కేంద్రంపై ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె పోస్టుల దుమారం
సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ చేసిన సోషల్ మీడియా పోస్టులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ఆమె చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.ఇటీవల దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, వాటిపై పోలీసుల చర్యల నేపథ్యంలో స్నిగ్ధ తన సోషల్ మీడియా ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాత్మక పోస్టులు చేశారు. "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో జరుగుతున్న నిరసనకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీసుకున్న ఫొటోలను ఆమె పంచుకోవడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఒక కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ "రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలా?" అంటూ చేసిన సెటైరికల్ పోస్టు కూడా నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ పోస్టులను కొందరు ప్రభుత్వంపై విమర్శగా చూస్తుండగా, మరికొందరు రాజకీయ వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు.కేశినేని స్నిగ్ధ చేసిన పోస్టులు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉండటమే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా కొనసాగుతుండగా, ఆ పార్టీ ఎంపీ కుమార్తె కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే, ఇవి కేశినేని స్నిగ్ధ వ్యక్తిగత సోషల్ మీడియా పోస్టులు మాత్రమే. ఈ పరిణామంతో టీడీపీ అధికారిక వైఖరి ఏమిటనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. అయితే, ఇప్పటివరకు ఈ పోస్టులపై టీడీపీ పార్టీ గానీ, ఎంపీ కేశినేని చిన్ని గానీ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అలాగే, బీజేపీ నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.
మొన్నే చంద్రబాబుతో ముచ్చటించింది.. ఇంతలోనే విషాదం
సాక్షి, పోలవరం: రంపచోడవరం మండలంలోని ఇర్లపల్లి కొత్త కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రేకు షేడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.మృతురాలిని రంపచోడవరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివానిగా గుర్తించారు. సోమవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం పక్కన..ఇటీవల జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్‌లో శివానికి ప్రత్యేక అవకాశం లభించింది. ఈనెల 24న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఆమె మాట్లాడింది. ఆపై ఆయనతో ఫొటో కూడా దిగింది. చంద్రబాబుతో ముచ్చటించిన బాలిక ఇలా అనూహ్యంగా మృతి చెందడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.అనుమానాస్పద మృతిగా కేసుఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శివాని మృతితో పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారి మృతికి అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.చంద్రబాబు దిగ్భ్రాంతివిద్యార్థిని మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని.. తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని… pic.twitter.com/9NZE0spqgv— N Chandrababu Naidu (@ncbn) July 27, 2026విద్యార్థులు, యువత సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని.. ఒత్తిడి, నిరాశకు లోనుకావద్దని సూచించారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, తమ బాధలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు.
ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి ఎపిసోడ్లో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కృష్ణా రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో ఆయన పరారీలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వివరాల మేరకు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన హైదరాబాద్ పోలీసులు, ఆయనకు నోటీసులు జారీ చేసేందుకు గత రెండు రోజులుగా తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే పోలీసుల విచారణకు సహకరించకుండా ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన రికార్డుల్లో పేర్కొన్న రెండు నివాస చిరునామాలను పోలీసులు పరిశీలించినప్పటికీ అక్కడ ఆయన ఆచూకీ లభించలేదు. అంతేకాకుండా తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఆయన పరారీలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఒకవైపు పోలీసుల గాలింపు తీవ్రతరం కాగా, మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తీవ్రత, నమోదు చేసిన సెక్షన్లు, ఆయన సమర్పించిన వాదనలపై హైకోర్టులో ఈరోజు మరోసారి కీలక విచారణ జరగనుంది. కానీ, ప్రస్తుతం ఆయన కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడికి ఈ-కేవైసీ తప్పనిసరి
రేషన్ లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా ఈ– కేవైసీ చేయించాలని పౌరసరఫరాలశాఖ ఆదేశాలిచ్చిన విషయం విదితమే. కేవైసీ నమోదు చేసిన వారికే సరుకులు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతుండటంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్తున్నారు. కొంతమంది ఆధార్ కార్డు అప్డేట్ లేకపోవడంతో ఈ–కేవైసీ కావడం లేదు. కార్డు అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు పరుగు పెడుతున్నారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు విధిగా ఈ–కేవైసీ చేసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి. ఆధార్ అప్డేట్ కోసం పరుగులు10ఏళ్ల క్రితం పొందిన ఆధార్ కార్డులను నవీకరణ చేసుకోకపోవడంతో చాలామందికి సమస్య ఎదురవుతోంది. ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్రలు 24 గంటల సమయంలో అప్డేట్ అవుతుంది. ఒక్కోసారి వారం కూడా పడుతుందని ఆధార్ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆధార్ నవీకరణ పూర్తికాకపోతే రేషన్‌కార్డు నుంచి పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉంది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు.సమస్యలెన్నో కార్డులో పేర్లున్న చిన్నారులకు, తల్లిదండ్రుల వేలిముద్రలతో ఆధార్ కార్డు జారీ చేస్తారు. వారి వయసు అయిదేళ్లు దాటగానే.. వేలిముద్రలు, ఫొటోను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో చాలా మంది చిన్నారులు కార్డులను నవీకరించుకోలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది చిన్నారులు ఊరికి దూరంగా చదువుల నిమిత్తం వేరే పట్టణాలు, వసతి గృహాల్లో ఉంటున్నారు. సదరు విద్యార్థులు ఈ– కేవైసీ కోసం ఇంటికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. వారి పేర్లు తొలగిపోతాయనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వారికి ఫోన్లు చేసి ఇంటికి వచ్చి ఈ–కేవైసీ చేసుకోవాలని కోరుతున్నారు. లబ్ధిదారులు తమ పరిధిలోని చౌక ధరల దుకాణం నుంచే కాకుండా దేశంలో ఎక్కడి నుంచైనా ఈ– కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.కార్డులో పేర్లున్న వారంతా..ఈ– కేవైసీ నమోదులో వేలి ముద్రపడకపోవడం, పదేళ్లలోపు చిన్నారుల ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఆధార్‌లో తప్పులు తదితర సమస్యలతో నమోదు ప్రక్రియ జిల్లావ్యాప్తంగా నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 3లక్షల కార్డులుండగా 11లక్షల యూనిట్లకు 9లక్షల వరకు కేవైసీ చేసుకున్నట్లు సమాచారం. కార్డులోని ఎవరో ఒకరు వెళ్లి వేలిముద్ర వేస్తే సరకులు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ– కేవైసీ కోసం కార్డులో పేర్లున్న ప్రతి ఒక్కరూ రేషన్ దుకాణానికి వెళ్లాల్సిందే. ఒక కార్డులో ఐదుగురు లబ్ధిదారులుగా ఉంటే వారంతా.. తమ ఆధార్, రేషన్ కార్డులతో వెళ్లి ఈ– కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.కరీంనగర్ అర్బన్:
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
సీఎం సినిమాకే తప్పని తిప్పలు.. షోలు ఆపేసి మరీ
అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
EPFO సభ్యుడు మరణిస్తే నగదు క్లెయిమ్ ఎలా?
ట్రంప్ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!
ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
'ఆదర్శ కుటుంబం' చిట్టిబాబు.. భలే ఫన్నీగా ఉన్నాడు
కిరాయి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..!
వీడని బిగ్ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం!
వేములవాడలో 10 అడుగుల నాగుపాము కలకలం..
మినిస్టర్‌కు మినహాయింపు ఉంటుందేమో!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
మన టార్గెట్ రీచ్ అయ్యాం!
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా
లెనిన్ హిట్ ఎఫెక్ట్.. 30 లక్షల నుంచి 2 కోట్ల దాకా
మరో కలకలం రేపిన ఇరాన్.. ఇక ట్రంప్ ఊరుకుంటారా?
'ఆదిపురుష్'.. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు
తారుమారైన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు!
నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
ఈపీఎఫ్ వడ్డీ డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక
చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
సీఎం సినిమాకే తప్పని తిప్పలు.. షోలు ఆపేసి మరీ
అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
EPFO సభ్యుడు మరణిస్తే నగదు క్లెయిమ్ ఎలా?
ట్రంప్ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!
ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
'ఆదర్శ కుటుంబం' చిట్టిబాబు.. భలే ఫన్నీగా ఉన్నాడు
కిరాయి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..!
వీడని బిగ్ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం!
వేములవాడలో 10 అడుగుల నాగుపాము కలకలం..
మినిస్టర్‌కు మినహాయింపు ఉంటుందేమో!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
మన టార్గెట్ రీచ్ అయ్యాం!
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా
లెనిన్ హిట్ ఎఫెక్ట్.. 30 లక్షల నుంచి 2 కోట్ల దాకా
మరో కలకలం రేపిన ఇరాన్.. ఇక ట్రంప్ ఊరుకుంటారా?
'ఆదిపురుష్'.. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు
తారుమారైన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు!
నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
ఈపీఎఫ్ వడ్డీ డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక
చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఫొటోలు
'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)
గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ (ఫొటోలు)
మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)
ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
డాక్టర్ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్ మేకర్' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)
శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)
'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనాలు (ఫోటోలు)
నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)
సినిమా
సడెన్‌గా నా కార్‌వ్యాన్‌లోకి వచ్చి బట్టలిప్పేసాడు.!
సినీ రంగంలో కథానాయకిల జీవితం అద్దాల మేడ వంటిది అంటారు. అది చూడ్డానికి అందంగా ఉంటుంది లోనికి దిగు చూస్తే భయాలు ,ఆవేదనలు, ఆటంకాలు, అవరోధాలు, ఆరోపణలు వంటి పలు మానసిక ఘటనలను కథానాయకులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇది వర్ధమాన నటిమణీలే కాకుండా ప్రముఖ నటీమానులు కూడా ఎదుర్కొంటున్న సమస్యే. పాన్ ఇండియా కథానాయకగా రాణిస్తున్న నటి కాజల్ అగర్వాల్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. తెలుగు తమిళం హిందీ భాషల్లో అగ్ర కథానాయక రాణించిన ఈమె ఆ మధ్య పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యారు. కాగా ఇటీవల తన రెండవ ఇన్నింగ్ ను ప్రారంభించి బిజీగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఆమె ఎదుర్కొన్న ఒక దిగ్భ్రాంతి సంఘటన గురించి ఒక భేటీలో పేర్కొంటూ. ‘‘ షూటింగ్ స్పాట్ లో మహిళలకు సరైన రక్షణ లేదనడానికి నేను ఎదుర్కొన్న ఒక ఘటన చిన్న ఉదాహరణ. నిజం చెప్పాలంటే షూటింగ్ ప్రాంతం అనేది కళాకారులకు రెండవ ఇల్లు మాదిరి అందులో కేరవాన్ అనేది వారికి ప్రత్యేక నివాసం. ఆమధ్య షూటింగ్లో పాల్గొన్న నేను విరామ సమయంలో కేరవాన్ కు విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడు ఆ చిత్ర సహాయ దర్శకుడు నా అనుమతి లేకుండా కేరవాన్ లోకి చొరపడ్డాడు. నేను ఒంటరిగా ఉండటం చూసి ఆనుచితంగా ప్రవర్తించాడు. ఒకసారిగా కంగారు పడ్డాను. కాళ్ల లోంచి వణుకు పుట్టింది. అతను వచ్చిన వెంటనే చొక్కా విప్పేశాడు . దీంతో నేను ఇంకా భయపడ్డాను అయితే అతని తన గుండెపై పొడిపించుకున్న ట్యాటూ చూపించారు. అందులో ఉన్నది ఎవరిదో కాదు నా ప్రతి రూపమే. తన బొమ్మను ట్యూటూగా పొడిని ఉంచుకోవడం సంతోషమే అనిపించింది. అతను నా అభిమాని అని చెప్పాడు. ఎంత అభిమాని అయిన అలా ప్రవర్తించటం సరికాదు. అది క్రిమినల్ చర్యే అవుతుంది అని అతని హెచ్చరించి పంపించేశాను‘‘ అని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.
భార్య జైనాబ్‌పై ట్రోలింగ్.. అఖిల్ స్పందన
గతేడాది జూన్‌లో అక్కినేని అఖిల్–జైనాబ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చాలా సాదాసీదాగా జరిగిన ఆ పెళ్లి వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరిపై కొంతమంది ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా జైనాబ్ వయసు, ఆమె మతం వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. తాజాగా ఈ విషయంపై అఖిల్ స్పందించాడు. తనకు, తన భార్యకు మధ్య ఉన్న వయసు వ్యత్యాసం, ఆమె మతం వంటి విషయాలు తనకు అసలు సమస్యగా అనిపించలేదని ఆయన స్పష్టం చేశాడు. పెళ్లికి ముందే వీటిపై తామిద్దరం మాట్లాడుకున్నాం. అప్పట్లో కొన్ని నెలల పాటు తనపై, తన భార్యపై నడిచిన ట్రోలింగ్ గురించి ఆలోచించాలా.. లేక రాబోయే నా 50 ఏళ్ల జీవితం గురించి ఆలోచించాలా.. నేను నా జీవితం గురించి ఆలోచించాను. ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి. తన భార్యగా మారిన తర్వాత ఇలాంటి నెగెటివ్ పోస్టులు వస్తాయని ముందే చెప్పాను.వాటిపై మానసికంగా సిద్ధంగా ఉండమని సూచించాను. జైనాబ్ అదే విధంగా పరిణతి చూపింది. తమ జంటపై వచ్చిన ప్రతి ట్రోలింగ్‌ను దీవెనగా తీసుకున్నాం. కులం, మతం, వయసు, ప్రేమ అన్నింటినీ దాటి తమ మధ్య అద్భుతమైన అవగాహన ఉందని చెప్పాడు. తాను మానసికంగా, శారీరకంగా కష్టకాలంలో ఉన్నప్పుడు జైనాబ్ అందించిన సపోర్ట్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. అక్కడ్నుంచే తమ మధ్య అండర్స్టాండింగ్ మరింత బలపడింది. సోషల్ మీడియాలో కనిపించే ట్రోల్స్ నుంచి తనను రక్షించలేను. కానీ వాటిని తను ఎలా స్వీకరించిందనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో జైనాబ్ ఎంతో పరిణతి చూపింది. ఐదేళ్ల రిలేషన్షిప్లో తనను బాగా అర్థం చేసుకుందని అఖిల్ పేర్కొన్నాడు. అఖిల్ లెనిన్ మూవీతో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్‌వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
క్రీస్తు జీవిత చరిత్రతో 'ప్రజాపతి'
యేసుప్రభు జీవిత చరిత్రతో ఇంతకుముందు పలు సినిమాలు వచ్చాయి. తాజాగా 'ప్రజాపతి' పేరుతో మరో మూవీ తెరకెక్కబోతోంది. అల్లేలూయ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ సమర్పణలో బి.రూబెర్ట్ కథ,దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రమిది. ప్రజాపతి పేరుతో యేసు క్రీస్తు జీవిత చరిత్రను ఈయన గత 25 ఏళ్లుగా నాటకాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. కాగా ప్రభు ఆదేశాలు మేరకు ఈ నాటకాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి పూనుకున్నట్లు బి.రూబెర్ట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.చిత్ర నిర్మాణానికి ముందే ట్రైలర్‌ను రూపొందించడం విశేషం. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజాపతి చిత్ర ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలా కార్యక్రమాలు ఉన్న రూపేష్ ఆహ్వానించడంతో ఇందులో పాల్గొనడానికి అంగీకరించాను. ఎందుకంటే ఇది ఈ కాలంలో జరగాల్సిన ముఖ్యమైన ప్రయత్నం గా నేను భావించాను. ఇప్పుడు సమాజానికి మంచి విషయాన్ని ప్రకటించడం చాలా అవసరం ఆ ఉద్దేశంతో అక్కనున్న ఈ చిత్రం ప్రేక్షకులను హత్తుకునే విధంగా రూపొందాలని సూచించడంతో పాటూ శుభాకాంక్షలు అందించారు. చిత్ర ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.
'రాయన్'కి జాతీయ అవార్డ్.. విమర్శలకు ధనుష్ కౌంటర్
2024కి సంబంధించి కొన్నిరోజుల క్రితం జాతీయ సినీ అవార్డులని ప్రకటించారు. అయితే వీటిపై చాలానే విమర్శలు వచ్చాయి. కొన్ని చిత్రాలకు అసలు ఏ ప్రాతిపదికన ఇచ్చారంటూ సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శించారు. అలా ట్రోల్స్ బారిన పడ్డ మూవీ 'రాయన్'. ఉత్తమ తమిళ సినిమాగా దీనికి పురస్కారం దక్కింది. ఈ విషయమై హీరో ధనుష్‌ని పలువురు విమర్శించారు. ఇప్పుడు వాళ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఇంట విషాదం)చెన్నైలో ఆదివారం, ధనుష్ పేరిట బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్.. తన చిత్రానికి జాతీయ అవార్డ్ ప్రకటించడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. అప్పట్లో ఒక్కరూ మాట్లాడలేదు కానీ ఇప్పుడు 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు.'మైయిళగన్(సత్యం సుందరం), మహారాజా సినిమాలు 'రాయన్' కంటే బాగున్నాయి. ఆ విషయాన్ని నేను కూడా ఒప్పుకొంటాను. కానీ గతంలో నేను నటించిన పుదుపెట్టై, వడచెన్నై, కర్ణన్, మరియన్, రన్ఝానా తదితర చిత్రాలు విడుదలైన టైంలో జాతీయ అవార్డులకు అర్హమైనవని బలంగా వాదించిన వాళ్లు చాలా తక్కువమంది. ఇప్పుడు నాకు వచ్చిన జాతీయ అవార్డుని 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ గతంలో నాకు ఇదే అవార్డులు రాకపోయినప్పుడు కనీసం 10 శాతం మంది కూడా నాకు సపోర్ట్‌గా మాట్లాడలేదు' అని ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఈ ఏడాది ఏప్రిల్‌లో 'కర' సినిమాతో వచ్చిన ధనుష్.. ప్రస్తుతం 'ఓం' సినిమా చేస్తున్నాడు. అక్టోబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'అమరన్' తీసిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)Thalaivan #Dhanush Speech about Raayan controversy.. 🤍#DhanushBloodDonationCamp #OM pic.twitter.com/Ty4F9xlQnG— Director vky (@vkycinecrave) July 26, 2026
క్రీడలు
ట్విన్ బ్రదర్స్ పోరు.. సీఎస్కే బౌలర్‌కు చుక్కెదురు
ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్‌లో ట్విన్ బ్రదర్స్ పోరు అభిమానులను అలరించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ట్రెంట్ రాకెట్స్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కవల సోదరులు క్రెయిగ్ ఓవర్టన్, జేమీ ఓవర్టన్ తలపడ్డారు. ఈ పోరులో ట్రెంట్ రాకెట్స్ ఆల్‌రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ పైచేయి సాధించాడు.చివరి ఐదు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో తన కవల సోదరుడు జేమీ ఓవర్టన్ (లండన్ స్పిరిట్) బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొని ట్రెంట్ రాకెట్స్‌కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. జేమీ ఓవర్టన్ ఐపీఎల్ 2026లో సీఎస్కే ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్‌కు బెన్ డకెట్ 47 బంతుల్లో 75 పరుగులతో అద్భుత ఆరంభం అందించాడు. చివర్లో క్రెయిగ్ ఓవర్టన్ కేవలం 6 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. జేమీ వేసిన చివరి ఓవర్లో సిక్సర్‌తో పాటు రెండు వరుస డబుల్స్ సాధించి మ్యాచ్‌ను ముగించాడు.అంతకుముందు లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 159/9 స్కోరు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ 24 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ 33 పరుగులు చేశాడు. క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు తీశాడు.బట్లర్ విధ్వంసంమరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌పై 87 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.బట్లర్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టుకు 187/5 భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో టామ్ మూర్స్ 17 బంతుల్లో అజేయంగా 39 పరుగులు జోడించాడు.188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. లియామ్ డాసన్ 3/15తో రాణించగా, జోష్ టంగ్, సోనీ బేకర్, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టి ఫీనిక్స్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. కెప్టెన్ డొనోవన్ ఫెరెరా చేసిన 23 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు.
కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ కసిగా కనిపిస్తున్నాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని వాసూ పరన్జేప్ క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ మూడు గంటల పాటు నెట్స్‌లో సాధన చేశాడు. దాదాపు 3 గంటల పాటు వెయ్యి బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ వినూత్న షాట్లు ఆడి అలరించాడు. మళ్లీ టీమిండియాలో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అన్నంతగా సూర్యలో కసి కనిపిస్తుంది. నెట్స్‌లో చెమటోడ్చిన వీడియోను ఎక్స్‌లో పంచుకున్న సూర్య.. ‘సండే ఫన్డే. క్విక్ రన్. 3 గంటల పాటు వెయ్యి బంతులు ఆడాను. మంచి ఫీల్ వచ్చింది’ అని క్యాప్షన్ జత చేశాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఇక 35 ఏళ్ల సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్‌గా 2026 టీ20 ప్రపంచకప్‌ను అందుకున్నాడు. అయితే బ్యాటర్‌గా విఫలమవుతూ వచ్చిన సూర్యకుమార్ ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో టీ20 కెప్టెన్సీ పదవిని కోల్పోయిన సూర్యకుమార్‌కు జట్టులోనూ చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత మహారాజ ట్రోఫీలో తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అప్పటినుంచి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న సూర్యకుమార్ కఠోర సాధన కొనసాగిస్తున్నాడు. Sunday was fun. Quick run 🏃🏾 Batted around 1000 balls for 3 hours. Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026Read: మీరాబాయి స్వర్ణ పతకం వెనుక కన్నీటిగాథ!
మీరాబాయి స్వర్ణం వెనుక దాగున్న కన్నీటిగాథ!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసి ఔరా అనిపించింది. 48 కేజీల కేటగిరీలో మీరాబాయి స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగ2ఇరీలో 105 కేజీలు.. మొత్తంగా 190 కేజీల బరువు ఎత్తి దేశానికి తొలి స్వర్ణంప పతకం అందించింది. మీరాబాయికి కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడో పతకం. 2018 గోల్డ్‌కోస్ట్, 2022 బర్మింగ్హమ్ క్రీడల్లోనూ మీరాబాయి పతకాలు సాధించింది. తాజాగా గ్లాస్కో వేదికపై వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన మీరాబాయి ఫోడియంపై నిలబడ్డ సమయంలో జాతీయ గీతం ఆలపిస్తూ కన్నీటిపర్యంతమవ్వడం వైరల్‌గా మారింది. విజయం తర్వాత మీరాబాయి చాను మాట్లాడుతూ.. ‘వరుసగా మూడోసారి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు గత రెండు రోజులుగా ఆహారం ఏమీ తీసుకోలేదు. పసిడి పతకం గెలవడంతో నాపై ఉన్న ఒత్తిడి అంతా పోయింది. నేను చాలా సంతోషంగా, అలాగే చాలా ఉద్వేగంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇవాళ పతకం గెలవడం వెనుక ఎన్నో త్యాగాలు చేయడంతో పాటు, ఒత్తిడిని, గాయాలను అధిగమించాను. నేను కామన్వెల్త్ గేమ్స్‌లో రికార్డు నెలకొల్పుతానని అనుకోలేదు. కేవలం నా కోచ్ అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి సారించాను. కష్టకాలంలో నా తల్లితో పాటు కోచ్ విజయ్ శర్మ అండగా నిలిచారు. కుటుంబం, స్నేహితుల నుంచి నాపై చాలా ఒత్తిడి ఉండేది. భారత్‌కు మూడో స్వర్ణం అందించినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రీడల్లో నేను పెద్దగా శ్రమ పెట్టకూడదని అనుకున్నాను, కానీ నా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. నేను చెరో రెండు లిఫ్టులు చేస్తానని కోచ్, నేను భావించాము.’ అని మీరాబాయి వ్యాఖ్యానించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన మీరాబాయి తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం ద్వారా కొత్త చరిత్ర లిఖించింది. INDIAN NATIONAL ANTHEM IN GLASGOW 🇮🇳- Mirabai Chanu got emotional after winning the Gold Medal for India in Weightlifting! 🏋️♀️🥺 pic.twitter.com/UfNeFHXg1a— The Khel India (@TheKhelIndia) July 26, 2026 मीराबाई चानू ने CWG 2026 में जीता गोल्ड मेडल CWG गेम्स में चानू की गोल्डन हैट्रिकMirabai Chanu #MirabaiChanu || #GoldMedal #BreakingNews #CWG #mirabaichanu pic.twitter.com/GDCUum3jqY— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) July 26, 2026Read: పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి
పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జాదుమణి పతకం ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన జాదుమణి పతకానికి అడుగుదూరంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జాదుమణి 5-0తో పాకిస్తాన్ బాక్సర్ సుమామా రెహమాన్‌ను మట్టికరిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం జాదుమణి ఈ విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. "నా విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నాను. పాకిస్థాన్‌పై గెలవడం చాలా గొప్పగా అనిపించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మరింత మెరుగ్గా రాణించి భారత్‌కు స్వర్ణం సాధించిపెడతాను''అని జాదుమణి పేర్కొన్నాడు. తొలి రౌండ్లో బై లభించిన జాదుమణి రెండో రౌండ్లో స్కాట్లాండ్కు చెందిన ఆరోన్ కల్లెన్పై 5-0తో అజేయ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రిక్వార్టర్స్‌లో పాకిస్తానీ బాక్సర్‌పై విరుచుకుపడిన జాదుమణి 5-0తో ఏకగ్రీవ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక జాదుమణి మంగళవారం క్వార్టర్స్ ఫైట్‌లో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశిస్తే అతనికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో సెమీఫైనల్లో ఓడిపోయిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి.ఇక మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి దెబోరా మావ్ (కెన్యా) రెండో రౌండ్లోనే చేతులెత్తేసింది. ఇక స్విమ్మింగ్‌లో భారత ఫ్రీస్టయిల్ రిలే జట్టు ఫైనల్‌కు చేరింది. 4X200 ఫ్రీస్టయిల్ రిలే హీట్‌లో దక్షణ్, అనీశ్ గౌడ, ఆర్యన్ నెహ్రా, శ్రీహరి నటరాజ్లతో కూడిన భారత జట్టు 7ని:39.48 సెకన్లలో లక్ష్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ ఫైనల్లో భారత ప్లేయర్ తపన్ మొహంతి 70.100 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. లాన్ బౌల్స్‌లో మహిళల పెయిర్ ఈవెంట్లో రూపా రాణి–పింకీ సింగ్ (భారత్) జోడీ, పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ (భారత్) పరాజయాలు చవిచూసి ముందంజ వేయడంలో విఫలమయ్యారు. 🚨 INDIA’S JADUMANI SINGH THRASHED PAKISTANI BOXER 5-0 AT COMMONWEALTH GAMES 2026 🇮🇳🔥Jadumani Singh Mandengbam said - "I dedicate my win to the Kargil heroes. I felt great winning against Pakistan."Another day, Another humiliation for Pakistan 😅pic.twitter.com/1REqzhnEoe— Ajay Jadeja (@AjayJadeja171) July 27, 2026
న్యూస్ పాడ్‌కాస్ట్
రెండేళ్ల బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం... ‘కాగ్’ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
ప్రశ్నపత్రాల లీకేజీ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల రూపాయల జరిమానా... ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కృష్ణా, గోదావరి డెల్టాలో వరి వేయొద్దని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
చంద్రబాబు సర్కారును నిద్ర లేపుతాం... పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతాం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన
ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించిన ప్రతిపక్షాలు..
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
రామాయపట్నంలో భారీ స్కామ్... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
బిజినెస్
ఆదాయపు పన్ను శాఖ వారు.. మీ సేవలో..
ఔనండి.. నిజమే. ఆదాయపు పన్ను శాఖ వారు ఇందుకు సిద్ధమవుతున్నారు. జూలై 24వ తేదీన 167వ ఇన్‌కం ట్యాక్స్ డే నిర్వహించిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను డిపార్టుమెంటుకి దశ–దిశ నిర్దేశించారు. ఈ సూచనలు అమలైతే చాలా మంచిదే అనుకోవచ్చు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో 5 ప్రాధాన్యతలతో కూడుకున్న మూడు పిల్లర్లతో పాటు ఏడు ప్రధాన సూత్రాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..దేశంలో అప్పీళ్ల సంఖ్య లక్షల్లో పేరుకుపోయింది. వాటిని శీఘ్రగతిని పూర్తి చేయమని నిర్దేశించారు ఆర్థిక మంత్రి. అనిశ్చితి నుంచి కచ్చితమైన పరిస్థితికి వెళ్లాలని నిర్దేసం. కొత్త చట్టంలో మార్పుల వల్ల అప్పీళ్ల సంఖ్యను తగ్గించవచ్చని ఆశాభావం నెలకొంది. ముందుగా మూడు మూల స్తంభాలు చూస్తే..🔹 సకాలంలో సర్క్యులర్ల ద్వార పన్ను చెల్లింపుదార్ల బాధ్యతలను వారికి తెలియజేయడం. (క్లారిటీ) 🔹 అధికారుల పరిధిలో చట్టంలో వివిధ అంశాలకు వివరణ ఇచ్చేటప్పుడు స్థిరత్వం, నిలకడ, క్రమబద్ధత. (కన్సిస్టెన్సీ) 🔹 అప్పేలేట్ అధికారులు ఇచ్చే ఆర్డర్లలో విషయం తెలుసుకుని, భవిష్యత్ సంస్కరణలకు అవసరమైన సమాచారం గురించి నిరంతరం నేర్చుకోవడం (కంటిన్యూస్ లెర్నింగ్).వీటి వల్ల లిటిగేషన్లను నివారించవచ్చు. లిటిగేషన్ ఏర్పడ్డ తర్వాత మేనేజ్ చేయడం కన్నా ముందుగానే నివారించవచ్చని, దానికి ఈ మూడు అంశాలు ప్రాతిపదికగా ఉండాలనేది ఆలోచన. నిజమే. లిటిగేషనే లేకపోతే, అంతా సాఫీగానే ఉంటుంది కదా.ఇక పన్ను వ్యవస్థపై ‘విశ్వాసం’ పెంపొందించాలంటే ‘రెస్పాన్సివ్ ట్యాక్స్ గవర్నెన్స్’ ఆవశ్యకతను ప్రతిఫలించేలా ‘5R’లు.. అంటే 5 ప్రాధాన్యతలను గుర్తించారు. అవేంటంటే, పట్టుకోవడం, ప్రతిస్పందించడం, పరిష్కరించడం, పునఃసమీక్షించడం, పన్ను విధానాలను సంస్కరించడం. ఇది చాలా మంచి ఆలోచన. ఇలా చేస్తే, అధికారులను ‘మా మంచి వారు.. మనసున్న వారు’ అని అనకతప్పదు. పట్టుకోవడం అంటే కేసులు పట్టుకోవడం. ట్యాక్స్ పేయర్స్ ఫిర్యాదులను తెలుసుకోవడం. వాటిని అర్థం చేసుకుని, స్పష్టంగా, పూర్తి సమాచారాన్ని, మర్యాదకరంగా ప్రతి స్థాయిలో ఇస్తూ, ప్రతి స్పందించడం. సకాలంలో సమగ్రంగా పరిష్కారం ఇవ్వడం. ఫిర్యాదులకు కారణాలను తెలుసుకుంటూ, వాటి ద్వారా నేర్చుకుంటూ, జాగ్రత్త వహించడం. అలాగే పన్ను మదింపు విధానం ప్రాసెస్, సిస్టం, పద్ధతులను పునఃసమీక్షించుకుని, ఫిర్యాదుల సంఖ్యను తగ్గించడం.. ఇలా ఈ ఐదు అంశాలూ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నిజాయితీ గల పన్ను చెల్లింపుదార్లకు వెసులుబాట్లు, సౌలభ్యం కల్పించడం.. పన్ను ఎగవేతదార్లను వదలకపోవడం అనే విధానాన్ని పాటించాలనేది హితవు. రెండు వర్గాల వారితోనూ ఒకే విధంగా వ్యవహరించకుండా ఎవరికి తగ్గ ట్రీట్మెంట్ వారికివ్వాలని అర్థం. వికసిత భారత్ వైపు అడుగులు వేయాలంటే ఏడు సూత్రాలను పొందుపరిచారు. 🔹 స్వయంగా, స్వతహాగా పాటించడం 🔹 సరళీకృత విధి విధానాలు 🔹 పన్ను విధానంలో అనిశ్చితి లేకుండా అమలుపరచడం, బలోపేతం చేయడం 🔹 టెక్నాలజీని విస్తృతంగా, బాధ్యతాయుతంగా వాడుకోవడం 🔹 డిపార్టుమెంటుని సంస్థాగతంగా, పటిష్టంగా చేయడం 🔹 ప్రజల విశ్వసనీయతని పెంపొందించడం 🔹 నిరంతర అభివృద్ధి వైపు నిత్యం అడుగులు వేయడంఆ మూడు స్తంభాలతో పాటు ఐదు ప్రాధాన్యతలను అమలు చేస్తూ ఏడు సూత్రాలను పాటిస్తే నిజంగానే నిజాయితీపరులకు న్యాయం జరుగుతుంది.
మళ్లీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 23,944 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 601 పాయింట్లు పుంజుకొని 76,667 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.16బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 92.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.63 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం పెరిగింది.నాస్డాక్ 0.64 శాతం నష్టపోయింది.Today Nifty position 27-07-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా?
క్రెడిట్ కార్డుతో మనం చేసే ప్రతి స్వైపింగ్ లేదా ఆన్లైన్ కొనుగోలుపై బ్యాంకులు రివార్డ్ పాయింట్లను ఖాతాలో జమ చేస్తుంటాయి. అయితే మెజారిటీ వినియోగదారులు ‘ఒక రివార్డ్ పాయింట్ అంటే ఒక రూపాయి’ అనే అపోహలో ఉంటారు. వాస్తవానికి బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రతీ రివార్డ్ పాయింట్ విలువ మీరు దాన్ని ఏ విధంగా రిడీమ్ (వినియోగం) చేసుకుంటున్నారు అనే అంశంపై ఆధారపడి 20 పైసల నుంచి ఒక రూపాయి వరకు మారుతుంటుంది.రీడెంప్షన్ పద్ధతిని బట్టి పాయింట్ విలువపాయింట్లను విమాన టికెట్లు లేదా హోటల్ రూమ్‌ల కోసం ఉపయోగిస్తే ప్రతి పాయింట్‌కు అత్యధికంగా కార్లును అనుసరించి రూ.0.50- రూ.1.00 వరకు లభిస్తుంది.అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వౌచర్లుగా మార్చుకుంటే ఒక పాయింట్ విలువ రూ.0.30-రూ.0.50 మధ్య ఉంటుంది.రివార్డ్ పాయింట్లను నేరుగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుగా మార్చుకుంటే బ్యాంకును బట్టి ఒక పాయింట్‌కు కేవలం రూ.0.20-రూ.0.25 మాత్రమే వస్తుంది.బ్యాంకు రివార్డ్ క్యాటలాగ్‌లో లభించే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు కొనుగోలు చేస్తే పాయింట్ విలువ రూ.0.10-రూ.0.20 కి పడిపోతుంది.గరిష్ఠంగా మలచుకోవడానికి సూత్రాలుభారతదేశంలో చాలా క్రెడిట్ కార్డ్ పాయింట్లకు 12-36 నెలల గడువు ఉంటుంది. వాడకుండా వదిలేస్తే పాయింట్లు రద్దయిపోతాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ రివార్డ్ పోర్టల్‌ను తనిఖీ చేసి పాయింట్లను రీడీమ్ చేసుకోవడం శ్రేయస్కరం.ప్రయాణాలు, ఇంధనం లేదా ఆన్లైన్ షాపింగ్‌ల కోసం ప్రత్యేక కో-బ్రాండెడ్ కార్డ్‌లను వాడటం వల్ల సాధారణ 1X పాయింట్ల కంటే 5X-10X వేగంతో ఎక్కువ పాయింట్లు లభిస్తాయి.రివార్డ్ పాయింట్ల ఆశతో అనవసర ఖర్చులు చేయడం లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు బకాయిలపై నెలకు 3%-3.5% (ఏడాదికి 36% - 42%) వడ్డీ చెల్లించడం వల్ల మీరు పొందే 1%-2% రివార్డ్ ప్రయోజనం పూర్తిగా వ్యర్థమవుతుంది.
20ల్లో చేసే తప్పులు.. 30ల్లో కరిగిపోతున్న కలలు!
