కొమ్మాల ఆలయాభివృద్ధికి కృషి
● రూ.2 కోట్లతో గుట్ట చుట్టూ రింగ్‌రోడ్డు
● శాశ్వత కమిటీ ఏర్పాటుపై దృష్టి
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈనెల 23 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొమ్మాల ఆలయం వద్ద అధికారులతో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.కోటి నిధులతో ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టామని చెప్పారు. గుట్ట చుట్టూ బండ్లు తిరగడానికి రింగ్ రోడ్డు కోసం రూ.2 కోట్లు, నాచినపల్లి రోడ్డు నిర్మాణం, విస్తరణ కోసం రూ.కోటి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ఆలయ అభివృద్ధికి శాశ్వత కమిటీని ఏర్పా టు చేసేందుకు దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.


