ఇతర సాంకేతిక కారణాల వల్ల కొత్తగా పులిని తీసుకురావడంలో ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇతర జూ పార్కుల నుంచైనా పులిని తెచ్చే ప్రయత్నాలు వేగవంతం చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. జూపార్క్‌లో గడ్డి తింటున్న దుప్పులు, నీటిలో తేలియాడుతున్న మొసళ్లు, వివిధ రకాల పక్షులు, జంతువులు సందడి చేస్తున్నా... పార్క్‌కు అసలైన అందం తెచ్చే పులి లేని జూ కళ తప్పిన బొమ్మలా కనిపిస్తుందని పర్యాటకులు వాపోతున్నారు. ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు వెంటనే పులులను తీసుకొచ్చి జూ కి పూర్వ వైభవం తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

జూ పార్కుకు కొత్తగా పులి రావడానికి మరో రెండు నెలలు సమయం పడుతుంది. కొత్త పులుల కోసం ఉన్నతాధికారుల ద్వారా సెంట్రల్‌ జూ అథారిటీకి నివేదికలు పంపామని తెలిపారు. త్వరలోనే పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.

– బి.మయూరి, ఎఫ్‌ఆర్‌ఓ, అసిస్టెంట్‌ క్యూరేటర్‌

వరంగల్‌ జూపార్క్‌లో జీవిడిచిన తెల్లపులి

నిరాశతో వెనుదిరుగుతున్న సందర్శకులు

పర్యవేక్షణలేకే మరణించిందని విమర్శలు

గర్జన ఆగింది.. జ్ఞాపకం మిగిలింది1
1/2

గర్జన ఆగింది.. జ్ఞాపకం మిగిలింది

గర్జన ఆగింది.. జ్ఞాపకం మిగిలింది2
2/2

గర్జన ఆగింది.. జ్ఞాపకం మిగిలింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement