
మారిన యూనిఫామ్ డిజైన్లు
రూ.75తో గిట్టుబాటు కాని కూలి..
ప్రభుత్వం ఒక జత యూనిఫామ్ స్టిచ్చింగ్‌కు రూ.75 చొప్పున చెల్లిస్తోంది. గతంలో ఒక్కో తకు రూ.50 చొప్పున చెల్లించగా గత ఏడాది నుంచి రూ.25 పెంచారు. ఇందులో కుట్టు కూలికి రూ.50, కటింగ్, బటన్స్, కాజలు, ఎంఎస్ సర్వీస్ చార్జి రూ.25 కలిపి రూ.75 ఇస్తున్నారు. బయట టైలర్లు ఒక్కో జత కుట్టడానికి రూ.300 నుంచి రూ.400 తీసుకుంటుండగా ప్రభుత్వం రూ.75 నిర్ణయించడంతో గిట్టుబాటు కావడం లేదని మహిళా సమాఖ్య సభ్యులు పేర్కొంటున్నారు. యూనిఫాంకు కనీసం రూ.150 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యారణ్యపురి/వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లోని వి ద్యార్థులకు(2025–26 )విద్యాసంవత్సరం అందించే స్కూల్ యూనిఫామ్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. తరగతుల వారీగా బాలబాలికలకు వేర్వేరు డిజైన్లలో దుస్తులు కుట్టించేందుకు ఇప్పటికే హనుమకొండ జిల్లాలో గ్రామీణ ప్రాంత మహిళ సంఘా ల సమాఖ్యలకు క్లాత్‌ను మండలాల వారీగా పాఠశాలల స్థాయిలో అందజేశారు. పట్టణ ప్రాంతంలో మెప్మాకు సంబంధించి టీఎల్‌ఎఫ్‌లకు అప్పగించారు. క్లాత్‌ను టిస్కో పంపిణీ చేసింది. ఈసారి స్టి చింగ్ డిజైన్‌లో మార్పులను గమనిస్తే.. ముఖ్యంగా చొక్కాలు, లాంగ్ ఫ్రాక్‌లకు పట్టీలు, భుజాలపైన క ప్స్ వంటి ప్యాచ్‌లు లేకుండా కుటిస్తున్నారు. స్టిచ్చింగ్ సరళంగా ఉండేందుకు స్వల్పమార్పులు చేశారు.
తరగతుల వారీగా యూనిఫామ్ ఇలా..
ఒకటి నుంచి 5వ తరగతి బాలురకు చొక్కా, నిక్కర్, ఆరు నుంచి 12వ తరగతి వరకు బాలురకు చొక్కా, పాయింట్, ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు చొక్కా, లాంగ్‌ఫ్రాక్, 4, 5 తరగతుల బాలికలకు షర్ట్, స్కర్ట్, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు పంజాబీడ్రెస్ మోడల్‌లో ఉండేలా టాప్ బాటమ్ చున్నీ లేకుండా కుట్టిస్తున్నారు. ఈసారి వేసవి సెలవులకు ముందే యూనిఫాం కుట్టించేందుకు కొలతలు కూడా తీసుకున్నారు. దుస్తులు హెచ్చు తగ్గులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తొలుత ఒకే జతకు క్లాత్‌రాక..
యూనిఫాం స్టిచ్చింగ్ కోసం ముందుగా ఒకే జత కోసం క్లాత్‌ను మహిళా సమాఖ్యలకు అప్పగించారు. ఈనెల 31 వరకు స్టిచ్చింగ్ పూర్తి చేసి అందజేయాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. జిల్లాలో 314 పీఎస్‌లు, 72 యూపీఎస్‌లు, 147 హైస్కూళ్లు, 9 కేజీబీవీలు, మూడు మోడల్ స్కూళ్లు, ఒక యూఆర్‌ఎస్, 25 వరకు ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. మొత్తం విద్యార్థులు 30,922 మంది ఉండగా ఇందులో బాలురు 14,852, బాలికలు 16,070 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రతి ఏడాది ఒక్కో విద్యార్థికి రెండుజతల చొప్పున స్కూ ల్ యూనిఫామ్ అందజేస్తున్నారు. ఈసారి తొలుత ఒక జత పంపిణీ చేసేందుకు స్టిచ్చింగ్ చేయిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక పిల్ల లకు అందజేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రెండో జతకు క్లాత్‌వచ్చే అవకాశం ఉంటుంది.
స్వల్పమార్పులతో స్టిచ్చింగ్
ప్రస్తుతానికి ఒకే జతకు క్లాత్ రాక
కుట్టుపనికి 31వ తేదీ వరకు డెడ్‌లైన్
జిల్లాలో 30,922 మంది విద్యార్థులు