
‘జల్ హీ అమృత్’కు నిధులు మంజూరు
వరంగల్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ హీ అమృత్ 2.0 పథకం స్టార్ రేటింగ్ ర్యాంకింగ్‌తో వరంగల్ నగరానికి రూ.3కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా చేపడుతున్న జల్ హీ పథకం లక్ష్యాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 15 ఎంఎల్‌డీల ఎస్‌టీపీలలో ఓసీఈఎంఎస్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు 70 కిలో వాట్స్ ఉత్పతి చేసే యూనిట్‌కు 15 ఎంఎల్‌డీ ప్లాంటులో మురికి నీటిని శుద్ధీకరించేందుకు ఉపయోగపడే విధంగా చూడాలన్నారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, మాధవిలత, సంతోష్ బాబు, పీఎంసీ ఆనంద్ పాల్గొన్నారు.
స్విమ్మింగ్ పూల్, కౌన్సిల్ హాల్ పూర్తి చేయండి
స్విమ్మింగ్ పూల్, కౌన్సిల్ హాల్ పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లను ఆదేశించారు. క్షేత్ర స్థా యిలో జరుగుతున్న పనులను మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి తనిఖీ చేశారు. తని ఖీల్లో అడిషనల్ కమిషనర్ జోనా, ఈఈలు, డీఈ కార్తీక్ రెడ్డి, ఏఈలు శ్రీకాంత్, నరేష్ పాల్గొన్నారు.
సమీక్షలో మేయర్ సుధారాణి