తిరిగి పంపించారు..
భూపాలపల్లి అర్బన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఇన్‌చార్జ్ ఎఫ్‌ఏఓగా బదిలీపై వచ్చిన మధుసూదన్‌ను భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మ తిరిగి పంపించారు. ‘అవినీతి అధికారికి అందలం’ శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. స్వస్థలానికి తిరిగి వెళ్లిపోయాలని మధుసూదన్‌ను కలెక్టర్ ఆదేశించారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వానికి సరెండర్ అయిన ఎఫ్‌ఏఓను జిల్లాకు బదిలీ చేయడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతనిని జిల్లాలో జాయిన్ చేసుకోకుండా తిరిగి పంపించాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. దీంతో డీఈఓ రాజేందర్ సదరు ఎఫ్‌ఏఓను రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కార్యాలయానికి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ఎస్‌ఓ, అకౌంటెంట్స్, పలువురు అధికారులు, సిబ్బంది అనందం వ్యక్తంచేశారు. కలెక్టర్ ఇదే విధంగా స్పందించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఎఫ్‌ఏఓ వ్యవహారంపై
కలెక్టర్ మండిపాటు
తిరిగి పంపించారు..