జీతం వస్తోంది.. ఖర్చవుతోంది. కానీ సంపద మాత్రం పెరగడం లేదు. ఇది నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవం. ఖరీదైన ఫోన్లు, వీకెండ్ ట్రిప్స్, క్రెడిట్ కార్డు షాపింగ్‌లు, సోషల్ మీడియా చూపించే లైఫ్‌స్టైల్...ఇవన్నీ తెలీకుండానే సంపద సృష్టించే అవకాశాలను యువతకు దూరం చేస్తున్నాయి. 20ల్లో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో కోట్ల రూపాయల నష్టంగా మారతాయి. అందుకే ఈ వయసులో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన దిశలో నడిపించడం అంతకంటే ముఖ్యం. ఈ ఏడు మనీ మిస్టేక్స్‌ను ఇప్పుడే గుర్తిస్తే యువత భవిష్యత్తు ఆర్థికంగా మరింత బలంగా మారుతుంది. నెలాఖరులో జీతం బ్యాంకు ఖాతాలో పడుతోంది. కానీ కొన్ని రోజుల్లోనే మాయమవుతోంది. ఈనెల నుంచి సేవింగ్స్ మొదలు పెడతా, ఈసారి జీతం పెరిగాక సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్) చేస్తా, ఈ ఈఎంఐ అయ్యాక పెట్టుబడులు ప్లాన్ చేస్తా ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత తమ జీవితంలో అత్యంత విలువైన ఒక దశాబ్దాన్ని కోల్పోతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 20 ఏళ్ల వయసులో చేసే ఆర్థిక పరమైన తప్పులు పెద్దవేం కావు. కానీ వాటి ప్రభావం మాత్రం 30, 40 ఏళ్ల వరకు వెంటాడతాయి. చిన్న అలవాట్లు, చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న ఆనందం కోసం వేసే వాయిదాలు భవిష్యత్తులో చేతికందాల్సిన కోట్ల రూపాయలను దూరం చేస్తాయి. 20ల్లో యువత చేసే తప్పులు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలి ? పర్సనల్ ఫైనాన్స్ (వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణ) గురించి ఎక్కడైనా చదివినా, సోషల్ మీడియాలో నిపుణుల సూచనలు విన్నా ఎక్కువమంది యువతే లక్ష్యంగా సలహాలు ఇస్తుంటారు. చిన్న వయసులోనే పొదుపు చేయండి, ఉద్యోగంలో చేరిన నెలనుంచే పెట్టుబడులు ప్రారంభించండి, అప్పులకు దూరంగా ఉండండి అంటూ అనేక సూచనలు ఇస్తుంటారు. పెట్టుబడులు ఎలా చేయాలో వివరిస్తుంటారు. కానీ 90 శాతం యువత ఈ సూచనలను పట్టించుకోరు. కారణం వారికి అవగాహన లేకపోవడం కాదు. కెరీర్ ప్రారంభ దశలో ఎదురయ్యే అనిశ్చితులు, ఆకర్షణలు, కొన్నాళ్ల తర్వాత మొదలెడదాంలే అనే భావన వారిని వెనక్కి నెడతాయి. అయితే 20 ఏళ్ల వయసు ప్రయోగాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి, కలలు కనడానికి సరైన సమయం. అయితే యువత ఆనందానికి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. కానీ ఆనందం కాస్త ప్రణాళికతో ఉండాలి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఊహించని సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. లేకపోతే 30 ఏళ్ల తర్వాత ‘ఇప్పటిదాకా ఇంత సంపాదించాను, అంతా ఎక్కడికిపోయింది‘ అనే ప్రశ్న ఎదురవుతుంది. అప్పడు పెరిగినబాధ్యతలు, పెరుగుతున్న ఖర్చులు భవిష్యత్తు గురించి బెంగపడేలా చేస్తాయి.యువత భవిష్యత్తును మింగేస్తున్న 7 మనీ ట్రాప్స్ 1. జీతం పెరిగినపుడు జీవనశైలిని అప్‌గ్రేడ్ చేయడం చాలామంది యువత ఉద్యోగంలో చేరిన కొత్తలో జీతం పెరిగిన వెంటనే కొత్త కొత్త మొబైల్ ఫోన్లు, కొనడం, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్లి వేలల్లో ఖర్చుచేయడం, నెలా నెలా విహార యాత్రలకు వెళ్లడం ద్వారా కొత్త లైఫ్ స్టైల్‌ను ఎంచుకుంటారు. ఒక్కోసారి ఇవన్నీ సహజంగానే అనిపిస్తాయి. కానీ ఈ అలవాట్లు భారీ ఖర్చులుగా మారతాయి. దీన్నే లైఫ్ స్టైల్ క్రీప్ అంటారు. జీతం పెరుగుతూ ఉంటుంది. పొదుపు మాత్రం పెరగదు. కానీ జీవన శైలి మారిపోతూ ఉంటుంది. ఫలితంగా పదేళ్లు గడిచేసరికి బ్యాంకు పొదుపు ఖాతాలో పదిరూపాయలు కూడా కనబడదు. దీనికి పరిష్కారం సులభమే. జీతం పెరిగిన ప్రతిసారీ ఆ పెరుగుదలలో కనీసం 50 శాతాన్ని నేరుగా పెట్టుబడి వైపు మళ్లించాలి. అప్పుడే ఆదాయం పెరుగుదల భవిష్యత్తులో సంపదగా మారుతుంది. 2. పెట్టుబడులను వాయిదా వేయడం‘ఈసారి జీతం పెరిగినపుడు పెట్టుబడి మొదలెడతా, వచ్చే ఇంక్రిమెంట్ అందుకున్నాక పొదుపు చేస్తా, ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేసి కాస్త స్థిరపడడ్డాక ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తా‘ యువత నుంచి సాధారణంగా వినిపించే మాటలు ఇవి. కానీ కాంపౌండింగ్ అనే అద్భుతం కాలాన్ని కోరుకుంటుంది. ఉదాహరణకు 22 ఏళ్ల వయసులో నెలకు రూ.5000తో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించిన వ్యక్తి 55 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు రూ.2.2 కోట్ల సంపద కూడబెట్టగలడు (ఏడాదికి 12 శాతం రాబడి అంచనాతో). అదే సిప్‌ను 30 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే అది రూ.85 లక్షల వరకు మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ డబ్బు కన్నా ముందుగా ప్రారంభించడం వల్ల వచ్చిన కాల ప్రయోజనమే ప్రధాన కారణం. అందుకే పెట్టుబడి ఎంత చేశారు కాదు. ఎప్పుడు మొదలెట్టారు అన్నదే అత్యంత కీలకం. 3. క్రెడిట్ కార్డును అదనపు ఆదాయంగా భావించడం క్రెడిట్ కార్డు అనేది ఆదాయం కాదు. అది తాత్కాలిక రుణం మాత్రమే. స్వైప్ చేసినపుడు గర్వంగా అనిపిస్తుంది. కానీ బిల్లు వచ్చినపుడు అసలు వాస్తవం కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుంది. వాడిన మొత్తంలో కనీస బకాయి మాత్రమే చెల్లిస్తూ వెళితే ఏడాదికి 36 నుంచి 48 శాతం అదనపు వడ్డీ భారాన్ని మోసే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డు వాడకుండా ఉండాలంటే కనీసం 6 నుంచి 9 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 4. తెలియని ఇన్వెస్ట్మెంట్ల వెంట పరుగులు తీయడంప్రతి కాలంలో ఏదో ఒక పెట్టుబడి రంగం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా, సంచలనంగా మారుతుంది. కొన్నేళ్ల క్రితం క్రిప్టో, తర్వాత డిఫెన్స్ స్టాక్స్, ఆ తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్స్, తర్వాత ఫ్లెక్సీ కాప్ ఫండ్లు ఇలా.. వాటిలో పెట్టుబడి పెట్టినవారు భారీ లాభాలు పొందారని, కోటీశ్వరులయ్యారని వార్తలు వస్తూంటాయి. యువతరం ఎక్కువగా ఆ ప్రచారంలో చిక్కుకుని, ఆ ట్రెండ్‌లో భారీగా నష్టపోతోంది. దీర్ఘకాలిక సంపద సృష్టించే పెట్టుబడులకంటే తక్షణ లాభాల ఆశతో ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ వైపు యువరం ఆకర్షితులవుతోంది. సోషల్ మీడియాలో ఫిన్ఫ్లూయెర్స్ ప్రభావం, తక్కువ సమయంలో భారీ రాబడులు వస్తాయనే ప్రచారం ఈధోరణిని మరింత పెంచుతున్నాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ సంపదను సృష్టిస్తే డెరివేటివ్స్ ట్రేడింగ్ మూలధనాన్నే కరిగించేస్తాయి. ఇక్కడ సమస్య పెట్టుబడి ఎంపికలో కాదు. స్పష్టమైన లక్ష్యం లేకుండా సమయం చూడకుండా ఇన్వెస్ట్ చేయడంలోనే ఉంది. ప్రతిసారి పెట్టుబడి చేసే ముందు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి ఈ డబ్బు ఏ అవసరానికి? రెండు.. ఎప్పుడు అవసరం అవుతుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేకపోతే పెట్టుబడి వ్యూహం కాదు, జూదం అవుతుంది.5. ఇన్సూరెన్స్‌ను పెట్టుబడిగా కొనడంచాలా మంది ఫైనాన్స్ ఏజెంట్లు యూలిప్‌లు. ఎండోమెంట్ పాలసీలు, ఒకే ఉత్పత్తితో రక్షణతో పాటు రాబడి కూడా ఇస్తాయని చెబుతుంటారు. కానీ అవి ఆశించిన ఫలితం ఇవ్వవు. ఈ పాలసీల్లో ఇన్సూరెన్స్ కవరేజీ తక్కువ ఉంటుంది. పెట్టుబడి రాబడులు కూడా రకరకాల ఛార్జీల కారణంగా తగ్గిపోతాయి. అందుకే పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు టర్మ్ ఇన్సూరెన్స్ వేరు, పెట్టుబడులు వేరు అనే సూత్రాన్ని సూచిస్తారు. కుటుంబ రక్షణకు టర్మ్ పాలసీ, సంపద కోసం ముచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడులు ఎంచుకోవడం తెలివైన నిర్ణయమవుతుంది. 6. సోషల్ మీడియా ప్రభావంతో ఖర్చు చేయడంసోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లు విదేశీ పర్యటనలు, ఖరీదైన రెస్టారెంట్లు, కొత్త కొత్త గాడ్జెట్లు, విలాసవంతమైన జీవితం మాత్రమే చూపిస్తారు. కానీ వాటి వెనక ఉన్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు గురించి చెప్పరు. వీటిని తరచూ చూసే యువతరం వాటి ప్రభావంతో తమ ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఖర్చు చేస్తారు. తాత్కాలిక ఆనందం కంటే ఆదాయానికి మించిన ఖర్చుతో పెరిగిన ఒత్తిడి తరువాతి రోజోల్లో అనుభవించిన ఆనందాన్ని గుర్తు లేకుండా చేస్తుంది. అందుకే ప్రతిసారి ఖర్చు చేసే ముందు ‘ఇది నిజంగా నాకు అవసరమా? లేక ఇతరులను చూసి చేస్తున్నానా? అని ఆలోచించుకోవడం అవసరం. 7. స్వీయాభివృద్ధికి పెట్టుబడి చేయకపోవడంయువతకు అత్యంత విలువైన ఆస్తి స్టాక్ పోర్ట్ ఫోలియో కాదు. సంపాదన సామర్ధ్యం ప్రధానం. ప్రమోషన్‌కు ఉపకరించే ఒక మంచి కోర్సు, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్, నైపుణ్యాన్ని పెంచుకునే సరైన పుస్తకాలుపై చేసే పెట్టుబడి కెరీర్‌ను పూర్తిగా మార్చగలవు. రూ.20000 జీతాన్ని లక్షలకు పెంచే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఈ వయసులో సంపద సృష్టించడంలో ముఖ్యమైన పెట్టుబడి మీపై మీరు చేసేదే.అసలు సమస్య ఏమిటి? ఈ ఏడు తప్పిదాల్లో ఒక సామాన్య అంశం ఇమిడి ఉంది. ఇవన్నీ చెడు నిర్ణయాల వల్ల జరిగినవి కావు. నిర్ణయం సరిగా తీసుకోకపోవడం వల్ల జరిగేవి. డబ్బు ఎప్పుడూ ఎవరికోసం ఆగదు. జీతం వచ్చిన క్షణం నుంచి అది అనేక రకాలుగా అనేక మార్గాల్లో ఎటో వెళ్లిపోతుంది. కాబట్టి మంచి ఆర్థిక అలవాట్లను ఆటోమేటిక్‌గా ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యం.ఆటో డెబిట్ సిప్, ప్రత్యేక సేవింగ్స్ ఖాతా, సరైన టర్మ్ ఇన్సూరెన్స్ వంటి నిర్ణయాలు జీవితాన్ని సులభతరం చేస్తాయి. 20 ఏళ్ల వయసులు సంపద సృష్టించాలి అనుకునే వారికి ఎక్కువ ఆర్థిక నైపుణ్యం ఉండాల్సిన అవసరంలేదు. కానీ త్వరగా సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నవారు ముందంజలో ఉంటారు. ఈ దశలో తీసుకునే చిన్న ఆర్ధిక నిర్ణయాలు భవిష్యత్తులో కోట్ల రూపాయల తేడాను చూపిస్తాయి. అందుకే 20ల్లో డబ్బును నిర్లక్ష్యం చేయడం కాదు, దానికి సరైన దిశ చూపించడం అత్యంత అవసరం.సంపద సృష్టికి గుర్తుంచుకోవాల్సిన 5 గోల్డెన్ రూల్స్→ జీతం పెరిగినపుడల్లా కనీసం 50 శాతం పెట్టుబడికి మళ్లించండి → మొదటిజీతం నుండే సిప్ ప్రారంభించండి → 6 నుంచి 9 నెలల ఖర్చులకు ఎమెర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయండి → టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి → నైపుణ్యాలు పెంచుకునేందుకు కొంత ఖర్చు చేయండి – సాక్షి, వెల్త్ డెస్క్
ఫ్యామిలీ
కుంచె పట్టి..ఆ గ్రామాన్ని రక్షించిన ఒకేఒక్కడు..!
ఒక్కడిగా పోరాడితే ఫలితం ఏం ఉంటుంది అనిపిస్తుంది. ఓ పదిమంది కలిసి ఐక్యంగా చేస్తేనే ఏదైనా సాధ్యం అనుకుంటాం. కానీ అవన్ని కరెక్ట్ కాదని నిరూపించాడు ఈ తాత. అంతేగాదు మనసుపెట్టి..పోరాడితే ఒక్కడే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు. యావత్తు ప్రపంచం తలెత్తి తనవైపు చూసేలా చేశాడు. అది కూడా కేవలం కాలక్షేపం కోసం చేసిన కళతోనే ఈ ఘనత సృష్టించడం విశేషం. పైగా సృజనాత్మకత గొప్పతనం, కళతో ఏం చేయొచ్చో.. కనవిప్పు కలిగించాడు. ఇంతకీ ఆ తాత ఏం చేశాడంటే..తైవాన్‌లోని తైచుంగ్‌లో శిథిలావస్థలో ఒక సైనిక స్థావరం ఉంది. అక్కడ హువాంగ్ యుంగ్-ఫు అనే మాజీ అధికారి ఒక్కే నివాసం ఉంటున్నాడు. అతడి కారణంగా ఆగ్రామం ఉనికి నిలిచింది, యావత్తు ప్రపంచానికి తెలిసింది. ఆ తాత అసాధారణ కథ వింటే విస్తుపోవడం ఖాయం. అద్భుత పాఠాన్ని నేర్పించిన తాత..ఆ గ్రామాన్ని 1940 చివరలో నిర్మించారు. దీన్ని చైనా అంతర్యుద్ధం తర్వాత తైవాన్‌కు తరలివచ్చిన కువోమింటాంగ్ (జాతీయవాద సైన్యం) సైనికులకు తాత్కాలిక నివాసంగా ఇచ్చారు. ఈ నివాస ప్రాంతంలో సుమారు 1,200 ఇళ్లు ఉండేవి. వాటిల్లో వేలాది కుటుంబాలు ఉండేవి. అయితే, దశాబ్దాలు గడిచేకొద్దీ, యువ తరాలు వలస వెళ్లిపోయాయి, భవనాలు శిథిలమయ్యాయి. దాంతో డెవలపర్లు పునరాభివృద్ధి కోసం ఆ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. 2000వ దశాబ్దం చివరి నాటికి, దాదాపు ప్రతి నివాసి వెళ్లిపోయారు, కేవలం కొన్ని ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాంతో దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న హువాంగ్ యుంగ్-ఫు, తైవాన్‌లో తనకు తెలిసిన ఏకైక ఇంటిని విడిచి వెళ్లడానికి నిరాకరించాడు. నిజానికి అతడొక్కడే మిగిలాడు అక్కడ. ఒంటరిగా ఏం పాలుపోక.. 86 ఏళ్ల వయసులో ఒక పెయింట్ బ్రష్ తీసుకుని తన ఇంటి లోపల గోడపై ఒక చిన్న పక్షి చిత్రాన్ని గీశాడు. ఆ ఒక్క చిత్రం త్వరలోనే గ్రామం అంతటా గోడలు, కాలిబాటలు, తలుపులు, కిటికీలను కప్పివేసేలా వేలాది రంగురంగుల కుడ్యచిత్రాలుగా విస్తరించింది.నిజానికి ఆయన చిత్ర కళాకారుడు కాదు. తన రోజులని చక్కగా గడిచిపోయేలా కాలక్షేపం కోసం చేసి పని మంచి ఉద్దేశ్యాన్నిచ్చే అభిరుచిగా మారిందని అన్నారు. ఆయన విలక్షణమైన శైలి, ప్రకాశవంతమైన రంగులు, బాల్యపు ఊహశక్తితో గీసిన చిత్రాలు ఒక్కసారిగా ఆ గ్రామాన్ని రంగులుమయంగా చేశాయి. ఆ కళే గ్రామానికి రక్షగా..సమీప విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రొఫెసర్లు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు హువాంగ్ చిత్రాలను చూసి ఆకర్షితులవుతారు. అలా శిథిలావస్థలో ఉన్న ఆ సైనిక స్థావరం సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించి..ఆ గ్రామాన్ని కూల్చివేయకుండా పరిరక్షించాలని తైచుంగ్ నగర ప్రభుత్వాన్ని కోరుతూ వారు ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించడంతో, చివరికి అధికారులే పునరాభివృద్ధి ప్రణాళికలను విరమించుకున్నారు.అలా సైనిక విలేజ్ కాస్త రెయిన్బో విలేజ్‌గా సాంస్కతిక ఆకర్షణగా పరిరక్షించబడింది. అంతేగాదు హువాంగ్‌కి రెయిన్బో తాతగా పేరొచ్చింది కూడా. దీనివల్ల హువాంగ్ తన ఇంట్లోనే ఉండగలిగాడు, అదే సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వచ్చి అతని కళాఖండాలను ఆరాధించడం మొదలుపెట్టారు. అంతేగాదు అక్కడి తైవాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం, హువాంగ్ చిత్రాలు ఒకప్పుడు నిర్మానుష్యంగా మారిన ఆ ప్రదేశాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రంగా మార్చాయి. ఒకప్పుడు కనుమరుగవడానికి సిద్ధంగా ఉన్న ఒకగ్రామానికి అవి కొత్త జీవం పోశాయి. ఇదిలా ఉండగా దురదృష్టవశాత్తు హువాంగ్ యుంగ్-ఫు 2024 జనవరిలో తన 100వ ఏట కన్నుమూశారు. ఆయన వెళ్తూ.. వెళ్తూ..రెయిన్బో విలేజ్‌లోని రంగురంగుల గోడల కన్నా ఎంతో విశాలమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారు. ఈ తాత హువాంగ్ కథ కళ కేవలం అందాన్ని ఇవ్వడానికే కాకుండా, భద్రపరచడానికి,ప్రజలను అనుసంధానించడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగ పడుతుందని నిరూపించింది. అంతేగాదు నిరసనలు, రాజకీయాలు సాధించలేని దానిని సృజనాత్మకత కొన్నిసార్లు సాధించగలదని హువాంగ్ యుంగ్-ఫు కథ నిరూపించింది కదూ..!. View this post on Instagram A post shared by JOTA (@jackofftoart) (చదవండి: టీసీఎస్ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..)
జామపండ్లలో మనమే టాప్!
జామపండ్లు మన స్థానికమైనవే అనుకుంటాం గాని, ఇవి పదహారో శతాబ్దిలో పోర్చుగీసు నావికుల ద్వారా మన దేశానికి వచ్చాయి. అప్పటి నుంచి తోటల్లోనే కాదు, ఇళ్ల పెరళ్లలోనూ జామచెట్లను విరివిగా పెంచడం మొదలైంది.జామపండ్లను పండించడంలో ఇప్పుడు మన భారత దేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. జామపండ్లలో నాలుగువందలకు పైగా రకాలు ఉన్నాయి. వీటిలో 160 రకాలు మన దేశంలో పండుతాయి. పోషకాల గని అయిన జామపండ్లు ఎక్కువగా ఆగస్టు–ఏప్రిల్ మధ్యకాలంలో దొరుకుతాయి. కొన్ని రకాలు ఏడాది పొడవునా దొరుకుతాయి. జామపండ్ల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...జామపండ్లలో పోషకాలుజామపండ్లలో పిండిపదార్థాలు, చక్కెర, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు సహా కీలకమైన విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ప్రతి వందగ్రాముల జామపండ్లు 68 కిలోకేలరీల శక్తినిస్తాయి. వీటిలో నీరు 80 శాతానికి పైగా ఉంటుంది. ప్రతి వంద గ్రాముల జామపండ్లలో ఉండే పోషకాల వివరాలను గణాంకాల్లో చూద్దాం...
కోడికూర రుచిచూడాలంటే అంకాపూర్ వెళ్లాల్సిందే..!
అంకాపూర్ ఊరి పేరు చెబితే భోజన ప్రియుల కళ్లలో మెరుపులు.. వేడివేడి మక్కవడ.. ఘుమఘుమలాడే దేశీచికెన్ రుచి చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే అంటూ ఉత్సాహం చూపుతారు. 63వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ఏ వాహనదారుడైనా అంకాపూర్‌లో ఆగిమరీ ఇక్కడి రుచులను ఆస్వాదిస్తారు. అలాగే ఇక్కడ విక్రయించే పచ్చి మక్కబుట్టలకు విపరీతమైన డిమాండ్ ఉంది. వ్యవసాయరంగంలో తనదైన ముద్రవేసుకున్న అంకాపూర్.. మక్కవడలు, దేశీచికెన్ రుచులతో భోజన ప్రియుల మదిలో ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకుంది. పచ్చిబుట్టల విక్రయాలు జోరుగాసాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు ప్రతిరోజూ ట్రాలీల్లో పచ్చిబుట్టలు తరలుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు హైదరాబాద్ వంటి మహానగరంలో పచ్చిబుట్టలు విక్రయించే వారు సైతం ‘అంకాపూర్’ పేరుతోనే బిజినెస్ సాగిస్తుంటారు. కాల్చిన మక్కెన్లు..63వ నంబర్ జాతీయ రహదారికి వరువైపులా చిన్నచిన్న గుడిసెలు వేసుకుని మహిళలు మక్కెన్లను కాల్చి విక్రయిస్తున్నారు. మొక్కజొన్న పండే ఆరు నెలల కాలం వీరికి జీవనోపాధి ఇదే. రైతులు, మధ్య దళారుల నుంచి ముందుగానే పచ్చి బుట్టలు కొనుగోలు చేసి వాటిని బొగ్గులపై కాల్చి రూ.20కు ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు. వాహనదారులు ఇక్కడ ఆగుతూ చల్లని వాతావరణంలో బొగ్గులపై కాల్చిన వేడి వేడి మక్కెన తింటూ మధురానుభూతిని పొందుతున్నారు. పచ్చి బుట్టలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న అంకాపూర్ మొక్కజొన్న మార్కెట్ విక్రయదారులు, కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఇక్కడ ఆగుతూ రైతులు, వ్యాపారులు చెప్పిన ధరకే పచ్చి మక్కబుట్టలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పండించిన మొక్కజొన్న పంటను మధ్య దళారులు ముందుగానే కొనుగోలు చేస్తారు. లేదా రైతులు నేరుగా ఆటో ట్రాలీల్లో అంకాపూర్ మార్కెట్‌కు తీసుకొచ్చి రోడ్డు పక్కన కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. కోడికూర అంకాపూర్ పేరు వింటేనే అందరూ ఠక్కున పలికేది ‘దేశీ కోడికూర’. మాంసం ప్రియుల నోరూరించే దేశీ కోడికూరకు అంకాపూర్ ఎంతో ప్రత్యేకం. మక్కవడలు, దేశీచికెన్ రుచి తెలిసిన భోజన ప్రియులు రెండింటిని కలిపి లాగిస్తున్నారు. మక్క వడలను దేశీ కోడి కూరలో నంజుకొని తింటున్నారు. పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో సైతం ఈ రుచి అందుబాటులో ఉండకపోవడంతో దేశీకోడి కూరతో మక్క వడలు తినడానికి ఎక్కువ మంది వస్తుండటంతో ఆర్డర్ మెస్‌లు, మక్క వడలు వేసే హోటళ్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. నోరూరిస్తున్న మక్కవడలుఅంకాపూర్ మక్కవడ అంటేనే ఎంతో స్పెషల్. గ్రామానికి చెందిన వారితోపాటు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారుసైతం హోటళ్లలో పోటాపోటీగా ఎంతో రుచికరంగా మక్కవడలు వేస్తున్నారు. వాహనదారులు అంకాపూర్లోని జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలను నిలిపి వడలు తింటూ ‘ఆహా.. ఏమి రుచి’ అంటూ ఆస్వాదిస్తున్నారు. తాము తినడమే కాదు కుటుంబ సభ్యులు, మిత్రుల కోసం పార్సిల్లు తీసుకు వెళ్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలవారు ఫోన్లలో ఆర్డర్ చేస్తూ పార్సిల్లు తెప్పించుకుంటున్నారు. పచ్చిబుట్ట కొంటున్నారు ఇతర పట్టణాలు, గ్రామాల నుంచి అంకాపూర్‌కు వచ్చిన వారు పచ్చి బుట్టను కొని తీసుకెళ్తున్నారు. ఇళ్ల లో మక్క వడలు వేసుకోవడానికి కొంటున్నామని చెబుతున్నారు. వాతావరణంలో మార్పు రావడంతో మార్కెట్ పుంజుకుంటోంది. – బోదాస్ లక్ష్మి, విక్రయదారు, అంకాపూర్ ఇక్కడ ఆగాల్సిందే.. అంకాపూర్ మీదుగా వెళ్లే వాహనాలు మాదగ్గర ఆగకుండా ముందుకు వెళ్లవు. కాల్చిన మక్కెన్ కొనుక్కొని ఉప్పు, నిమ్మకాయ దట్టించుకొని తిని మమ్మల్ని మెచ్చుకొని వెళ్తారు. చాలా ఆనందంగా ఉంటుంది. పదుల సంఖ్యలో ఇక్కడ షెడ్లు వేసుకొని మక్కెన్లు కాలుస్తున్నాం. గ్రామస్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. – నర్సవ్వ, కాల్చిన మక్కెన్లు విక్రయించే మహిళ నిజామాబాద్
టీసీఎస్ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..
కొన్ని సమయాల్లో కంఫర్ట్ జోన్ కంటే రిస్క్ తీసుకుంటేనే గొప్ప విజయాలను సొంత చేసుకోగలం. అలా చేసి ఎందరో విజేతలుగా నిలిచిన ఘటనలు చూశాం. అంత ముక్తకంఠంలో మహారిస్క్ అన్నా..తగ్గేదేలే అంటూ ముందుకు సాగి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్‌ని అందుకున్నారు. అలాంటి కోవకు చెందని వాడే ఈ వ్యక్తి. చాలామంది కోరుకునే డ్రీమ్ జాబ్‌ని కాదనుకుని ఎలాంటి వ్యాపారం రంగంలోకి దిగాడో వింటే నోటమాటరాదు.అందుకు సంబంధించిన విషయాన్ని అంకిత్ పాండ్ సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఎక్స్పోస్ట్లో అంకిత్ పాండే ఇలా రాసుకొచ్చారు. తన స్నేహితుడు టీసీఎస్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ని వద్దనుకుని మరి వ్యాపారం చేయాలి నిర్ణయించుకున్నాడు. మొదట అదడి నిర్ణయం విని స్నేహితులంతా తప్పు చేస్తున్నావంటూ విమర్శించారని చెప్పాడు. కానీ అతడు గ్రామాలు, రాష్ట్రాలలోని రైతుల నుంచి నేరుగా బియ్యాన్ని సేకరించి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అందుకోసం ఆ వ్యాపారవేత్త రైతుల నుంచి నేరుగా బియ్యాన్ని కొనుగోలు చేసి, దాన్ని శుభ్రపరిచి, దానికి తన సొంత బ్రాండ్ప్యాకేజీ చేయించాడు. వాటిని సుమారు 200 రిటైల్ దుకాణాలకు సరఫరా చేశారు. మధ్యవర్తులను తొలగించి, ఒక స్థిరమైన రిటైల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా, ఆయన లాభదాయకమైన, నిలకడైనా వ్యాపారాన్ని సృష్టించారని సమాచారం.వ్యాపారం ట్రిక్ ఏంటంటే..రైతుల నుంచి కిలో బియ్యాన్ని రూ. 35ల చొప్పున కొనుగోలు చేస్తారు. ప్యాకేజింగ్‌కు, కిలోకు రూ. 3లు, రవాణా ఖర్చుకు మరో రూ. 2 అదనం. దీంతో మొత్తం ఖర్చు కిలోకు రూ. 40 అవుతుంది. అంటే ప్యాకేజీ చేసిన బియ్యాన్ని రిటైలర్లకు కిలోకు రూ. 50 చొప్పున అమ్ముతారు. రిటైలర్లు దానిని వినియోగదారులకు కిలోకు సుమారు రూ. 55–57 చొప్పున అమ్ముతారు. దీంతో అమ్మిన ప్రతి కిలోపై వారికి రూ. 10 లాభం వస్తుందని వివరంగా చెప్పుకొచ్చారు పోస్ట్‌లో. ప్రస్తుతం ఈ వ్యాపారం ప్రతి నెలా తమ రిటైల్ భాగస్వాములకు సుమారు 200 క్వింటాళ్లు, అంటే 20 వేల కిలోగ్రాముల బియ్యాన్ని సరఫరా చేస్తోందని పాండే అనఆనరు. ఈ గణాంకాల ఆధారంగా తన స్నేహితుడు సుమారు రూ. 25 లక్షలు సంపాదిస్తున్నాడని అంచనా వేశారు. అయితే నెటిజన్లు తీసుకునే రిస్క్‌ని బట్టి ఫలితం కూడా ఆస్థాయిలో ఉంటుందని సదరు వ్యక్తిని ప్రశంసించగా, మరికొందరు పైకి చూడటానికి సునాయాసంగా కనిపిస్తున్నా..టీసీఎస్ ఉద్యోగంతో పోలిస్తే..వ్యాపారం నుంచి లాభం పొందడం అనేది కొంచెం కష్టమే అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా..)
అంతర్జాతీయం
భారత జెన్-జీకి పాక్, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే..
భారత జెన్-జీని తరచూ మొబైల్లో ఎక్కువ సమయం గడిపే తరం, ప్రతి విషయాన్నీ మీమ్స్‌గా మార్చే తరం, తీవ్రమైన అంశాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టని తరంగా భావించేవారు. కానీ గత నెల రోజులుగా అదే బలహీనతలు వారి అతిపెద్ద బలంగా మారాయి. వరుసగా సాగిన విద్యార్థి ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో సంప్రదాయ రాజకీయ ప్రకటనల స్థానంలో మీమ్స్ వచ్చాయి. ఇన్‌స్టా రీల్స్ ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి.ఈ ఉద్యమం ఇప్పుడు భారత్‌కే పరిమితం కాలేదు. పొరుగు దేశాల్లో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. జెన్-జీ దృష్టి త్వరగా మళ్లిపోతుందని సాధారణంగా చెబుతుంటారు. కానీ భారత్‌లో జరిగిన ఈ ఉద్యమం శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ యువత దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ దేశాల్లో గతంలో కూడా యువజన ఉద్యమాలు జరిగాయి. అందువల్ల భారత్‌లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై అక్కడ ప్రత్యేక ఆసక్తి కనిపించింది.దీనిపై పాకిస్థాన్ యువతి ఒకరు మాట్లాడుతూ.. "ఇలా చేస్తుంటే ప్రేమలో పడిపోతానేమో... మీరు ఇంత బాగా చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను?" అని అన్నారు. భారత జెన్-జీ చూపించిన ధైర్యం, ఐక్యత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. సరిహద్దులు వేరు కావచ్చు. కానీ ఈ తరం ఆలోచనలు, ఉత్సాహం ఒక్కటేనని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు అవకాశం వస్తే తామూ భారత విద్యార్థుల్లాగే వీధుల్లోకి వచ్చేవాళ్లమని అన్నారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. "కాక్రోచ్ జనతా పార్టీ చాలా కూల్‌గా ఉంది. వారు అవసరానికి మించి సీరియస్‌గా ఉండరు. అదే నాకు నచ్చింది. జెన్-జీకి సాటి ఎవరూ లేరు" అని చెప్పాడు.ఒక ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయేవాళ్లం ముంబైలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా అతను ప్రస్తావించాడు. అందులో పోలీసులు విద్యార్థులను వాహనంలో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి ఎవరో నిశ్శబ్దంగా తాళం తీసేయడంతో విద్యార్థులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరో పాకిస్థాన్ యువకుడు మాట్లాడుతూ.. భారత విద్యార్థులు మతం, కులానికి అతీతంగా ఐక్యంగా నిలిచారని, కానీ పాకిస్థాన్‌లో ప్రజలు పంజాబీ-పష్తూన్, సున్నీ-షియా వంటి విభజనల్లో ఉన్నారని అన్నాడు."అదే భారత్ జెన్-జెడ్ అతిపెద్ద బలం. పాకిస్థాన్ జెన్-జీ అంత సులభంగా ఒక్కటవుతుందని నాకు అనిపించడం లేదు." భారత్ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్ కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "మా దేశాన్ని నడపడానికే మా దేశం వద్ద డబ్బు లేదు. భారత ఉద్యమానికి ఎలా నిధులు ఇస్తాం?" అని అన్నాడు.బిలాల్ హసన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ పాకిస్థాన్‌లో చాలా సందర్భాల్లో ప్రజలను నేరుగా తీసుకెళ్లి అదృశ్యం చేస్తారు’’ అని చెప్పారు. పాకిస్థాన్‌లో చాలామందిని "ఒక ప్లేట్ బిర్యానీ"కే కొనుగోలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.శ్రీలంక యువతపై ప్రభావంభారత విద్యార్థి ఉద్యమం శ్రీలంక యువతపై కూడా ప్రభావం చూపింది. 2022లో శ్రీలంక యువత ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత రాజపక్స ప్రభుత్వం అధికారాన్ని వీడింది. ఇప్పుడు శ్రీలంకలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై కార్టూన్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా వచ్చాయి. ప్రముఖ కార్టూనిస్ట్ అవంతా ఆర్టిగాలా పంచుకున్న వ్యంగ్య చిత్రంలో ప్రభుత్వం "బొద్దింకలను" అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, భారత్ ఇళ్లలో వాడే "లక్ష్మణ రేఖ" కూడా వాటిని ఆపలేకపోయినట్టు చూపించారు.భారత్ ఉద్యమంలో ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం ముంబైకి చెందిన రియా అహీర్ పోలీసు వాహనం ముందు చేతులు చాపి నిలిచిన ఫొటో. చాలామంది దీన్ని 1989 తియానన్మెన్ స్క్వేర్‌లోని ప్రసిద్ధ "ట్యాంక్ మ్యాన్" చిత్రంతో పోల్చారు. శ్రీలంక లా కాలేజీ విద్యార్థిని స్వస్థిక అరులింగం ఫేస్బుక్లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ "వైబింగ్ ఎట్ అనదర్ లెవల్" అని రాశారు. 2022 శ్రీలంక ఉద్యమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బువాంకా పెరేరా ఇన్‌స్టాగ్రామ్‌లో భారత యువతకు సందేశం పంపారు."శ్రీలంక నుంచి ప్రారంభమై ఆసియా అంతటా వ్యాపించిన యువజన ఉద్యమాల జ్వాల భారత్‌ను చాలాకాలం తాకలేదనిపించింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం, దేశ వ్యవస్థాపకులు కలలు కన్న భారత్ కోసం భారత యువత పోరాడుతుండటం చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. నేపాల్ యువత మద్దతునేపాల్లో కూడా భారత్ జెన్-జీ ఉద్యమంపై సానుకూల స్పందనలు వచ్చాయి. కాఠ్మాండూ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా మాట్లాడుతూ.. భారత విద్యార్థుల ఆగ్రహం పూర్తిగా సమంజసమని, దాన్ని అతిగా స్పందించారని చెప్పలేమన్నారు. "వీధుల్లో విద్యార్థులను చూసినప్పుడు నా మనసు అప్పుడూ బాధపడింది. ఇప్పుడూ బాధపడుతోంది" అని చెప్పారు. 2025లో నేపాల్ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అది కూడా యువత శక్తికి ఉదాహరణగా నిలిచి చివరకు కేపీ ఓలీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసిందని అన్నారు.జెన్-జీ నుంచి ప్రపంచం నేర్చుకుంటోంది..ఢిల్లీ జంతర్ మంతర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం తొలిసారి భారత్ జెన్-జీ మీమ్స్, నినాదాలు, వైరల్ వీడియోలను చూసి నవ్వడమే కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా ప్రారంభించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన స్పందనలు చూస్తే, భారత్ విద్యార్థి ఉద్యమం సరిహద్దులు దాటి యువతకు స్ఫూర్తిగా మారిందని తెలుస్తోంది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు భారత విద్యార్థుల ఐక్యత, ధైర్యం, సృజనాత్మక నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమానికి కొత్త ఆదర్శంగా అభివర్ణించారు.
భారీ దాడులకు సిద్ధమైన అమెరికా.. ఒక్కసారిగా ఎందుకు ఆగింది?
వాషింగ్టన్: ఇరాన్‌పై భారీ సైనిక దాడి చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పెంటగాన్ వద్ద ఉన్న వాయు రక్షణ ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతాయని సీనియర్ సలహాదారులు హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. శుక్రవారం ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు, సీనియర్ సలహాదారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా సైన్యం వద్ద పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయన్న అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత పెంచాలన్న అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్న సమయంలో అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని హెచ్చరించారు.వాయు రక్షణ ఆయుధ నిల్వలు తగ్గిపోవడమే అమెరికా వరుస రాత్రి దాడులను నిలిపివేయడానికి ప్రధాన కారణమా, లేక ఈ విరామం కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు పశ్చిమాసియాలో పెద్ద యుద్ధం చెలరేగడం, గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇంధన సరఫరా అంతరాయం, శరణార్థుల సంక్షోభం మరింత పెరగడం వంటి అంశాలపై కూడా ట్రంప్, ఆయన సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్‌పై పెద్ద స్థాయి యుద్ధ చర్యలు చేపట్టడం సాధ్యమేనని, కానీ అలా చేస్తే పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతాయని జనరల్ డాన్ కేన్ వ్యక్తిగతంగా ట్రంప్‌కు వివరించారు.ముగ్గురు అమెరికా సైనికులు మృతితో.. గత వారం జోర్డాన్‌లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అమెరికా వాయు రక్షణ వ్యవస్థను దాటి దాడి చేయడంతో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన ఘటన తర్వాత ఈ చర్చలు జరిగాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.శుక్రవారం అమెరికా బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని, దాడికి రెడీగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించినా, చివరకు భారీ బాంబు దాడులకు ఆయన అనుమతి ఇవ్వలేదు. ఈ వారం ప్రారంభంలో ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీ దాడి చేయించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాను. నిర్ణయానికి చాలా దగ్గరగా ఉన్నాను. అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అని ట్రంప్ చెప్పారు.ఇరాన్ తీర ప్రాంత రాడార్లు, నౌకలపై దాడి చేసే క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళ వాహనాలు, రవాణా వ్యవస్థలు, పిక్‌యాక్స్ పర్వతం అడుగున ఉన్న భూగర్భ అణు కేంద్రం వంటి వ్యూహాత్మక లక్ష్యాలపై పలుదశల్లో దాడి చేసే ప్రణాళికలను పెంటగాన్ సిద్ధం చేసింది. అయితే దీర్ఘకాలం దాడులు కొనసాగితే ఇప్పటికే తగ్గిపోయిన క్షిపణి నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని అధికారులు హెచ్చరించారు.ట్రంప్ సీనియర్ సలహాదారుల్లో పలువురు, జారెడ్ కుష్నర్ సహా, భారీ సైనిక దాడికి బదులుగా నిరంతర దౌత్య చర్చలు, ఆర్థిక ఒత్తిడి కొనసాగించే వ్యూహానికే మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో, అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. దాదాపు రెండు వారాలుగా నిరంతరంగా సాగిన వైమానిక దాడుల తర్వాత అమెరికా సైన్యం తొలిసారి రాత్రి దాడులను నిలిపివేసింది. తాత్కాలిక కాల్పుల విరమణను పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై రాజీ మార్గం కనుగొనేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.అయితే ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని యాన్బు, జిజాన్ ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టు ప్రకటించారు.హోదైదాపై సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే అరామ్కోకు చెందిన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని వారు తెలిపారు.
విమానం మార్చేసిన ట్రంప్.. ఎందుకలా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల ప్రారంభంలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశాన్ని ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో తన ప్రయాణ విమానాన్ని అత్యవసరంగా మార్చవలసి వచ్చింది. ఇరాన్ ప్రాక్సీ దళాల నుండి ఆయనకు ముప్పు ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.ట్రంప్ టర్కీకి వెళ్లేటప్పుడు ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన సరికొత్త 'బోయింగ్ 747-8' విమానంలో ప్రయాణించారు. అయితే భద్రతా కారణాల రీత్యా తిరిగి వస్తున్నప్పుడు పాత 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలో ప్రయాణించాలని సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనను కోరారు. ఈ ముప్పు ప్రత్యేకించి ఖతార్ విమానానికి మాత్రమే కాకుండా, అధ్యక్షుడితో పాటు ఆయన ప్రయాణించే ఏ విమానాన్నైనా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మొదట్లో ఈ విమానం మార్పును వైట్‌హౌస్ సాధారణ విషయంగానే పేర్కొంది. బ్రిటన్‌లోని అమెరికా సైనికులు.. కొత్త విమానాన్ని తిలకించేందుకే తాను విమానం మార్చినట్లు ట్రంప్ బహిరంగంగా తెలిపారు. కానీ.. అసలు కారణం భద్రతా ప్రమాదాలేనని అధికారులు తరువాత స్పష్టం చేశారు. ఖతార్ బహుమతిగా ఇచ్చిన బోయింగ్ 747-8 విమానంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఉండే అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలు లేవు.ఈ నేపథ్యంలో ఈ విమానం భద్రతపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత ఈ విమానాన్ని మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు త్వరలో సుమారు ఒక నెలపాటు సర్వీస్ నుంచి తప్పించనున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కరెలిన్ లీవిట్ వెల్లడించారు. అమెరికా అగ్రనేతలకు ముప్పు తీవ్రత ఊహించని స్థాయిలో పెరిగిందని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్ పేర్కొన్నారు.
మరో కలకలం రేపిన ఇరాన్.. ఇక ట్రంప్ ఊరుకుంటారా?
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన స్థావరాలను, అణు కేంద్రాలను వేగంగా పునర్నిర్మిస్తోంది ఇరాన్. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఇటీవలి నెలల్లో అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో ధ్వంసమైన వంతెనల నుంచి క్షిపణి స్థావరాల వరకు పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఇరాన్ తిరిగి నిర్మించిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.ఒక ఉపగ్రహ చిత్రాల సమాహారంలో.. పశ్చిమ ఇరాన్‌లోని కంగావర్ వద్ద ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరానికి వెళ్లే ప్రవేశ రహదారి మార్చి తొలి రోజుల్లో జరిగిన దాడులతో దెబ్బతిన్నట్టు కనిపించింది. కొన్ని వారాల తర్వాత తీసిన చిత్రాల్లో, దాడుల వల్ల మూసుకుపోయిన అదే ప్రవేశ ద్వారం వరకు కొత్తగా తారు వేసిన రహదారి కనిపించింది.వాల్ స్ట్రీట్ జర్నల్ సేకరించిన మరికొన్ని చిత్రాల ప్రకారం.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో అనుబంధం ఉన్న బందర్ అంజలి నౌకాశ్రయంలో జూలై తొలి వారం నుంచే పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.అమెరికా ఇటీవల జరిపిన దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాల్లో మరమ్మతు పనులు ప్రారంభమైనట్లు కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించినట్టు నివేదికలు తెలిపాయి. ఈ చిత్రాలు బయటకు రావడంతో, ఇరాన్ తన అణు మౌలిక వసతులను ఎంత వేగంగా తిరిగి పునరుద్ధరించగలదనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. ఊహించిన దానికంటే వేగంగా.. అణు కేంద్రాల పునరుద్ధరణ సామర్థ్యంపై కొత్త అంచనాలు వెలువడుతున్నాయి. చాలా మంది నిపుణులు ఊహించిన దానికంటే వేగంగా ఇరాన్ కీలక అణు కేంద్రాలను తిరిగి అందుబాటులోకి తెస్తోంది. గతంలో అమెరికా లక్ష్యంగా చేసుకున్న పలుచోట్ల పునర్నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు కొత్త చిత్రాలు సూచిస్తున్నాయి.అమెరికా మాజీ రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ మాట్లాడుతూ.. దాడుల తర్వాత ఇరాన్ తన సైనిక సామర్థ్యంలో కొంత భాగాన్ని వేగంగా పునరుద్ధరించిందన్నారు. అయితే అణు కేంద్రాల మరమ్మతు వేగం కూడా ఇరాన్ పునరుద్ధరణ సామర్థ్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు.అమెరికా గూఢచారి సంస్థల అంచనా ప్రకారం.. అలీ ఖమేనీ మరణం తర్వాత నాయకత్వంలో వచ్చిన మార్పులతో ఇరాన్ అణ్వాయుధ విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ముజ్తబా ఖమేనీ బహిరంగంగా అణ్వాయుధాల తయారీకి మద్దతు ప్రకటించకపోయినా, అలాంటి కార్యక్రమాల పట్ల ఆయన తన తండ్రికంటే ఎక్కువగా సానుకూలంగా ఉండవచ్చని అమెరికా గూఢచారి సంస్థలు భావిస్తున్నాయి.అలీ ఖమేనీ మాత్రం మతపరమైన ఫత్వా ఆధారంగా అణ్వాయుధాలు నిషిద్ధమని బహిరంగంగా ప్రకటించేవారు. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అంచనాల్లో చాలావరకు యుద్ధానికి ముందు సేకరించిన సమాచారంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ కొన్ని పరికరాలను అత్యంత భద్రత కలిగిన భూగర్భ కేంద్రం పికాక్స్ మౌంటెన్ ప్రాంతానికి తరలించింది.
జాతీయం
డిశ్చార్జ్ తర్వాత వాంగ్‌చుక్ ప్రణాళిక ఇదే..
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష విరమించిన ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పిస్తారని, ఆ తర్వాత లడఖ్‌కు పయనమవుతారని ఆయన బృందం వెల్లడించింది.గత శుక్రవారం అర్ధరాత్రి తన 26 రోజుల నిరాహార దీక్షను ముగించిన వాంగ్‌చుక్, ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ, నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించడానికి ముందు, జూన్ 28న కూడా ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.జూన్ 28న విద్యార్థుల నేతృత్వంలోని ఆందోళనలో చేరిన వాంగ్‌చుక్ 26 రోజుల పాటు నిరవధిక దీక్ష కొనసాగించారు. జూలై 18న ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనను ఖైదీలా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం ఆయనను మేదాంత ఆస్పత్రికి తరలించారు. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై బాధ్యుల నుంచి జవాబుదారీతనం కోరుతూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో జూన్ 20న ప్రారంభమైన ఈ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శనివారం ముగిసింది.ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు థన్‌బర్గ్ ఎందుకు మద్దతు పలికారు?
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్‌తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.
నందన్ నీలేకని ఎవరు?..‘పరీక్షల భద్రత’కు ఎందుకు ఎంపిక చేశారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ ఉదంతాలు, అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు. HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుంది. ప్రశ్నాపత్రాల భద్రతను పటిష్టం చేయడం, అభ్యర్థుల ధృవీకరణ, మూల్యాంకన విధానాలు, పరీక్షల నిర్వహణలో సాంకేతికతను ఏ విధంగా అమలు చేయాలనే అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కల్వాల్ తదితరులు ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.నందన్ నీలేకని ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, టెక్నాలజీ నిపుణుడు. ప్రభుత్వ విధాన నిపుణుడు. 1981లో ఎన్ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2002 నుండి 2007 వరకు ఆ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) సేవలు అందించారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచపు అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు ప్రాజెక్ట్ అయిన ‘ఆధార్’ (యూఐడీఏఐ) వ్యవస్థాపక ఛైర్మన్‌గా విశేష సేవలందించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి విశేష కృషి చేశారు.ఇది కూడా చదవండి: ‘నన్ను అరెస్ట్ చేస్తారా?’.. మమ్దానీపై విరుచుకుపడ్డ నెతన్యాహు
మహిళతో అసభ్య ప్రవర్తన.. బస్సులోనే దాడి
బనశంకరి: బెంగళూరు బీఎంటీసీ బస్సుల్లో గొడవలు కొత్త కాదు. ఇప్పుడో రగడ వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని యువతితో పాటు బస్సు డ్రైవరు అతన్ని చితకబాదారు. సంపిగేహళ్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. వివరాలు.. ఈ నెల 24వ తేదీ మద్యాహ్నం 12:42 సమయంలో బీఎంటీసీ బస్సు మాన్యతా టెక్‌పార్కు వైపు వెళ్తోంది. ఓ యువతిని నిందితుడు కావాలనే తాకాడని ఆమె కోపంతో అతన్ని కేకలు వేసింది. తరువాత డ్రైవరుకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి అతన్ని బస్సులో మూలకు తోసి బట్టలు విప్పి చితకబాదారు. డ్రైవరు కాలితో ఎడాపెడా కొట్టాడు. చివరకు అతడు బస్సులో నుంచి దిగి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు వ్యక్తిని మతిస్థిమితం లేనివానిగా భావిస్తున్నారు. తరచూ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఆకతాయిగా ప్రవర్తిస్తుంటాడని సమాచారం. యువతి ధైర్యంగా అతనికి గుణపాఠం చెప్పిందని కొందరు నెటిజన్లు అన్నారు. మరికొందరు అతన్ని అంత ఘోరంగా కొట్టడం సరికాదని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని విచారించడానికి పోలీసులు గాలింపు చేపట్టారు.A woman faced sexual harassment by a copassenger on a #BMTC bus near Manyata Tech Park in #Bengaluru.After she confronted the accused, the BMTC driver locked the bus doors to stop him from fleeing and assaulted him. A video of the incident has gone viral. #Karnataka pic.twitter.com/MhXMNMZs4e— Imran Khan (@KeypadGuerilla) July 25, 2026
ఎన్ఆర్ఐ
తాత వారసత్వం.. అమెరికాలో మెరిసిన మనవడు కార్తీక్!
తల్లిదండ్రులు పుట్టింది భారత దేశంలో.. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాకినాడకు చెందిన తాతయ్య పద్మనాభానికి క్రీడలంటే ఎంతో మక్కువ. జిల్లాలో సీనియర్ క్రీడాకారుడిగా, ఒలింపిక్ సంఘ కార్యదర్శిగా క్రీడారంగానికి ఎనలేని సేవలు అందించారు. తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మనుమడు కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం అమెరికా దేశంలోని శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో క్రీడలపరంగా గుర్తింపు తెచ్చుకుని తండ్రి పురిటి గడ్డ కీర్తిని ప్రవాసాంధ్రుడిగా రెపరెపలాడిస్తున్నారు. అమెరికా నుంచి కాకినాడకు ఇటీవల వచ్చిన కార్తీక్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. కాకినాడకు చెందిన కె.పద్మనాభం, యమునలకు జన్మించిన సంతానం రామకృష్ణ. సాఫ్ట్వేర్ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు పద్మజతో వివాహం జరిగింది. రామకృష్ణ, పద్మజలకు 2005లో కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం జన్మించాడు. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ పెంచుకోవడంతో అమెరికాలో తల్లిదండ్రులు స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇప్పించారు. అనతి కాలంలోనే స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో ప్రావీణ్యం సంపాదించి శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రానికి కార్తీక్ ప్రాతినిధ్యం వహించి పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నాడు. పదేళ్ల వయసులో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన మినీ ఒలింపియాడ్ ర్యాలీలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు. అమెరికాలో స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న కృష్ణస్వామి కార్తీక్ బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్‌తో పాటు టెన్నిస్‌లో కూడా క్రీడా ఓనమాలు కాకినాడలోనే కార్తీక్ నేర్చుకున్నాడు. అమెరికాలో 9 నుంచి 12వ తరగతి వరకు మేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెయింట్ లూయిస్ కంట్రీ డే స్కూల్లో చదవి అక్కడే బాస్కెట్‌బాల్ మెరుగైన శిక్షణను కోచ్ ట్రవీస్ వ్యాలీస్ వద్ద తీసుకున్నాడు. తొలిసారి కార్తీక్ సారథ్యంలో ఇంటర్ స్కూల్ స్టేట్ పోటీల్లో చాంపియన్ షిప్‌ను సాధించారు. తాతయ్య జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కావడం, మనవడు క్రీడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రీడల్లో రాణిస్తుండడంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎంఎస్సీ కర్రి పద్మశ్రీ, రెడ్‌క్రాస్ చైర్మన్, మాజీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు వైడీ రామారావులు ఇటీవల కార్తీక్‌ను అభినందించారు. నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ)
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడి
అమెరికాలోని ఓ షాపింగ్ మాల్లో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడితో చేశారు. హైదరాబాద్ టౌలిచౌకికి చెందిన సయ్యద్ సోహైల్‌పై ఓ దుండగుడు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దాడి ఘటన జులై 13న జరగ్గా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ సోహైల్.. వెస్ట్ వ్యాలీ సిటీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 37 ఏళ్ల సయ్యద్ సోహైల్.. గత రెండున్నరేళ్లుగా ఆ షాపింగ్ మాల్లో చిన్న వ్యాపార దుకాణం నిర్వహిస్తున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోకముందే, మాల్లోని కొందరు వ్యక్తులు దాడి చేసిన వ్యక్తిని నిలువరించి.. అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. నిందితుడిని పీటర్ మైఖేల్ లార్సెన్గా గుర్తించారు.ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విన్నవిస్తూ.. ఈ సమస్యను అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తాము అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దాడి గురించి తెలిసి.. సోహైల్ భార్య అమ్రీన్ ఫిర్దౌస్ స్పృహతప్పి పడిపోయారు. ఈ దంపతులకు ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.Indian stabbed in US over his religionA 37-year-old Indian national Syed Sohailuddin was st*bbed more than 15 times at a kiosk inside Valley Fair Mall in West Valley City, Utah. Suspect Peter Michael Larsen, 48, allegedly told police he targeted the Muslim victim and intended… pic.twitter.com/6rso7E03XX— Piyush Rai (@Benarasiyaa) July 16, 2026
అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్
అమెరికాలో సుమారు రెండు దశాబ్దాలు గడిపిన తర్వాత ఒక టెకీ భారత దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసుకోవడం కోసం మాతృదేశానికి వచ్చానంటూ మెటా (Meta) ఇంజనీరింగ్ లీడర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. తన 18 ఏళ్ల అమెరికా జీవితాన్ని డజనుకు పైగా సూట్‌కేసులలో సర్దేసి, బెంగళూరుకు మారిపోయినట్లు ఒక ఎయిర్పోర్ట్ ట్రాలీ ఫోటోను ఆయన షేర్ చేశారు.మెటాలో సీనియర్ ఇంజనీరింగ్ లీడర్‌గా పనిచేసిన బాలాజీ గురురాజన్, లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన నిర్ణయంతో పెద్దవాళ్లైపోయిన తన కన్నవాళ్లకు దగ్గరగా ఉండటంతోపాటు, పిల్లలు తమ గ్రాండ్ పేరెంట్స్‌ను ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉండేకన్నా, ఉమ్మడి కుటుంబంలో కలిసి పెరిగే అవకాశం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు.18 ఏళ్ల ప్రయాణంమైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, మెటా వంటి దిగ్గజ సంస్థలలో పనిచేసిన ఆయన, అమెరికా తనకు కెరీర్‌ను, మంచి స్నేహితులను ఇచ్చిందని చెబుతూ, అక్కడ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇపుడిక తన పుట్టిన నేల, చిన్న వయసులో చూసిన బెంగళూరు నగరంలో ఇప్పుడు పిల్లల స్కూళ్లు, ఇల్లు, నిత్య జీవితాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభించడం ఒక సరికొత్త అనుభవమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందినెటిజన్ల స్పందనఈ పోస్ట్‌కు నెటిజన్ల నుండి భారీగా మద్దతు, ప్రశంసలు లభించాయి. ఒక యూజర్ స్పందిస్తూ, బెంగళూరులోని సాంకేతిక పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని, ఇది "రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్" (ప్రతిభావంతులు తిరిగి స్వదేశానికి రావడం) కు సంకేతమని పేర్కొన్నారు.తల్లిదండ్రుల కళ్లలో కనిపించే ఆనందాన్ని డాలర్లతో కొనలేం మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది ఆయన నిర్ణయాన్ని అభినందించారు. అంతేకాదు గతంలోనే భారత్‌కు తిరిగి వచ్చిన పలువురు నెటిజన్లు ఆయనకు స్వాగతం పలుకుతూ, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొన్ని చిట్కాలను కూడా పంచుకోవడం విశేషం.ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్
క్రైమ్
కిరాయి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..!
నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వరంగల్–ఖమ్మం హైవేపై పెద్దనాగారం పరిధిలోని వశ్రాంతండా స్టేజీ వద్ద నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై సమాచారం మేరకు నర్సింహులపేట పోలీసులు శనివారం అర్ధరాత్రి మెరుపుదాడి చేశారు. పెద్దనాగారానికి చెందిన ఓ వ్యక్తి వశ్రాంతండా స్టేజీ వద్ద ఉన్న ఇంటిని కిరాయికి తీసుకున్నాడు. రాత్రి కాగానే అక్కడ ఒక్క మనిషి కన్పించడు. పెద్దనాగారానికి చెందిన నిర్వాహకుడు నడిపిస్తున్న వ్యభిచార గృహంపై పక్కా సమాచారంతో ఎస్సై బానోత్ వెంకన్న సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఇందులో ఓ మహిళ, ముగ్గురు విటులు పట్టుబడ్డారు. పెద్దనాగారానికి చెందిన ఓ వ్యక్తి పరారయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మహిళగా, తొర్రూరుకు చెందిన వ్యక్తులుగా ముగ్గురిని గుర్తించారు. తొర్రూరుకు చెందిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అని తెలుస్తోంది. దీనిపై ఎస్సై వెంకన్నను వివరణ కోరగా సమాచారం మేరకు దాడులు చేయగా ఒక మహిళ, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒకరు పరారీలో ఉన్నారన్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ప్రశాంత వాతావరణంలో ఉన్న నర్సింహులపేట మండలంలో వ్యభిచార గృహం నడుస్తుందనే విషయం తేలియగానే పలువురు ఆశ్చర్యపోతున్నారు.
మొన్నే చంద్రబాబుతో ముచ్చటించింది.. ఇంతలోనే విషాదం
సాక్షి, పోలవరం: రంపచోడవరం మండలంలోని ఇర్లపల్లి కొత్త కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రేకు షేడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.మృతురాలిని రంపచోడవరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివానిగా గుర్తించారు. సోమవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం పక్కన..ఇటీవల జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్‌లో శివానికి ప్రత్యేక అవకాశం లభించింది. ఈనెల 24న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఆమె మాట్లాడింది. ఆపై ఆయనతో ఫొటో కూడా దిగింది. చంద్రబాబుతో ముచ్చటించిన బాలిక ఇలా అనూహ్యంగా మృతి చెందడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.అనుమానాస్పద మృతిగా కేసుఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శివాని మృతితో పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారి మృతికి అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.చంద్రబాబు దిగ్భ్రాంతివిద్యార్థిని మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని.. తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని… pic.twitter.com/9NZE0spqgv— N Chandrababu Naidu (@ncbn) July 27, 2026విద్యార్థులు, యువత సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని.. ఒత్తిడి, నిరాశకు లోనుకావద్దని సూచించారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, తమ బాధలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు.
మరో ‘నీట్’ విద్యార్థిని బలవన్మరణం
అహిల్యానగర్: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా కర్జాత్ తాలూకా జలాల్పూర్ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల ‘నీట్’ అభ్యర్థి అంకిత సంగాలే ఆత్మహత్య చేసుకున్నారు. ‘నీట్ రీ టెస్ట్’లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికిలోనై, ఆమె తన స్టడీ రూమ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.ఈ పరీక్షలో అంకిత 166 మార్కులు సాధించారు. ఆశించిన మార్కులు రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేపర్ లీక్ వివాదం కారణంగా రీ టెస్ట్ నిర్వహించడానికి ముందు జరిగిన పరీక్షలో ఆమె మెరుగైన మార్కులు సాధించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో నీట్ స్కోర్ గురించిన ప్రస్తావన ఉన్న సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కర్జాత్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ‘నీట్’ కారణంగా ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్దారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం!
అబిడ్స్‌లో యువకుడి వీరంగం! కారుతో నేరుగా పోలీసుల పైకే..
హైదరాబాద్: గత కొన్నిరోజులనుంచి డ్రగ్స్ డీల్ సమాచారంతో అబిడ్స్‌లో పోలీసులు నిఘా పెడ్తున్నారు. అయితే, ఈరోజు సోమవారం ఉదయం తెల్లవారుజామున, ఓ యువకుడు బలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకుడు కారుతో నేరుగా పోలీసులపైకి దూసుకెళ్లాడు. ప్రమాదంనుంచి తప్పుకునేలోపు నిందితుడు కారును రివర్స్‌లో తీసి పోలీసులపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు గాయాలు కాగా, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అయినాసరే వారి గాయాలను లెక్కచేయకుండా పారిపోతున్న నిందితుడు సైఫ్‌ను పోలీసులు ఛేజ్‌చేసి పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం దగ్గరలో ఉన్నటువంటి యశోధ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స పొందుతున్నారు. అయితే, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ ఫిర్యాదుతో నిందితుడిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగం నిందితుడిని విచారిస్తున్నట్లుగా తెలిసింది.
వీడియోలు
నైతిక బాధ్యతతో లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి
రైతుల పొట్ట కొట్టకు చంద్రబాబు పోలవరం ఆయకట్టు రైతులకు అండగా వల్లభనేని వంశీ
ఢిల్లీలో పెల్లెట్ గన్స్ బీహార్ లో AK-47 తో కాల్పులు.. రాహుల్ గాంధీ సూటి ప్రశ్న
అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్.. ఇప్పటివరకు చేసిన అప్పు..!
నిరసన చేస్తే కొట్టడం ఏంటి? లాఠీ ఛార్జ్ పై సుప్రీంకోర్టు సీరియస్
ఏపీలో Gen-Z తుఫాన్ నారా మోసం అంతా ఇంతా కాదు
చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై? కొత్త చీఫ్ ఎవరు?
రైతుల పొట్ట కొట్టకు చంద్రబాబు.. నీకు ఇదే నా విజ్ఞప్తి
నీకు భయపడేవాడు ఎవడూ లేడు.. నా తల్లిదండ్రులను జైల్లో పెట్టి... జక్కంపూడి ఫైర్
రాజీనామా తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ ఎంట్రీ పార్లమెంట్లో!


