
కుంభకోణాల కాంగ్రెస్
హన్మకొండ: నిధులు, ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే కాంగ్రెస్ నాయకులు కుంభకోణాలకు, అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని శాఖల్లో అవినీతికి పాల్పడుతున్నారని, చివరకు రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలనూ వదలడం లేదని దుయ్యబట్టారు. వీరి చేష్టలతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను దోపిడీ చేయడమే ఆదాయ మార్గంగా ఎంచుకున్న కాంగ్రెస్ మొన్న ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్లు, నిన్న పత్తి కొనుగోళ్లలో రూ.3వేల కోట్లు, నేడు రైతుల పంట కొనుగోలు కేంద్రాల్లో వినియోగించే తేమ శాతం కొలిచే యంత్రం, వేయింగ్ మిషన్, గ్రేడింగ్ మిషన్, టార్పాలిన్ షీట్ల టెండర్ల నిర్వహణలో టీజీ ఆగ్రోస్ దోపిడీకి పాల్పడిందని అన్నారు. తెలంగాణ ఆగ్రోస్ నిర్వహించిన టెంటర్ల తేదీని చెర్మన్ అనుయాయుల కోసం మార్చడమే కాకుండా సమయం దాటిపోయిన తర్వాత సీల్ వేసిన బాక్స్‌లు ఓపెన్ చేసి టెండర్లు వేయించారని, దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో బీఆర్‌ఎస్ వద్ద ఉన్నాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు 25 ఎక్సెస్‌తో సమయం దాటిన తర్వాత టెండర్ దాఖలు చేశారని, దీనిపై ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు నయీముద్దీన్, బండి రజనీకుమార్, శరత్‌శ్చంద్ర, చాగంటి రమేష్ పాల్గొన్నారు.
అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది
మంత్రుల గాలి మాటలు.. చేతి వాటం
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు,
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి