Bapatla
-
5న ‘చలో విజయవాడ’ కార్యక్రమం
మంగళగిరి: జూన్ 5వ తేదీన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏపీజీఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. జూన్ 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు విజయవంతం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంఘానికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, మంగళగిరి తాలూకా యూనిట్ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి మాధవరావు, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటి సంరక్షించాలి కాజ (మంగళగిరి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని కాజలో గురువారం ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెప్మా డైరెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు సభ్యులు తొలుత కనీసం ఒక్క మొక్క నాటి దానిని సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడంపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మహిళలకు కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, మెప్మా పి.డి. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజే విద్యామిత్ర కిట్లు అందిస్తాం ప్రత్తిపాడు: పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు అందించడం జరుగుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఐ. పద్మావతి అన్నారు. ప్రత్తిపాడులోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మండల స్థాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టాక్ పాయింట్‌ను గురువారం ఏపీసీ పరిశీలించారు. క్వాలిటీ వాల్‌తోపాటు బ్యాగుల నాణ్యతను పరిశీలించారు. స్టాక్ పాయింట్‌కు చేరిన పుస్తకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన కిట్లు అందించడం జరుగుతుందన్నారు. వెంట ఎంఈవో–2 జి. లీలారాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఇకపై వజ్ర కిరీటంతో దుర్గమ్మ దర్శనం ప్రతి పౌర్ణమి రోజున అలంకరించాలన్న ఈవో శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ప్రతి పౌర్ణమిన అమ్మవారికి స్వర్ణకవచంతో పాటు వజ్ర కిరీటాన్ని అలంకరించాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆలయ వైదిక కమిటీకి సూచించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీ, ముఖ్య అర్చకులతో ఈవో శీనానాయక్ గురువారం సమావేశమయ్యారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈవో చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి వైదిక కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్, మల్లేశ్వర శాస్త్రి, సుందరంబాబులతో పాటు ఇతర అర్చకులు పాల్గొన్నారు. ఈవో శీనానాయక్ మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో జరిగే వైదిక కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించాలని, నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని సూచించారు. దేవతామూర్తుల అలంకరణ, వస్త్రాలు వైభవంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, కోట రవికుమార్, ముఖ్య అర్చకులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఏఈవోలు పాల్గొన్నారు. -
గంజాయి,మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించాలి
బాపట్ల : రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి రేషన్ డీలర్లకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ సరుకులు షాపుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ విధానం జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఒకటో తేదీన షాపులను ప్రజాప్రతినిధులతో ఘనంగా ప్రారంభించాలని తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు షాపులు తెరచి ఉంచాలన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు సరుకులను పంపిణీ చేయాలన్నారు. ప్రతి కార్డుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి సరుకులను అందజేయాలన్నారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించే వారికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి లవన్న, పౌర సరఫరాల మేనేజర్ శ్రీనివాసరావు, రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు రామలక్ష్మి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్రను విజయవంతం చేయాలి ఈనెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరం నుంచి యోగాంధ్ర క్యాంపెయిన్ అంశంపై ఎంపీడీవోలు, గ్రామస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఒక్కో మండలంలో 30 వేల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ప్రతి సచివాలయం ఉద్యోగి 300 మందిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్‌లో 2500 నుంచి 5000 మందితో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలి ప్రజలు నివాసం ఉండే గ్రామాలను అధికారులు సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. పంచాయతీశాఖలో చెత్త సంపద కేంద్రాల నిర్వహణ, గ్రామాల పరిశుభ్రతపై స్థానిక సాయిరామ్ గ్రాండ్ కన్వెన్షన్ హాలులో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులపై ఉందని అన్నారు. ఇప్పటివరకు గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడంతోనే గ్రామాలు అపరిశుభ్రంగా మారాయని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలలో ప్రక్షాళన జరగాలి, ఇందుకోసం జూన్ 21వ తేదీ వరకు సమయం ఇస్తామని, ఆ తర్వాత గ్రామాలలో రహదారుల వెంట చెత్త కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాలు సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు. నషా ముక్త్ భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మాదక ద్రవ్యాల నిర్మూలన–మత్తు రహిత సమాజం మన లక్ష్యం వాల్‌పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. అదనపు ఎస్పీ విఠలేశ్వర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉత్పత్తి, విక్రయాలను అరికట్టడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025వైభవంగా హనుమాన్ శోభాయాత్ర సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 512.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,459 క్యూసెక్కులు విడుదలవుతోంది. కొనసాగుతున్న సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పున:పరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారం కొనసాగింది.సుఖీభవ లబ్ధిదారుల నమోదు నూజెండ్ల: నూజెండ్ల రైతుసేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల నమోదు చేపట్టారు. ఇప్పటివరకు 13,175 మంది వివరాలు నమోదు చేశారు. ఇంకొల్లు–పర్చూరు (పాత మద్రాసు) రోడ్డు ఆధునికీకరణ పనులకు గత ప్రభుత్వం రూ.22 కోట్ల నిధులు మంజూరు చేసి 19 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డుఽ పనుల్లో 28 శాతం పూర్తి చేసింది. ఇంకొల్లులో సిమెంట్ రోడ్డు నిర్మాణంతోపాటు రహదారిలో ఉన్న కల్వర్టు పనులను దాదాపుగా పూర్తిచేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది ముగుస్తున్నా రోడ్డుపై తట్టమట్టి పోయలేదు. ఇటీవల వర్షాలు కురవడంతో మరింత అధ్వానంగా తయారైంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ దారిలో ఇంకొల్లు మొదలు ఇడుపులపాడు, వంకాయలపాడు, దగ్గుపాడు, నూతలపాడు, ఎర్రగుంటపాలెం, పర్చూరుతోపాటు పలు గ్రామాలున్నాయి. ఈ దారిగుండా అటు పర్చూరు నుంచి చిలుకలూరిపేట, గుంటూరు, విజయవాడతో పాటు పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్‌కు ఇటు ఇంకొల్లు నుంచి చైన్నె– కోల్‌కతా జాతీయరహదారి మీదుగా ప్రకాశం, నెల్లూరు, చైన్నె, తిరుపతి జిల్లాకు వెళ్లవచ్చు. మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి పలుమార్లు రోడ్లు భవనాల శాఖ డీఈ, కాంట్రాక్టర్‌తో మాట్లాడి నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలని కోరారు. ఆ శాఖ సీఈ రోడ్డును పరిశీలిస్తారని, ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని జేఈ శ్రీకాంత్ ఆరునెలల కిందట చెప్పినా ఇప్పటికీ పురోగతి లేదు. శ్రద్ధ చూపని పచ్చనేత ... నూతలపాడు–మార్టూరు, పర్చూరు యద్దనపూడి, ఇంకొల్లు, నాగట్లతో పాటు పలు రహదారులు ఇప్పటికే గుంతలమయంగా మారాయి. వర్షాలు పెరిగితే పూర్తిగా రాకపోకలు స్తంభించే అవకాశముంది. ఇప్పటికే ఈ రోడ్లలో పది కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఎన్నికల్లో ఓట్లేయించుకొన్న నియోజకవర్గ పచ్చనేత ప్రకృతి వనరులను కొల్లగొట్టడంలో చూపిస్తున్న శ్రద్ధ ఇక్కడి రోడ్లను మరమ్మతు చేయించడంలో చూపడం లేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. 9న్యూస్‌రీల్ పనులు వెంటనే మొదలు పెట్టాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అవకతవకలు లేకుండా చూడండి జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి రేషన్ డీలర్ల నాయకులతో సమీక్ష బాపట్ల జిల్లాలో రోడ్లు అధ్వానం ఏడాది పాలన ముగుస్తున్నా రోడ్లకు మరమ్మతులు లేవు ప్రధాన రహదారి పనులను గాలికి వదిలిన కూటమి గుంతలమయంగా ఇంకొల్లు, పర్చూరు ప్రధాన రహదారి 19 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ. 22 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం.. అప్పటికే 28 శాతం పనులు పూర్తి మరింత అధ్వానంగా నూతలపాడు–మార్టూరు రోడ్డు పర్చూరు–యద్దనపూడి రోడ్డుది ఇదే పరిస్థితి దుస్థితిలో ఇంకొల్లు– నాగట్ల రోడ్డు ‘గత ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ప్రభుత్వం ఒక్క రోడ్డును రిపేరు చేయలేదు. మేము అధికారంలోకి రాగానే రోడ్లను అద్దంలా మారుస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక కొత్త రోడ్ల నిర్మాణం సంగతి దేవుడెరుగు ఉన్న రోడ్ల గుంతలను పూడ్చకుండా గాలికి వదిలేశారు. అధికారం దక్కాక బోడిమల్లన్న చందంగా వ్యవహరిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, బాపట్ల ఇంకొల్లు– పర్చూరు రోడ్డు అధ్వానంగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రోడ్డు ప్రమాదాలతో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నియోజకవర్గంలోని నూతలపాడు–మార్టూరు, పర్చూరు యద్దనపూడి, ఇంకొల్లు, నాగట్లతోపాటు పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. తక్షణం ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. – గాదె మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త ఇంకొల్లు– పర్చూరు రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తిచేయాలి. వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు ఇచ్చింది. 28 శాతం పనులు పూర్తయ్యాయి. అధికారులు, కాంట్రాక్టర్‌తో సకాలంలో పనులు పూర్తి చేయించలేక పోయారు. రోడ్డు మరింతగా దెబ్బతినడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాలు పడడంతో రోడ్డు మరింత గుంతలమయంగా మారుతోంది. – భవనం శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ, ఇంకొల్లు -
పట్టపగలే రూ.6.25 లక్షలు చోరీ
సుద్దపల్లి (చేబ్రోలు): చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో పట్టపగలే ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టిన దొంగలు భారీగా నగదు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. సుద్దపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట శ్రీనుకు చెందిన ఇంటిలో మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టారు. అందులోని రూ.6.25 లక్షల నగదును చోరీ చేశారు. వీటితో పాటు బంగారు వస్తువులు కూడా చోరీ అయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇంటిలో వివాహ వేడుక జరిగింది. వడ్లమూడిలో జరిగే శుభకార్యానికి అందరూ వెళ్లటంతో గమనించిన దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై డి. వెంకట కృష్ణ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజాయుద్ధ నేతగా సజ్జా నాగేశ్వరరావు
చీరాల: మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న అలియాస్ ఏసన్న అలియాస్ నవీన్ నారాయణపూర్‌లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట. జాండ్రపేటలో సాధారణ చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన 36 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. బాల గంగాధరరావు, సుబ్బరావమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి బాలగంగాధరరావు ఇరిగేషన్ శాఖ లో ఉద్యోగిగా పలు ప్రాంతాలలో పనిచేశారు. రెండో సంతానంగా నాగేశ్వరరావు జాండ్రపేట హైస్కూల్లో విద్యాభ్యా సం పూర్తి చేసి గుంటూరు జిల్లా నల్లపాడులోని పాలిటెక్నిక్ కాలేజీలో చదివారు. 17 ఏళ్ల వయస్సులోనే రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవోద్యంలోకి జీవితకాలం కార్యకర్తగా వెళ్లిన నాగేశ్వరరావు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. సోదరి వివాహానికి పెరోల్‌పై విడుదలైన ఆయన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా ఉద్యమంలో ‘ఏసన్న’గా పేరు... గుంటూరు జిల్లాలో జరిగిన ఉద్యమంలో నాగేశ్వరరావుకు ఏసన్నగా పేరుంది. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రజా యుద్ధ సైనికుడిగా నల్లమల, ఆంధ్ర ఒడిశా బోర్డర్ ప్రాంతంలో జరిగిన వివిధ రైతాంగ, దళిత, గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించారు. టెక్నికల్ రంగంలో ప్రావీణ్యం పొందిన నాగేశ్వరరావు అనతి కాలంలోనే అప్పటి పీపుల్స్ వార్ నిర్వహించిన మిలటరీ పత్రిక జంగ్ సంపాదకునిగా వ్యవహరించారు. విప్లవోద్యమ అవసరాలలో భాగంగా ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ మిలటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నారాయణపూర్ ఎదురు కాల్పుల్లో సజ్జా నాగేశ్వరరావు మరణించారని మీడియాలో రావడంతో ఆయన సోదరుడు సజ్జా శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడారు. తమ్ముడి మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం కోరారు. నారాయణపూర్ ఎన్కౌంటర్లో సజ్జా మృతి 36 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం -
సాగర్ కుడి కాలువకు తాగునీటి విడుదల
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు గురువారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలతో కుడి కాలువ 2, 3వ గేట్లు ద్వారా 5,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. తాగునీటి అవసరాల నిమిత్తం 4 టీఎంసీలను రోజుకు 5,500 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని అధికారులు సూచించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ నుంచి విడుదలవుతున్న నీరు -
యోగాపై అవగాహన పెంపునకు చర్యలు
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాలులో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల వీడియో సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడారు. వచ్చే నెల 21వ తేదీ వరకు జరుగనున్న యోగాంధ్ర క్యాంపెయిన్‌ను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతి మండల, డివిజనల్ స్థాయి కేంద్రాల్లోనూ యోగా మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రచారం విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి మండల, గ్రామ, డివిజనల్ స్థాయిలో ట్రైనర్ల ద్వారా యోగా సాధన వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. గ్రామ, మండలాల్లో వంద నుంచి 150 మంది యోగా చేసేందుకు వీలున్న విద్యాసంస్థలు, గోదాములు, గుర్తించాలని తెలిపారు. సచివాలయ కార్యదర్శుల ద్వారా యోగా సాధనకు పేర్లు నమోదు చేయించాలన్నారు. యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొక బృందాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి కల్చరల్ టీం ఈ బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జిల్లా భద్రతా విభాగం పోలీసుల మాక్ డ్రిల్
తాడికొండ: తుళ్ళూరు మండలంలో భద్రతా పోలీసు విభాగం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో డీఎస్‌డబ్ల్యూ ఆర్ఐ సురేష్ కుమార్ సమక్షంలో గురువారం నిర్వహించిన ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది తమవద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, శిక్షణ పొందిన పోలీసు జాగిలాలతో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు తనిఖీలు నిర్వహించారు. కచ్చితత్వాన్ని పరీక్షించి జాగిలాల పనితీరును అంచనా వేసేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డులో ఓ చోట పేలుడు పదార్థం గోప్యంగా పెట్టారు. బాంబు డిస్పోజల్ విభాగానికి చెందిన జాగిలం దాన్ని కనిపెట్టింది. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ.. వీవీఐపీలు ప్రయాణించే సీడ్ యాక్సిస్ రోడ్డులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి నిర్మాణ పనులకు వచ్చిన కార్మికుల వివరాలను సేకరిస్తున్నామని, భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుళ్ళూరు సీఐ కొంకా శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు, ఎస్బీ విభాగం శ్రీహరి, జిల్లా భద్రతా విభాగం ఆర్ఐ సురేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగుతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో గురువారం రెండో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణలను ఆలయ అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు స్వామి వారికి పొంగళ్లను చేసి, నైవేద్యాన్ని సమర్పించారు. స్వామి వారికి విశేష ఆకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని మాలదారులకు గురుస్వామి వెంకట నరసింహాచార్యులు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పాన్ని స్వామివారికి సమర్పించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సువర్చలా సహిత ప్రసన్నాంజనేయ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు దక్కినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి చెప్పారు. సాంబశివపేటలోని కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... 82 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కళాశాల నాక్ నుంచి తాజాగా నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు దక్కించుకున్నట్లు వివరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థినులకు ఆధునిక, సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. కాలానుగుణంగా ఉద్యోగం, ఉపాధి కల్పించే కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్వయంప్రతిపత్తి హోదా కలిగిన కళాశాల తాజాగా పొందిన నాక్ ఏ గ్రేడ్ గుర్తింపుతో మరో పదేళ్లపాటు స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళుతుందని చెప్పారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సులకు తీసిపోని విధంగా వాటికి సమాంతరంగా బీఎస్సీలో డేటాసైన్స్, ఏఐ, బయోకెమిస్ట్రీ వంటి ఆధునిక కోర్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో నాక్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి. మధుసూదనరావు, అధ్యాపకులు ఎం. సంతోషికుమారి, కె. అపర్ణ సీతారామ్, కె. సుబ్బరత్నమ్మ, జి.శేషు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... దరఖాస్తు ప్రక్రియతో ఎన్నో అంశాలు ముడి పడి ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయులు గతంలో టీఐఎస్‌లో స్వయంగా అప్లోడ్ చేసిన సమాచారమే ఆన్లైన్ పోర్టల్‌లో ఉంటుందని, దానిలో ఎటువంటి మార్పు ఉండబోదని చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తులో ప్రత్యేక పాయింట్లు, రేషనలైజేషన్, ప్రిఫరెన్షియల్ పాయింట్లు ఇతర వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు సబ్మిట్ చేసే ముందుగా పరిశీలన చేసుకోవాలని, దరఖాస్తు ప్రింటవుట్ రెండు కాపీలను డీడీవోకు సమర్పించాలని సూచించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమైన తరువాత అదనంగా గంట బోధించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ బదిలీల చట్టం, ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపు, పాఠశాలల స్ట్రక్చర్ వెనుక యూటీఎఫ్ పోరాటం ఉందని తెలిపారు. సదస్సులో సంఘ నాయకులు జి.వెంకటేశ్వర్లు, సీహెచ్ ఆదినారాయణ, కె. సాంబశివరావు, బి. రంగారావు, ఎం.గోవిందు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, ఎం. చిన్నయ్య, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పీజీ వైద్యులకు పరిశోధనలపై దృష్టి ముఖ్యం
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి గుంటూరు మెడికల్: పీజీ వైద్య విద్యార్థులు అకడమిక్ కార్యక్రమాలతోపాటు పరిశోధనలపై దృష్టి సారించడం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్‌లో పీజీ వైద్య విద్యార్థుల కోసం రెండురోజుల పరిశోధన శిక్షణ శిబిరం గురువారం మొదలైంది. తొలి ఏడాది పీజీ వైద్య విద్యార్థులకు ‘రీసెర్చ్ మెథడాలజీ – థీసిస్ ప్రిపరేషన్’పై కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. వివిధ వైద్య విభాగాల నుంచి 180 మందికిపైగా పీజీ వైద్యులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌ను ప్రారంభించిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సీతారామ మాట్లాడుతూ, పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, గుణాత్మక థీసిస్ రూపొందించేందుకు వర్క్‌షాప్ ఉపయోగపడుతుందన్నారు. ముఖ్య అతిథిగా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణలు విద్యార్థులకు పరిశోధన పట్ల అవగాహనను పెంచడమే కాకుండా, మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయన్నారు. గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జయంతి, డాక్టర్ పి.అనిల్, పలువురు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తరగతులు నిర్వహించి, పీజీ విద్యార్థుల థీసిస్ ప్రోటోకాల్‌ను వివరించారు. -
సమావేశాలతో మమ అనిపించారు
పట్నంబజారు: గుంటూరు నగరంలో అర్ధరాత్రి పూట మద్యం విక్రయాలపై ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘నిశీధిలోనూ అదే నిషా’ కథనానికి అధికారులు స్పందించారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మద్యం విక్రయాలపై చర్చించారు. అయితే ఇప్పటి వరకు అర్ధరాత్రి పూట మద్యం అమ్మకాలు చేపట్టిన దుకాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాలక్షేపంగా సమావేశం నిర్వహించి, జాగ్రత్త పడాలంటూ అధికారులే సూచనలు చేశారని విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా సాక్ష్యాధారాలతో ‘సాక్షి’తో కథనం ప్రచురితమైనప్పటికీ అధికారులు నోటి మాటలతోనే సరిపెట్టారు. అర్ధరాత్రి వేళ అమ్మకాలు జరిగినా బార్ అండ్ రెస్టారెంట్లపై కనీస నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు పోలీసులు సైతం సమావేశం ఏర్పాటు చేసి యాక్షన్ తీసుకుంటామని ‘యాక్షన్’ చేశారు తప్ప, ఎటువంటి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారుగానీ, ఏడాది కాలంలో ఏ ఒక్కరోజూ ఇది అమలు కాలేదు. గతంలో సైతం బహిరంగ మద్యపానం, ఎమ్మార్పీ ధరలు, అర్ధరాత్రి అమ్మకాల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు చేపడతామని చెప్పారేగానీ, చేతల్లో మాత్రం ఆ విషయం చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉందని, అధికారులకు అన్ని విధాలా సహాయంగానే ఉంటున్నామని, ప్రతినెలా మామూళ్లు చెల్లిస్తున్నామని, చూసీచూడనట్లు పోవాలని ఎకై ్సజ్, పోలీసు అధికారులతో వ్యాపారులు విన్నవించినట్లు సమాచారం. కొద్దిరోజులు పేరుకు తాము తనిఖీలు నిర్వహిస్తామని, ఆ సమయంలో కొద్దిరోజులపాటు నియమాలు పాటించాలని పోలీసు అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి మద్యం అమ్మకాలపై చర్యలు శూన్యం -
నంబాల ఎన్కౌంటర్ నాటకమే
ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ సత్తెనపల్లి: మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారనేది నాటకమేనని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంబాల కేశవరావు మృతి చెందారనే వార్తను తాము నమ్మడం లేదన్నారు. ఎన్కౌంటర్ జరిగిన తరువాత రోజుల తరబడి మృతదేహాలను మార్చురీలో పెట్టుకుని, అవి కుళ్లిపోయిన తరువాత ప్రధాన నాయకుడు చనిపోయాడని అంటున్నారని పేర్కొన్నారు. కానీ అవి ఆదివాసీలు, మిలీషియా సభ్యుల మృతదేహాలని వార్తలు వస్తున్నాయన్నారు. నంబాల చనిపోయారని చెబితే కేడర్ నిరాశ, నిస్పృహలతో ఉంటారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని భావిస్తున్నామన్నారు. ఇలా ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. -
అర్హులైన వైద్యులనే గర్భిణులు సంప్రదించాలి
పల్నాడు డీఎంహెచ్ఓ డాక్టర్ రవి నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని గర్భిణులు, బాలింతలు వైద్య సేవలకు అర్హులైన వైద్యులనే సంప్రదించాలని, నాటు వైద్యుల దగ్గరకు వెళ్లవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి సూచించారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా వైద్యుల సలహాల మీరకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం పొందటం వల్ల మాతాశిశు మరణాలు నియంత్రించవచ్చని అన్నారు. తొమ్మిది నెలల గర్భకాలంలో కనీసం రెండు సార్లు స్కానింగ్ తప్పని సరిగా చేయించాలని సూచించారు. దీని వలన గర్భస్థ శిశువు పెరుగుదల తెలుసుకునేందుకు, జన్యుపరమైన వ్యాధులు, అంగవైకల్యాలు నిర్ధారించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటళ్లలో ఉచితంగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు చేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ గురించి ఎటువంటి వాణిజ్య ప్రకటనలు చేయరాదని తెలిపారు. ఈ పరీక్షలు చేసిన వారికి, దానిని ప్రోత్సహించిన వారికీ మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. జిల్లాలో రిజిస్టర్ కాకుండా ఏ హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహిస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారన్నారు. ఇటువంటి వారి గురించి తెలిస్తే టోల్‌ఫ్రీ నంబరు 18004253365 ద్వారా తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మెమో కె.సాంబశివరావు పాల్గొన్నారు. -
ఇసుకాసురుల పైసాచికం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల ప్రాంతంలో పచ్చ నేతల ఇసుక దందా యథేఛ్ఛగా సాగుతోంది. ఓడ రేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారి పేరుతో అనుమతులు పుట్టించారు. దీని మాటున ఇసుకను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. పచ్చనేతలు సామాన్యులను ఒక్క ట్రాక్టర్‌ను కూడా తీసుకు వెళ్లనీయడం లేదు. అవసరమైన వారు పచ్చ నేతలకు ఆర్డర్ పెట్టుకొని అధిక ధరలకు కొనుక్కోవాల్సి వస్తోంది బుసకతో మస్కా స్థానికంగా ట్రాక్టర్ ఇసుకను రూ.2 వేలకు విక్రయిస్తున్న నేతలు పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లో రూ. 4 నుంచి రూ.5 వేల వరకూ విక్రయిస్తున్నారు. ఇంటి నిర్మాణాలతో పాటు పునాదులు పూడ్చుకునేందుకు పలువురు గత్యంతరం లేక అధిక ధరలకు కొంటున్నారు. ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న రియల్ వెంచర్లకు రియల్టర్లు పచ్చ నేతల వద్దే కొనుక్కోవాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. మరోవైపు పచ్చనేతలు బుసక, సముద్ర తీరం ఇసుకను కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది నిర్మాణాలకు పనికి రాదు. కానీ పచ్చనేతలు మాత్రం ఆ రెండింటిని విక్రయించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కాలువ గట్లు మాయం వేటపాలెం మండలం పందిళ్లపల్లి వద్ద రహదారి నిర్మాణం పేరుతో అనుమతులు తీసుకున్న పచ్చ నేతలు ఇక్కడి నుంచే కాకుండా ఈపూరిపాలెం ప్రాంతంలో ఉన్న స్ట్రెయిట్ కట్ కాలువ గట్ల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రధాన సాగునీరు, మురికి నీటి కాలువల గట్లు కొల్లగొడుతున్నారు. పచ్చనేతల ఇసుక తరలింపుతో వేటపాలెం, ఈపూరిపాలెం ప్రాంతాల్లోని కాలువ గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికారులు కూడా భయపడి నోరు మెదపడంలేదన్న విమర్శలున్నాయి. ఉచితం మాట ఉత్తిదే.. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పినా పచ్చనేతలు మాత్రం తీసుకు వెళ్లనివ్వడంలేదు. తామే సరఫరా చేస్తామంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు అందుబాటులో ఉన్న ఇసుకను తీసుక వెళ్లేందుకు కొందరు ప్రయత్నించినా పచ్చనేతలు అడ్డు పడుతున్నారు. పోలీసులకు చెప్పి వాహనాలను పట్టించి కేసులు పెట్టిస్తున్నారు. దీంతో ప్రజలు నేరుగా ఇసుక తీసుక వెళ్లేందుకు సాహసించడం లేదు. పచ్చ నేతల వద్ద అధిక ధరలకు కొని నష్టపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ జోక్యం చేసుకొని పచ్చనేతల ఇసుక దందాను కట్టడిచేసి ఇసుక అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. పచ్చనేతకు కప్పం చీరాల ప్రాంతంలో ఇసుక దందా వ్యవహారంలో ఈ ప్రాంత పచ్చనేతకు ట్రిప్పులవారీ కప్పం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఇసుక ట్రాక్టర్‌కు రూ. 900 చెలిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన నిత్యం తరలించే వందలాది ఇసుక తరలింపు వాహనాలకు సంబంధించి రోజుకు రూ. లక్షల్లోనే పచ్చనేతకు కప్పం చెల్లిస్తున్నట్లు సమాచారం. పందిళ్లపల్లి, ఈపూరిపాలెం నుంచి ఇసుక అక్రమ రవాణా జాతీయ రహదారి పేరుతో అనుమతులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు అమ్మకం అసైన్డ్, ప్రభుత్వ, అటవీ భూముల్లో తవ్వకాలు నియోజకవర్గంలో అసైన్డ్, ప్రభుత్వ, అటవీ భూముల నుంచి పచ్చనేతలు పెద్ద ఎత్తున ఇసుకను తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. గతంలో చీరాల ఎమ్మెల్యే, బాపట్ల ఎంపీ అనుచరుల మధ్య ఇసుక అక్రమ రవాణా విషయంలో గొడవలు తలెత్తాయి. ఏకంగా ఎంపీ వర్గీయుల జేసీబీని ఎమ్మెల్యే అనుచరులు తగల బెట్టారు. దీనిపై కేసులు కూడా నమోదు కావడంతో కొందరు క్షేత్రస్థాయి అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇంత జరిగినా తవ్వకాలు ఆగలేదు. -
సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి
డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి సాక్షి ప్రతినిధి, బాపట్ల /బాపట్ల టౌన్: అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జల వనరులు, వ్యవసాయ, జాతీయ ఉపాధి పథకం, పర్యాటక రంగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడమనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని చెప్పారు. వేసవి కాలం ముగిసే వరకు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నీటి తీరువాకు వడ్డీని ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ మేరకు డీఆర్సీలో కమిటీ ఆమోదించి తీర్మానం చేసినట్లు మంత్రి ప్రకటించారు. వర్షాలు రాకముందే పంట కాల్వల పూడికతీత, మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది వర్షాలు ముందుగా వచ్చే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది రూ.20 కోట్ల నిధులు మురిగిపోవడంపై అధికారులను నిలదీశారు. పొగాకు పంట అధికంగా సాగు చేయాలని కంపెనీలు ఒత్తిడి చేసి, దిగుబడి వచ్చిన తర్వాత రైతులను వదిలేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. బ్లాక్ బర్లీ పొగాకును కొనిపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చెరువుల కట్టలను బలోపేతం చేయాలి రైతుల నుంచి నీటి తీరువాకు వడ్డీని వసూలు చేయరాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. చెరువుల పూడికతీత పనుల్లో భాగంగా కట్టలను బలోపేతం చేయాలని తెలిపారు. గుండ్లకమ్మ నదిపై మల్లవరం ప్రాజెక్ట్ గేట్లు పూర్తిగా మరమ్మతులు చేయాలని, నిధులు తెప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. పమిడిమర్రు ఎత్తిపోతల పథకం అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి ఎత్తిపోతల పథకాలు, కాలువల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ చెప్పారు. నీటి తీరువా వసూలులో భూమి అమ్మినవారి పేర్లు కూడా ఆన్లైన్లో చూపిస్తున్నాయన్నారు. తద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వాటిని నివారించాలని అధికారులకు సూచించారు. మురిగి పోయిన జల జీవన్ మిషన్ నిధులు జల జీవన్ మిషన్ కింద రూ.532.39 కోట్లు పనులు చేయకపోవడంతోనే నిధులు మురిగిపోయాయని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. 1,080 పనులు నిలిచిపోవడంపై ఆయన అధికారుల్ని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో పని చేస్తున్న యంత్రాంగం ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడానికి యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేస్తోందని కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. స్వదేశీ దర్శి– 2 కింద సూర్యలంక బీచ్‌ని అభివృద్ధి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.97 కోట్లు పర్యాటకానికి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. పొగాకు రైతులను ఆదుకోవాలి పొగాకు పంటను రైతుల వద్ద నుంచి కంపెనీలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. సమావేశంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టీనా, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య, జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పొట్టకూటి కోసం వచ్చి అనంతలోకాలకు..
సత్తెనపల్లి: పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పట్టణంలోని గడియారస్తంభం వద్ద బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు (48), బి.జోసెఫ్ అలియాస్ శ్రీనివాసరావు ఇద్దరు కూలి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో దామచర్లకు చెందిన ఓ వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో గడియార స్తంభం వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉప్పుతల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా జోసెఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బాధితుడిని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కారు ఢీకొని కూలీ మృతి.. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు -
జర్నలిస్టులపై దాడులు గర్హనీయం
చిలకలూరిపేట: జర్నలిస్టులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్వర్ధ్దన్పై కారెంపూడిలో టీడీపీ వర్గీయులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే అనుబంధ చిలకలూరిపేట ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాల్గో స్తంభంగా పరిగణించే మీడియా స్వేచ్ఛపై దాడులు జరగడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. జర్నలిస్టులు వ్యక్తిగత అభిప్రాయంతో పని చేయరని, వారు ఏ పార్టీకి అనుకూలం లేదా వ్యతిరేకం కాదని వెల్లడించారు. నిజాలు మాత్రమే వెలికితీసే పనిని జర్నలిస్టులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తప్పులు చేయకుంటే జర్నలిస్టులు వారి గురించి తప్పుగా రాయాల్సిన అవసరం ఉండదని, తప్పు చేసిన వారే దాడులకు పాల్పడటం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. ప్రభుత్వం, పోలీసులు జర్నలిస్టులపై దాడికి పాల్పడేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ జిలాని, చిలకలూరిపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అన్నలదాసు శేషగిరి, షేక్ అబ్దుల్ సత్తార్, సభ్యులు షేక్ అల్లాబక్షు, కాట్రు శ్రీనివాసరావు, షేక్ హసన్‌వలి, షేక్ కరిముల్లా, దార్ల బుజ్జిబాబు, మలాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భక్తవత్సలరావు -
వీరాంజనేయునికి మామిడి ఫలార్చన
తెనాలి: పట్టణ మారీసుపేటలోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో గల వీరాంజనేయ స్వామికి ఈ నెల 22వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష ప్రదక్షిణముల మహాయజ్ఞం కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఆరంభమైన కార్యక్రమంలో భాగంగా రోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. భక్తులు తమ శక్తిని అనుసరించి ప్రదక్షిణములు చేస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంలోనూ సామూహికంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్వామి వారికి మామిడి ఫలార్చన చేశారు. తదుపరి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగాయి. లలితా గోష్టి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. 22న హనుమజ్జంతి వేడుకను నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంధి సేతుమాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధరరావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు. కిల్కారి కాల్ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని బుధవారం ఆర్మ్ సెంట్రల్ బృందం విజిట్ చేసింది. ఈ సందర్భంగా కిల్కారి కార్యక్రమం అమలు గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకుంది. పనితీరును అభినందించింది. అనంతరం సంగం జాగర్లమూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బృంద సభ్యులు సందర్శించారు. ఆరోగ్యకేంద్రం స్థాయిలో కిల్కారి కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తల పని తీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలతో ముచ్చటించారు. కిల్కారి కాల్ సర్వీస్‌ను కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రవేశం పెట్టినట్లు వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించటానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని, 01244451660 అనే నంబర్ నుంచి కాల్ రావడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, ఇన్చార్జి డీపీహెచ్ఎన్ఓ డాక్టర్ ప్రియాంక, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజు, డీసీఎం సురేష్ పాల్గొన్నారు. 17 మండలాల్లో తేలికపాటి వర్షం కొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 17 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా పొన్నూరు మండలంలో 8 మిల్లీ మీటర్లు నమోదుకాగా, అత్యల్పంగా తాడికొండ మండలంలో 0.8 మి.మీ. కురిసింది. సగటు వర్షపాతం 4.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 21వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.2 మి.మీ కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ. కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. చేబ్రోలు మండలంలో 7.8, ప్రత్తిపాడు 6.6, గుంటూరు పశ్చిమ 6.2, కొల్లిపర 6.2, ఫిరంగిపురం 5.6, కాకుమాను 5.4, పెదనందిపాడు 5.4, తాడేపల్లి 5.4, మంగళగిరి 5.2, తెనాలి 4.4, దుగ్గిరాల 2.8, పెదకాకాని 2.2, గుంటూరు తూర్పు 2, మేడికొండూరు 1.8, తుళ్ళూరు మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
సత్తెనపల్లి: కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు గద్దె చలమయ్య, ఆయన భార్య ఐద్వా రాష్ట్ర నాయకురాలు గద్దె ఉమశ్రీ కారులో బుధవారం గుంటూరు వెళ్లి తిరిగి సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో సత్తెనపల్లి నుంచి ఆటోలో పరుచూరి రాధ, పరుచూరి ఉషశ్రీ, శ్యాం సాయి, ఆటో డ్రైవర్ బలుసు పాటి సాంబశివరావులు గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో మండలంలోని కంటెపూడి రిథమ్ హోటల్ సమీపంలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఆటో పూర్తిగా రోడ్డు పక్కన కంపలోకి పల్టీకొట్టింది. కారు ముందు భాగం ధ్వసమైంది. కారులోని ఇద్దరికి, ఆటోలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్దె చలమయ్య, ఉమాశ్రీలను చికిత్స నిమిత్తం సత్తెనపల్లికి, మిగిలిన నలుగురిని గుంటూరు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు మంజూరు
కలెక్టర్ జె. వెంకట మురళి బాపట్ల టౌన్: అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు అందజేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై బుధవారం రాష్ట్ర సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్ల జిల్లాలో ఇంటి స్థలాలు కావాలని పేదల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి, సమగ్ర నివేదికను ఆన్లైన్లో పొందుపరిచామని తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్లలో 50,484 పాట్లు ఉండగా, అందులో 24,241 ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హుల జాబితా పరిశీలించాలని ఆయన చెప్పారు. బాపట్ల జిల్లాలో నమోదైన 22–ఏ కేసుల వివరాలను తెలుసుకుని, సంబంధిత దస్త్రాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన 108 కేసులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ రికార్డు రూములు లేని ప్రాంతాల్లో వాటి నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనను పంపాలని ఆదేశించారు. ఇంటి స్థలం కోసం వచ్చిన దరఖాస్తులు, అర్హులు, అనర్హులు, ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ముందస్తుగా ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించే ప్రక్రియకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. ఖాళీ ప్లాట్లపై క్షేత్రస్థాయి పరిశీలించి, తదుపరి నివేదికలో పొందుపరచాలని తెలిపారు. రూ. 97.52 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధిసూర్యలంక బీచ్‌ను రూ. 97.52 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. బీచ్ అభివృద్ధికి గానూ టూరిజం కార్పొరేషన్‌కు 25 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, సర్వే ల్యాండ్స్ ఏడీ కనకరాజు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు గ్లోరియా, చంద్రశేఖర్ రామలక్ష్మి, కలెక్టరేట్ ఏవో సీతారత్నం, టూరిజం కార్పొరేషన్ డీఈ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. -
వైభవంగా ప్రసన్నాంజనేయ జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు బుధవారం ఉదయం 6 గంటల నుంచి రామనామ సంకీర్తనతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను ఆలయ పండితులు బొర్రా వెంకట అనంతచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రసన్నాంజనేయుని మాలధారులు వారి ఇళ్ల వద్ద నుంచి భజన కార్యక్రమాలతో గ్రామోత్సవాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని ఆలయం వద్దకు వచ్చి ఇరుముడులు కట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయ శాఖ ఈఓ అవుడూరి వెంకటేశ్వరరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. -
యోగా మన దేశ అపూర్వ సంపద
గుంటూరు వెస్ట్: వేల సంవత్సరాల క్రితం రుషుల కృషి ఫలితంగా యోగా అనే అపూర్వ సంపద మన దేశానికి దక్కిందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. యోగా మాసంలో భాగంగా బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాపై విస్తృత అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమాలు నెల రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. యోగాంధ్ర థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతను, ఉపయోగాలను వివరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా రంగోలి, ర్యాలీ, మారథాన్, పరుగు, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. యోగా సాధన నిర్వహించనున్న ప్రాంతాల్లో ట్రైనర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వైభవంగా ఆంజనేయ స్వామి శోభాయాత్ర
తెనాలి: హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక షరాఫ్‌బజార్‌లోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీహనుమజ్జయంతి మహోత్సవాలు ప్రారంభం కానున్నందున బుధవారం పట్టణంలో స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని కొలువుదీర్చి, పూజలు చేశారు. శ్రీపంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22 నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార్షిక శ్రీ హనుమజ్జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీహనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు విశేష పూజలు, హోమాలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కల్యాణం, 31న శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం ఉంటాయన్నారు. జూన్ ఒకటో తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనూరాధ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్రప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లెలో బుధవారం జరిగిన నియోజకవర్గస్థాయి మహానాడులో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ టి. కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఇబ్బంది లేకుండా రేషన్ పంపిణీ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి మనోహర్ తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరకుల పంపిణీ నిలిపివేతకు తీసుకున్న నిర్ణయం సున్నితమైనందున లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రేషను పంపిణీ నిర్వహించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బుధవారం సాయంత్రం తెనాలి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీ సంబంధిత చౌకధరల దుకాణాల వద్దే జరుగుతుందని చెప్పారు. అరవై అయిదేళ్లు పైబడిన కార్డుదారులు, అంగవైకల్యం కలిగిన లబ్ధిదారులకు మాత్రం ఇంటి వద్దే పంపిణీ చేస్తారని తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తుల దాఖలు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల కారణంగా కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ముగ్గురికి గాయాలు నాదెండ్ల: ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. గణపవరం పరిధిలో జాతీయ రహదారిపై భారత్‌గ్యాస్ గోడౌన్ వద్ద గణపవరం నుంచి ప్రయాణికులతో చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కారసాల సుబ్బారావు, నాగజ్యోతి, ఆటోడ్రైవర్ పల్లపు వెంకటేశ్వర్లు గాయాలపాలయ్యారు. నాగజ్యోతిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, మిగతా ఇద్దరిని చిలకలూరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
గుంటూరు వెస్ట్: తుది ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా తయారు చేసుకోవడానికి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.ఎన్.శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితాపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహించే ఈ సమావేశంలో స్వీకరించే సూచనలు, సలహాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాలసీలకు సంబంధించిన అంశాలపై వారికే ఫిర్యాదులు పంపిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన వారిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారన్నారు. వాటిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోపు ఓటరు, ఆధార్ కార్డుల అనుసంధానం చేయించాలని తెలిపారు. పోలింగ్ బూత్‌లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్వోలు క్లయిమ్స్ వెరిఫికేషన్‌కు వెళ్లేటప్పుడు వారితోపాటు బీఎల్ఏలను కూడా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పై సమస్యలపై స్పందించిన ఇన్చార్జి కలెక్టర్.. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం గురించి ఏ నిర్ణయమైనా ఎన్నికల సంఘం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తుది ఓటర్ల జాబితా 2026 జనవరి 5న రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుంటూరు ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
బాపట్ల టౌన్: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 69వ సమావేశంలో 2014 సెప్టెంబర్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా ప్రతిపాదించారని గుర్తు చేశారు. దీన్ని 177 దేశాలు ఆమోదించాయని తెలిపారు. 2015 నుంచి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. జూన్ 21వ తేదీన వైజాగ్‌లో ఐదు లక్షల మందితో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. యోగాంధ్ర క్యాంపెయిన్‌లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ధైర్యం వస్తుందని చెప్పారు. జిల్లాలోని 17 లక్షల మందికి యోగాంధ్ర చేరే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్‌లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో యోగా ఒకటిగా చేర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, చీరాల శాసనసభ్యులు ఎం. ఎం. కొండయ్య పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి -
అమ్మవారి హుండీ కానుకల లెక్కింపు
దుర్గి: శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం హుండీ కానుకల లెక్కింపు బుధవారం నిర్వహించారు. అమ్మవారికి రూ. 31,30,423 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సైదమ్మ తెలిపారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన లెక్కింపులో పేట సన్నెగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణ అధికారి శివనాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామి కల్యాణం మాచర్ల: పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణం జరిపారు. అమ్మవారి జన్మదినమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, బి.రఘురామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు రాధ, రమణారెడ్డి, కమిటీ నిర్వాహకులు కె.బ్రహ్మారావు, కె.గురవయ్య, పిచ్చయ్యల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. భక్తులకు తీర్థపసాదం అందించారు. డీఆర్ఎం కార్యాలయంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం లక్ష్మీపురం: గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని డీఆర్ఎం సుధేష్ట సేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా డీఆర్ఎం కార్యాలయ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్ఎం సుధేష్ట సేన్ మాట్లాడుతూ ప్రతి ఏటా మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తారన్నారు. అహింస, శాంతిపైమన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ప్రతిజ్ఞ చేశామని తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం పెదకాకాని: గ్రామానికి చెందిన గరికపాటి వరుణ్‌దేవ్ పెదకాకాని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ను అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ బుధవారం తెలిపారు. గరికపాటి లక్ష్మీకాంతం, ఉయ్యూరు మాసమ్మ జ్ఞాపకార్థం గరికపాటి వరుణ్ దేవ్ పై నగదుతో పాటు వెండి బిందె, వెండి గిన్నెలు విరాళంగా అందించినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు. ఎండీయూ వాహనదారులను కాపాడండి గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా విధానాన్ని రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సిబ్బంది రోడ్డున పడ్డారని ఎండీయూ వాహనాల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొని ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు ఎండీయూ వాహనాలు రేషన్ పంపిణీకి తప్ప దేనికీ పనికిరావని తెలిపారు. తమకు ఉపాధి చూపించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి బి.తిరుపతి రామారావు, కోశాధికారి కె.డానీ, నాయకులు పాల్గొన్నారు. -
ఐసెట్‌లో సత్తా చాటిన మనోళ్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన రావూరి మాధుర్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా నుంచి ఐసెట్‌కు హాజరైన 1,528 మంది విద్యార్థుల్లో 1,485 మంది ఉత్తీర్ణులయ్యారు. బాపట్ల, చీరాల నుంచి పరీక్షలు రాసిన 354 మంది విద్యార్థుల్లో 338 మంది ఉత్తీర్ణత సాధించారు. పల్నాడు జిల్లాలో పరీక్షకు హాజరైన 725 మంది విద్యార్థుల్లో 678 మంది ఉత్తీర్ణులయ్యారు. కోచింగ్ లేకుండానే 5వ ర్యాంకు ఐసెట్‌లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించిన విద్యార్థిని రావూరి మాధుర్య ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. మాధుర్య 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ప్రామాణిక పుస్తకాలను చదువుతూ సొంతంగా ప్రిపేర్ అవుతోంది. పరీక్షలకు వ్యవధి ఉండటంతో ఏపీ ఐసెట్‌కు దరఖాస్తు చేసి, కోచింగ్ లేకుండా నేరుగా పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత లాం విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు -
డ్రెయిన్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలి
బాపట్ల: నీటిపారుదల, డ్రెయినేజీ శాఖల పరిధిలో నిర్వహించే ఆపరేషన్, నిర్వహణ పనులను తనిఖీ చేసే అధికారులకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లాలో నీటిపారుదల, డ్రెయినేజీ శాఖలు నిర్వహించే మరమ్మతుల పనులను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మలు మంగళవారం తనిఖీ చేశారు. తొలుత జిల్లెలమూడి గ్రామంలోని నల్లమడ వాగులో కోతకు గురైన కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. నల్లమడ వాగులో పేరుకుపోయిన మట్టిని తొలగించాలని, వాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నల్లమడ వాగు విస్తరణకు కావలసిన భూమి కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారిని ఆదేశించారు. బాపట్ల జిల్లాకు నీటి సరఫరా చేసే పీటీ ఛానల్‌ను తనిఖీ చేశారు. ఛానల్లోని ఇసుక మేటలను తొలగించాలని తెలిపారు. బాపట్లకు చెందిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లోని పూడికలను తొలగించి, ట్యాంక్ విస్తీర్ణాన్ని పెంచి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. అందుకుగాను తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని నీటిపారుదల శాఖ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. నరసాయపాలెంలోని చెరుకూరు ట్యాంక్ చానల్‌లోని గుర్రపు డెక్క, తూటుకాడ తొలగింపు పనులను కలెక్టర్, బాపట్ల ఎమ్మెల్యే ప్రారంభించారు. నర్సాయపాలెం పంచాయతీలో చెత్త సేకరణ విషయమై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పంచాయతీ సెక్రెటరీ రాజును కలెక్టర్ ప్రశ్నించారు. సేకరించిన చెత్తను సమాధుల్లో పడవేయటానికి గల కారణా లపై పంచాయతీ సెక్రటరీని విచారించారు. పంచాయతీకి ఎస్డబ్ల్యూ పీసీ ల్యాండ్ కోసం జిల్లా రెవెన్యూ అధికారికి ప్రతిపాదన పంపాలని కలెక్టర్ పంచాయతీ సెక్రటరీకి సూచించారు. అనంతరం నల్లమడ వాగు లాకులను పరిశీలించారు. నల్లమడ వాగు లాకుల వివరాలను నీటిపారుల శాఖ ఎస్ఈని అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ వెంకటరత్నం, డ్రెయినేజీ శాఖ ఈఈ మురళీకృష్ణ, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బాపట్ల తహసీల్దార్ సలీమా, నీటిపారుదల, డ్రెయినేజీ శాఖలకు చెందిన డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నివారించాలి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ నెల నుంచి ఇసుక తవ్వకాల నిషేధం అమలులోకి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రేవు నుంచి వాహనాలు వెళ్లే రహదారులను తొలగించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
సాక్షి టీవీ జిల్లా ప్రతినిధిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల : సాక్షి టీవీ గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కలెక్టర్ వద్ద మంగళవారం కొద్ది సేపు నిరసన వ్యక్తం చేసి జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, ఎస్బీ సీఐ నారాయణకు వినతిపత్రం అందించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రతికా విలేకరులపై దాడులు హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టుగా భావించాలని సూచించారు. సమాచారాన్ని సేకరించేందుకు వెళ్లిన అశోక్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సాక్షి బాపట్ల ప్రతినిధి, బి.రమణారెడ్డి అసోసియేషన్ నాయకులు గోపిశెట్టి రాఘవ, వేజండ్ల శ్రీనివాసరావు, సృజన్‌పాల్, వెంకట్, అంజయ్య, దాసు, మరియదాసు, బత్తుల సురేష్, చీమలదిన్నె నారాయణ, షాజహాన్, చంటి, చెన్నకేశవరెడ్డి, వీరేష్, యాసిన్, పొటికలపూడి జయరామ్, వాసు, బొగ్గవరపు శివ, శీలం సాగర్ తదితరులు ఉన్నారు. -
దైవ సన్నిధి నుంచి తిరిగి వస్తూ..
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు మేదరమెట్ల: కారులో తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణమైన అనంతరం కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇరువురికి గాయాలయ్యాయి. కొరిశపాడు మండలం మేదరమెట్ల ఉత్తర బైపాస్ ప్రాంతంలో మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఏడుగురు కారులో తిరుపతి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మేదరమెట్ల ఉత్తర బైపాస్ సమీపానికి రాగానే అతివేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుంకర నాగరాజు (21) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని వైద్యశాలకు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు మేదరమెట్ల ఎస్ఐ మహ్మద్ రఫీ తెలిపారు. వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. జూన్ 2వ తేదీ లోపు వ్యవసాయ శాఖలోని అన్ని విభాగాల్లో బదిలీలు పూర్తి చేయాలని తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల మేరకు ఒక ప్రాంతంలో ఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. మిగిలిన వారు కూడా రిక్వస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.మండల వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ), మండల వ్యవసాయ అధికారులు(ఏఓ), ఏడీఏ, డీడీఏ, మినిస్టీరియల్ స్టాఫ్, వాచ్మెన్, అటెండర్స్ తదితర అన్ని విభాగాల్లోనూ బదిలీల ప్రక్రియ ఉండటంతో ఎవరికి వారు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు ప్రజాప్రతినిధుల సిఫారసుల కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. కొన్ని స్థానాలకు ఉద్యోగుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో డబ్బు ఖర్చు చేయడానికి సైతం వెనకాడటం లేదని చెబుతున్నారు. ఇదే అదునుగా ఆ శాఖ ఉన్నతాధికారులు, అసోసియేషన్ నాయకులు, అధికార పార్టీకి చెందిన చోటామోటా నేతలు అంతో ఇంతో వెనుకేసుకునేందుకు ఉద్యోగులకు వల విసురుతున్నట్లు సమాచారం. శ్రీవారికి వైభవంగా శ్రీచక్రస్నానం తెనాలి: పట్టణంలో చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ అనంతరం స్వామివారికి వసంతోత్సవం, శ్రీచక్రస్నానం సంప్రదాయబద్ధంగా జరిపించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణం, పూర్ణాహుతి జరిపించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు. మహంకాళీ దేవస్థానంలో చండీ హోమం దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో 48వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా నాల్గవ రోజు మంగళవారం చండీ హోమం నిర్వహించారు. పోసాని నాగేశ్వరరావు దంపతులు హోమంలో పాల్గొన్నారు. భక్తులకు అమ్మవారు ధనలక్ష్మీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. -
బాపట్ల
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025శిథిలావస్థలో సాగునీటి కాలువలుకర్లపాలెం: వ్యవసాయ భూములకు సాగునీరు అందించే ప్రధాన కాలువలు శిథిలావస్థకు చేరాయి. మండల ప్రజలు ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారు. వర్షాలు కురవక, సాగునీరు సక్రమంగా అందక సాగు అనుకూలంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కాలువలు శిథిలావస్థకు చేరటంతో ఖరీఫ్ సాగుకు నీరు అందుతాయా అని రైతులు సందిగ్ధంలో ఉన్నారు. సాగునీటి పంట కాలువలను మరమ్మతులు చేసి సాగునీరు సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు. మండలంలో 17వేల ఎకరాల సాగుభూమి. కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 17వేల ఎకరాలు సాగుభూమి ఉంది. ఈ భూమిని ఆధారంగా చేసుకుని రైతులు, రైతు కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ భూములకు కాలువల ద్వారానే కృష్ణానది నుంచి నీరు వస్తుంది. సాగునీరు అందించేందుకు ప్రధానంగా పేరలి తిమ్మరాజు చానల్, ఆర్మండ చానల్లు ఉన్నాయి. పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలో 13,500 ఎకరాలు, ఆర్మండ చానల్ పరిధిలో 3,500 ఎకరాలకు సాగునీరు వస్తుంది. పంట కాలువల్లో నీరు పారేనా? పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలోని తిమ్మరాజు చానల్, కర్లపాలెం చానల్, లంక చానల్, ఇసుక చానల్, పేరలి చానల్, తుమ్మలపల్లి చానల్, తుమ్మలశాఖ చానల్ పంట కాలువల సిమెంట్ లైనింగ్ శిథిలమై కాలువ కట్టలకు గండ్లు పడ్డాయి. దీంతో సాగునీరు భూములకు సరిగా అందటం లేదు. ఆర్మండ్ చానల్ పరిధిలోని ఇసుక చానల్, పరకాలువ, యాజలి చానల్, బుద్ధాం చానల్ కాలువల కట్టలు శిథిలమవటంతోపాటు పూడిక పెరిగి సాగునీరు పారేందుకు అసౌకర్యంగా మారాయి. ఈ కాలువలను పూడిక తీయించటంతోపాటు, కట్టలను పటిష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. శిథిలావస్థలో పేరలి తిమ్మరాజు చానల్ పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలో మొత్తం 13,500 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ భూమికి పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలో ఉన్న మరో ఏడు పంట కాలువలు ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరటంతో సాగునీరు సక్రమంగా అందే అవకాశం లేదు. తిమ్మరాజు చానల్ పరిధిలో 2700 ఎకరాలు, కర్లపాలెం చానల్ పరిధిలో 1100 ఎకరాలు, లంక చానల్ పరిధిలో 2వేల ఎకరాలు, ఇసుక చానల్ పరిధిలో 400 ఎకరాలు, పేరలి చానల్ పరిధిలో 1285 ఎకరాలు, తుమ్మలపల్లి చానల్ పరిధిలో 4800 ఎకరాలు, తుమ్మల శాఖ చానల్ పరిధిలో 1215 ఎకరాల భూమి సాగవుతుంది. మరమ్మతులకు నోచని ఆర్మండ చానల్ ఆర్మండ చానల్ పరిధిలోని ఇసుక చానల్, పరకాలువ, యాజలి చానల్, బుద్ధాం చానల్ కాలువల పరిధిలో 3,500 ఎకరాల భూమి ఉంది. కాలువలకు ఈ వేసవి కాలంలో మరమ్మతులు చేయించాలని రైతాంగం కోరుతున్నారు.న్యూస్‌రీల్ మరమ్మతులకు నోచుకోని పీటీ చానల్ 13,500 వేల ఎకరాల సాగు ఈ ఏడాది నీరు సక్రమంగా అందేనా! మరమ్మతులు చేయాలిపీటీ చానల్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలి. ఉపాధి హామీ పథకంలో కాలువలోని మట్టిని మాత్రమే తీస్తున్నారు. కాలువ గోడలన్నీ పగిలిపోయి గండ్లు పడుతున్నాయి. పంట చేలకు నీరు అందడం కష్టమే అవుతుంది. –యల్లావుల ఏడుకొండలు, నర్రావారిపాలెం. కాలువ చివరి భూములకు నీరందించాలిపెదగొల్లపాలెం, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం, తుమ్మలపల్లి పంచాయతీల పరిధిలోని కాలువ చివరి భూములకు సాగునీరందించాలి. గత సంవత్సరం సాగునీరు రాక కొందరు రైతులు నాట్లు వేయలేదు. తిండి గింజలు పండించుకునేందుకు సాగునీరందించాలి. – పందరబోయిన సుబ్బారావు, రైతు నక్కలవానిపాలెం. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం కాలువలో తూటికాడ తొలగించి కాలువ కట్టలు పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంట కాలువల మరమ్మతులకు, గండ్లు పూడ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. –వెంకటరమణ, ఏఈ, ఇరిగేషన్ -
క్రీస్తు చూపిన మార్గంలో నడుద్దాం
● వజ్రోత్సవ జూబిలీ ముగింపు వేడుకలలో విశ్రాంత బిషప్ గాలిబాలి ● 8 జిల్లాలనుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు ● తరలి వచ్చిన భక్తులు ● ప్రత్యేక ఆకర్షణగా తేరు ఊరేగింపుఅచ్చంపేట: ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి గౌరవ ప్రదమైన జీవితాన్ని పొందాలని, ఏసు క్రీస్తుపై నమ్మకం ఉంచాలని గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత బిషప్ గాలిబాలి అన్నారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు దేవాలయం నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గత మూడు రోజులుగా జరుగుతున్న జూబిలి వేడుకలు సోమవారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో 8 జిల్లాల నుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు, 100 మంది కన్యాసీ్త్రలు, 50 మంది విచారణ గురువులు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత పీఠాధిపతి గాలిబాలి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. వైభవంగా తేరు ప్రదక్షిణ విశాఖపట్నం అగ్రిపీఠాధిపతులు ఉడముల బాల, నల్గొండ జిల్లా విశ్రాంత పీఠాధిపతి గోవిందుజోజి, ఏలురు పీఠాధిపతి పొలిమేర జయరావు, శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్, నెల్లూరు మేత్రాసన కోఆజ్యుటర్ పీఠాధిపతులు పిల్లి అంథోనిదాస్, వరంగల్ మేత్రాసన పరిపాలాధికారి విజయపాలేరెడ్డిలతో పాటు అనేమంది విచారణ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక విచారణ గురువులు పుట్టి అంతోనిరాజు, సహాయ విచారణ గురువులు శ్యామ్‌కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నృత్యరీతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాలనుంచి క్రైస్తవులు తండోప తండాలుగా తరలి వచ్చారు. రాత్రి 10 గంటలకు నిర్వహించిన తేరు ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. రంగురంగుల కాంతులతో బాణసంచా కాలుస్తూ గ్రామ వీధులలో తేరు (రథం)పై బాలఏసును అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి, గ్రామాలనుంచి తరలి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్స్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
జీవనోపాధి మెరుగుపరుచుకోవాలి
డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు కర్లపాలెం: స్వయం సహాయక సంఘాలలోని మహిళలు తమ జీవనోపాధులు మెరుగుపరుచుకోవాలని డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు చెప్పారు. కర్లపాలెంలోని భవిత గ్రామ సమైఖ్య సంఘం సభ్యులతో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు మంగళవారం రాత్రి సమావేశమై సూక్ష్మ రుణ ప్రణాళికపై చర్చించారు. పీడీ మాట్లాడుతూ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలను వినియోగించుకుని చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కుటీర పరిశ్రమల లాంటివి స్థాపించుకుని వాటిని అభివృద్ధి చేయటం ద్వారా ఆర్థికంగా లబ్ధిపొందాలని చెప్పారు. 2025–26 సంవత్సరానికి సంబంధించిన సూక్ష్మ ప్రణాళికలను సంసిద్ధం చేసుకోవాలని చెప్పారు. గ్రామ సమైఖ్య సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలని చెప్పారు. కార్యక్రమంలో సీసీ రాఘవ, వీవోఏలు రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, నూరా, డ్వాక్రా మహిళలు తదితరులు ఉన్నారు. -
గుర్తుతెలియని మృతదేహానికి పోస్టుమార్టం
మార్టూరు: గుర్తుతెలియని మృతదేహానికి మార్టూరు పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం చేయించిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. మార్టూరు ఏఎస్ఐ మహబూబ్ బాషా మరో కానిస్టేబుల్‌తో కలిసి ఓ మృతదేహాన్ని ఆటోలో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతదేహం ఉన్న విషయం తెలుసుకున్న కొంతమంది విలేకరులు అక్కడికి చేరుకునేసరికి .. దహన సంస్కారాలు చేసేందుకు పంచాయతీ సిబ్బంది మృతదేహాన్ని ఆటోలో ఎక్కిస్తూ కనిపించారు. వివరాల కోసం ప్రయత్నించిన విలేకరులకు పోలీసులు సమాచా రం ఇవ్వకుండా తీసుకొని వెళ్లారు. శవ పంచనామాలో పాల్గొన్న ఆసుపత్రి సిబ్బందికి పోలీసులు ఫోన్‌చేసి మీడియాకు సమాచారం చెప్పవద్దని ఆదేశించినట్లు తెలిసింది. కొంతసేపటికి ఎస్ఐ సైదా విలేకరులకు ఫోన్‌చేసి ఆ మృతదేహం ఓ బిచ్చగాడి దని మీరు రాయటానికిఏమీ లేదన్నారు. -
తుఫాన్ షెల్టర్లను సిద్ధంగా ఉంచాలి
ఎంపీడీవో శ్రీనివాసరావు కర్లపాలెం: తుఫాన్ ప్రమాదం పొంచి ఉన్నందున తీరప్రాంత గ్రామాలలో ఉన్న షెల్టర్లను ప్రజలు ఉండేందుకు అనుకూలంగా సిద్ధం చేయాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. కర్లపాలెం మండల పరిధిలోని సముద్రతీర గ్రామాలైన పేరలి, కట్టావాద, తుమ్మలపల్లి, పెదగొల్లపాలెం గ్రామాలలో ఉన్న తుఫాన్ షెల్టర్లను మంగళవారం ఎంపీడీవో శ్రీనివాసరావు స్థానిక గ్రామ సచివాలయ సిబ్బందితో కలసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో గిరిజనులు, పూరి గృహాలలో ఉండే వారు తలదాచుకునేందుకు తుఫాన్ షెల్టర్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. అనంతరం తుమ్మలపల్లి, పెదగొల్లపాలెం గ్రామ సచివాలయాలను ఎంపీడీవో సందర్శించి రికార్డులు పరిశీలించారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
గుంటూరు వెస్ట్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిందేనని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ మాట్లాడుతూ 2004 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన వారి సంఖ్య 3.5 లక్షలు ఉందన్నారు. ఈ ఉద్యోగుల భవిష్యత్తును నూతన పెన్షన్ స్కీం ద్వారా ప్రభుత్వాలు కొలిమిలోకి నెట్టేసినట్లు అయ్యిందన్నారు. తమ పోరాటాల ఫలితంగా 2017లో గ్యాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్లు సాధించామని చెప్పారు. ఏపీఈఏఈ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల కనీస సమస్యలు కూడా పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరుకాదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. అనంతంర జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో కార్యదర్శి లక్ష్మీనారాయణ, సుబ్బారావు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో వివాదం.. యువకుడికి కత్తిపోట్లు
లక్ష్మీపురం: మద్యం మత్తులో స్నేహితుల మధ్య వాగ్వివాదం కత్తిపోట్లకు దారితీసిన ఘటన మంగళవారం అరండల్‌పేట 8వ లైన్లో చోటు చేసుకుంది. అరండల్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోబాల్డ్‌పేట 4వ లైన్ ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ రహ్మన్ అలియాస్ అబ్బులు అనే యువకుడు స్థానికంగా చికెన్ షాపులో పని చేస్తుంటాడు. మంగళవారం అబ్బులు తన స్నేహితుడైన కృష్ణతో కలిసి అరండల్‌పేట 8వలైన్లోని మయూరి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగేందుకు వెళ్లారు. ఈక్రమంలో శ్రీనగర్‌కు చెందిన మాలిక్ అనే వ్యక్తికి అబ్బులు ఫోన్ చేయగా, ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కొద్ది సేపటికి మాలిక్ తనతో పాటు కోబాల్డ్‌పేటకు చెందిన నన్నె, రఫీలను వెంటబెట్టుకుని మయూరి బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చి అబ్బులుతో ఘర్షణ పడ్డాడు. మాలిక్ జేబులో ఉన్న చిన్నపాటి కత్తితో అబ్బులు వీపుపై విచక్షణారహితంగా దాడి చేశాడు దీన్ని గమనించిన ఇరువురి స్నేహితులు ఇద్దరిని వేరు చేసి బయటకు తీసుకు వచ్చారు. మాలిక్ బయటకు వెళుతుండగా అబ్బులు అతనిపై దాడికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు సిబ్బందితో ఘటనా స్థలంకు చేరుకుని కత్తిపోట్లకు గురైన అబ్బులును జీజీహెచ్‌కు తరలించి మాలిక్, నన్నెలను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
ప్రాణం తీసిన ఇనుప గేటు
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి యద్దనపూడి: నిండు ప్రాణాన్ని ఇనుప గేటు బలితీసుకుంది. విద్యుత్‌షాక్ కొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన యద్దనపూడి మండలంలోని యనమదల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రత్నకుమారి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యద్దనపూడి పంచాయతీలోని కటారివారిపాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి సుబ్బాయమ్మ (60) గత 8 సంవత్సరాలుగా యనమదల గ్రామంలో రైస్‌మిల్లును లీజుకు తీసుకొని అక్కడే ఉంటోంది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సుబ్బాయమ్మ మిల్లు నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఇనప గేటును పట్టుకుంది. ఆ గేటు పైన ఎలుకలు విద్యుత్వైర్లను కొరకటంతో ఆ గేటుకు విద్యుత్ సరఫరా జరిగి సుబ్బాయమ్మ పడిపోయింది. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపి 108కు సమాచారం అందించారు. సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై రత్నకుమారి సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేయాలి
ధర్నాలో రైతుల డిమాండ్ జె.పంగులూరు: నల్లబర్లీ పొగాకును మార్కెఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు, గిట్టుబాటు ధరకు రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం కొనాలని కౌలు రైతు సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పంగులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. పొగాకు కొనుగోలు చేయకపోతే తాము వ్యవసాయం చేయలేమని స్పష్టం చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు మాట్లాడుతూ నల్ల బర్లీ సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తక్షణమే రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా గానీ, కంపెనీల ద్వారా గానీ కొనుగోలు చేయాలన్నారు. కంపెనీల మోసం మాటలు నమ్మి రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారని, ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న పొగాకుకు డిమాండ్ ఉన్నప్పటికీ, కొనకుండా కాలయాపన చేస్తే రైతులు తక్కువ ధరకు ఇస్తారని కంపెనీలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ విషయం ప్రభుత్వం తీవ్రంగా తీసుకొని కంపెనీల ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. బర్లీ పొగాకు ద్వారా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రూ.70 వేల కోట్ల ఆదాయం వస్తుందని, అదే మాదిరిగా కంపెనీలకు కూడా వేల కోట్ల ఆదాయం వస్తోందని అన్నారు. అలాంటి పొగాకు పండించే రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పొగాకు పంట కొనుగోలు చేసే వరకు రైతులు ఐక్యంగా పోరాడాలని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు మాట్లాడుతూ పొగాకు కంపెనీలు మాటలు నమ్మి రైతులు పూర్తిగా మోసపోయారని, మోసపు మాటలు చెప్పిన కంపెనీలు ఇప్పుడు ముఖ్యం చాటేశాయని, పొగాకు మొత్తం కొనుగోలు చేసేవరకు రైతులంతా నిలబడి పోరాడాలన్నారు. కార్యక్రమానికి ముందు జీపీఐ కంపెనీ ఏజెంటు దొంగచాటుగా వచ్చి రహస్యంగా రైతులు ఫొటోలు తీసి వారికి గేట్ పాస్‌లు ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించగా, రైతులు గమనించి ఏజెంట్ హర్షను పట్టుకొని నాయకుల ముందు ఉంచారు. అతని ద్వారా చిలకలూరిపేట కంపెనీ మేనేజర్ ప్రసాద్‌తో తహసీల్దార్ సింగారావు, నాగబోయిన రంగారావు, రామారావు ఫోన్లో మాట్లాడారు. రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు తక్షణమే కొనుగోలు చేయాలని, ఇంకొల్లు, పంగులూరు పరిసర ప్రాంతాల్లో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమానికి ముందు తహసీల్దార్ సింగారావు తడిచిన నల్లబర్లీ పొగాకు చూపించారు. అనంతరం తహసీల్దార్ సింగారావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు రాయిణి వినోద్‌బాబు, నాయకులు గుడిపూడి మల్లారెడ్డి, తలపనేని సుబ్బారావు, పోతుగంటి ఆదుసాహెబ్, నాయపాము ప్రభాకర్, అద్దంకి సుబ్బారావు, మద్దినేని సుబ్బరామయ్య, నాయపాము జాన్, ఉన్నం అంజయ్య, మాగులూరి చంద్రశేఖర్, వీరాంజనేయులు, గొర్రె వేణుబాబు, గోగుమళ్ల సింగయ్య, బాచిన శేషగిరి పాల్గొన్నారు. -
యోగాంధ్రలో ప్రజలంతా పాల్గొనేలా చూడాలి
అధికారులను ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు నరసరావుపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే యోగాపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖపట్నంలో పాల్గొనే కార్యక్రమం లైవ్ ద్వారా ప్రసారం జరుగుతుందని, ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. యోగాపై ప్రజలల్లో చైతన్యం కలిగించి, ప్రతి ఒక్కరూ యోగాభ్యసనంలో పాల్గొనేలా చేయాలన్నారు. ముందుగా మండలానికి ఇద్దరేసి యోగా శిక్షకులను గుర్తించి వారి ద్వారా టీఓటీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారి ద్వారా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. టీఓటీ కోసం ప్రతి గ్రామం, వార్డ్ నుంచి ఒకరి చొప్పున ఎంపిక చేసి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు వారి వివరాలను పంపాలని తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు వరకు టీఓటీ శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 16 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు.. మాస్టర్ ట్రైనర్లకు ఐదు రోజులు, యోగా నేర్చుకునే వారికీ మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. వీరందరికీ యోగా పూర్తిచేసినట్లు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జూన్ 16 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరూ తప్పక యోగాభ్యాసన చేయాలనీ తెలిపారు. జూన్ 16న ఫ్యామిలీ యోగా పేరుతో నాలుగు తరాల కుటుంబ సభ్యులంతా పాల్గొనేలా చూడాలని, 17న సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ యోగా కార్యక్రమాలు ఉంటాయని, 18, 19 తేదీలలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఈ కార్యక్రమాలను ఆయా స్థాయిలలో నిర్వహిస్తారని తెలిపారు. మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని అన్నారు. ఈ నెల 21న నాలుగు గంటలకు కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో కర్టెన్ రైజర్ కార్యక్రమం జరుగుతుందని, జిల్లా ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. అంతర్జాతీయ ఎగుమతిదారుల సమావేశం కొరిటెపాడు(గుంటూరు): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచి ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఓ హోటల్లో మంగళవారం ఎగుమతిదారుల సమావేశం జరిగింది. సమావేశానికి ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి.ప్రభు అధ్యక్షత వహించారు. ఎగుమతిదారులకు బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల రుణాలు, విదేశీ మారక ద్రవ్య లావాదేవీల పద్ధతులు, అంతర్జాతీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఎస్బీఐ ఏజీఎంలు రామ్‌ప్రసాద్, రమేష్‌బాబు, విజయ రాఘవయ్య, సూర్యశేఖర్, మేనేజర్ శ్రీను నాయక్, ఈసీజీసీ అధికారులు, పలువురు ఎగుమతిదారులు పాల్గొన్నారు. -
జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన శింగరకొండ
అద్దంకి/అద్దంకిరూరల్: జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ప్రాంగణం ‘జై శ్రీరామ్.. జై ఆంజనేయం, ప్రసన్నాంజనేయం’ నామస్మరణతో మార్మోగిపోయింది. సోమవారం మహా కుంభాభిషేక నూతన ఆలయ ప్రారంభం, విమాన శిఖర కలశ ప్రతిష్ట, జీవ ధ్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు దేవదాయశాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ నెల 14న ప్రారంభమైన కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. కుంభాభిషేకంలో భాగంగా విమాన శిఖర కలశ ప్రతిష్ట, నూతన ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ట నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 3 వేల మంది మహిళా భక్తులతో ఉదయాన్నే అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది నుంచి మూడు వేల కళశాలతో జలాన్ని తీసుకుని ‘జై శ్రీరామ్.. జైశ్రీరామ్’ నామస్మరణ చేసుకుంటూ శింగరకొండ వరకు శోభాయాత్ర నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, ప్రత్యేక నృత్యాలతో, దేవతా వేషధా రణల విన్యాసాలతో కన్నుల పండువగా సాగింది. కిక్కిరిసిన క్యూలైన్ల్లు.. కుంభాభిషేక కార్యక్రమాన్ని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి నిర్వహించారు. కుంభాభిషేకానికి హాజరైన భక్తులతో క్షేత్రంలోని ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ సామాజిక వర్గాల్లోని సత్రాల్లో అన్నదానంతోపాటు, దేవాలయ అధికారుల ఆధ్వర్యంలో 30 వేల మందికి అన్న సంతర్పణ చేశారు. అద్దంకి బస్టాండ్ నుంచి భవిష్య పాఠశాలకు చెందిన రెండు బస్సులు భక్తులను ఉచితంగా చేరవేశాయి. కోటా శ్రీనివాసకుమార్ భక్తులకు తాగునీరు సరఫరా చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి ప్రసన్నాంజనేయ స్వామికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టువస్త్రాలు సమర్పించా రు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్‌శాఖ మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం తిమ్మనాయుడు, సిబ్బంది పర్యవేక్షించారు. బందోబస్తును చీరాల డీఎస్పీ మొయిన్, అద్దంకి సీఐ సుబ్బరాజు పర్యవేక్షించారు.మహిమాన్వితుడు ఆంజనేయస్వామి వైభవంగా మహా కుంభాభిషేకం 3 వేల మంది మహిళలతో శోభాయాత్ర గుండ్లకమ్మ నది నుంచి శింగరకొండ వరకు శోభాయాత్ర శోభాయాత్రలో నడిచిన మేనక (ఏనుగు) రపత్యేక అతిథిగా హాజరైన శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి లక్షల డబ్బు ఖర్చు పెట్టే పని లేకుండా 108 సార్లు రామనామ జపం చేస్తే చాలా ఎక్కువ ఫలితం పొందవచ్చని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి అన్నారు. మహా కుంభాభిషేకం అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. రామాయణంలోని సుందరకాండలో, కిష్కింధకాండలో ఆంజనేయస్వామి దివ్యమైన చరిత్ర మనకు తెలుస్తుందని చెప్పారు. అనాది కాలం నుంచి ఆంజనేయస్వామి ఆరాధనను చేయడం సంప్రదాయంగా వస్తుందని, ఆయన మహిమ అపారమైనదన్నారు. శింగరకొండలో ఒకే దేవతను రెండు రూపాల్లో కొండపైన లక్ష్మీ నరసింహాస్వామి గానూ, కొండ కింద ఆంజనేయస్వామిగానూ మనకు దర్శనం ఇస్తున్నారన్నారు. శింగరకొండ దివ్య క్షేత్రమని చెప్పారు. అటువంటి క్షేత్రంలో ఆ స్వామికి నూతనాలయం, నూతన విమాన గోపుర, కలశ ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా భగవత్ అనుగ్రహానికి పాత్రులు అయ్యారన్నారు. ఏదో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని చెప్పారు. -
పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలు పరిష్కరించాలి
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 170 అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ సావధానంగా విన్నారు. వాటికి అక్కడికక్కడే ఆయన పరిష్కార మార్గం చూపారు. తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. కొన్నింటిని క్షేత్రస్థాయి పరిశీలనకు, మరికొన్నింటిని విచారించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదయ్యే ప్రతి అర్జీని అధికారులు నిశితంగా పరిశీలించి, పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. పరిష్కరించిన అనంతరం అర్జీదారుని ఇంటి వద్దకు వెళ్లి ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి 170 అర్జీలు స్వీకరణ -
వైఎస్సార్ సీపీదే విజయం
● వైస్ ఎంపీపీగా దొంతిరెడ్డి సింధు ఏకగ్రీవం ● అభినందనలు తెలిపిన వైఎస్సార్ సీపీ నాయకులుపిట్టలవానిపాలెం(కర్లపాలెం): పిట్టలవానిపాలెం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి, భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. మండలంలో మొత్తం 11మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో 10మంది వైఎస్సార్ సీపీ సభ్యులు ఉన్నారు. ఒకరు టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు ఉన్నాడు. గతంలో వైస్ ఎంపీపీగా పనిచేసిన పిట్టువారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు దెందుకూరి సీతారామరాజు మార్చినెలలో జరిగిన ఎన్నికలో ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారి, డ్వామా పీడీ ఎ.విజయలక్ష్మి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. సోమవారం ఉదయం 10.45 గంటలకు వైఎస్సార్ సీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. చందోలు–1 ఎంపీటీసీ సభ్యుడు షేక్ బాజీ భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు పేరును వైస్ ఎంపీపీ పదవికి ప్రతిపాదించారు. అల్లూరు ఎంపీటీసీ సభ్యురాలు వాలి కుమారి బలపరిచారు. ఎన్నిక నిర్ణీత సమయానికి వైస్ ఎంపీపీ పదవికి దొంతిరెడ్డి సింధు ఒక్కరే పోటీలో ఉండటంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి విజయలక్ష్మి ప్రకటించారు. అనంతరం ఎన్నికల అధికారి విజయలక్ష్మి దొంతిరెడ్డి సింధుకు ధృవీకరణ పత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. వైస్ ఎంపీపీగా ఎన్నికై న సింధుకి ఎన్నికల అఽధికారి విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ యాదవ్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో తహసీల్దార్ డి.వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ ఎంపీడీవో ఎలీషాబాబు, సూపరిటెండెంట్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి మండలంలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తూ, వైఎస్సార్ సీపీ బలోపేతానికి పనిచేస్తానని వైస్ ఎంపీపీ సింధు చెప్పారు. వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో తనకు ఉపాధ్యక్ష పదవి లభించినట్లు తెలిపారు. తనను ఎన్నుకున్న ఎంపీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అభినందనలు వైస్ ఎంపీపీగా ఎన్నికై న డి.సింధును ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు, వైస్ ఎంపీపీ చేబ్రోలు కృపానందం, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు వాలి శివారెడ్డి, మండే విజయ్‌కుమార్, కుంటం ప్రసన్నరాజు, దోమా వెంకటేశ్వరరెడ్డి, దొంతిరెడ్డి కోటిరెడ్డి, తిరుమలరెడ్డి, బడుగు మాధవి, ఆరేపల్లి శివయ్య అభినందించారు. -
భగవద్గీత అవగాహన అంశంలో పుష్పలతకు గోల్డ్ మెడల్
చీరాల: రోటరీ క్లబ్ క్షీరపురి మాజీ అధ్యక్షురాలు నన్నపనేని రామకృష్ణ సతీమణి నన్నపనేని పుష్పలత మైసూరు గణపతి సచ్చిదానంద స్వామిజీ నిర్వహించిన భగవద్గీత అవగాహన అంశంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఆదివారం రాత్రి మైసూరులోని స్వామిజీ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు స్వామిజీ గోల్డ్ మెడల్ అందించారు. ఈనెల 2న ఆన్లైన్ వీడియో కాల్లో పీఠానికి చెందిన ఐదుగురు గురువులు భగవద్గీతపై 90 నిమిషాలపాటు పలు రకాల ప్రశ్నలు వేశారు. వీడియోకాల్ నిర్వహణలో కళ్లు మూసుకుని మాత్రమే సమాధానం చెప్పాలన్నారు. ఆన్లైన్లో వివిధ పీఠాలకు సంబంధించిన 20 మంది పరిశీలిస్తుంటారని ఆమె తెలిపారు. స్వామిజీ చేతుల మీదగా గోల్డ్ మెడల్‌తో పాటు ఆయన ఆశీర్వచనాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ స్థలాల లీజుపై 22న సమావేశం పట్నంబజారు: గుంటూరు జిల్లా పరిధిలోని పెదకాకాని, తెనాలి, పెదనందిపాడు బస్సు స్టేషన్ల పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు ఈనెల 22న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ తెలిపారు. ఆసక్తి గల వారు ఆ రోజు సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఆర్టీసీ.ఏపీ.జీవోవి.ఇన్‌లో లేదా 9959225412 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. గరుడ వాహనంపై గ్రామోత్సవం తెనాలి టౌన్: వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 7.30 గంటలకు నిత్య హోమం, బలిహరణ, ఉదయం 8గంటలకు గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దివ్య రథోత్సవం, ప్రత్యేక పుష్పాలంకరణ, మేళతాళాలు, విద్యుత్ దీప కాంతుల నడుమ స్వామి గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణ ప్రజలంతా తిలకించి తరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు నరసరావుపేట: మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కోరారు. సోమవారం కార్యాలయంలో నష ముక్త్ భారత్ అభియాన్ 2.0లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియచేసే పోస్టర్లను ఆవిష్కరించారు. డీఆర్ఓ ఏకా మురళి, డీఈఓ చంద్రకళ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై సోమవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జేసీ సూరజ్ గనోరే హాజరయ్యారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.3003 టీఎంసీలకు సమానం. -
రైతు ఊపిరితీస్తున్న బ్లాక్ బర్లీ
● పేరుకుపోయిన పొగాలు నిల్వలు ● కొనుగోలుకు ఆసక్తి చూపని టుబాకో కంపెనీలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య ● ప్రభుత్వం ఆదుకోకుంటే అందరిది అదే బాట అంటున్న రైతులు సాక్షి ప్రతినిధి,బాపట్ల: పండించిన పొగాకు పంట మొత్తాన్ని కొంటామని హామీ ఇచ్చిన టుబాకో కంపెనీలు ఈ ఏడాది ఒక్క క్వింటా కూడా కొనక అన్నదాతలను వంచించాయి. రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ముఖం చాటేసింది. ఇప్పటికే పర్చూరు మండలం వీరన్నపాలెంకు చెందిన రైతు ఉప్పుటూరి సాంబశివరావు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు అదేబాటలో ఉన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం క్వింటా పొగాకుకు రూ.15 నుంచి రూ.18 వేల ధర ఇచ్చి రైతులను ఆదుకోగా కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. బయట మార్కెట్లో క్వింటా రూ.5 వేలకు అమ్ముకోలేక రైతులు విలపిస్తున్నారు. అప్పులోళ్ల ఒత్తిళ్లు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఇంకొల్లు మండలం వంకాయలపాడు, సుబ్బారెడ్డిపాలెం, పర్చూరు మండలం ఉప్పు టూరు, వీరన్నపాలెం గ్రామాల్లో పర్యటించింది. కష్టమంతా వర్షార్పణం ఇంకొల్లు మండలం వంకాయలపాడు చేరుకోగా ముందు రోజు రాత్రి కురిసిన వర్షానికి పొగాకు తడిసిపోయింది. కొందరు రైతులు తడిసిన పొగాకును ఆరబెట్టుకుంటున్నారు. మరికొందరు ప్లాస్టిక్ పట్టలు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు రామలింగారెడ్డి రూ.12 లక్షలు పెట్టుబడులు పెట్టి 8 ఎకరాలలో సాగు చేసిన బ్లాక్ బర్లీ పొగాకు మొత్తం వర్షానికి తడిసిపోయింది. ఇంటి మనుషులతోపాటు కూలీలను పెట్టి రోడ్డుపైనే ఆరబెట్టుకుంటున్నాడు. పొగాకు కొంటామని చెప్పి జీపీఐతోపాటు మిగిలిన టుబాకో కంపెనీలు మోసం చేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో బ్లాక్‌బర్లీ సాగు ఇలా.... బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో బ్లాక్‌బర్లీ, వైట్ బర్లీ, ఎఫ్‌సీవీ పొగాకు కలిపి 63,471 ఎకరాల్లో సాగుకాగా ఒక్క బ్లాక్ బర్లీ 53,067 ఎకరాల్లో సాగైంది. పర్చూరు నియోజకవర్గంలోనే 52,989 ఎకరాల్లో సాగుచేశారు. ఇప్పటివరకూ 5.60 లక్షల క్వింటాళ్లకు పైగా పొగాకు రైతుల వద్దే ఉండిపోయింది. ఊరంతా పొగాకు గుట్టలే... ప్రభుత్వం ఆదుకోవాలి పర్చూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వేలాది మంది రైతులు బ్లాక్ బర్లీ సాగుచేశారు. పంట చేతికొచ్చి నెల అవుతున్నా కంపెనీలు క్వింటా కూడా కొనలేదు. కంపెనీలు ఇచ్చిన హామీతోనే రైతులు పొగాకు సాగుచేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రైతుల వద్ద ఉన్న పొగాకు వెంటనే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతాం. –గాదె మధుసూదనరెడ్డి, వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త ఇంత దుస్థితి ఎన్నడూ లేదు గత ప్రభుత్వంలో క్వింటా బ్లాక్ బర్లీ రూ.18 వేలకు తగ్గకుండా కొన్నారు. గుళ్లాకు సైతం రూ.9 వేలకు కొన్నారు. ఇప్పడు రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేను ఐదెకరాలు సాగుచేస్తే దాదాపు రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాను. కూలీలకు కూడా డబ్బులు కట్టలేకున్నాం. వంకాయలపాటి సాంబశివరావు, రైతు, వంకాయలపాడు, ఇంకొల్లు మండలంవంకాయలపాడు గ్రామంలో 100 మంది రైతులు 400 ఎకరాల్లో బ్లాక్ బర్లీ సాగుచేశారు. సుబ్బారెడ్డిపాలెం గ్రామంలో 120 మంది రైతులు 500 ఎకరాల్లో పొగాకు సాగుచేశారు. ప్రభు త్వం వెంటనే పొగాకు కొనిపించకపోతే చాలామంది రైతులు ప్రాణాలు బలిపెట్టుకుంటారని రైతు సంజీవరెడ్డితోపాటు మిగిలినవారు వాపోయారు. ఉప్పుటూరు చెరువు పక్కన రోడ్డుపైన ఉన్న ఖాళీ స్థలంలో వందలాది కౌలు రైతు ల పొగాకు గుట్టలుగా కనిపించాయి. 10 ఎకరాలు సాగుచేసిన సుధాకర్, 15 ఎకరాలు పండించిన అబ్దుల్ రజాక్, 20 ఎకరాలు వేసిన కోట య్య, 10 ఎకరాలు వేసిన బాల కోట య్య, 30 ఎకరాలు సాగు చేసిన షేక్ మొహిద్దీన్, 5 ఎకరాల షేక్ హషన్ బాషా, 14 ఎకరాల అప్పారావుతోపాటు అందరూ కష్టాలు ఏకరువు పెట్టారు. ఒక్క ఉప్పుటూరులోనే ప్రస్తుతం వెయ్యిలారీల పొగాకు సిద్ధంగా ఉందన్నారు.క్వింటా కూడా కొనలేదు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశా. కంపెనీలు ఒక్క క్వింటా కూడా కొనలేదు. గత ప్రభుత్వంలో మాదిరి ధర ఉండి ఉంటే రూ.21.60 లక్షలు వచ్చేదని, ప్రస్తుత ధరకు అమ్మితే రూ.6 లక్షలు కూడా రాదు. –వంకాయలపాటి రఘుబాబు -
ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు 328 మంది హాజరు
వేటపాలెం: సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు 328 మంది విద్యార్థులు హాజరైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, సెక్రటరీ ఎం లక్ష్మణరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి షిఫ్ట్‌లో 176 మంది హాజరు కావాల్సి ఉండగా 164 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. సాయంత్రం రెండో షిఫ్ట్‌లో 176 మందికిగాను 164 మంది హాజరైనట్లు తెలిపారు. 24 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ జగదీష్‌బాబు తెలిపారు.ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి నలుగురికి గాయాలు సంతమాగులూరు (అద్దంకి రూరల్): క్వారీలో పనికి వెళ్తూ ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈఘటన ఆదివారం రాత్రి సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన ఇలుమలై నాగరాజ్ (44) సజ్జాపురం గ్రామంలో ఉన్న తిరుమల సాయిచంద్ర గ్రానైట్ క్వారీలో పనిచేస్తుంటాడు. ఆదివారం రాత్రి ట్రాక్టర్ కొండ ఎక్కుతుండగా తిరగబడింది. ట్రాక్టర్ నడుపుతున్న నాగరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేపు డీఈవో కార్యాలయం ముట్టడి గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం సోమవారం సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈనెల 21న డీఈవో కార్యాలయ ముట్టడి యథాతథంగా నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకుడు కె.బసవ లింగారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపాదించిన డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం వరకు వ్యవధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
నిర్ణీత గడువులోపు అర్జీలు పరిష్కరించాలి
బాపట్ల: అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు వారి సమస్యలను స్వేచ్ఛగా ఎస్పీకి విన్నవించుకున్నారు. కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, ఇతర సమస్యలపై వచ్చిన 50 అర్జీలను ఎస్పీ పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి అర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కరానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని తెలిపారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని పోలీస్ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీనివాస్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ తుషార్ డూడీ -
ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు
నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్‌బాబు గుంటూరు లీగల్: ఈనెల 19 నుంచి జులై 5 వరకు జరగనున్న లోక్ అదాలత్‌లో మోటార్ వెహికల్ ప్రమాదాల కేసులు ఎక్కువ సంఖ్యలో పరిష్కరించడానికి కృషి చేయాలని నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్‌బాబు చెప్పారు. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ప్రతినిధులు, న్యాయవాదులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. మోటార్ వెహికల్ ప్రమాదాల కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. కంపెనీ మెంబర్స్, కౌన్సెల్స్ పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. సమస్యలుంటే పిటిషనర్‌ను, అతడి కౌన్సెల్‌ను కూడా పిలిపించి ప్రీ సిట్టింగ్ ద్వారా కేసును రాజీ చేయాలని ఆయన సూచించారు. రెండో అదనపు జిల్లా జడ్జి వై. నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై.సూర్యనారాయణ, ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్కు పలు సలహాలు, సూచనలు చేశారు. వాటిని పరిశీలించాలని కోరారు. సమావేశంలో బార్ కౌన్సెల్ సభ్యుడు వి.బ్రహ్మారెడ్డి, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్, నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్ పాల్గొన్నారు. -
ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు
చీరాల అర్బన్: తినుబండారాలు ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మితే చర్యలు తప్పవని చీరాల తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు హెచ్చరించారు. ప్రపంచ తూనికలు, కొలతలు దినోత్సవం ఈనెల 20న నిర్వహిస్తున్నామని చెప్పారు. అలానే తూనికలు, కొలతల విభాగం 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా సోమవారం చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లోని స్టాల్స్‌ను పరిశీలించారు. స్టాల్స్ నిర్వహించేవారు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు అమ్మే ప్రతి వస్తువును నిర్దేశించిన ధరలకు మాత్రమే అమ్మాలన్నారు. అలానే వస్తువు కొనుగోలు చేసే ముందు తూకం, ధరలు సరిచూసుకొని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు
● జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ● 25వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వ ఆమోదం బాపట్ల: రైతులకు మద్దతు ధర కల్పించడంలో భాగంగా 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఆమోదించిందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. జిల్లా అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమావేశం అయ్యారు. వర్చువల్ విధానం ద్వారా డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 29 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. బయట మార్కెట్లో ధాన్యం ధరలు తగ్గడం, అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ లక్ష్యం పెంచేలా అనుమతులు ఇవ్వాలని పలుమార్లు కోరినట్లు చెప్పారు. స్పందించిన ప్రభుత్వం తాజాగా 25వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతులు ఇచ్చిందన్నారు. ధాన్యం సేకరణ వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బంగారు కుటుంబాలను గుర్తించాలి పీ–4 విధానంలో బంగారు కుటుంబాలు మార్గదర్శిలను అనుసంధానించే ప్రక్రియ చేపట్టాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. బంగారు కుటుంబాలకు మార్గదర్శిలు అందించే సహాయం ఎలా చేరవేయాలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. నీటి తీరువా లక్ష్యం మేరకు వసూలు చేయాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద పట్టణాలలో 2,500 యూనిట్లను స్థాపించాలని మున్సిపల్ కమిషనర్లకు లక్ష్యాలను నిర్దేశించామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సూర్యఘర్ యూనిట్ల స్థాపన ప్రతి ఎంపీడీవోకి 1500 యూనిట్లను లక్ష్యంగా ఇచ్చామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా అధికారులు పనిచేయాలని సూచించారు. వాహనాలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. రీ సర్వే ప్రక్రియ క్షేత్రస్థాయిలో వేగంగా జరిగేలా ఆర్డీవోలు, తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గృహ నిర్మాణ లక్ష్యాలు వేగంగా పూర్తయ్యేందుకు పొజిషన్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ఉండరాదన్నారు. సమావేశంలో డీఆర్వో జి గంగాధర్‌గౌడ్,వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21వ తేదీన బాపట్ల కలెక్టరేట్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు వెయ్యి మందితో యోగ ఆసనాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు. యోగా దినోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని, ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నెలరోజులపాటు ఈ కార్యక్రమాలను అన్ని ప్రాంతాలలో నిర్వహించాలన్నారు. యోగా ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు పోటీ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విజేతలకు బహుమతులిచ్చి కార్యక్రమాన్ని మరింతగా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, డీఈవో పురుషోత్తం, డీఆర్డీఏ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నాటు సారా తయారీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలినాటు సారా తయారీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లైన్ డిపార్టుమెంటు అధికారులతో కలెక్టర్ సోమవారం సమావేశం నిర్వహించారు. నాటు సారా నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 అనే కార్యక్రమాన్ని తలపెట్టిందని అన్నారు. జిల్లాలో నాటు సారా నిర్మూలనపై పొబిషన్, ఎకై ్సజ్ అధికారులను ఆయన ఆరా తీశారు. నవోదయం 2.0 అమలుపై తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ కు ఎకై ్సజ్ శాఖ అధికారులు వివరించారు. రాబోవు 15 రోజులలో జిల్లాలో నాటు సారా తయారు చేసే సమస్యాత్మకమైన 16 గ్రామాలలో దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియ, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అదే.. ఆ తల్లి ప్రత్యేకత
● మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక ● కంటిపాపలా చూసుకున్న తల్లిదండ్రులు ● ఆనందాన్నీ, అవసరాలను వదులుకున్నారు ● బిడ్డ కోసం టీచరుగా మారిందా తల్లి ● ఇష్టమైన సైక్లింగ్‌లోనూ శిక్షణనిచ్చింది ● స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గేలా చూశారు ● ఇప్పుడా బిడ్డలాంటి మరికొందరికోసం ఏకంగా అలాంటి పాఠశాలనే నడుపుతోందా తల్లి తెనాలి: ‘‘అది 2019 సంవత్సరం మార్చి నెల. 14–21 తేదీల్లో దుబాయ్‌లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్. 25 గేమ్స్‌లో 170 పైగా దేశాలకు చెందిన ఏడు వేల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 280 మంది వివిధ పోటీల్లో తలపడ్డారు. ఇందులో సైక్లింగ్‌లో 16 మంది పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ యువతి ఆ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో యువతి 500 మీటర్లు, కిలోమీటరు పోటీలు రెండింటిలోనూ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాలను కై వసం చేసుకుంది. రెండు కి.మీ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ఆ యువతే 2018లో రాంచీలో నిర్వహించిన జాతీయ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో కిలోమీటరు సైక్లింగ్‌లో బంగారు పతకం, రెండు కి.మీ విభాగంలో రజత పతకం గెలిచి, స్పెషల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.’’ మానసిక పరిపక్వత లేదని సమాజం ఈసడించింది. తనపై డబ్బు ఖర్చుచేసినా, శ్రమ వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం లేదు... తిండి, బట్ట ఇస్తే సరిపోతుందని తలిదండ్రులకు జాగ్రత్తలు చెప్పింది. అయితే సమాజం మాటవిని ఆ పాపను తల్లిదండ్రులు వదిలేయలేదు. తనకోసం తమ ఆనందాల్నీ, అవసరాలనూ వదులుకున్నారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు నీహారికను తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలలో చదివిస్తూ తనకెంతో ఇష్టమైన సైక్లింగ్‌లో శిక్షణనిస్తూ వచ్చిందా తల్లి భార్గవి. తద్ఫలితమే.. నీహారిక సాధించిన విజయాలు. భార్గవి సొంతూరు చినపరిమి భార్గవి సొంతూరు తెనాలి సమీపంలోని చినపరిమి. భర్త ఆర్మీ ఉద్యోగి ముక్కామల శివరామకృష్ణ. 2001లో తొలి కాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఏడాదిన్నర వచ్చినా నడక రాకపోవటంతో అనుమానం వేసింది. ఉద్యోగరీత్యా అప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఉన్నారు. ‘ఒకసారి న్యూమోనియాకు ఇచ్చిన మందు ఓవర్‌డోస్ అయి, నాలుగురోజులు పాప కోమాలో ఉంది... తెలివొచ్చేసరికి మాటలు బాగా తగ్గిపోయాయి..చెప్పిందీ అర్థం చేసుకోవటం తగ్గింది. డ్రమ్స్ మోగినా, బాణసంచా పేలుళ్లు విన్నా, భయంతో వణికేది...పెరిగేకొద్దీ ఆ భయం ఎక్కువైంది’ అని భార్గవి గుర్తుచేసుకున్నారు. అయిదో ఏడు వచ్చేసరికి ఆగ్రాకు వెళ్లారు. అక్కడి డాక్టర్లు ‘ఇంటలెక్చువల్ డిసేబిలిటీ’ అన్నారు. ‘పిల్లలతో విపరీతంగా ప్రవర్తించేది అప్పుడే...డ్రమ్స్, బాణసంచా మోతకు భయపడిపోయేది. ఎవరినీ దగ్గరకు రానిచ్చేదికాదు...తనొక్కతే ఏదొక వస్తువుతో ఆడుకుంటూ ఉండేది...ఆ క్రమంలో సైకిల్ తనను బాగా ఆకర్షించింది...చిన్న సైకిల్ నడిపేది. పాడైపోతే కొత్తది కొనేదాకా ఊరుకునేది కాదు...ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను’ అన్నారు భార్గవి. అప్పటికి తనకు మరో బాబు కలిగాడు. కుమార్తె కోసం త్యాగాలు.. పాప ఆరోగ్యం కారణంగా హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చేర్పించారు. కొడుక్కి హోం వర్క్ చేయించేటపుడు, నీహారికను దగ్గరుంచారు. స్పీచ్ థెరపీనీ ఇప్పించారు. 2013లో విజయవాడకు వచ్చేశారు. 2013 నవంబరులో ఇలాంటి పిల్లల కోసం ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని తెలుసుకున్నారు. 2014లో పార్టిసిపేట్ చేసేలా చూశారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు పాపను నిద్రలేపటం, హైవేపై 10 కి.మీ ప్రాక్టీస్ చేయించి, ఇంటికి తీసుకొచ్చేవారు. తర్వాత ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’కు తీసుకెళ్తారు. నీహారిక కోసం తనుకూడా అదే స్కూలులో ఉద్యోగం చేశారు భార్గవి. శివరామకృష్ణ కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. విభిన్న ప్రతిభావంతులకు తల్లిలా.. తన బిడ్డ నీహారిక లాంటి మరికొందరి కోసం ఇప్పుడా తల్లి ఏకంగా స్కూలునే నడుపుతోంది. 2020లో ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టరు చేశారు. 2022 నుంచి ఆ సొసైటీ తరఫున సాయి అంకుర్ స్పెషల్ స్కూల్‌ను ఆరంభించారు. 2019లో స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాల సాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్‌మనీతో మొదలుపెట్టిన స్కూలుకు ఇప్పుడు సొంత డబ్బులు పడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల మద్దతు తోడవుతోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం, అవసరాలను తీర్చుకోవటం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా శిక్షణనివ్వటం తమ ఆశయమని చెప్పారు భార్గవి. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని ‘సాయి అంకుర్ స్పెషల్ స్కూల్’ ఇప్పుడు భార్గవి ప్రపంచం. 24 ఏళ్ల కుమార్తె నీహారికతో సహా పదిహేనుమంది విభిన్న ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడ పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఆటలతో బోధన ఉంటుంది. రోజువారీ స్కూలుకు వెళుతూ రెమిడియల్ క్లాసుకు వచ్చేవారూ ఉన్నారని భార్గవి చెప్పారు. తనతోపాటు అక్కడ ముగ్గురు టీచర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. పాప కోసం ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’ టీచరుగా పనిచేసిన భార్గవి, ఇప్పుడు ఏకంగా అలాంటి స్కూలునే నడుపుతూ ఎందరికో తల్లిలా మారింది. -
దాడుల్లో బట్టబయలు
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025చీరాల అర్బన్: పాలు కల్తీ.. నూనె కల్తీ.. పప్పు దినుసులు కల్తీ.. ఎటు చూసినా విషాహారం.. ఏ హోటల్లో తిందామన్నా విచ్చలవిడిగా రంగులు వాడిన పదార్థాలు దర్శనమిస్తున్నాయి. విషతుల్యమైన మాంసం, చేపలు, రొయ్యలు, మరగబెట్టి మళ్లీవాడే నూనెలు, పాడైపోయిన దినుసులు వాడుతూ తయారు చేసిన ఆహారాన్ని అధిక ధరలకు అమ్మేస్తున్నారు. విషాహారంతో అమాయక ప్రజలను వ్యాపారులు ఆస్పత్రులకు పంపుతున్నారు. చీరాల పట్టణంలో ఆహార పదార్థాల్లో కల్తీ పెరిగినా అధికారులు, పాలకులు కన్నెత్తి చూడటం లేదు. రంగుల గరళం ముఖ్యంగా చిన్నారులను టార్గెట్ చేస్తున్న వ్యాపారులు పలు పదార్థాల్లో ప్రమాదకరమైన రసాయనాలతో ఉన్న రంగులు కలుపుతూ అంటగడుతున్నారు. వీటిని తింటే జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చీరాల నియోజకవర్గంలో బహుళ అంతస్తుల్లో నిర్వహిస్తున్న వెజ్, నాన్‌వెజ్ రెస్టారెంట్లు 15 ఉన్నాయి. పలావు పాయింట్లు, చికెన్ పకోడి, బిర్యాని పాయింట్లు, జాతీయ రహదారి వెంబడి నిర్వహించే షాపులు సుమారు వంద వరకు ఉన్నాయి. చీరాల, వేటపాలెం మండలాల్లో చిన్న చిన్న షాపులు, తోపుడు బండ్లపై పెట్టిన బిర్యానీ పాయింట్లు 50 వరకు ఉన్నాయి. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా బిర్యానీ పాయింట్లు వెలిసి ప్రజారోగ్యానికి హానికరంగా మారాయి. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తప్పనిసరి హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ శాఖ నిబంధనలు మేరకు ఆహారం తయారు చేయాలి. 2006లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్, చీరాల, బాపట్లకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా ప్రతి నెలా 12 శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. ఆ నివేదికల ఆధారంగానే కేసులు నమోదు చేసి జరిమానా, శిక్షలు విధిస్తారు. అనుమతులు తప్పనిసరి ఆహారానికి సంబంధించిన వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన కార్యాలయం ఒంగోలులో ఉంది. లైసెన్స్ కోసం ప్రభుత్వానికి నిర్ణీత రుసుం చెల్లిస్తే అధికారులు పరిశీలించి జారీ చేస్తారు. అయితే, చాలా వరకు లైసెన్స్‌లు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నట్లు సమాచారం. న్యూస్‌రీల్ ఆహారంలో విచ్చలవిడిగా రంగుల వాడకం జీర్ణకోశ వ్యాధులకు గురయ్యే అవకాశం రెస్టారెంట్లలో రోజుల తరబడి ఫ్రిజ్‌ల్లో ఆహారం నిల్వ పప్పు దినుసుల్లో నాణ్యత డొల్ల ఫుడ్ కంట్రోలర్ల దాడుల్లో బయటపడుతున్న వాస్తవాలు విష రసాయన రంగుల వినియోగం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తరచూ నిర్వహించే తనిఖీల్లో కఠోర వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన రెస్టారెంట్లలోనూ ఆహారం నాణ్యతగా ఉండటం లేదు. చీరాలలో ఇటీవల పలు బిర్యాని పాయింట్లను పరిశీలించగా ఫ్రిజ్‌ల్లో నిల్వ ఉంచిన చేపలు, రొయ్యలు, చికెన్, మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా చట్నీలు దర్శనమిచ్చాయి. అయితే, వీటిలో కలిపేందుకు వినియోగించే రంగుల డబ్బాలు, టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్లు చూసి విస్తుపోయారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడం, వాడిన నూనెనే తిరిగి వాడటాన్ని గుర్తించి నిర్వాహకులకు నోటీసులు అందించారు. బస్టాండ్ వద్ద ఉన్న స్వీట్స్ కార్ఖానాను పరిశీలించారు. అపరిశుభ్రత, పప్పు దినుసులు కల్తీగా ఉన్నట్లుగా గుర్తించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. ఫుడ్ కలర్‌ను పరిమితికి మించి వాడుతున్నారు. ఒక కిలోకు 0.001 మిల్లీ గ్రాములు వాడాల్సి ఉన్నా.. దీనికి ఎన్నో రెట్లు అదనంగా వినియోగిస్తున్నారు. పట్టణంలోని రెస్టారెంట్లలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఓ రెస్టారెంట్లో ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, రొయ్యలు, అల్లం.. వెల్లుల్లి పేస్ట్ వంటివి గమనించి నిర్వాహకులకు నోటీసులు అందించారు. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. చీరాల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో ఉన్న బిర్యానీ సెంటర్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఆహార లైసెన్స్‌లు లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడం, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్లను విచ్చలవిడిగా వాడుతుండటంతో చర్యలు తప్పవని హెచ్చరించారు. చీరాల పట్టణంలోని హోటల్స్ ఇటీవల ఫుడ్ అసిస్టెంట్ కంట్రోలర్ తనిఖీ చేపట్టారు. అపరిశుభ్రతతో పాటు పప్పు దినుసులు కొన్ని కల్తీవిగా గుర్తించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. ఫుడ్ కలర్ ఎక్కువగా వాడితే ప్రమాదం నిత్యం తినే ఆహారంలో ఫుడ్ కలర్ ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మాంసాహారం వడ్డిస్తున్నారు. తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిస్తున్నాం. నివేదికలు వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాం. –జి.ప్రభాకరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
ప్రజల శాంతికి ఆటంకం కలిగిస్తే చర్యలు
నరసరావుపేట: జిల్లాలో ప్రజల శాంతికి ఆటంకం కలిగించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే ప్రదేశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా ఆదివారం పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లాడ్జీలు, వాహనాలు, నగర శివారు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై విస్తృత తనిఖీలు చేశారు. బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్లు కూడా పాల్గొన్నాయి. లాడ్జీల్లో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వ్యక్తులను ప్రశ్నించి, వివరాలు ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీచేసి వారి గుర్తింపు వివరాలను నమోదు చేశారు. ఖాళీ ప్రదేశాలు, శివారు నగర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై దాడులు నిర్వహించారు. అనంతరం వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు -
ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ప్రారంభం
కొల్లూరు : రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు మండలంలోని క్రాపలో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జూనియర్ విభాగంలో 10 నిమిషాల వ్యవధిలో పోటీలను నిర్వహించారు. సోమవారం సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలోని ఐదు మండలాలలో ఇప్పటి వరకు బండ, బండి లాగుడు పోటీల్లో పాల్గొనని టైరు బండి ఎద్దులకు మాత్రం మంగళవారం పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ విభాగాలలో ప్రథమ బహుమతి నుంచి 8వ స్థానం వరకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయి టైరు బండి విభాగంలో ఆరు స్థానాల్లో నిలిచిన ఎడ్లకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
విద్యార్థి అదృశ్యం
మూడు రోజులుగా లభించని ఆచూకీ కారంచేడు: కారంచేడు పాలేటివారి బజారుకు చెందిన ఓ విద్యార్థి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఎప్పుడూ ఇల్లు కదలని అతడు అదృశ్యం కావడంపై పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మీనిగ జయప్రకాష్‌కు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు సామ్యేల్ ప్రణీత్ చీరాల లోని ఒక ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో ఇంటి వద్దనే ఉంటున్న బాలుడు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. మూడు రోజులుగా బంధువులు, స్నేహితుల వద్ద విచారించామని చెబుతున్నారు. ఆదివారం సామ్యేల్ వాడుతున్న సైకిల్ పర్చూరు గ్రామంలోని ఉప్పుటూరు వంతెన వద్ద స్టాండ్ వేసి ఉండటం గమనించామని పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఆచూకీ తెలిసిన వారు 9515640934, 9542618260 నంబర్లకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభం
క్రోసూరు: స్థానిక జెడ్పీ పాఠశాల ఆవరణలో వైఎంసీఏ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను కంచేటి సాయిబాబు ఆదివారం ప్రారంభించారు. మొత్తం 40 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు అఖిల్ తెలిపారు. సాయిబాబు మాట్లాడుతూ క్రీడల వల్ల యువతకు ఆరోగ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. పోటీలలో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.50,116, ద్వితీయ బహుమతిగా రూ.25,116, మూడో బహుమతిగా రూ.10,116, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు రూ.5,116 అందించనున్నట్లు వెల్లడించారు. బెస్ట్ బ్యాట్స్‌మన్‌కు రూ.2,116, బెస్ట్ బౌలర్‌కు రూ.2,116 అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దిగుమర్తి అప్పారావు, మన్నెం శ్రీను, వెంకటరామిరెడ్డి, బండారు రాము, కంభంపాటి రాము, బాబు పాల్గొన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ తాడేపల్లి రూరల్: ఫూటుగా మద్యం తాగి కారును విచక్షణారహితంగా నడపడంతో వృద్ధుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి రోడ్డులో పెనుమాక–ఉండవల్లి మధ్య ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నరేష్ అనే వ్యక్తి బొలేరో వాహనంలో పెనుమాక నుంచి ఉండవల్లి వెళుతున్నాడు. ఈక్రమంలో ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక వెళ్తున్న బ్రహ్మయ్య (60) ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బ్రహ్మయ్యతో పాటు వాహనంపై ఉన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వీరి వెనుక ఉన్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో అతనికీ గాయాలయ్యాయి. బొలెరో వాహనం రెండు వాహనాలను ఢీకొట్టడంతో వాటిపై ప్రయాణిస్తున్న ముగ్గురు గాలిలోకి ఎగిరి రోడ్డు మీద పడ్డారు. అనంతరం బొలెరో వాహనం రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్యతో పాటు గాయపడ్డ ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బ్రహ్మయ్య మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మద్యం మత్తులో వున్న నరేష్‌ను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పవర్ లిప్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
సత్తెనపల్లి: స్థానిక పవర్ హౌస్ ఫిట్‌నెస్‌లో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పల్నాడు జిల్లా నుంచి జట్టు ఎంపిక ఆదివారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఆర్పీ ఆనంద్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి 2 జూన్ వరకు రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఏక్విపైడ్ పోటీలు జరుగుతాయి.కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సెక్రటరీ పసుపులేటి సురేష్, ప్రెసిడెంట్ జిమ్ రాజు, జి.రమేష్, కత్తి పవన్‌కుమార్, ఎం.రాహుల్‌గౌతమ్, సయ్యద్ మస్తాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, శాంతయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి సురేష్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో పథకాలను సాధించి పల్నాడు జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ఎంపికై న జట్ల వివరాలు ఇలా.. సబ్ జూనియర్: 43 కేజీలు కత్తి పల్లవి (గురజాల), 53 కేజీలు కె.కార్తిక్ (గురజాల), 66 కేజీలు ఎం.వినయ్ వెంకట శివ(సత్తెనపల్లి) జూనియర్ విభాగం: 53 కేజీలు ఎం.సాయి గగన్ (సత్తెనపల్లి),74 కేజీలు ఎన్. శరత్(కంకణాలపల్లి), 74 కేజీలు పి.శ్రీహర్ష రమేష్ చౌదరి (కంకణాలపల్లి), 83 కేజీలు పసుపులేటి వంశీ కృష్ణ (సత్తెనపల్లి),120 కేజీలు ఎల్. శివనాగేశ్వరరావు(గుడిపుడి) ఎంపికయ్యారు. -
పేదల ఆస్పత్రిలో ఫీ‘జులుం’!
ఉచిత సేవలు అందించలేరా ? గుంటూరు మెడికల్: క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆధునిక చికిత్సలతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ఏ దశలో ఉంది... శరీరంలో ఏ భాగంలో ఉంది.. ఎంత మేరకు వ్యాప్తి చెందింది.. క్యాన్సర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు పెట్ సీటీ స్కానింగ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షను ప్రైవేటు క్యాన్సర్ సెంటర్లో చేసినందుకు రోగి వద్ద సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఎంతో ఖరీదైన పెట్‌సీటీ పరీక్షను ఉచితంగా అందించాలనే మంచి ఆశయంతో ప్రభుత్వం సుమారు రూ.18 కోట్ల ఖరీదు చేసే పెట్‌సీటీ మెషిన్‌ను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు మంజూరు చేసింది. కొద్దిరోజుల్లోనే పెట్‌సీటీ మెషిన్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేలా వేగవంతంగా సివిల్, ఎలక్రిక్టల్, ఇతర పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో లేనివిధంగా మొట్టమొదటిసారిగా గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పెట్సీటీస్కాన్ వైద్య పరికరం అందుబాటులోకి రావటంతో క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి రోగులు ఎంతో సంతోషపడ్డారు. గతంలో ఈ పరీక్ష కోసం జీజీహెచ్‌లోని క్యాన్సర్ రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బందులు పడేవారు. వైద్య పరికరం రాకతో సంతోషపడుతున్న తరుణంలో క్యాన్సర్ రోగులకు పిడుగులాంటి వార్త చెవిని పడింది. శనివారం గుంటూరు జీజీహెచ్‌లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం( హెచ్‌డీఎస్) జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ, పలువురు హెచ్‌డీఎస్ సభ్యుల సమక్షంలో పెట్ సీటీ చేసేందుకు సుమారు రూ.7వేలు రుసుంగా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై పలువురు రోగులు, సహాయకులు మండిపడుతున్నారు. రోగులు, సహాయకుల ఆగ్రహం నాట్కో ట్రస్ట్ వారు ప్రతి ఏడాది సుమారు రూ.కోటి వ్యయం చేసే మందులు ఉచితంగా జీజీహెచ్‌కు వచ్చే క్యాన్సర్ రోగులకు అందిస్తున్నారు. కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో నేడు ఆస్పత్రిలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి కోట్లాది రూపాయలు విరాళాలు అందిస్తూ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ రోగులకు వైద్య పరీక్ష పేరుతో రూ.7వేలు ఫీజు తీసుకోవడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క ప్రాణాలు తీసే క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ చికిత్స పొందుతున్న రోగులు ఆర్థిక ఇబ్బంది పడేలా ఫీజులు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు క్యాన్సర్ రోగుల శ్రేయస్సు దృష్ట్యా వైద్య పరీక్షకు ఫీజు తీసుకోవాలనే విషయమై పునరాలోచించాలని పలువురు రోగులు కోరుతున్నారు. పెట్ సీటీ స్కానింగ్‌కు యూజర్ చార్జీలు ఒక్కో రోగి వద్ద రూ.7వేలు వసూలుకు రంగం సిద్ధం హెచ్‌డీఎస్ సమావేశంలో యూజర్ చార్జీలకు ఆమోదం క్యాన్సర్ రోగులపై తీవ్ర భారం పేదల ఆస్పత్రిలో ఫీజులు పెట్టడంపై తీవ్ర విమర్శలు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాట్కో ట్రస్ట్ చైర్మన్ నన్నపనేని వీసీ సుమారు రూ.45 కోట్లతో క్యాన్సర్ రోగులకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించేందుకు నన్నపనేని లోకాదిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను నిర్మించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 జూలై 1న నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. గతంలో కేవలం రేడియేషన్ ఆంకాలజీ వైద్యసేవలు మాత్రమే గుంటూరు జీజీహెచ్‌లో లభించేవి. నాట్కో క్యాన్సర్ సెంటర్ నిర్మించాక మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య విభాగాలు రావటంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బందిని సైతం ప్రభుత్వం నియమించింది. సుమారు రూ.15 కోట్లు ఖరీదు చేసే లీనియర్ యాక్సిలేటర్, రూ.2కోట్లు ఖరీదు చేసే బ్రాకీథెరపీ, రూ.5 కోట్లు ఖరీదు చేసే సీటీ స్టిమ్యూలేటర్ వంటి వైద్య పరికరాలను ప్రభుత్వం నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు ఇచ్చింది. దాంటోపాటుగా పెట్ సీటీ పరికరాన్ని సైతం మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగి ఎట్టకేలకు ఏడాదిన్నర తరువాత పెట్ సీటీ వైద్య పరికరం నేడు నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు వచ్చింది. వైద్య పరికరం వచ్చిందన్న ఆనందం కన్నా వైద్య పరీక్ష చేయించుకునేందుకు రూ.7వేలు చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయం తీసుకున్నారనే బాధే నేడు ఎక్కువ మంది రోగుల్లో నెలకొంది. -
బంగారం దుకాణంలో ఆభరణాల చోరీ
●అసలు స్థానంలో నకిలీ వస్తువులు పెట్టి పరారీ ●సీసీ పుటేజ్ ద్వారా ముగ్గురు మహిళల గుర్తింపు ●దుకాణ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు నరసరావుపేటటౌన్ : బంగారు వస్తువుల కొనుగోలుకు వచ్చిన మహిళలు నకిలీవి పెట్టి అసలైన బంగారం దొంగిలించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఎం.వి చరణ్ ఆదివారం తెలిపారు. పట్టణంలోని శివుడి బొమ్మ సెంటర్లో గల శ్రీ శారద జ్యూయలర్స్ దుకాణంలోకి శనివారం ముగ్గురు మహిళలు వచ్చారు. బంగారు చెవి కమ్మలు కావాలని అడిగారు. అవి చూస్తూనే దుకాణ సిబ్బందిని మాటల్లో పెట్టి వారి వెంట తెచ్చుకున్న నకిలీ కమ్మలను అక్కడ పెట్టి అసలైన వాటిని అపహరించారు. సరిపడా డబ్బులు లేవని రేపు వచ్చి తీసుకు వెళ్తామని చెప్పి వెళ్లిపోయారు. బంగారం వస్తువుల తూకంలో వ్యత్యాసం రావడంతో అనుమానం వచ్చిన దుకాణ గుమస్తా యజమాని దృష్టికి తీసుకెళ్లారు. సీపీ పుటేజ్ పరిశీలించగా, ముగ్గురు మహిళలు నంబర్ ప్లేట్ లేని ఆటోలో వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు దుకాణ యజమాని కపిలవాయి విజయ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ. 1.30 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆల్ ఔట్ రీఫిల్ ప్యాక్ నోటిలో పెట్టుకున్న బాలుడు మృతి చిలకలూరిపేట టౌన్: ఆడుకుంటూ ఆల్ఔట్ రీఫిల్ ప్యాక్‌ను నోటిలో పెట్టుకున్న బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఉపాధి పనుల నిమిత్తం చిలకలూరిపేట పట్టణానికి మూడు నెలల కిందట భానుప్రతాప్‌సింగ్, లాలీదేవి దంపతులు తమ ముగ్గురు సంతానంతో వచ్చారు. స్థానిక రెడ్ల బజారులో అద్దె ఇంట్లో ఉంటూ మోర్ సమీపంలో ట్యాటూస్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 14వ తేదీన లాలీదేవి ఇంట్లో స్నానానికి వెళ్లింది. ఈ సమయంలో ఆడుకుంటున్న రెండేళ్ల నాలుగు నెలల రెండో కుమారుడు దీపక్‌సింగ్ పొరపాటుగా ఆల్ఔట్ను నోటిలో పెట్టుకున్నాడు. స్నానం ముగించి వచ్చిన తల్లి దీపక్ నోటి నుంచి నురగ రావడం గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ దీపక్ ఆదివారం మృతి చెందాడు. కబడ్డీ అసోసియేషన్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్‌గా మాబు హుస్సేన్ సత్తెనపల్లి: కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్‌గా షేక్ మాబు హుస్సేన్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ పల్నాడు జిల్లా సమావేశం శనివారం తాడేపల్లిలో నిర్వహించారు. ఇందులో సత్తెనపల్లికి చెందిన అంజి మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ షేక్ మాబు హుస్సేన్‌ను పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ కాసాని వీరేష్ హాజరయ్యారు. ఎంపికై న వారికి పత్రాలు అందజేశారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్‌గా ఎన్నికై న షేక్ మాబు హుస్సేన్‌ను ఆదివారం పలువురు అభినందించారు. -
ఎల్ఐసీ పాలసీలపై జీఎస్టీని తీసి వేయాలి
సత్తెనపల్లి: పాలసీలపై జీఎస్టీ తీసి వేయాలని, పాలసీదారులకు బోనస్‌ను పెంచాలని ఎల్ఐసీ ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఐదు లాంతర్ల సెంటర్లో గల మాడా విశ్వేశ్వరరావు ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన లియాఫీ ఏజెంట్ల యూనియన్ మచిలీపట్నం డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాలసీదారులకు లోన్‌పై వడ్డీ రేటు తగ్గించాలని, ఏజెంట్లు అందరికీ మెడి క్లైమ్ను కుటుంబ సమేతంగా కల్పించాలని కోరారు. గ్రూప్ ఇన్స్యూరెనన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నంత కాలం కలిపించాలని డిమాండ్ చేశారు. సమాజంలో దిగువ తరగతి వారికి రూ. లక్ష పాలసీ ప్రవేశ పెట్టాలని మేనేన్మెంట్ను ఆయన కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సత్తెనపల్లి బ్రాంచి అధ్యక్షుడు మంచాల రమేష్ మాట్లాడుతూ ఎల్ఐసీ ఏజెంట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు అని, ఎల్ఐసీని బలోపేతం చేయడంలో కీలకమని తెలిపారు. ఏజెంట్లు అభివృద్ధికి సంస్థ కృషి చేయాలని కోరారు. సమావేశంలో డివిజన్ నాయకులు రవీంద్రరెడ్డి, అలిమియా, జగన్నాథం, రఘు, శ్రీనివాసరెడ్డి, మారుతి, సత్తెనపల్లి బ్రాంచి ఎల్ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు. ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ పాలసీదారులకు బోనస్ పెంచాలి -
నేడు మహా కుంభాభిషేకం
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి నూతన రాతి దేవస్థానంలో మహా కుంభాభిషేకాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు శృంగేరీ పీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి నిర్వహించనున్నారు. వైభవంగా కలశ యాత్ర మహా కుంభాభిషేకంలో భాగంగా దేశంలోని పవిత్ర నదుల నుంచి సేకరించి తెచ్చిన పవిత్ర జలాలకు తోడుగా అద్దంకిలో జీవ నది అయిన గుండ్లకమ్మ నుంచి సోమవారం ఉదయం ఐదు గంటలకు 1008 కలశాలలో 1008 మంది పుణ్య సీ్త్రలు జలాలను సేకరిస్తారు. నది పరీవాహక ప్రదేశం నుంచి శింగరకొండ క్షేత్రం వరకు ఆరు కిలోమీటర్ల పాదయాత్రతో కలశ యాత్ర నిర్వహిస్తారు. దీనిలో ప్రధాన ఆకర్షణగా కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన గజేంద్రుడు (ఏనుగు). ఈ కలశయాత్రలో పాల్గొనేందుకు అద్దంకి, పరిసర గ్రామాల సీ్త్రలు భారీగా తరలి రానున్నారు. విశేష పూజలు ఉదయం 8 గంటల నుంచి గురు వందనం, గణపతి పూజ, మండప పూజలు, వేదపారాయణం, సుందరాకాండ పారాయణం, శాంతి హవనములు, పూర్ణాహుతి, జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీస్వామితో యాగశాలలో హోమాలు, విమాన శిఖ కుంభాభిషేకం, యంత్ర స్తాపన, జీవధ్వజ ప్రతిష్ట, అనుగ్రహభాషణం, రక్ష కంకణాధారణ, మూల విరాట్‌కు 70 మంది రుత్వికులతో, పంచామృతాలతో అభిషేకంతో పాటు స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించనున్నారు. పలువురు మంత్రులు రాక అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వామికి పట్టు వస్త్ర సమర్పణ చేయనున్నారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, గృహని ర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొనున్నారు. భారీగా ఏర్పాట్లు మహా కుంభాభిషేకం కార్యక్రమానికి దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ యం. తిమ్మనాయుడు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎండలకు భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కుంభాభిషేకాన్ని భక్తులు చూసేందుకు భారీ స్కీన్లను ఏర్పాటు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అన్నదానానికి ప్రత్యేక స్టాల్లు ఏర్పాటు చేశారు. అన్ని సామాజిక సత్రాల్లో కూడా అన్నవితరణ చేపడతారు. కార్యక్రమ నిర్వహణకు 700 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. శృంగేరీ పీఠ ఉత్తరాధికారి విదుశేఖర భారతీస్వామి రాక 50 వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా శృంగేరి పీఠాధిపతికి ఘన స్వాగతం కుంభాభిషేకంలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతీ స్వామి శింగరకొండ విచ్చేశారు. అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. భక్తులకు స్వామి ఆశీర్వాదాలు అందజేశారు. -
సందేశాత్మకం.. హాస్యభరితం
ముగిసిన నాటికల పోటీలు చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: మనిషికి ప్రాణం లా, జీవితంలోనూ కళలు అంతే ముఖ్యమని, సంస్కృతి, సంప్రదాయాలకు అవే మూలమని డాక్టర్ చెరుకూరి తేజస్వి చెప్పారు. చిలకలూరిపేట కళాపరిషత్, సీఆర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఉభయ తెలుగురాష్ట్రాల స్థాయి 9వ ఆహ్వాన మూడోరోజు పోటీలను ఆదివారం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక సీఆర్ క్లబ్ ఆవరణలో స్వర్గీయ నాగభైరు సుబ్బారావు కళా ప్రాంగణంలో మూడోరోజు ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి భారీవర్షం కారణంగా చివరి ప్రదర్శన దొందు–దొందే నాటిక నిలిచిపోగా, దాన్ని మరుసటి రోజు తొలి ప్రదర్శనగా వేశారు. దీంతో ముగింపురోజు నాలుగు ప్రదర్శనలు అయ్యాయి. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు చెరుకూరి కాంతయ్య, క్లబ్ కోశాధికారి మక్కెన నరసింహారావు, ప్రజానాట్యమండలి నాయకుడు నూతలపాటి కాళిదాసు, బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి ఏవీ శివయ్య, ఆళ్ల హరిబాబు, కొత్త శివ, కేవీ మంగారావు, సత్యానందం, ఉమర్ పాల్గొన్నారు. నవ్వించిన ‘దొందూ–దొందే’ లోపం లేని వాడు లోకంలోనే లేడని మనలోని లోపాల్ని కాదు ప్రేమను పంచినపుడే జీవితం సంతోషంగా ఉంటుందని చాటింది భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి ‘దొందు–దొందే’ నాటిక. భారీపొట్టతో 40 ఏళ్లుదాటినా సంబంధాలు రాని ఓ యువకుడు తన లోపాన్ని పెళ్లికి ముందే భాగస్వామికి తెలియజేయాలని కుటుంబ సభ్యులతో చెబుతాడు. రేచీకటి ఉన్న యువతితో అసలు విషయం చెప్పకుండా పెద్దలు వైభవంగా వివాహం చేస్తారు. తొలిరాత్రి నాడు విషయం బహిర్గతం కావడంతో నూతన దంపతులు మధ్య మనస్పర్ధ్థలు ఏర్పడి విడాకుల కావాలంటారు. ఇరు కుటుంబాల్లో గందరగోళం మొదలవుతుంది. మనిషిలోని లోపాల్ని బలహీనతలుగా కాక, సహనం, ప్రేమతో చూసినపుడే జీవితాన్ని సాఫీగా ముందుకు సాగించడం సాధ్యమవుతుందని పెద్దలు తెలిపే సందేశంతో నాటిక ముగుస్తుంది. స్వీయరచనకు డేవిడ్‌రాజు దర్శకత్వం వహించారు. -
హెచ్ఐవీ,ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
డీఎంఅండ్‌హెచ్‌ఓ విజయమ్మ బాపట్ల: హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టరు విజయమ్మ చెప్పారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 42వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ డే –2025 కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. మహిళలు క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులకు భరోసా కల్పించేందుకు ఈ ప్రదర్శన దోహద పడుతుందని తెలిపారు.హెచ్ఐవీ,ఎయిడ్స్ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేపడుతోందని తెలిపారు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి షేక్ మొహమ్మద్ సాదిక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
దేవుని దృష్టిలో అంతా సమానమే..
రెవరెండ్ పిల్లి అంథోని దాస్ అచ్చంపేట: దేవుని దృష్టిలో అందరూ సమానమేనని నెల్లూరు మేత్రాసనం మహా ఘన రెవరెండ్ పిల్లి అంథోని దాస్ తెలిపారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు పునఃప్రతిష్ట వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన జూబిలీ ఆరంభ కృతజ్ఞతార్చన సమష్టి దివ్య పూజాబలి గీతాంజలి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్మనీ నుంచి ఇక్కడకు వచ్చిన స్వామి అర్లానంద 130 సంవత్సరాల కిందట తాళ్లచెరువు గ్రామాన్ని సృష్టించడం గొప్ప విషయమని తెలిపారు. ఇక్కడ నివసించే వారందరికీ క్రైస్తవ మతాన్ని ప్రబోధించి, 1950లో బాలఏసు మందిరాన్ని నిర్మించడం అద్భుతమని పేర్కొన్నారు. దినదినాభివృద్ధి చెంది నేడు మహా దేవాలయంగా పునఃప్రతిష్ట జరుపుకోవడం ఆనందించదగిన విషయం అన్నారు. దేవాలయం నిర్మించి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గ్రామస్తుల సమష్టి కృషితో వజ్రోత్సవ జూబిలీ వేడుకలతో పాటు దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవడం అభినందనీయమని తెలిపారు. జూబిలీ వేడుకలు అంటే ఇచ్చి పుచ్చుకోవడం, పరస్పరం అభినందించుకోవడం, గౌరవభావం కలిగి ఉండటం, ప్రేమ, దయ, జాలి కలిగి ఉండి అందరూ సమానమేనని తెలుసుకోవడమని వివరించారు. కార్యక్రమంలో 50మంది ఫాదర్స్, మరో 50మంది కన్య సీ్త్రలు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన గురువులు సందేశాన్ని ఇచ్చారు. దేవాలయం విచారణ గురువులు పుట్టి అంథోనిరాజు ఆధ్వర్యంలో ప్రారంభ వేడుకలు అద్భుతంగా జరిగాయి. మూడు వేల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఉత్సవ నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. -
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం
సత్తెనపల్లి:బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చిలుకా జయపాల్ ఆదివారం ఖండించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులతో దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ చేశారని, అది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్త తప్పుడు ఫిర్యాదుతో మరోసారి అరెస్ట్ చేశారని తెలిపారు. సురేష్ ఇంటి వద్ద రాజు అనే టీడీపీ కార్యకర్త హల్చల్ చేసి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించాడని, కార్లను ధ్వంసం చేసి వీరంగం సృష్టించినా కనీసం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హల్చల్ చేసిన టీడీపీ కార్యకర్త రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీకో న్యాయం.. వైఎస్సార్ సీపీకో న్యాయమా? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రహించాలని జయపాల్ పేర్కొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు దళితుల పైన చూపిస్తున్న ప్రేమ ? అంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా అక్రమ అరెస్ట్‌లు మానుకోకపోతే ప్రజలే భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. గుంటూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు లక్ష్మీపురం: ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు గుంటూరులో జులై 23, 24 తేదీల్లో నిర్వహించనునట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ నరసింహారావు చెప్పారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం బి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇప్పటికై నా సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభకు మేస్త్రిలు, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ సహాయ సహకారాలు అందించాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఉద్యోగ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న జీవో నంబర్ 20ని రద్దు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు, నాయకులు కె. శ్రీనివాసరావు, బి. ముత్యాలు, పి. దీవెనరావు, బాబూరావు, డి కోటేశ్వరరావు, ఖాసీం వలి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. బదిలీల నుంచి మినహాయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: 60 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్న ఉపాధ్యాయులను బదిలీల నుంచి మినహాయించాలని వైఎస్సార్ సీపీ ఉద్యోగ, పెన్షనర్ల విభాగ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ ఆదివారం ఓప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. 2017 ఆగస్టులో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో స్థాన చలనం పొందిన వారిని ప్రస్తుత బదిలీల్లో లాంగ్ స్టాండింగ్ విభాగంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి కాకుండా, అకడమిక్ ఇయర్స్ ప్రాతిపదికగా మే 31 నాటికి లాంగ్ స్టాండింగ్‌గా పరిగణించి బదిలీల్లో చేర్చుతున్నారని తెలిపారు. కేలండర్ ఇయర్స్ కాకుండా విద్యా సంవత్సరాల ప్రాతిపదికన బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా 60 ఏళ్ల వయసు పైబడిన ఉపాధ్యాయులు సైతం బదిలీల్లో స్థాన చలనం పొందనున్నారని, ఇది వారికి తీవ్ర అన్యాయం కలిగించే విషయమన్నారు. ఒక అకడమిక్ ఇయర్లో 9 నెలలు పనిచేస్తే ఒక ఏడాదిగా పరిగణిస్తున్న విద్యాశాఖాధికారులు, 59 ఏళ్ల 10 నెలలు వయస్సు నిండిన వారిని 60 ఏళ్ల వయసు నిండిన వారితో సమానంగా పరిగణించకపోవడంతో అనేకమంది ఉపాధ్యాయులు మానసికంగా ఆవేదన చెందుతున్నారని అన్నారు. 60 ఏళ్లకు చేరువలో ఉన్న వయోధిక ఉపాధ్యాయుల వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని వారిని బదిలీల నుంచి మినహాయించాలని కోరారు. ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. -
తెలుగు పలుకుబడులకు చిరునామా చేరెడ్డి
అద్దంకి: తెలుగు పలుకుబడులు, పదబంధాల విన్యాసం చేరెడ్డి మస్తాన్‌రెడ్డి కవిత్వంలో కనిపిస్తాయమని సాహిత్యవేత్త గాడేపల్లి దివాకరదత్తు అన్నారు. సాహితీ కౌముది ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డికి పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన పుట్టంరాజు కళాక్షేత్రంలో 2025 సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సభకు గాడేపల్లి దివాకరదత్తు అధ్యక్షత వహించారు. దేవపాలన మాట్లాడుతూ చేరెడ్డి రచనలు ప్రాచీన కావ్యాలను తలపిస్తుంటాయని అభినందించారు. పోలూరి వెంకట శివరామ ప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ పద్య సాహిత్యానికి చేరెడ్డి గౌరవాన్ని చేకూర్చారని చెప్పారు. పద్య కవులను ప్రోత్సహించడంలో చేరెడ్డి పాత్ర గొప్పదని వివరించారు. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి ‘మహాభారతం.. కవిత్రయ శైలి’ అనేది గొప్ప పరిశోధన అని శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అనంతరం చేరెడ్డి మస్తాన్‌రెడ్డికి సాహిత్య పురాస్కారాన్ని ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.5వేలు, పట్టుబట్టలు, సన్మాన పత్రం, జ్ఞాపకను అందజేశారు. కార్యక్రమంలో వారణాశి రఘురామశర్మ, చుండూరి మురళీ సుధాకర్‌రావు, కడియం పాపారావు, కె. సుబ్బారావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, కొండకావూరి కుమార్, ఆర్. రాజశేఖర్, కూరపాటి రామకోటేశ్వరరావు, సాహిత్యవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. పుట్టంరాజు సాహిత్య పురస్కారం అందజేత -
ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి అమానుషం
పర్చూరు(చినగంజాం): తిరుపతి జిల్లాలో అనుపల్లి జేమ్స్ అనే విద్యార్థిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జేమ్స్‌ను దళితుడని ఇబ్బందులకు గురిచేసిన యశ్వంత్ నాయుడుతోపాటు అతనిపై దాడికి పాల్పడిన రౌడీషీటర్ రూపేష్, చోటా బ్లేడ్, జగ్గా కిరణ్‌లను కఠినంగా శిక్షించాలని కోరారు. తిరుపతి విద్యానికేతన్ కాలేజీలో చివరిస సంవత్సరం చదువుతున్న జేమ్స్‌ను అతని కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన యశ్వంత్ నాయుడు హేళన చేశాడన్నారు. దళితుడని, ఒరేయ్ అంబేడ్కర్ అని రకరకాలుగా మాటలతో హింసిస్తుండగా. జేమ్స్ ఖండించాడని తెలిపారు. మరొక సారి ఇదే విధంగా మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించాడన్నారు. దీనినిపై పగ పెంచుకున్న యశ్వంత్ నాయుడు అతనిపై దాడి చేసి హింసించి నానా విధాలుగా పరుష పదజాలంతో తిట్టడంతో పాటు, కాళ్ళు చేతులు కట్టి వేసి కత్తితో హత్యాయత్నం చేశారని.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళితే కేసును తీసుకోకుండా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించారని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు వ్యవస్థలను పాడు చేస్తుంటే ప్రభుత్వం ఏమీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనార్టీల కోసం పనిచేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇటువంటి వ్యక్తుల భరతం పడతారని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు, కిడ్నాప్కేసు, పరువు నష్టం కేసు సెక్షన్లు అమలు చేస్తూ కేసు నమోదు చేసి జేమ్స్‌కు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ -
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
తెనాలి అర్బన్: ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంటే బ్యానర్లు పెట్టుకుని రోడ్లపై తిరగడం కాదని, ఉద్యోగులంతా ప్రజలకు మెరుగైన సేవలందించడమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం ఉదయం శివాజీ చౌక్ నుంచి మార్కెట్ వరకు నిర్వహించారు. పలువురు సచివాలయ ఉద్యోగులు తమకు నూతన పింఛన్లు, రేషన్‌కార్డులపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తప్పనిసరిగా వారానికి ఒకసారి ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. మురుగు కాల్వలు అధ్వానంగా ఉండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పలువురు కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వారందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సబ్ కలెక్టర్ సంజనా సింహా, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న పాల్గొన్నారు.మంత్రి నాదెండ్ల మనోహర్ -
రాజకీయ కక్షతో అక్రమ అరెస్టులు అన్యాయం
బాపట్ల: రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసిందని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బాపట్లలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు. మద్యం కేసు అంటూ ఎటువంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులను వేధించాలనే లక్ష్యంతో అక్రమంగా మద్యం కేసును బనాయించిందన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ నాయకులు, అధికారులను వేధింపులకు గురిచేస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే లిక్కర్ స్కాం జరిగిందన్నారు. వారి తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతుందన్నారు. -
సచివాలయ ఉద్యోగులపై వేధింపులు ఆపాలి
వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి కె.వి.కృష్ణారెడ్డి రేపల్లె: సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం వేధింపులను ఆపాలని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి కె.వి.కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి పౌర సేవలను ప్రజల ముంగిటికీ చేర్చారన్నారు. ఎన్నికల ముందు వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా విధుల్లోకి తీసుకోకుండా వారి ఉపాధిపై దెబ్బకొట్టిందన్నారు. ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తున్న సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. పలు రకాల సర్వేల పేరుతో పని ఒత్తిడి కల్పించి మానసికంగా వేధిస్తుందని చెప్పారు. -
సోషల్ మీడియా, సైబర్ నేరాల పర్యవేక్షణ కేంద్రం ప్రారంభం
నగరంపాలెం: సోషల్ మీడియా, సైబర్ నేరాలను నియంత్రించేందుకు కేంద్రం నెలకొల్పినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని ఉమేష్ చంద్ర బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నిపుణులైన పోలీస్ సిబ్బంది ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలు, సామాజిక మాధ్యమాల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహ శక్తులను గుర్తిస్తారన్నారు. తద్వారా వారి చర్యలను అణచివేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. సామాజిక మాధ్యమాల వాడకం, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారని ఆయన తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు సహకరించిన జిల్లేళ్లమూడి వెంకట్, కొల్లా అశోక్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), నిస్సార్ బాషా, ఎస్పీ సీసీ ఆదిశేషు, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
బాపట్ల: భావితరాల ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలలో ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని చెత్త, వ్యర్థాలను తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. గునపాలు, పారలు, చీపురులు చేతబట్టి పిచ్చి మొక్కలు తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నామన్నారు. స్వచ్ఛత అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదని, అది మన అభివృద్ధికి పునాదని, శుభ్రమైన పరిసరాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయన్నారు. పోలీస్ స్టేషన్, కార్యాలయాల పరిసరాలు శుభ్రంగా ఉండాలన్నారు. పక్షుల కోసం నీటి పాత్రలు ఏర్పాటు చేయాలి పరిశుభ్రమైన పర్యావరణం మానసిక ప్రశాంతతను పెంచుతుందన్నారు. ఇది పోలీస్ సిబ్బంది పనితీరుపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుతం వేసవి కాలం కనుక సహజమైన చల్లదనం కోసం టెరరస్ లపై ఆకర్షణీయమైన, ఆరోగ్యకరమైన మొక్కలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పక్షుల దాహార్తి తీర్చేందుకు గోడలు, టెరరస్ లపై చిన్న మట్టి పాత్రలలో నీటిని ఏర్పాటు చేయాలన్నారు. భూమిపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మనం ఇప్పుడు నాటే మొక్కలు భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం సామాజిక బాధ్యతగా భావించి అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, ఎఆర్ డీఎస్పీ పి.విజయసారది, ఎస్బి ఇన్స్పెక్టర్ నారాయణ, ఆర్ఐ మౌలుద్దీన్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ -
చెరువును చెరబట్టారు
చుండూరు(వేమూరు):అధికారంలోకి వచ్చింది దరిమిలా కూటమి నేతలు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలతో పేట్రేగుతున్నారు. చెరువులకు చెరువులనే చెరపడుతూ మట్టిని అక్రమంగా తోడేస్తూ, లక్షలు ఆర్జిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చుండూరు మండలంలోని పెదగాదెవర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో మట్టిని కూటమి నేతలు అక్రమ తవ్వేస్తూ, ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.800కి అమ్మేస్తూ జేబులు నింపుకొంటున్నారు. పట్టపగలు మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నీరు–చెట్టు పథకం కింద చెరువులను తవ్వేసిన టీడీపీ నేతలు అక్రమంగా రూ.లక్షలు ఆర్జించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో నేతల కన్ను చెరువులపై పడింది. అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి లక్షలు ఆర్జించాలనే థ్యేయంతో ముందుకెళుతున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. చుండూరు మండలం పెదగాదెలవర్రు చెరువులో కూటమి నేతల అక్రమ మట్టి తవ్వకాలు జగన్న కాలనీల్లో మెరక కోసమే.. జగనన్న కాలనీల్లో మెరకలు వేసేందుకు చెరువు తవ్వకానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మండలంలోని పెదగాదెలవర్రు, చుండూరు, అంబేడ్కర్ నగర్, నడిగడ్డవారి పాలెం, చిన గాదెవలవర్రు, చినపరిమి, కారుమూరు పాలెం గ్రామా ల్లో జగనన్న కాలనీలకు మట్టి తరలిస్తున్నాం. – నాగరాజు, చుండూరు తహసీల్దార్ -
వైఎస్ జగన్‌తోనే సుపరిపాలన సాధ్యం
గుంటూరు ఎడ్యుకేషన్:ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన వైఎస్. జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో శనివారం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. పార్టీ న్యూజిలాండ్ కన్వీనర్ నెల్లూరి బుజ్జిబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సాంబశివారెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర పథాన ముందుకు దూసుకెళ్లిందని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఆయన సుపరిపాలన అందించారని కొనియాడారు. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలే కాకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం వైఎస్ జగన్ నాయకత్వానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. బుజ్జిబాబు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత వైఎస్ జగన్ పరిపాలన చరిత్రలో మరపురాని ముద్ర వేసిందని పేర్కొన్నారు. 17 మెడికల్ కళాశాలలు, పోర్టులు, విద్య, వైద్యంతో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌లో జరిగిన సమావేశానికి ఆన్లైన్లో గుంటూరుకు చెందిన జి. శాంతమూర్తి హాజరయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ న్యూజిలాండ్ ఎన్నారై కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
నవతరానికి పుస్తక పఠనం అవసరం
నగరంపాలెం: నవతరానికి పుస్తక పఠనం అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ ఐదో వీధిలోని గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్ సర్వీసు ఆర్గనైజేషన్ ప్రాంగణంలో శనివారం ఏపీ అభ్యుదయ రచయితల సంఘం 90 ఏళ్ల సంబరాల్లో భాగంగా కవితా స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాలు గు పుస్తకాలను ఆవిష్కరించారు. సభకు సాహితీవేత్త భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ ఈ పుస్తకాలను నవతరం చదవడం అవసరమని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ సమితి అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఛాయారాజ్, ఎండ్లూరి సుధాకర్, నూతలపాటి గంగాధరం, పఠాభీల కవిత్వాన్ని ఈ తరం సులభంగా చదువుకునేలా అందిస్తున్న అరసం కృషి మరువలేనిదని ప్రశంసించారు. సభకు అధ్యక్షత వహించిన భూసురపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పుస్తకాలు కవి ఆత్మీయతను ప్రతిబింబించేలా ఉన్నాయని తెలిపారు. అనంతరం యుద్ధం– శాంతి అంశంపై కవితా గోష్టి నిర్వహించారు. బండికల్లు జమదగ్ని, మేడిశెట్టి సుభద్ర, హేమలత, ఎం.లలితకుమారి హజరయ్యారు. కార్యక్రమంలో జనసాహితి దివికుమార్, రచయిత్రి మందరపు హైమావతి, అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోసూరి రవికుమార్ పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ -
ఘనంగా జానపద కళాపీఠం రజతోత్సవం
అద్దంకి రూరల్: జానపద కళాపీఠం రజతోత్సవం శనివారం రాత్రి స్థానిక బంగ్లారోడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షుడు దేవపాలన మాట్లాడుతూ పల్లె ప్రజల గుండె చప్పుడు జాన పదమదన్నారు. జానపద కళలు ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలని తెలిపారు. దీనిలో భాగంగా చెన్నుపల్లి నాగేశ్వరరావు బృందం చేపట్టిన కోలాట ప్రదర్శన, జానపద రూపాలైన డప్పువాయిద్య కళాకారులు ప్రదర్శన, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జ్యోతి శ్రీరాములు స్మారక సాహిత్య పురస్కారాన్ని కొండా శ్రీనివాసులు, వీరవల్లి రంగయ్య, యశోదమ్మ స్మారక కళాపురస్కారాన్ని కారుమూరి సీతారామయ్యకు, గుర్రం జాఫువా స్మారక సాహితీ పురస్కారాన్ని పిన్నాబత్తిన వెంకట రమణయ్యకు, మారెడ్డి స్మారక కళాపురస్కారాన్ని బత్తుల ఆంజనేయులుకు, జానపద కళాపీఠం ఆత్మీయ సన్మానాన్ని ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆర్జేటి సుబ్బారావుకు అందజేశారు. వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య) జ్యోతి చంద్రమౌళి, గాడేపల్లి దివాకరదత్తు, జ్యోతి శ్రీమన్నారాయణ, మలాది శ్రీనివాసరావు, ధర్మవరపు శ్రావణ్‌కుమార్, తాళ్లూరి సుబ్బారావు, గోగుల వీరాంజనేయులు విస్తాలి శంకరావు పాల్గొన్నారు. -
వేమూరులో తిరంగా ర్యాలీ
వేమూరు: ఉగ్రవాదులను అంతం చేసేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్ భయపడి పోయిందని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణం శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వేమూరులో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంలో మొక్కలు నాటారు. మానవహారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్ర చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, గ్రామ సర్పంచ్ సజ్జా లక్ష్మీ తిరుపతమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, జొన్నలగడ్డ విజయబాబు, ఉసా రాజేష్, బండారు సూర్యనారాయణ, తహసీల్దారు సుశీల, ఎంపీడీవో శ్రీమన్నారాయణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పర్చూరు బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం
పర్చూరు(చినగంజాం): పర్చూరు బస్టాండు వద్ద వర్షపు నీటిలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వర్షపు నీటిలో ఉన్న మృత దేహాన్ని బయటకు తీశారు. అక్కడ పడి ఉన్న విధానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంచనామా నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టుం నిమిత్తం పర్చూరు వైద్యశాలకు తరలించారు. కారు బోల్తా : వ్యక్తికి గాయాలుచినగంజాం: మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ గాయాలపాలైన సంఘటన చినగంజాం– ఉప్పుగుండూరుల మధ్య జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. దర్శి గ్రామానికి చెందిన వెదురు చెన్నారెడ్డి శనివారం చీరాల నుంచి ఒంగోలు వైపు కారు డ్రైవింగ్ చేస్తూ వెళుతున్నాడు. చినగంజాం టోల్ ప్లాజా దాటిన తరువాత సాయిబాబ విగ్రహం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. డ్రైవర్ చెన్నారెడ్డికి స్వల్ప గాయాలు కావడంతో హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పర్యాటకుడిపై దాడి.. కేసు నమోదు చీరాల: సముద్రతీరంలో సేదతీరేందుకు వచ్చిన వ్యక్తిపై కొందరు దాడి చేసి గాయపరచిన సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం చీరాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వేటపాలెం మండలం సంపత్‌నగర్‌కు చెందిన యనుముల వీరాస్వామి అతని కుటుంబంతో శుక్రవారం రామాపురం సముద్రతీరానికి వెళ్లారు. అదే సమయంలో వారి పక్కన సముద్రస్నానం చేస్తున్న కొందరు యువకులు గోల చేస్తూ ఇబ్బందిగా ప్రవర్తించడంతో వీరాస్వామి వారించాడు. ఆవేశానికి గురైన యువకులు అతనిపై దాడి చేయగా అడ్డుకోబోయిన అతని కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి నకరికల్లు: ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శనివారం జరిగింది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొలిమి బడే సాహెబ్ (69) పొలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. గ్రామశివారులో ఇటుక బట్టీల వద్ద రోడ్డు దాటుతుండగా చిలుకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఆతనికి తీవ్రగాయాలు కాగా, నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మంగళగిరి: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు జరిగే పవర్ లిఫ్టింగ్ నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ క్లాసిక్ మెన్, ఉమెన్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ టీమ్‌ను ఎంపిక చేసినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. పట్టణంలోని కార్యాలయంలో శనివారం వివరాలను వెల్లడించారు.ఉమెన్ సబ్ జూనియర్ టీమ్ 76 కేజీల విభాగంలో బి. లాలిత్య, 84 కేజీల విభాగంలో ఈ.ఎల్. వినయశ్రీ , జూనియర్ టీమ్ 47 కేజీల విభాగంలో ఎం. షానూన్, 76 కేజీల విభాగంలో ఎల్. చాతుర్య, 84 కేజీల విభాగంలో ఎన్. జ్ఞాన దివ్యలను ఎంపిక చేసినట్లు తెలిపారు. పురుషుల సబ్ జూనియర్ 53 కేజీల విభాగంలో టి. శివకార్తిక్, 83 కేజీల విభాగంలో ఎస్. మునీశ్వర్ రామ్, జూనియర్ 93 కేజీల విభాగంలో ఎస్. కౌశిక్, 105 కేజీల విభాగంలో డి. పృథ్వీకుమార్ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న పవర్ లిఫ్టర్లను రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు తెలిపారు. -
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్–2025
గుంటూరుఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నా యి. ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సు ల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2025ను నిర్వహిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు 41,319 మంది విద్యార్థులు హాజరు కాను న్నారు. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షలకు 34,148, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 7,106, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 65 మంది ఉన్నారు. వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలను కలుపుకుని మొత్తం 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షల జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 41,319 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 41,319 మంది హాజరు కానున్నారు. ● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 25,692 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 21,551, అగ్రికల్చర్, ఫార్మసీ 4,100, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 41 మంది ఉన్నారు. ● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 11,126 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 9,198, అగ్రికల్చర్, ఫార్మసీ 1,912, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 16 మంది ఉన్నారు. –బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల పరిధిలో మొత్తం 4,501 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 3,399, అగ్రికల్చర్, ఫార్మసీ 1,094, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు ఎనిమిది మంది ఉన్నారు. విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్‌లో విద్యార్థి కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలి. నిముషం ఆలస్యమైనా నో.. ఎంట్రీ ఏపీ ఈఏపీ సెట్‌కు హాజరు కానున్న విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు అనుమతిస్తారు. ఉదయం 9.00 గంటలు, మధ్యాహ్నం 2.00 గంటల తరువాత నిముషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్ష జరిగే రోజున కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిముషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి. 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 41,319 మంది విద్యార్థులు మూడు జిల్లాల్లో 22 పరీక్ష కేంద్రాలు నిముషం ఆలస్యమైనా నో... ఎంట్రీ -
ఆధునిక జీవన శైలే ఐబీడీకి మూలం
గుంటూరు మెడికల్ : పల్నాడుకు చెందిన నాగేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఉద్యోగ రీత్యా రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మేలుకొని ఉండటం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో సమస్య తీవ్రమైన గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్ష చేసి సుబ్బారావు ఇన్‌ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బాపట్లకు చెందిన శ్రీనివాస్ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల కాలంలో తీవ్రమైన కడుపు మంట సమస్య ఉత్పన్నమవడంతో తల్లిదండ్రులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. విద్యార్థి ఎక్కువగా పాస్ట్‌ఫుడ్ తీసుకోవడం, సకాలంలో ఆహారం తీసుకోకుండా చదువు ధ్యాసలో పడి ఒత్తిడికి గురవడం ద్వారా ఐబీడీ వ్యాధి బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. ఇన్‌ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్న వారి సమస్య రోజురోజుకు ఎక్కువతోందని, సకాలంలో చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలం వ్యాధి వేధిస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదివేల మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యాధి బాధితులు ఉన్నట్లు ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ క్రోన్స్ అండ్ ఆల్సరేటీవ్ కొలిటీస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టడం తప్ప పూర్తిగా నయం చేయలేరు. ఐబీడీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 2010 నుంచి మే 19న ప్రపంచ వ్యాప్తంగా ఐబీడీ డే నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. వ్యాధి లక్షణాలు క్రాన్స్ వ్యాధి, అల్సరేటీవ్ కొలిటీస్ వ్యాధులనే ఐబీడీ వ్యాధిగా పిలుస్తారు. వాంతులు, విరేచనాలు, కొన్నిసార్లు రక్తపు విరేచనాలు, కడుపులో నొప్పి, అకస్మాత్తుగా శరీరం బరువును కోల్పోవడం, కడుపులో మంట, కడుపులో తిమ్మరి, అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. వ్యక్తుల ను బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. కారణాలు ఐబీడీ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, జన్యుపరమైన కారణాలు, జీవన విధానం, కొన్ని రకాల మందులు మింగడం ద్వారా, పాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి వ్యాధి కారణాలు. నిర్ధారణ ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎమ్మారై, రక్త పరీక్షలు, సిటీస్కాన్, మలహర్ష ద్వారా ఐబీడీ వ్యాధిని నిర్ధారిస్తారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమీకృత ఆహారాన్ని సక్రమంగా నమిలి మింగాలి. సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రించకూడదు. రాత్రివేళల్లో త్వరితగతిన ఆహారం తినాలి. పాల ఉత్పత్తులు పరిమితి మోతాదులో తీసుకోవాలి. కాఫీ, టీలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. –డాక్టర్ షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు 15 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఈవ్యాధి బారిన పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి బాధితులే. కొంత మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడు వారంలో నలుగురు లేదా, ఐదుగురు ఐబీడీ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతిరోజూ ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ వ్యాధి భారతదేశంలో కూడా నేడు పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సూచిస్తున్నారు. బాధితులు 40 ఏళ్లలోపు వారే రోజురోజుకు పెరుగుతున్న బాధితులు ఐబీడీ వ్యాధిపై అవగాహన అవసరం అంటున్న వైద్యులు ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే కట్టడి చేయవచ్చు రేపు వరల్డ్ ఐబీడీ డే -
అక్రమాలకు పోలీసు దన్ను
బాపట్లఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025ఆక్రమణల తొలగింపు వినుకొండ: వినుకొండలోని శివయ్య స్థూపం సెంటరులో ఆక్రమణలను ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు పొన్నూరు: పొన్నూరులోని గాంధీ బొమ్మ సెంట ర్, గుంటూరు బస్టాఫ్ల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలను శనివారం ఏర్పాటుచేశారు. జిల్లా ప్రత్యేక అధికారి కె.కన్నబాబు ప్రారంభించారు. శంకరమ్మ తల్లి తిరునాళ్ల చెరుకుపల్లి: మండల పరిధిలోని బలుసులపాలెం గ్రామంలో వేంచేసియున్న శంకరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. సాక్షి ప్రతినిధి,బాపట్ల: గ్రానైట్ క్వారీల్లో పేలుడు పదార్థాల అక్రమ విక్రయాలకు జిల్లాలోని కొందరు పోలీసులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి కేంద్రంగా పేలుడు సామగ్రి లైసెన్స్‌దారు హైదరాబాద్, నాగపూర్, చైన్నె ప్రాంతాల నుంచి అక్రమంగా ఎక్స్‌ఫ్లోజర్స్‌ను పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని ప్రకాశం జిల్లా చీమకుర్తి, బాపట్ల జిల్లా బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు, గురిజేపల్లి ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ క్వారీల యజమానులకు బిల్లులు లేకుండా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమాలకు దన్నుగా ఉన్నందుకు పేలుడు పదార్థాల వ్యాపారులు కొందరు పోలీసు అధికారులకు నెల మామూళ్లు ముట్టజెప్పి తమ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారు. ఒక డీఎస్పీకి నెలకు రూ.15 వేలు చొప్పున కప్పం కడుతున్న వ్యాపారులు క్వారీల పరిధిలోని కొందరు సీఐలకు నెలకు రూ.15 వేల వంతున ముట్టజెపుతున్నట్లు సమాచారం. ఎస్ఐలకు సైతం రూ.15 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల క్వారీల పరిధిలో కొత్తగా బదిలీపై వచ్చిన కొందరు ఎస్ఐలు స్థానికంగా పనిచేస్తూ అక్రమ వ్యాపారానికి దన్నుగా నిలుస్తున్నందున తమకు నెలకు రూ.20 వేలు ఇవ్వాలని లైసెన్సుదారులను డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతటితో వదలక పేలుడు పదార్థాల లైసెన్సుదారులతో సమావేశం పెట్టి గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక పోలీసుల సహకారం లేకుండా అక్రమ వ్యాపారం సాగించడం కష్టమని భావించిన పేలుడు పదార్థాల వ్యాపారుల సిండికేట్ దిగువ స్థాయి పోలీసు అధికారులకు నెల మామూళ్లు పెంచి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అడిగినంత ఇచ్చేద్దాం రికార్డులపై సంతకాలు పెట్టే అధికారులకు ఇచ్చే మొత్తం కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు అధికారులకు వారు అడిగిన మొత్తం ఇవ్వాలని పేలుడు పదార్థాలను వితౌట్లో సరఫరా చేస్తున్న చీమకుర్తి లైసెన్సుదారుడు త్రినాథరావు పేలుడు సామగ్రి లైసెన్సుదారుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు అడిగినంత మొత్తం అందరూ ఇవ్వాలని సదరు వ్యాపారి మిగిలిన లైసెన్సు దారులకు హుకుం జారీ చేశారు. జిల్లాతోపాటు ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఉన్న పేలుడు పదార్థాల లైసెన్సు దారులకందరికీ చీమకుర్తి లైసెన్సుదారుడే వితౌట్లో పేలుడు సామగ్రి సరఫరా చేస్తుండడం, పేలుడు సామగ్రి క్రయవిక్రయాల రికార్డులు సైతం ఆయనే నిర్వహిస్తుండడంతో మిగిలిన వ్యాపారులు పోలీసులకు నెల మామూళ్లు పెంచి ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. 7న్యూస్రీల్ప్రభుత్వ ఆదాయానికి గండి పేలుడు పదార్థాల అక్రమ విక్రయాల వల్ల అటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన రాబడికి గండిపడుతుంది. కానీ కొందరు పోలీసులు నెల మామూళ్లకు కక్కుర్తిపడి అక్రమ వ్యాపారాలకు దన్నుగా నిలవడం మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇప్పటికై నా పేలుడు పదార్థాల అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలి. నిముషం ఆలస్యమైనా నో.. ఎంట్రీ ఏపీ ఈఏపీ సెట్‌కు హాజరు కానున్న విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు అనుమతిస్తారు. ఉదయం 9.00 గంటలు, మధ్యాహ్నం 2.00 గంటల తరువాత నిముషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్ష జరిగే రోజున కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిముషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి. రికార్డులు పరిశీలించకుండానే సంతకాలు వాస్తవానికి పేలుడు పదార్థాల వ్యాపారులు పేలుడు పదార్థాల కొనుగోళ్లు, విక్రయాలకు సంబందించి ఫారం–3, ఫారం–4 రికార్డులను క్రమం తప్పకుండా నిర్వహించాల్సి వుంది. డీఎస్పీ స్థాయి అధికారి ప్రతి మూడు నెలలకొకసారి వీటిని పరిశీలించి సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా నెల మామూళ్లు పుచ్చుకుంటున్న కొందరు పోలీసు అధికారులు పేలుడు పదార్థాల వ్యాపారులు రాసుకు వచ్చిన రికార్డులపై సంతకాలు చేయడం పరిపాటిగా మారింది. యథేచ్ఛగా అనధికార ఎక్స్‌ఫ్లోజర్స్ విక్రయం జోరుగా లైసెన్స్ హోల్డర్ల అక్రమ వ్యాపారాలు కాపు కాస్తున్న పోలీసులకు నెల మామూళ్లు అక్రమ దందాకు అండగా ఉన్నామంటూ అధిక మొత్తానికి డిమాండ్ చీమకుర్తి లైసెన్స్ పచ్చనేత ద్వారా పోలీసులకు మామూళ్లు -
సర్కారు తీరుతో ‘పాఠశాల విద్య’లో గందరగోళం
లక్ష్మీపురం: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను జీవో నెం. 19, 20, 21ల ద్వారా 9 రకాలుగా విభజించి వేల సంఖ్యలో ఉపాధ్యాయులను మిగులుగా చూపించి పాఠశాల విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.రఘునాథ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేట జిల్లా సీపీఐ కార్యాలయంలో మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఉన్న జీవో నెం.117 అనేది ఉన్నత పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. దాన్ని రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు జివోలు దాంతోపాటు ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్ధిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీల ప్రమోషన్లను గండి కొట్టేలా నిర్ణయాలు ఉన్నాయన్నారు .ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులను మూడు రకాలుగా విభజించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్టీయూ ప్రధాని కార్యదర్శి కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ బదిలీల విషయంలో ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తెచ్చి ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వర రావు, రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్ ప్రకాష్ రావు ఆయా సభ్యులు అడిగిన విషయాలను వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
చేయి తిరిగేలా క్రీడా శిక్షణ
తెనాలి: పట్టణ పరిధి చెంచుపేటలోని అమరావతి కాలనీలో డీఎస్ఏ స్టేడియానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో సకల వసతులు సమకూరిన విషయం తెలిసిందే. చేపట్టిన నిర్మాణాలు, దాతల సహకారంతో అందిన సౌకర్యాలతో పూర్తిస్థాయిలో క్రీడలకు సంసిద్ధం చేశారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘శాప్’ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్ అకాడమీ నడిచింది. తెనాలి డబుల్‌హార్స్ మినపగుళ్లు సంస్థ యాజమాన్యం ఇందుకు సహకరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అకాడమీని పక్కన పెట్టారు. ఉదయం, సాయంత్ర వేళల్లో... ప్రస్తుతం వేసవిలో శాప్ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్‌లో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలో తెనాలికి గల ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకొని శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి శిబిరం నడుస్తోంది. 23 మంది ఉచితంగా శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు అండర్–14, అండర్–17, సబ్‌జూనియర్ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో ఆడినవారూ ఉన్నారు. కొత్తగా నేర్చుకునే ఆసక్తి కలిగినవారూ వస్తున్నారు. రోజూ ఉదయం 6–8 గంటలు, సాయంత్రం 4–7 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. స్టేడియం హ్యాండ్‌బాల్ కోచ్ నాగరాజు సెలవులో ఉండటంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్), పాటియాలలో శిక్షణ పొందుతున్న హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు పి.కాలేబును కోచ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఫిట్నెస్, క్రీడలో టెక్నిక్స్, స్కిల్స్ నేర్పుతున్నారు. ఈ నెలాఖరు వరకు జరిగే శిబిరాన్ని అవసరమైతే మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ) ఆధ్వర్యంలోని తెనాలి స్టేడియంలో హ్యాండ్‌బాల్ కోచ్‌గా నన్ను నియమించారు. నా పర్యవేక్షణలో వేసవి క్రీడాశిబిరం నడుస్తోంది. గతంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాను. ఎన్ఐఎస్లో శిక్షణ తీసుకుంటూ నాకున్న అనుభవంతో వేసవి శిబిరంలో శిక్షణ ఇస్తున్నా. క్రీడాకారులకు ఇదో మంచి అవకాశం. వారిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. – పి.కాలేబు, కోచ్ హ్యాండ్‌బాల్ క్రీడలో ఉచితంగా తర్ఫీదు ‘శాప్’, డీఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో తెనాలిలో గల క్రీడాస్టేడియం ఇప్పుడు శిక్షణకు వేదికగా నిలిచింది. వేసవి సెలవుల్లో ఇండోర్, ఔట్‌డోర్ ఆటల్లో చిన్నారులు సాధన చేస్తున్నారు. హ్యాండ్‌బాల్ అకాడమీ నడిచిన ఈ స్టేడియంలో ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఎన్ఐఎస్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. -
నల్లబర్లీ రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం
నరసరావుపేట: పొగాకు కొనుగోలు కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి నల్లబర్లీ పొగాకు సాగుచేసిన రైతులు నిలువునా మునిగిపోతున్నారని, ప్రభుత్వం సైతం వారి గోడు పట్టించుకోవడం లేదని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద పొగాకు రైతులతో ధర్నా నిర్వహించారు. హరిబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో నల్లబర్లీ పొగాకును కనీస మద్దతు ధర రూ.15వేల నుంచి రూ.18వేల వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ధర కాస్త ఆశాజనకంగా ఉండడం, కంపెనీ ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి రైతులను సంప్రదించి ఇతర పంటలు సాగు చేయొద్దని, నల్లబర్లీ సాగుచేస్తే మంచి ధర చెల్లిస్తామని నమ్మించారన్నారు. తీరా పంటచేతికి వచ్చాక కంపెనీలు మొత్తం సిండికేట్‌గా ఏర్పడి రైతులను లూటీ చేసేందుకు సిద్ధమయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మోసాన్ని ప్రభుత్వం చోద్యంగా చూస్తుందని ఎద్దేవా చేశారు. పర్చూరు, ఇంకొల్లు తదితర ప్రాంతాలలో పొగాకు సాగుచేపట్టిన రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం స్పందిస్తుందని ప్రశ్నించారు. ఇటీవల ఉద్యాన పంటలపై సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకు రూ. లక్ష ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెబుతున్న వ్యాఖ్యలు గారడీ మాటలను తలపిస్తున్నాయన్నారు. స్పందించకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో వందేళ్ల చరిత్రలో పండించిన పొగాకులో 30శాతం మాత్రమే భారతదేశంలో వినియోగిస్తున్నారని 70 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఎగుమతి చేసే పొగాకును కంపెనీలు ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. పొగాకు కొనుగోలుకు ఇప్పటికై నా ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈనెల చివరిలో రైతులను ఏకంచేసి ఛలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, ఉపాధ్యక్షుడు గుంటూరు విజయకుమార్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి కలెక్టరేట్ వద్ద ధర్నాలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు -
క్యాన్సర్ రోగులకు శుభవార్త
గుంటూరుమెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు అందించేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్సలను ఉచితంగా అందించేందుకు నాట్కో ట్రస్టు చైర్మన్ వి.సి.నన్నప నేని సుమారు రూ.50 కోట్లతో జీజీహెచ్‌లో వంద పడకలతో ఐదంతస్తుల క్యాన్సర్ వార్డు నిర్మించారు. తాజాగా రూ. 20 కోట్లతో మరో క్యాన్సర్ భవన నిర్మాణం చేస్తున్నారు. ప్రతి ఏడాది రూ.కోట్లాది విలువైన క్యాన్సర్ మందులను సైతం నాట్కో ఫార్మా వారు ఉచితంగా అందజేస్తున్నారు. నాట్కో ట్రస్టు క్యాన్సర్ రోగులకు చేస్తున్న సేవలకు మరింత మెరుగైన వైద్యం అందించేలా సుమారు రూ.18 కోట్లతో ప్రభుత్వం వైద్య పరికరాన్ని జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు అందజేసింది. క్యాన్సర్ శరీరంలో ఏ భాగంలో ఉంది, ఇతర భాగాలకు క్యాన్స ర్ సోకుతుందా, లేక అక్కడే ఉందా, అనే పూ ర్తి విషయాలు తెలుసుకునేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం ఉపయోగపడుతుంది. ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ పరీక్ష చేయించేందుకు సుమారు రూ.25 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్‌లో వైద్య పరికరం అందుబాటులోకి రావడం ద్వారా పేద క్యాన్సర్ రోగులకు మేలు చేకూరనుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీజీహెచ్‌లో రూ. 18 కోట్లతో పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు -
కార్మికులకు మెరుగైన వసతులు కల్పించండి
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి ఆయా గుత్తేదారు సంస్థలను ఆదేశించారు. రాజధాని నిర్మాణాలలో పనిచేసేంందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు గుత్తేదారు సంస్థలు కల్పిస్తున్న సదుపాయాలను ఆమె గురువారం క్యాంపులకు వెళ్లి తనిఖీ చేశారు. మొదట తుళ్లూరులోని ఆర్వీఆర్ సంస్థ క్యాంపును పరిశీలించారు. ఎండ అధికంంగా ఉండటంతో అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. కార్మికులకు భోజన వసతిపై ఆరా తీశారు. కార్మికుల కుటుంబ సభ్యులు వచ్చినపుడు నివసించేందుకు ప్రత్యేక వసతి కల్పించాలని, వారి పిల్లలు చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఐనవోలు, శాఖమూరులోని ఎన్సీసీ, ఆర్వీఆర్ సంస్థల క్యాంపులు పరిశీలించారు. -
విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం
పర్చూరు(చినగంజాం): విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటన గురువారం పర్చూరు నెహ్రూనగర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. నెహ్రూనగర్ కాలనీకి చెందిన నల్లబోతుల రాజాకు చెందిన పూరింటిలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పంటుకుంది. దాంతో పూరిల్లు పూర్తిగా తగులబడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఇంటిలోని నగదు, వెండి ఆభరణాలు, విలువైన కాగితాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి, సకాలంలో అగ్నిమాపక యంత్రం రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి అదుపులోనికి తీసుకొని వచ్చారు. సుమారు రూ.లక్షపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. రూ.లక్షకు పైగా నష్టం -
సబ్ డివిజన్లో పెరిగిన హత్యలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా పోలీసులు గుట్టుచప్పుడు వ్యవహరిస్తున్నారు. అసలు ఆ ఘటనలను బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతూ కేసులను నీరు గారుస్తున్నారనే విమర్శలు తరచు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా ఇలాంటి ఘటనే గురువారం వెలుగులోకి వచ్చింది. వడ్డేశ్వరం – ఇప్పటం బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున ముళ్లపొదల్లో గుర్తుతెలియని అస్తిపంజరం ఉన్నట్లు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. గత ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా ఎముకల గూడును అక్కడి నుంచి తరలించారు. జనసంచారం లేని ఆ ప్రాంతంలో ముళ్లపొదల్లో మూడు నాలుగు నెలల క్రితం మృతదేహాన్ని పడవేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం పోలీసులు బయటకు తీసిన అస్తిపంజరం పురుషునిదా? లేదా మహిళదా? అనేది నిర్ధారించడానికి కూడా వీలులేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలు సేకరించడంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మృతదేహంపై దుస్తులు ఉంటే వాటికి సంబంధించి మగవారు అయితే షర్ట్ బటన్లు, ప్యాంట్ బకిల్స్, జిప్ లాంటివి లభించేవి. ఆడవారు అయితే హెయిర్ పిన్స్ కానీ, జాకెట్ హుక్స్ కానీ ఉండేవి. ఎవరైనా చంపి ఆధారాలు లభించకుండా దుస్తులను తీసివేసి ఆ మృతదేహాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మహిళదా, పురుషుడిదా అని నిర్ధారించలేని పరిస్థితి గుట్టుచప్పుడు కాకుండా ఎముకలను తొలగించిన పోలీసులు హత్య కేసులు పెరుగుతున్నా ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం ఈ మధ్యకాలంలో మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో వేశ్యలు, ట్రాన్స్‌జెండర్స్ ఎటువంటి జన సంచారం లేని ప్రాంతాల్లో తిరుగుతూ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గొడవలు ఏర్పడినపుడు, ఆధిపత్య పోరు వచ్చినప్పుడు హత్యలు కూడా జరుగుతున్నాయి. తాడేపల్లి రూరల్‌లోని కొలనుకొండలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో గుంటూరు చానల్ ఒడ్డున ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పెదవడ్లపూడి – కాజ మధ్య పొలాల్లోని బీటీ రోడ్లో ఓ ట్రాన్స్‌జెండర్ తన ప్రియుడి కోసం మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇన్ని సంఘటనలు జరిగినా తాడేపల్లి పోలీసులు మాత్రం అస్తిపంజరం ఉందన్న సమాచారం అందిన వెంటనే ఎటువంటి విచారణ చేయకుండా ఆ అస్తిపంజరాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్చురీకి తరలించారు. మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలలో ఎముకల గూడుకు పోస్ట్‌మార్టం చేయలేమని చెప్పడంతో పోలీసులు గుంటూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. -
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను గురువారం రాత్రి పశుప్రదర్శన కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిది జతలు పోటీలో పాల్గొన్నాయన్నారు. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఆరుపళ్ల విభాగం పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన శ్రీకావ్య నంది బ్రీడింగ్ బుల్స్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 15 నిమిషాల వ్యవధిలో 3911.08 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని కావ్యమధు ఎడ్ల జత 3583.2 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం పంగులూరు గ్రామానికి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన గాదే అశేర్ సుమన్వీరెడ్డి ఎడ్ల జత 3,481.8 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 3412.3 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 3,313.3 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
మహాకుంభాభిషేక పూజలు ప్రారంభం
అద్దంకి: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి నూతన విమాన శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో నిర్వహించతలపెట్టిన మహాకుంభాభిషేక కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. దానిలో భాగంగా స్వామివారికి కలశం సమర్పించిన నలమలపు విజయభాస్కరరెడ్డి దంపతులు కలశ అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ తిమ్మనాయుడు, సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భరత నాట్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం తెనాలి: స్థానిక శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ఉదయం 11 గంటలకు స్వామి వారిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు అంకురారోపణ, ధ్వజారోహణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవాన్ని జరిపారు. ఆలయ సహాయ కమిషనర్/కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తిరుమలగిరి హుండీ ఆదాయం రూ. 26.41 లక్షలు తిరుమలగిరి(జగ్గయ్యపేట): గ్రామంలో వేంచేసియున్న వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.26,41,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. ప్రాంగణంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత నెలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్‌కల్యా, పరిటాల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. లెక్కింపు సమాచారాన్ని ఆలయ పాలకవర్గానికి ఇవ్వలేదని లెక్కింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన కల్యాణ మహోత్సవాల్లో ఈవో ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి గ్రామస్తులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో ఆలయ ఈవో కార్యాలయంలో లేరు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వెంకటపాలెం యూపీ పాఠశాలలో చోరీ తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం యూపీ స్కూల్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్ఎం జానకీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఇటీవల ప్రధానమంత్రి రాక నేపధ్యంలో వసతి కోసం పోలీసులకు పాఠశాలను ఇచ్చామని, కార్యక్రమం అనంతరం ఆఫీసు గదిలో ఉన్న రూ.20 వేల పెద్ద సౌండ్ బార్, రూ.3 వేల చిన్న సౌండ్ బాక్స్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
ప్రభుత్వానికి నివేదించాం
తెనాలి: భవన నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి కొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో జీవో జారీ చేసింది. సాంకేతిక కారణాలతో మార్చి నెల నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ విధానంలో భవన నిర్మాణాలకు అనుమతుల కోసం కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ యజమానులు తిరగాల్సిన పనిలేదని పేర్కొన్నారు. అధికారులు కొర్రీలు పెట్టి వేధిస్తారన్న ఆందోళన అవసరం లేదన్నారు. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్టీపీ, లైసెన్స్డ్ సర్వేయర్) ద్వారా భవన నిర్మాణానికి దరఖాస్తును పోర్టల్‌లో అప్లోడ్ చేసి, గంటల వ్యవధిలోనే అనుమతులు పొందవచ్చని చెప్పారు. నిబంధనలకు లోబడి భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా పొందవచ్చని తెలిపారు. ఈ విధానంలో 18 మీటర్ల ఎత్తులోపు అయిదు అంతస్తుల్లో నిర్మాణాలకు సులభతరం చేస్తూ ప్రభుత్వం ‘స్వీయ ధ్రువీకరణ పథకం’ తీసుకొచ్చింది. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి ఉంచింది. బాధ్యతంతా వారిదే.. దరఖాస్తులు, వాటికి అనుబంధ పత్రాలు అప్లోడ్ చేసిన నాటి నుంచి నిర్మాణ పనులు పూర్తి చేసే వరకు అన్ని దశల్లోనూ టెక్నికల్ పర్సన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇంటి యజమానులు, నిర్మించిన కట్టడాల్లో ఏవైనా సాంకేతికపరంగా తప్పులు చేసినట్టు నిర్ధారణ అయితే సంబంధిత లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ లైసెన్సును అయిదేళ్లపాటు రద్దు చేస్తామని పేర్కొంది. తప్పు తీవ్రత ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని తెలిపింది. ఆమోదిత లే అవుట్లలోని ప్లాట్లలోనే నిర్మాణాలు చేయాలని షరతు విధించింది. యాజమాన్య హక్కులు కలిగి ఉండాలని తెలిపింది. సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ వంటివి తప్పనిసరి చేశారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యహరించినట్టు ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూస్తే అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్లాను ఇచ్చిన తర్వాత యజమాని ఎక్కడైనా ఉల్లంఘిస్తే తమదెలా బాధ్యత అవుతుందని ఎల్టీపీలు, లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ నిర్మాణం చేసినపుడు మేమే సమాచారం ఇవ్వాలట! అధికారులు వచ్చి కూలగొడతారట... ఇదేం న్యాయం...’ అంటూ ప్లానర్లు ఆందోళన చెందుతున్నారు. ఇంటి ప్లాను కోసం వచ్చిన వారికి ఇదే చెప్పడంతో తిరిగి వెళ్లిపోతున్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంతూళ్లలో ఇళ్ల నిర్మాణాన్ని మానుకొని, ఉంటున్న నగరంలోనే అద్దె ఇళ్లలో కొనసాగటమో.. అక్కడే ఏదైనా ప్లాటు కొనుక్కోవటమో చేస్తున్నారు. మరోవైపు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్, వారి దగ్గర పనిచేసేవారు ఉపాధి కోల్పోతున్నారు. అధికారులందరూ ఏం చేస్తారో?తెనాలి మున్సిపాలిటీ వరకు చూసుకుంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు 22 మంది ఉంటారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్లాన్లు గీసి ఉపాధిని పొందుతుంటారు. పట్టణంలో నెలకు 40–45 వరకు ప్లాన్లు ఇస్తుంటారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పథకంలో ప్లాను గీసే బాధ్యతతోపాటు కచ్చితంగా ఆ ప్రకారం ఇల్లు/ భవనాన్ని నిర్మించేలా చూడాల్సిన బాధ్యతనూ వీరిపై ఉంచింది. పట్టణ మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ఉంటారు. అనధికార నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ విభాగంపైనే ఉంది. అయినా కేవలం లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లపైనే భారం మోపటం విమర్శలకు దారితీస్తోంది. నూతన విధానం కింద 60, 100, 150 గజాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు వసూలు చేస్తున్న ఫీజులు అధికం. దీనికితోడు కఠిన నిబంధనలతో చిన్న స్థలాల్లో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే గ్రామాల్లో ప్లాన్లు లేకుండానే ఇళ్ల నిర్మాణం చాలాకాలంగా జరుగుతోంది. సగటున పది ఇళ్లు నిర్మిస్తుంటే, ఒక ఇంటికి మాత్రమే ప్లాను గీయిస్తున్నారని, ఇప్పటివరకు జరిగిన ఇంటి నిర్మాణాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని చెబుతున్నారు. భవన నిర్మాణ అనుమతుల నూతన జీవోపై తీవ్ర వ్యతిరేకత ఎల్టీపీలు, సర్వేయర్లను బాధ్యులను చేసేలా నిబంధనలు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా నిలిచిన ఇంటి ప్లాన్ల తయారీ అడ్డగోలు నిబంధనలతో ఆమోదం కోసం రాని దరఖాస్తులు అవగాహన ప్రచారం పేరిట ఆపసోపాలు పడుతున్న అధికారులు ఇంటి ప్లాన్ల దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవటంపై ప్రభుత్వానికి నివేదించాం. నూతన జీవోలో రెండు సవరణలు చేశారు. ప్రస్తుతమున్న ప్లానర్లు కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించారు. భవన నిర్మాణం చేయదలచినవారు పట్టణ ప్లానింగ్ అధికారులు లేదా హెల్ప్ డెస్క్‌ను సంప్రదిస్తే ప్లాను ఇస్తారు. కొత్తగా అర్హత కలిగిన ప్లానర్లు ఎవరైనా ముందుకొస్తే లైసెన్సులు ఇస్తాం. వారి చేత ప్లాన్లు తీసుకోవచ్చు. – మధుకుమార్, రీజినల్ డెప్యూటీ డైరెక్టర్, టౌన్‌ప్లానింగ్ విభాగం -
కాటేస్తున్న కాల్ నాగులు
బాపట్లశుక్రవారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2025అడ్డదిడ్డంగా సర్కార్ ప్లాన్అస్తిపంజరం కలకలంసాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.300 టీఎంసీలకు సమానం. దుర్గమ్మకు వెండి పంచపాత్ర ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు గురువారం వెండి పంచపాత్ర సమర్పించారు.సదరం క్యాంప్ తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారం కొనసాగింది. 50 మంది దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. బాపట్ల: పొదుపు సంఘాలలోని 30 వేల కుటుంబాలకు జీవనోపాధులు కల్పించడం, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పేర్కొన్నారు. పొదుపు మహిళల జీవనోపాధుల కార్యకలాపాలు, ఆర్థికాభివృద్ధి అంశాలపై సమావేశం బాపట్లలోని సాయిరామ్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించారు. డీఆర్డీఏ, మెప్మాలోని క్షేత్రస్థాయి పట్టణ, గ్రామ సంఘాల నాయకులకు మెగా వర్క్‌షాప్ నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా అమలయ్యే పథకాలు, రాయితీలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. సీడాప్ ద్వారా నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణలు, ఉద్యోగ అవకాశాలపై రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాను ప్రథమంగా నిలిపి ఏపీ గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం, అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ జె వెంకట మురళిని అధికారులు, గ్రామ సంఘాల నాయకులు సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పొదుపు మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందని అన్నారు. వారంతా నికర ఆదాయం సాధించేలా చైతన్య పరచాలని సూచించారు. బాపట్ల జిల్లాలో 33,390 పొదుపు సంఘాలు ఉండగా అందులో నాలుగు లక్షల కుటుంబాలు సభ్యులుగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది ముప్పై వేల కుటుంబాల జీవన స్థితిగతులను మార్చడానికి కార్యోన్ముఖులు కావాలని వారిలో స్ఫూర్తి నింపారు. సూర్య ఘర్ పథకంతో ప్రకృతికి మేలు ఇస్తూనే సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలో 60 వేల గృహాలకు సౌర విద్యుత్ యూనిట్లు స్థాపించడం లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలోనే బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో అవకాాశాలను కల్పిస్తుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ కె.శ్రీనివాసరావు తెలిపారు. బాపట్ల జిల్లా పర్యాటక రంగంగా అభివృద్ధి జరగనుంద న్నా రు. జిల్లా మహిళ సమాఖ్య అధ్యక్షురాలు ద్రాక్షావల్లి, సీపీడీసీఎల్ ఎస్ఈ ఆంజనేయులు, ఎల్డీఎం శివకృష్ణ, మెప్మా పీడీ పి.శ్రీహరి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పనులు వెంటనే చేపట్టాలి నీటి పారుదల శాఖలోని ఆపరేషన్, నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, పర్చూరు, చీరాల నియోజకవర్గాలలో నీటిపారుదుల శాఖ కు ఆపరేషన్, నిర్వహణ కింద మొత్తం 454 పనులకు రూ.12 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం పొందిందని తెలిపారు. తాగునీటికి సంబంధించి ఈనెల 10వ తేదీన నీటిని నిలుపుదల చేసినందున, మరమ్మతులు ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా, నిల్వలపై బాపట్ల మున్సిపల్ కమిషనర్‌ను అడిగి ఆరా తీశారు. గుంటూరు, నీటిపారుదల శాఖ ఎస్ఈ పి వెంకటరత్నం పాల్గొన్నారు.సాక్షి టాస్క్‌ఫోర్స్: చీరాల నియోకవర్గంలో కాల్ నాగులు బుసకొడుతున్నాయి. అవసరానికి అప్పు తీసుకున్న పాపానికి సామాన్యులను నిత్యం వేధిస్తున్నాయి. అసలుకు నాలుగింతల వడ్డీ కలిపి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. అప్పు తీసుకున్న వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతూ మానవత్వం మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నాయి. బాధితులు ఇల్లు, గ్రామ విడిచి పారిపోయేలా చేస్తున్నాయి. ప్రజలు వడ్డీ జలగల వలలో చిక్కుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏకంగా బాధితుల ఇళ్ల పైకి వెళ్లి దాడులకు పాల్పడుతున్నారు. నగదు కట్టకపోతే ఇంటికి తాళాలు వేసి బాధితులను ఇంటి నుంచి బయటకు గెంటుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లిన బాధితులకు న్యాయం జరగడంలేదని వాపోతున్నారు. వేధింపులు, దౌర్జన్యాలు.. ● వడ్డీకి ఇచ్చిన నగదు ఏదైనా కారణంతో బాధితులు కట్టలేకపోతే వారికి వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు మొదలవుతాయి. అంతటితో ఆగకుంటా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఇళ్లపై దాడి చేసి వారి ఇళ్లకు తాళాలు వేసిన సంఘటన ఉన్నాయి. ఎదురు తిరిగి మాట్లాడితే దాడికి పాల్పడుతున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు, దౌర్జన్యాలు తాళ లేక బాధితులు ఇల్లు, గ్రామం విడిచి పారిపోయిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. ● దేశాయిపేట పంచాయతీ విజయనగర్ కాలనీకి చెందిన షేక్ ఖజీ మొఘల్ బెల్దారు పనులు చేస్తూ జీవిస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులతో అదే ప్రాంతానికి చెందిన దంపతుల వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దానికి సంబంధించి రూ.1.30 లక్షలు తిరిగి చెల్లించినట్లు బాధితులు తెలిపారు. అయినప్పటికీ ఇంకా రెండు లక్షలు చెల్లించాలని లేదంటే చంపేస్తామని బెదిరించి ఇంటిపై దాడి చేసి ఇంట్లో నుంచి బయటకు నెట్టి ఇంటికి తాళాలు వేసినట్లు బాధితులు తెలిపారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ● వడ్డీ వ్యాపారుల బెదిరింపులు, దాడులకు భయపడి రామానగర్ మూడోలైనుకి చెందిన ఒక కుటుంబ మూడు నెలల కిందట ఇంటికి తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లిపోయింది. ● రామన్నపేట పంచాయతీ స్ట్రయిట్ కాలవ కట్టపై నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటున్న రెండు కుటుంబాలు వడ్డీ వ్యాపారుల దాడులకు భయపడి మూడు నెలల కిందట ఇల్లు వదిలి కుటుంబాలతో గుంటూరు తరలిపోయారు. ● అక్కాయిపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో ఒక కుటుంబం వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఇల్లు విడిచి వెళ్లిన సంఘటన ఉంది. ● రామన్నపేట పంచాయతీ అచ్చుకట్లలంపలో నివాసం ఉంటున్న కుటుంబం తమ కుటుంబ అవసరాల కోసం అప్పు చేయడంతో వడ్డీ వ్యాపారులు వేధింపులు, దాడులతో ఇల్లు విడిచి 8 నెలల కిందట హైదరాబాద్ వెళ్లిపోయారు. ● ఇప్పటికై నా ఉన్నత అధికారులు కాల్‌మనీ వడ్డీ వ్యాపారుల బారి నుంచి పేద ప్రజలకు కాపాడాలని కోరుతున్నారు. 7న్యూస్రీల్వడ్డీ వ్యాపారం తీరుతెన్నులు.. దేశాయిపేట పంచాయతీ విజయనగర్ కాలనీకి చెందిన ఒకరు, ఈపురుపాలెం నుంచి వచ్చి విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మరొకరు. చీరాల–వేటపాలెం రోడ్డు పక్కన వేటపాలెం ఆర్టీసీ పెట్రోల్ బంక్ దగ్గరలో మరో ఇద్దరు, రాపూరిపేట అచ్చుకట్లలంపలో నలుగురు మహిళలు, కొత్తపేటలో మరొకరు ఇదే విధంగా మరి కొందరు కొంత మొత్తంలో నగదు అప్పుగా ఇస్తారు. రూ.10 వడ్డీగా వసూలు చేస్తారు. ఇచ్చిన అప్పును కిస్తీల రూపంలో ప్రతి రోజూ కొంత మొత్తంగా నగదు చెల్లించేలా అవగాహన కుదుర్చుకుంటారు. పట్టి పీడిస్తున్న వడ్డీ జలగలు అసలుకు నాలుగింతులు కట్టినా వేధింపులు దాడులకు పాల్పడుతున్న వడ్డీ వ్యాపారులు పోలీసుల తూతూ మంత్రపు చర్యలు ఇల్లు, గ్రామం విడిచి పారిపోతున్న బాధితులు -
కల్తీ ఆహార విక్రయాలపై కఠిన చర్యలు
వేటపాలెం: కల్తీ ఆహారం విక్రయించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ హెచ్చరించారు. వేటపాలెం బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద గల గాయిత్రి బిర్యాని హోటల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చికెన్, మటన్, పలావుల్లో కల్తీ ఉన్నట్లు తరచూ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేశామన్నారు. హోటల్ ప్రాంగణంలో అపరిశుభ్రంగా ఉందని, నిల్వ ఉంచిన మాంసాన్ని వండి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిన్నట్లు తెలిపారు. హోటల్లోని చికెన్, మటన్, ఇతర పదార్థాలను, వంట నూనెలను ఆయన పరిశీలించారు.పాలిసెట్‌లో జిల్లా విద్యార్థికి రాష్ట్ర స్థాయి ర్యాంకుబల్లికురవ: పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫలితాల్లో బల్లికురవ మండలంలోని కొప్పరపాడు ఉన్నత పాఠశాల విద్యార్థి కంభాల నాగసాయి చరణ్‌తేజ రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించినట్లు ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు జి.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. 120 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో 119 మార్కులు కై వసం చేసుకుని రాష్ట్రస్థాయిలో 69వ ర్యాంకు, బాపట్ల జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు చెప్పారు. ఇటీవల విడుదల అయిన పదో తరగతి ఫలితాల్లో 590 మార్కులు పొందిన చరణ్‌తేజ మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విదితమే. చరణ్‌తేజను పాఠశాల ఉపాధ్యాయులు, సీఎంసీ, గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు.హోమ్స్‌ను సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగుంటూరు లీగల్: క్యాలెండర్ యాక్టివిటీస్‌లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు బుధవారం గుంటూరులోని హోమ్స్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, శిశు గృహం, స్వధార్ హోమ్, లీమా డెఫ్ అండ్ డమ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడున్న అధికారులతో మాట్లాడారు. పిల్లలకు అందుతున్న విద్య, వైద్య సదుపాయాలు, రూంలను పరిశీలించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, స్వధార్ హోమ్‌లో మహిళలకు అందుతున్న సదుపాయాల గురించి వాకబు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి రిజిస్టర్స్‌ను పరిశీలించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఫ్రీ లీగల్ ఎయిడ్, బాధిత మహిళలకు అందే పరిహారం గురించి వివరించారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు.విపత్తుల నిర్వహణపై అవగాహన అవసరంగుంటూరు వెస్ట్: ప్రకృతి వైపరీత్యాలు, భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కనీస అవగాహన ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) షేక్ ఖాజావలి అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళనకు గురికాకూడదని తెలిపారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీలైనంత వరకు నష్టం తగ్గించడం మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఫైర్ వస్తోందని తెలుసుకోవడానికి ముందుగా పొగను గుర్తించాలని, ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారంతా బయటకు వచ్చేయాలని తెలిపారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అవిశ్వాసపాత్రుడికి వెన్నుపోటు!
వంచనకు, వెన్నుపోటుకు మారు పేరు ఆ పార్టీ. ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు చాలామంది అదే పేరుతో సంబోధించడం తెలిసిందే! అలాంటి పార్టీని, అధినేతను నమ్మి చేరితే వెన్నుపోటు, భంగపాటు తప్ప ఏం జరుగుతుంది? ఇప్పుడు చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుకు అచ్చం అలాగే జరిగింది. వైఎస్సార్సీపీలో మెజార్టీ కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై న వ్యక్తి.. అనైతికంగా సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచి పచ్చ పార్టీలో చేరి పట్టుమని 15 రోజులు ముగియకుండానే అదే వెన్నుపోటుకు బలయ్యారు. ఇప్పుడు చీరాలతోపాటు జిల్లాలో ఇదే చర్చనీయాంశంగా మారింది. జంజనంకు ఇలా జరగాల్సిందేనని పార్టీలకతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, బాపట్ల: గత నెల 30వ తేదీన పచ్చ కండువా కప్పుకొన్న చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుకు ఆ పదవిని పచ్చపార్టీ నిర్దయగా పీకేసింది. పదవిని నిలబెట్టుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచి పచ్చ పార్టీ తీర్థం పుచ్చుకున్న జంజనం.. అదే తరహాలో పచ్చపార్టీ పదవి ఊడగొట్టింది. దీంతో జంజనం ఇప్పుడు రెంటికీ చెడ్డరేవడిలా మారారు. జంజనంకు వ్యతిరేకంగా సాక్షాత్తు ఆ పార్టీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే కొండయ్యలు చేతులెత్తి మరీ ఓటు వేయడం ఇక్కడ గమనార్హం. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో చీరాల మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు ఉండగా.. అత్యధికంగా 22 స్థానాలు గెలుచుకొని వైఎస్ఆర్ సీపీ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకుంది. జంజనం శ్రీనివాసరావును చైర్మన్‌గా ఎన్నుకున్నారు. కూటమి రాకతో కుట్రలు కూటమి అధికారంలోకి రావడం, చీరాల ఎమ్మెల్యేగా పచ్చ పార్టీకి చెందిన ఎం.ఎం.కొండయ్య ఎన్నిక కావడంతో అధికారం అడ్డుపెట్టి మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కూటమి కుట్రలకు తెరతీసింది. ప్రలోభాలకు తలొగ్గి వైఎస్సార్సీపీ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గాలకు చెందిన 22 మంది పచ్చ పార్టీలోకి వెళ్లారు. దీంతో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావును పదవి నుంచి దించేందుకు పచ్చపార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సూచనతో అవిశ్వాసం కోసం గత నెల 23న జిల్లా కలెక్టర్ వెంకట మురళికి లేఖ ఇచ్చారు. దీంతో కలెక్టర్ మే నెల 14వ తేదీన బలనిరూపణకు గడువు పెట్టారు. పదవి నిలబెట్టుకునేందుకు చైర్మన్ జంజనం పచ్చపార్టీ పంచన చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే, ఇతర పెద్దలతో మంతనాలు సాగించి ఎట్టకేలకు ఏప్రిల్ నెల 30వ తేదీన ఎమ్మెల్యే ఎంఎం. కొండయ్య, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుల సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ మారినా ఆయనకు ప్రయోజనం లేకుండా పోయింది. ఎమ్మెల్యే, కౌన్సిలర్లు ఆయన చైర్మన్ పదవిలో కొనసాగేందుకు ససేమిరా అన్నారు. దీంతో బుధవారం అవిశ్వాసం పెట్టారు. అవమానభారం తట్టుకోలేక చైర్మన్ జంజనం అవిశ్వాస తీర్మానం మొదలయ్యే పదిహేను నిమిషాల ముందే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. సాంకేతికంగా అది కుదరలేదు. చైర్మన్‌పై అవిశ్వాసం కొనసాగింది. ఐనా ఎమ్మెల్యే, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని ఏడవలేక నవ్వినట్టు గంభీరపు సందేశం ఇచ్చారు. వ్యతిరేకంగా ఎంపీ, ఎమ్మెల్యేలు జంజనం శ్రీనివాసరావు గత నెల 30న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం జరిగిన అవిశ్వాసంలో సాక్షాత్తూ ఆ పార్టీ బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యలు జంజనంకు వ్యతిరేకంగా చేతులెత్తి మరీ ఓట్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సన్నివేశం చూసిన చీరాల వాసులు నవ్విపోతున్నారు. పదవి ఇచ్చి గౌరవించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన జంజనంకు అదే పరిస్థితి వచ్చిందని, పార్టీలో చేర్చుకొని పచ్చపార్టీ తగిన బుద్ధి చెప్పిందని వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ చెప్పడంతోనే..చీరాల: మంత్రి లోకేష్ చెప్పడంతోనే తాను మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశానని, రానున్న రోజుల్లో టీడీపీతో తన పయనం ఉంటుందని జంజనం శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. చీరాల మున్సిపల్ చైర్మన్‌పై పచ్చ పార్టీ అవిశ్వాసం రాజకీయంగా పదవి ఇచ్చిన వైఎస్సార్సీపీకి ద్రోహం పదవి కోసం అనైతికంగా టీడీపీలో చేరిన జంజనం అవిశ్వాసానికే మొగ్గిన ఎమ్మెల్యే, పచ్చ పార్టీ కౌన్సిలర్లు పార్టీ మారినా చైర్మన్ పదవి ఇచ్చేది లేదన్న కౌన్సిలర్లు పదవి కోసం రేసులో ముగ్గురు కౌన్సిలర్లు.. ఎటూ తేలని పంచాయితీ రెంటికీ చెడ్డ రేవడిలా జంజనం పరిస్థితి పచ్చ పార్టీలో మొదలైన లొల్లి మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం వ్యవహారం చీరాల పచ్చ పార్టీలోనూ అసంతృప్తులు రాజేసింది. కౌన్సిలర్లు అవిశ్వాసం కోసం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగానే పచ్చ పార్టీ చీరాల పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెరపైకి వచ్చారు. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం అవసరం లేదని ప్రకటించడంతో ఆ పార్టీలోని లుకలుకలు రోడ్డునపడ్డాయి. మరోవైపు చైర్మన్ పదవి కోసం కౌన్సిలర్లు యాదవ సామాజికవర్గానికి చెందిన సాంబశివరావు, గౌడ వర్గానికి చెందిన ఎస్.లక్ష్మి, వైశ్య వర్గానికి చెందిన సుబ్బయ్యలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే మద్దతు కోసం కొందరు, ఆయన తనయుడి ఆశీర్వాదం కోసం ఇంకొందరు పోటీలు పడుతున్నారు. ఇప్పుడు అవిశ్వాసం కూడా ముగియడంతో చైర్మన్ గొడవ ఊపందుకోనుంది. మున్సిపాలిటీని వారం రోజులపాటు ప్రత్యేక అధికారి పాలనలో ఉంచి చైర్మన్ ఎన్నికకు వెళ్లాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైర్మన్ పదవి కోసం ఒక్కో కౌన్సిలర్ సుమారు రూ. 7 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లెక్కన రూ. కోట్లలోనే ఆశావహులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత మొత్తం వెచ్చించినా చైర్మన్ పదవి ఇంకా కేవలం 8 నెలలే ఉండడంతో కొందరు ఆలోచనలో పడుతున్నట్లు సమాచారం. పదవి ఎవరికి ఇచ్చినా మిగిలిన ఆశావహులు అలకబూనే పరిస్థితి కనపడుతోంది. ఇదే అవకాశంగా మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు సైతం తన వర్గాన్ని ఎగదోసే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అవిశ్వాసం వ్యవహారం చీరాల పచ్చపార్టీలో మరింతగా అగ్గి రాజేసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. -
చీరాల చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం
చీరాల: చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై కూటమి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌లు హాజరయ్యారు. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా చీరాల ఆర్డీఓ టి.చంద్రశేఖర్ నాయుడు వ్యవహరించారు. నాలుగు సంవత్సరాలపాటు చైర్మన్‌గా పనిచేసిన చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు టీడీపీ మద్దతు కౌన్సిలర్లతోపాటు ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్లు మొత్తం 22 మంది సంతకాలు చేసిన వినతిపత్రాన్ని గత నెల 23న జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళికి 17 మంది కౌన్సిలర్లు అందించారు. వారితో కూడా కలిపి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్యా బలం 24 ఉండడంతో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించేందుకు ఈ నెల 14వ తేదీని కలెక్టర్ ఖరారు చేసిన విషయం విదితమే. చైర్మన్ పదవికి రాజీనామా.. బుధవారం ఉదయం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆర్డీవోకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఉదయం 10 గంటలకు అధికారులు అవిశ్వాస తీర్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తీర్మానానికి 24 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి 26 మంది పాల్గొని మూజువాణి పద్ధతిలో అనుకూలంగా ఓటు వేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన తర్వాత మరో ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కూటమికి మద్దతుగా నిలిచారు. అనంతరం 12.30 గంటలకు వైస్‌చైర్మన్–1పై అవిశ్వాస తీర్మానానికి 24 మంది కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి 26 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లు వేశారు. మద్దతుగా 26 మంది కౌన్సిలర్ల తీర్మానం వైస్ చైర్మన్‌పైనా నెగ్గిన అవిశ్వాసం ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీలు హాజరు తేదీ ఖరారు తర్వాత ఆపలేం... మీడియాకు అనుమతి నిరాకరణ అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. దీంతో కార్యాలయం ఎదుట రోడ్డుపైనే ఎండలోనే మీడియా ప్రతినిధులు ఉండిపోయారు. గదిని కేటాయించాలని కోరినా అనుమతులు లేవంటూ లోనికి రానివ్వలేదు. రెండు గంటలపాటు రోడ్డుపైనే వేచి ఉన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత అధికారులు లోపలికి పిలవడంతో, బయటనే ఉంటామని జర్నలిస్టులు చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీలు బయటకు వచ్చి అవిశ్వాస తీర్మాన విషయాలను మీడియాకు వివరించారు. ఎన్నడూ లేని విధంగా కార్యాలయంలోనికి కూడా అనుమతించకపోవడం ఏంటని ఎమ్మెల్యే, ఎంపీల ఎదుట జర్నలిస్టులు వాపోయారు. అనంతరం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎంపీ టి.కృష్ణప్రసాద్‌లు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అవిశ్వాస తీర్మానం నిర్వహించేందుకు తేదీ ఖరారు అయిన తర్వాత చైర్మన్ వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి చేరారన్నారు. అయితే పార్టీలోకి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అవిశ్వాసం తీర్మానం రోజున చైర్మన్ పదవికి రాజీనామా చేయడం సరికాదన్నారు. ముందే రాజీనామా చేస్తే అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఉండేదే కాదన్నారు. అవిశ్వాసానికి తేదీ ఖరారు చేసిన తర్వాత ఆ ప్రక్రియను ఆపడం జరగదని, అలానే కూటమి కౌన్సిలర్లు అభిప్రాయానికి తమ మద్దతు పలికామన్నారు. చైర్మన్‌గా ఉన్న ఆయన హయాంలో వార్డులలో అభివృద్ధి కుంటుపడిందని కౌన్సిలర్లు చెబుతున్నారన్నారు. భవిష్యత్‌లో కూటమి కౌన్సిలర్ల సహకారంతో చీరాల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకారం అందిస్తామన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ అవిశ్వాస తీర్మాన కార్యక్రమాన్ని నియమనిబంధనల మేరకు నిర్వహించామన్నారు. వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను త్వరలో నిర్వహిస్తామన్నారు. అవిశ్వాసం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
పవర్ లిఫ్టర్ షానూన్కు సత్కారం
తెనాలి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగిన ఆసియన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సహా నాలుగు పతకాలు సాధించిన మదిర షానూన్‌ను బుధవారం స్థానిక కేవీఐకే జిమ్‌లో సత్కరించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్‌శ్యాంప్రసాద్ హాజరయ్యారు. షానూన్‌ను సత్కరించారు. ఆమె విజయాలు క్రీడాలోకానికి స్ఫూర్తినిచ్చేవని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. జిమ్ శిక్షకురాలు, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి మాట్లాడుతూ తెనాలికి చెందిన షానూన్ కేఎల్ యూనివర్సిటీలో బీఐఏఎస్ డిగ్రీ చదువుతూ, తెనాలి కేవీఐకే జిమ్‌లో సాధన చేస్తోందని చెప్పారు. రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలను సాధించిన తర్వాత తొలిసారిగా ఆసియా స్థాయి పోటీల్లో జూనియర్స్ విభాగంలో 47 కిలోల కేటగిరీలో పోటీ పడిందని తెలిపారు. పతకాలను సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. -
ఫ్లోరోసిస్ భూతంపై యుద్ధం
గుంటూరు మెడికల్: వయస్సుతో సంబంధం లేకుండా నేడు పలువురు ఫ్లోరోసిస్‌తో అనారోగ్యానికి గురవుతున్నారు. సమస్యను నియంత్రణలో పెట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా జిల్లావ్యాప్తంగా వైద్య పరీక్షలు చేయిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సిబ్బందితో వైద్య పరీక్షలు చేయిస్తోంది. మందులు కూడా ఉచితంగా అందజేస్తోంది. ఫ్లోరోసిస్ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను పూర్తిగా కట్టడి చేయవచ్చు. ఫ్లోరోసిస్ మహమ్మారిని కట్టడి చేయడమే ధ్యేయంగా జరుగుతున్న స్క్రీనింగ్ పరీక్షలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని, వ్యాధి బారిన పడకుండా మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచి స్తున్నారు. 2013లో నివారణ కార్యక్రమం ప్రారంభం ఫ్లోరోసిస్ బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ, నివారణ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం 2014 జూన్ నుండి అమల్లోకి వచ్చింది. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో 2014 నుంచి నేటి వరకు వైద్య సిబ్బంది పరీక్షలు చేసి బాధితులను గుర్తిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్ధులకు వైద్య పరీక్షలు చేసి దంత ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేశారు. ● ఫ్లోరైడ్‌తో కలుషితమైన నీటిని తీసుకోకూడదు. ● అధికంగా ఉన్న ప్రదేశాల్లో పండిన కూరగాయలు, పాలు, టీ, మాంస ఉత్పత్తులు తీసుకోకూడదు. ● బ్లాక్ టీ, సుపారి, రాక్ సాల్ట్, పాన్‌పరాగ్, పొగాకు వాడకూడదు. ● ఫ్లోరైడ్ కల్గిన టూత్ పేస్టులు, మౌత్‌వాష్ వాడరాదు. ● అల్యూమినియం పాత్రలను వంట చేసేందుకు వాడకూడదు. ● రక్షిత మంచినీటిని తాగాలి. ● పాలు, పెరుగు, జున్ను, బెల్లం, పచ్చటి ఆకుకూరలు,జీలకర్ర, మునగకాడలు, ఉసిరి, జామ, నిమ్మ, నారింజ, టమాటా, పప్పు ధాన్యాలు, చిరుదాన్యాలు, ఆకుకూరలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లి తీసుకోవాలి. ● క్యారెట్, బొప్పాయి, చిలకడ దుంపలు ఫ్లోరోసిస్ నివారణ, నియంత్రణకు దోహదపడతాయి జిల్లావ్యాప్తంగా ఉచితంగా వైద్య పరీక్షలు ఏడాదిలో 490 గ్రామాల్లో సర్వేతో బాధితుల గుర్తింపు 825 పాఠశాలల్లో స్క్రీనింగ్ పరీక్షలు ఫ్లోరోసిస్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యుల సూచన 490 గ్రామాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 490 గ్రామాల ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడి, అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని నూజెండ్ల, వినుకొండ, ఏనుగుపాలెం, కొచ్చర్ల, రెడ్డిపాలెం, రొంపిచర్ల, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు, కోటప్పకొండ, అత్తలూరు, 75 త్యాళ్లూరు, క్రోసూరు, అచ్చంపేట, రాజుపాలెం, చండ్రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అత్యధిక సంఖ్యలో బాధితులు ఉన్నారు. జిల్లాలో ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు 81 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 409 గ్రామాలు కలిపి మొత్తం 490 గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించారు. 19,682 ఇళ్లను సర్వే చేశారు. 47,854 మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 2,370 మంది అనుమానిత డెంటల్ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడినట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్య పరీక్షలు చేసి 509 మంది ఫ్లోరోసిస్ బారిన పడినట్లు తేల్చారు. ఉమ్మడి గుంటూరుజిల్లా వ్యాప్తంగా 825 పాఠశాలల్లో 24,612 మంది విద్యార్థులను పరీక్షించారు. ఇందులో 1,783 మంది అనుమానిత దంత ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్య పరీక్షలు చేసి 974 మంది విద్యార్థులు ఫ్లోరిసిస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ఫ్లోరోసిస్ రాకుండా జాగ్రత్తలు ఇవి -
ఉచితంగా వైద్య పరీక్షలు
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు వివరించి, బాధితులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాం. పాఠశాలల విద్యార్థులకు మందులు, విటమిన్ సీ బిళ్లలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 3,504 మంది ఫ్లోరైడ్ బాధితులకు నెక్ బెల్ట్, నడుం బెల్ట్, వాకింగ్ స్టిక్, ఫ్లోల్డింగ్ టాయిలెట్ చైర్ కిట్‌ను ఉచితంగా అందించాం. వ్యాధిపై అవగాహన కలిగేలా 1,315 ప్రాంతాల్లో పోస్టర్లు అంటించాం. మెడికల్ ఆఫీసర్లు 42 మందికి, పారా మెడికల్ సిబ్బంది 84 మందికి, హెల్త్ వర్కర్లు 335 మందికి, ఆశా వర్కర్లకు 980 మందికి ఫ్లోరోసిస్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించేలా నైపుణ్యం పెంపొందించాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు -
చిన్నారి మేధావి ప్రదీప్ నారాయణకు అరుదైన గుర్తింపు
తెనాలి: రూరల్ మండలం గుడివాడకు చెందిన చిన్నారి మేధావి బండికళ్ల ప్రదీప్నారాయణకు మరో గౌరవం దక్కింది. ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ వరల్డ్‌వైడ్ ఫౌండేషన్ ‘ఇంటర్నేషనల్ బెస్ట్ అచీవర్ అవార్డు’ లభించింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ, నీతి అయోగ్ల సహకారంతో ఫౌండేషన్ ఇటీవల విశాఖపట్నంలోని ప్రెస్‌క్లబ్‌లో ఇంటర్నేషనల్ సోషల్ అవార్డ్స్ ప్రదానోత్సవం నిర్వహించింది. ఇందులో ప్రదీప్నారాయణకు ఈ గౌరవాన్ని అందజేశారు. ప్రస్తుతం నాలుగేళ్ల వయసున్న చిన్నానరి 23 నెలల వయసు నుంచే అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్నాడు. తొలుత 150 పైగా వస్తువులు, కూరగాయలు, పక్షుల పేర్లను చెప్పాడు. ప్రస్తుతం 500 పైగా జంతువులు, వాహనాలు, జెండాలు, ఆకారాలు, రంగులు, ఫలాలు, కూరగాయలు, శరీర భాగాలు, ఆట బొమ్మలు, వస్త్రధారణ వంటి విభిన్న అంశాలను గుర్తించి చెప్పగలిగిన ప్రతిభను సొంతం చేసుకున్నాడు. భారత జాతీయ గీతాన్ని కేవలం 52 సెకన్లలోనే శ్రద్ధగా పాడుతున్నాడు. -
భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి
బాపట్ల: భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి సూచించారు. భూ పరిపాలన శాఖ అడిషనల్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లాలలోని అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం జరిగింది. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో రీ సర్వే కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. రేపల్లె డివిజన్‌కు సంబంధించి 100 మంది లబ్ధిదారులు డొంక పోరంబోకు భూములను ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారనే సమాచారం మేరకు వారి వివరాలు సేకరించాలని సూచించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి పట్టాల మంజూరు నిమిత్తం ప్రతిపాదనలు తయారు చేసి పంపాల్సిందిగా సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్లో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, సర్వేశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
పూలంగి సేవతో పవళింపుము స్వామీ!
● రంగనాథుడికి అంగరంగ వైభవంగా పుష్పయాగం ● సొలస ఆలయంలో ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవయడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో శ్రీభూ సమేత రంగనాయక స్వామి ఆలయం బుధవారం భక్తజనంతో కళకళలాడింది. ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు కై ంకర్యాల నిర్వహణ అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం వేకువజామునే రంగనాథస్వామికి ఎన్నోరకాల పుష్పాలను భక్తులు మేళతాళాలతో భజాభజింత్రీలతో గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పర్చూరి రామకృష్ణమచార్యులు ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పూలంగి సేవలు అందించారు. హోమపూజల్ని ముగించారు. సాయంత్రం అత్యధిక మంది భక్తులు పాల్గొని ద్వాదశ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవ చేశారు. భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఆయా కార్యక్రమాలను ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామపెద్దలు పర్యవేక్షించారు. -
భవన నిర్మాణ అనుమతులపై అపోహలు వీడండి
టౌన్ ప్లానింగ్ గుంటూరు రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ తెనాలి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన భవన నిర్మాణాల అనుమతులపై అనేక అపోహలున్నాయని, వాటిని వీడాలని టౌన్ ప్లానింగ్ విభాగ గుంటూరు రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ముందుకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం పట్టణ పరిధిలోని పలు సచివాలయాలను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన నూతన నిబంధనల వల్ల ఎటువంటి నష్టం లేదన్నారు. లైసెన్స్ సర్వేయర్లు కొందరు దీనిపై అపోహలు సృష్టించారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో అన్ని చోట్లా ప్లాన్ల దరఖాస్తు ప్రక్రియ నిలచిపోయిందని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని పట్టణాల్లో ఫ్లెక్సీలు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనధికార కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తెనాలి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ జేపీ రెడ్డి, తెనాలి అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శివన్నారాయణ, వాణి, టీపీవో సాంబశివరావు పాల్గొన్నారు. -
ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం
బాపట్ల: ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి పిలుపునిచ్చారు. రైతాంగం, కార్మికులపై భారం వేస్తూ దోపీడీ శక్తుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రమైన బాపట్లలో పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రమాదేవి మాట్లాడారు. జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు టి.కష్ణమోహన్ అధ్యక్షత వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యమాల ద్వారా ప్రజల పక్షాన పోరాటం చేయొచ్చు అన్నారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాబురావు మాట్లాడుతూ.. దేశంలో కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలతో ప్రజలపై భారం పడుతోందన్నారు. కులాల మధ్య చిచ్చు రేపుతున్నారన్నారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో నల్లబర్లీ పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ మజుందార్, ఎన్.బాబురావు, సీహెచ్ మణిలాల్, ఎం.కొండయ్య, వి. వెంకట్రామయ్య, బి.తిరుమల, టి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సామర్థ్యానికి మించి ఇసుక రవాణా తెనాలి: ఇసుక తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఇసుక రవాణాలోనూ ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. భారీ వాహనాల్లో కెపాసిటీకి మించి రవాణా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. భారత్ బెంజ్, టాటా బెంజ్ వంటి భారీ వాహనాల్లో ఇప్పుడు ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతోందని తెలిసిందే. వీటి కెపాసిటీ 17–18 టన్నులు మాత్రమే. ఇందుకు భిన్నంగా ఒక్కో వాహనంలో రూ.40 టన్నులు, అంతకుమించిన పరిమాణంలోనూ రవాణా చేస్తున్నారు. వాహనం బాడీకీ పైన దాదాపు మీటరు ఎత్తులో లోడింగ్ చేస్తున్నారు. పైన పట్టా కప్పి మరీ గమ్యస్థానానికి రవాణా చేస్తున్నారు. వాహనదారులకు అవస్థలు ప్రతిరోజూ పరిమితికి మించిన లోడింగ్‌తో ఇసుక రవాణా వాహనాలు తెనాలి మీదుగా వెళుతున్నాయి. ఇసుక జారిపోతున్నా, వెనుక వచ్చే ద్విచక్రవాహన దారులకు ఇబ్బందిగా ఉంటున్నా ఎవరికీ పట్టటం లేదు. కొద్దిరోజుల కిందట వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని రైల్వే లోబ్రిడ్జి వద్ద వాహనాల నుంచి ఇసుక జారిపోయి ప్రజలు ఇబ్బది పడ్డారు. కెపాసిటీ మించిన పరిమాణంతో ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాలతో రోడ్లు, కల్వర్టులు దెబ్బతింటున్నాయి. తెనాలి పట్టణంలోంచి వాహనాలు ప్రతిరోజూ పట్టపగలే వెళుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. -
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం
యద్దనపూడి: మండలంలో బుధవారం సాయత్రం ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. కొద్దిపాటి వర్షం కూడా పడింది. మండలంలోని పోలూరు గ్రామంలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. చెట్టుపక్కన ఉన్న వరిగడ్డి వామి కూడా కొద్ది మేర కాలిపోయింది. గ్రామం నడిబొడ్డున ఉన్న చెట్టుపై పిడుగుపడినా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు ఆ శబ్దానికి భయపడిపోయారు. మంటలు చెలరేగకుండా ఆర్పివేశారు. పిడుగుపాటుకు మహిళ మృతి యడ్లపాడు: పిడుగు పాటుకు మహిళ బుధవారం మృతి చెందింది. మండలంలోని కారుచోల గ్రామానికి చెందిన 15 మంది మహిళలు మిర్చికోతకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులు రావడంతో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో సమీపాన పిడుగు పడిన భారీ శబ్దం విని వారిలో ముగ్గురు మహిళలు కింద పడిపోయారు. వారిలో షేక్ పర్వీన్(35) చెవుల నుంచి రక్తం కారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు స్పృహ కోల్పోయారు. మృతురాలి భర్త షేక్ సైదావలి దివ్యాంగుడు. తాపీ పనులు చేస్తుండగా, వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
హెచ్ఐవీ మహిళలకు క్యాన్సర్ పరీక్షలు
నరసరావుపేట: స్థానిక ఏరియా వైద్యశాలలో హెచ్ఐవీతో జీవిస్తున్న మహిళలకు త్వరలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) విభాగంతో కలిసి ఎయిడ్స్ కంట్రోల్ అధికారులు దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ శాక్స్ జాయింట్ డైరక్టర్ డాక్టర్ పి.అంకినీడుప్రసాదు, డీడీ సీఎస్టీ డాక్టర్ చక్రవర్తి, పెప్ఫార్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాదు షేర్ ఇండియా అధికారులు డాక్టర్ జయకృష్ణ బుధవారం ఏరియా వైద్యశాలను సందర్శించి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్‌కుమార్, గైనకాలజీ విభాగ అధిపతులతో ఈ అంశంపై చర్చించారు. క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ చేయటం వలన హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి త్వరగా షుగర్, బీపీ, క్యాన్సర్ గుర్తించి ముందుగానే చికిత్స ప్రారంభించటం తద్వారా వారి జీవితకాలం పొడిగించే అవకాశం ఉన్నందున దీనికి కావాల్సిన సహాయసహకారాలు అందజేసేందుకు తాము సిద్ధమని హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ కె.ఏడుకొండలు, డాక్టర్ దయానిధి, గైనకాలజీ డాక్టర్ మంత్రూనాయక్, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద పాల్గొన్నారు. ఏర్పాట్లపై నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో ఏపీ శాక్స్ అధికారుల పర్యటన -
ఫ్లోరోసిస్‌తో అనర్థాలు
ఎముకల ఫ్లోరోసిస్‌తో కాళ్లు, చేతులు వంకరపోవడం, వెన్నుముక కట్టెల్లా బిగుసుపోవడం, కండరాలు, లిగమెంట్స్, కణజాలాలు, ఎర్ర రక్తకణాలు, వీర్య కణాలు, ఉదర భాగంలోని జీర్ణవ్యవస్థపై దీని ప్రభావం కనిపిస్తుంది. ఎముకలు పెలుసుబారిపోతాయి. దంత ఫ్లోరోసిస్ వల్ల పళ్లు పసుపు లేదా గోధుమ రంగు నుంచి నలుపుగా మారతాయి. ఫ్లోరోసిస్ నీటిని తాగడం వల్ల వెన్నముకలో ఉండే లిగమెంట్స్ ఉబ్బిపోతాయి. వెన్నుముకపై నరాలు ఒత్తుకుని కాళ్ళు, చేతులు తిమ్మిర్లు వస్తాయి. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. గర్భవతులకు పరీక్షలు చేయడం వల్ల పుట్టబోయే పిల్లలు ఫ్లోరోసిస్ బారిన పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. – డాక్టర్ జె. నరేష్‌బాబు, సీనియర్ స్పైన్ సర్జన్, గుంటూరు -
లే అవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిబాపట్ల: లే అవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో బాపట్ల మున్సిపాలిటీ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లే అవుట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. 2019 నుంచి బాపట్ల మున్సిపాలిటీ, బావుడా పరిధిలోని తొమ్మిది మండలాలలో మొత్తం 183 అనధికార లే అవుట్లను గుర్తించి వాటి వివరాలను డీటీసీపీకి పంపినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అందులో 86 లే అవుట్లను 22–ఎ కింద గుర్తించి రిజిస్ట్రేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలియజేశామని, మిగిలిన 97 లే అవుట్లను సబ్ డివిజన్లుగా చేసి పంపాలని వాటిని తిప్పి పంపారని వారు కలెక్టర్‌కు వివరించారు. 97 లే అవుట్లకు సంబంధించి సర్వే నెంబర్లు వారీగా ఆయా తహసీల్దార్లతో సబ్ డివిజన్ చేయించి వాటి వివరాలను బావుడాకు తెలియజేయాలని రెవెన్యూ డివిజన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆ వివరాలను డీటీసీపీకి పంపి రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త లేఅవుట్ల అనుమతులకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. మున్సిపాలిటీలలో, పంచాయతీలలో గృహ నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి ప్రభుత్వం సూచించిన నియమాలను బావుడా అధికారి వివరించారు. ఎవరైనా గృహాలు నిర్మించుకోవాలనుకునేవారు వారి దరఖాస్తులను పంచాయతీరాజ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా మాత్రమే చేసుకోవాలన్నారు. సమావేశంలో డీపీఓ ప్రభాకర్, బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, బాపట్ల, రేపల్లె, అద్దంకి, చీరాల మున్సిపల్ కమిషనర్లు, బావుడా ప్లానింగ్ అధికారి షేక్ ఖలీషా, లైసెనన్స్ టెక్నికల్ ఇంజినీర్లు పాల్గొన్నారు. మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మోటుపల్లి గ్రామం, మ్యూజియం నిర్మాణం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. కాకతీయులనాటి అభయ శాసనాలను తెలుగులోకి అనువదిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రాచీన వైభవం తెచ్చేలా ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. కోదండరామ దేవాలయానికి సమీపంలోని 5.8 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. కాకతీయులు, చోళుల నాటి శాసనాలు, పంచలోహాలను చిన్నగంజాంలోనే భద్రపరచడానికి మ్యూజియం నిర్మించాల్సి ఉందని తెలిపారు. మ్యూజియం నిర్మాణంపై పురావస్తు శాఖకు సమగ్ర నివేదికతతోపాటు లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాచీన సంపద ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియం, చైన్నె మ్యూజియం, విజయవాడ మ్యూజియంలో ఉందన్నారు. వాటిని తెప్పించడానికి దస్త్రాలను సిద్ధం చేయాలన్నారు. వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధితో మోటుపల్లి మరింత ప్రాచుర్యం పొందనుందన్నారు. సమావేశంలో చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సూర్యప్రకాశరావు, చిన్నగంజాం తహసీల్దార్ ప్రభాకర్‌రావు, మోటుపల్లి అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం
పర్చూరు(చినగంజాం): రాష్ట్రంలో రైతులు అధైర్యపడొద్దని ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని.. మనోధైర్యంతో మెలగాలని.. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు ఉప్పుటూరు సాంబశివరావు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంకొల్లు మండలం దుద్దుకూరుకు చెందిన మరో రైతు బిల్లా శ్యాంసన్ కుటుంబాలను పర్చూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డితో కలసి నాగార్జున పరామర్శించారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తోందన్నారు. వీరన్నపాలేనికి చెందిన ఉప్పుటూరు సాంబశివరావు బీసీ కులానికి చెందిన పేదవాడు అని.. కౌలుకు తీసుకున్న డబ్బులు కట్ట లేక, పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్మోహనరెడ్డిలు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండుగ అనే ధోరణిలోని పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేదలు వ్యవసాయం చేస్తూ.. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అయినా ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఇక్కడకు వచ్చినా ఎలాంటి సహాయం అందలేదంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహనరెడ్డి రూ.2 వేల కోట్లు పొగాకు రైతుకిచ్చి ఆదుకున్నారన్నారు. రైతులకు రైతు భరోసా అందించి జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మభ్యపెడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు భరోసా అందించి అండగా నిలవాలని కోరారు. రైతుల తరఫున పోరాడేందుకు మాజీ సీఎం జగన్ ఈ ప్రాంతానికి రావాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు.జగన్ ఆదేశాలతో పర్యటనలు అనంతరం పర్చూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెళ్లి రైతుల బాధలు తెలుసుకొని వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో తాత్సారం చేయకుండా తక్షణమే కంపెనీల ద్వారా కొనిపించడమో లేదా స్వయంగా ప్రభుత్వం కొనుగోలు చేయడమో చేయాలని కోరారు. ఐదేళ్ల జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని.. తిరిగి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారంతా సుఖపడతారన్నారు.ఆయా గ్రామా ల్లోని పొగాకు నిల్వలను వారు పరిశీలించారు. పార్టీ నాయుకులు భవనం శ్రీనివాసరెడ్డి, మార్టూరు, కారంచేడు మండల కన్వీనర్ పఠాన్ కాలేషావలి, జువ్వా శివరాంప్రసాద్, గర్నెపూడి రవిచంద్, ముప్పాళ్ల రాఘవయ్య, పాదర్తి ప్రకాష్, బిల్లా డేవిడ్ వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దావుపల్లి తండాలో విషాద ఛాయలు
వెల్దుర్తి: మండలంలోని దావుపల్లితండాకు చెందిన జొన్నగిరి రామాంజీ దంపతులు కూలీ పనుల నిమిత్తం మంగళవారం తెల్లవారుజామున యర్రగొండపాలెం వెళ్లి అక్కడ నుంచి బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో శివాపురం వద్ద అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామాంజీ, అంకమ్మ దంపతులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న తండావాసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వీరి మృతదేహాలను దావుపల్లితండాకు తీసుకొచ్చారు. మృతదేహాలు తండాలోకి రాగానే ఒక్కసారిగా రోదనలతో దద్దరిల్లింది. వీరికి ఐదు సంవత్సరాల పవన్, మూడు సంవత్సరాల చైతన్య అనే కుమారులున్నారు. పవన్‌కుమార్ 1వ తరగతి చదువుతుండగా చైతన్య ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలియగానే పవన్‌కుమార్ రోదిస్తుండగా.. చైతన్య దిక్కులు చూస్తున్నాడు. వీరికి తాతయ్య మాత్రమే ఉన్నాడు. పేద కుటుంబం కావటంతో వీరికి ఎవరూ దిక్కు లేకపోవటంతో తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామాంజీ, అంకమ్మలు రెక్కాడితేకానీ డొక్కాడని పరిస్థితులలో ప్రతిరోజూ కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. పనులకు వెళ్తూనే పిల్లలను చూసుకుంటూ పవన్‌కుమార్‌ను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. సంఘటన తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి దావుపల్లితండాకు వెళ్లి రామాంజి, అంకమ్మల మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘటన వివరాలు తెలుసుకొని సంతాపం వ్యక్తం చేశారు. -
20 సూత్రాల అమలుకు చిత్తశుద్ధితో పని చేయాలి
లంకా దినకర్బాబుబాపట్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, డ్వామా, డీఆర్డీఏ, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, గృహ నిర్మాణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, విద్యుత్, పబ్లిక్ హెల్త్, మెప్మా, పర్యాటక శాఖలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంతో అధికారులంతా సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా జీడీపీ 11.2 శాతం ఉండగా, రానున్న ఏడాదిలో 15 శాతానికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. అభివృద్ధి వైపు బాపట్ల జిల్లా అడుగులు వేయాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చాలా ముఖ్యమన్నారు. నీతి ఆయోగ్ సూచనలను పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా పని చేయాల్సి ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీరణం పెరిగితే, రసాయనాల వినియోగం పూర్తిగా అరికట్టవచ్చన్నారు. సూర్యలంక, రామాపురం, మోటుపల్లి బీచ్‌లు అభివృద్ధి చెందితే స్వర్ణాంధ్రప్రదేశ్‌లో బాపట్ల జిల్లాను భాగస్వామ్యం చేయవచ్చన్నారు. పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రాయో జిత స్వదేశీ దర్శన్ పథకం క్రింద సూర్యలంక బీచ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.97.52 కోట్లు మంజూరయ్యాయన్నారు. సూర్యలంక, రామాపురం బీచ్‌ల ‘బ్లూ ఫ్లాగ్’ స్టేటస్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పీఎం ఫసల్ బీమా పథకంపై అవగాహన కల్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. కలెక్టర్ జె.వెంకట మురళి, డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, సీపీఓ కె శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మరణంలోనూ ఒకరికొకరై..
వినుకొండ: పొట్టకూటికోసం వలస వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో రెండు జంటలు మృతిచెందిన ఘటన వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద జరిగింది. మృతుల్లో ఇద్దరు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని గడ్డమీదపల్లెవాసులుకాగా, మరో ఇద్దరు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి తండా వాసులుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. గడ్డమీదపల్లె గ్రామానికి చెందిన ఆరుగురు వ్యవసాయ కూలీలు బొప్పాయి పంట కోసేందుకు వాహనంలో తమ గ్రామం నుంచి పల్నాడుజిల్లా ఈపూరుకు బయలుదేరారు. గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై మార్గమధ్యంలో వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కొబ్బరిబొండాల లారీ బొలేరోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో పగడాల రమణారెడ్డి(45), భార్య సుబ్బమ్మ(40), జొన్నగిరి రామాంజీ(35) భార్య అంకమ్మ(28)లు మృతి చెందారు. లారీలో ఉన్న మరోముగ్గురు కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ, డ్రైవరు కదిరి నాగేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డా రు. గాయపడిన వారు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పగడాల సుబ్బమ్మ, బొట్టు అంకమ్మలు ఘటనా స్థలంలోనే మృతి చెందగా పగడాల రమణారెడ్డి, బొట్టు రామాంజీలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. సమాచారం తెలుసుకున్న వినుకొండ పోలీసులు ఘటనాప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద వార్త తెలుసుకుని మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు వినుకొండ ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మృతుల బంధువుల రోదనతో ఆస్పత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మిన్నంటిన రోదనలు పగడాల రమణారెడ్డి, సుబ్బమ్మలకు ముగ్గురు సంతానం. మొదటి కుమార్తె అరుణ కుమారికి వివాహం కాగా రెండవ కుమారుడు రమణారెడ్డి బీటెక్ కంప్లీట్ చేశాడు. చివరి కుమార్తె నబిత ఇంటర్ పూర్తిచేసింది. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుమార్తెలు, కుమారుడు రోదిస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ, కష్టపడుతూ తమకు కష్టం తెలీకుండా చూసుకునే తల్లిదండ్రులు ఇలా విగతజీవులుగా మారతారని తాము కలలోనూ ఊహించలేదంటూ రోదించారు. ● అలాగే మరో కుటుంబం బొట్టు రామాంజీ, అంకమ్మకి ఐదు, మూడు సంవత్సరాల కుమారులు ఉన్నారు. ఇంకా ఊహ కూడా తెలీకముందే పిల్లలు అనాథలుగా మారారని, ఇక వారికి దిక్కెవరంటూ బంధువులు పెద్ద పెట్టున రోదించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు మృతదేహాలను సందర్శించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వ్యవసాయ కూలీల వాహనాన్ని ఢీకొన్న లారీ ఘటనలో భార్యాభర్తలైన నలుగురు వ్యవసాయ కూలీలు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు మృతుల్లో ఇద్దరు ప్రకాశం జిల్లా వాసులు మరో ఇద్దరు వెల్దుర్తి మండలం దావుపల్లి తండావాసులుగా గుర్తింపు మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో వినుకొండ ప్రభుత్వాసుత్రిలో విషాద ఛాయలు -
చలివేంద్రాన్ని తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో తమ తండ్రి జ్ఞాపకార్ధం కుమారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున తగలబెట్టారు. సేకరించిన వివరాల ప్రకారం గరికె బాలాజీ జ్ఞాపకార్ధం ఆయన కుమారులైన దుర్గారావు, సూరిబాబు, గోపిలు ప్రతి సంవత్సరం వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఉండవల్లి సెంటర్లోని తాడేపల్లి రోడ్లో ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేశారు. అయితే ఈ చలివేంద్రానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పూర్తిగా తగలబడింది. ఘటనపై తాడేపల్లి పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణతో పాటు భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పరిపాలన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెనీ క్రిస్టినా మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు, జెడ్పీకి రావాల్సిన ఆదాయం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, రేవుల వేలం, షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి రావాల్సిన బకాయిలపై మండలాల వారీగా వివరాలు సేకరించారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న కల్యాణ మండపాలు, దుకాణాల నుంచి అద్దెలు, లీజు బకాయిలను వసూలు చేయాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు జెడ్పీకి రావాల్సిన ఆదాయ వనరులు, బకాయిలకు సంబంధించి మండలాల వారీగా సమీక్షించారు. డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ ప్రతినెలా ఇవ్వాల్సిన నివేదిక వివరాలను క్రమం తప్పకుండా పంపాలని సూచించారు. వార్షిక అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్, పెండింగ్‌లో ఉన్న బకాయిలు, న్యాయస్థానాల్లో ఉన్న కేసుల వివరాలను సేకరించారు. వివిధ అంశాలపై పరిపాలనాధికారులు పూర్ణచంద్రారెడ్డి, శోభారాణి, తోట ఉషాదేవి నివేదిక సమర్పించారు. సమావేశంలో అకౌంట్స్ అధికారి శామ్యూల్‌పాల్, ఎంపీడీఓలు, ఏఓలు పాల్గొన్నారు. -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
నరసరావుపేటటౌన్: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి అల్లూరయ్య మాట్లాడుతూ వినియోగదారుల దిన వారోత్సవాల్లో భాగంగా కల్తీలు, తూకాల్లో వ్యత్యాసాలపై వివిధ రూపాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా చట్టప్రకారం నడుచుకోవాలన్నారు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చట్టపరమైన అంశాలను వివరించారు. నరసరావుపేట, సత్తెనపల్లి ఇన్స్పెక్టర్లు సాయి శ్రీకర్, జాన్‌సైదా తదితరులు పాల్గొన్నారు. -
పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రేపల్లె: రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ ఏడీ నాంచారయ్య అన్నారు. పట్టణంలోని పశు వైద్యశాలలో పశు యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన దాణాను మంగళవారం ఆయన పంపిణీ చేసి, మాట్లాడారు. పశువులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. యజమానులు తమ పశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్, పశు వైద్యాధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు 20న రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు కారంచేడు: ఈ నెల 20వ తేదీన గ్రామ దేవత స్వర్ణమ్మ తల్లి తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎద్దుల పరుగు పందెం పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి రూ. 20 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాలుగో బహుమతి రూ. 5 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు దుర్గారావు 77308 30949, సాయికిరణ్ 63001 50488, నంగనం తేజ 80742 60245 ఫోను నంబర్లలో సంప్రదించాలని కోరారు. కోడి గుడ్ల లారీ బోల్తా జె.పంగులూరు: మండల పరిధిలోని ముప్పవరం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం అదుపు తప్పిన కోడి గుడ్లు లారీ బోల్తా పడింది. బోయపాలెం నుంచి టంగుటూరు వెళుతుండగా, ముందున్న వాహనాన్ని క్రాస్ చేయబోయి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌తోపాటు లారీ క్యాబిన్లో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కోడిగుడ్లు రోడ్డుపై పడి పగిలిపోయాయి. అప్రమత్తం అయిన హైవే సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అద్దంకి: మండలంలోని శింగరకొండ దేవస్థానం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు సీఐ సుబ్బరాజు మంగళవారం తెలిపారు. అతడి వయసు సుమారు 45 – 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికై నా మృతుడి ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. -
రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి
వడదెబ్బతో వృద్ధుడు మృతి గుంటూరు రూరల్: రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని బండారుపల్లి, నల్లపాడు రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో రేపల్లే నుంచి చర్లపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి వృద్ధుడు మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారుగా 65 నుంచి 70 సంవత్సరముల మధ్య ఉంటుందని, తెల్లజుట్టు, తెలుపు రంగు ఆఫ్ చేతుల చొక్కా, తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడని, ఎరుపు రంగు మొలతాడు కట్టుకుని ఉన్నాడన్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు, నడికుడి గవర్నమెంట్ రైల్వే పోలీసువారిని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు నడికుడి రైల్వే పోలీసు స్టేషన్ ఎస్ఐ రోశయ్య 8309369916, 9949063960 సెల్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నం రామ్మోహనరావు బాపట్ల టౌన్: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నం రామ్మోహనరావు తెలిపారు. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఆర్టీసీ కార్యాలయం ముందు అద్దంకి, చీరాల, బాపట్ల, రేపల్లె డిపోల పరిధిలోని నాయకుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ్మోహనరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత ఆదేశాలను వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అమలు పరచాలన్నారు. అక్రమ సస్పెన్షన్ల రద్దు చేసి, తిరిగి ఉద్యోగం ఇవ్వాలన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీహెచ్ఎస్ స్థానంలో ఆర్టీసీకి పాత వైద్య విధానాన్ని అమలు పరచాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ, ప్రభుత్వమే కొని ఉద్యోగులతో నడిచేలా చూడాలని పేర్కొన్నారు. నైట్ అవుట్ అలవెన్సులు రూ.150 నుంచి రూ.450కు పెంచాలన్నారు. సిక్ లీవులకు పూర్తి జీతం చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వైఎస్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి తులసి శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు పెంచలయ్య, గాంధీ ఆశాబాబు, జిల్లాలోని నాలుగు డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజల ఆందోళన
యంత్రాలతో ఇసుక తవ్వకాలపై కొల్లూరు: కృష్ణా నదిలో చేపడుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రజలు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడటంపై పత్రికల్లో వెలువడుతున్న కథనాలకు తోడు, గాజుల్లంకకు చెందిన వ్యక్తులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడంతో మంగళవారం రాత్రి రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, డీఎస్పీ ఎ. శ్రీనివాసరావులు గాజుల్లంక వద్ద ఇసుక క్వారీలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లకుండానే అధికారులు బాపట్ల–కృష్ణా జిల్లాల నడుమ రాకపోకలకు ఏర్పాటు చేసిన బాటలో ఆగి లారీలను నిలువరించి ప్రశ్నిస్తున్న సమయంలో ప్రజలు అధికారులను చుట్టుముట్టి తమ గోడు వినిపించారు. తమ పట్టా భూముల్లో సైతం తవ్వుకొని తరలిస్తున్నారని ఆర్డీవో ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. భారీ యంత్రాలతో గ్రామం వెంబడి తవ్వకాలు జరుపుతుండటం, నిర్దేశించిన పరిమాణాలను మించి ఇసుక తవ్వుకొని తరలిస్తుండటం కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, సముద్రపు నీరు చొచ్చుకొని వస్తున్నాయని అన్నారు. పశువులు తాగేందుకు సైతం చుక్క నీరు లేకుండా పోయిందని వాపోయారు. ఇసుక తవ్వకాలు చేపడుతున్న ప్రాంతం మైనింగ్ శాఖ నిర్దేశించిన ప్రదేశంలో జరగడం లేదని, కనీసం హద్దులు సైతం ఏర్పాటు చేయలేదని మైనింగ్ శాఖాధికారులను స్థానికులు ప్రశ్నించారు. దీనిపై మైనింగ్ శాఖాధికారులు తాము హద్దులు నిర్ణయించామని, తమ సిబ్బందిని నియమించామని ఎల్లప్పుడూ తాము ఇక్కడ ఉండలేమని బాధ్యతారాహిత్య సమాధానం చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతుంటే చర్యలు తీసుకోకుండా ఇటువంటి సమాధానాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించడంతో, ఇకపై గాజుల్లంకలో ఉచిత ఇసుక క్వారీ నిర్వహణ జరగదని, కేవలం డంపింగ్‌కు మాత్రమే తవ్వకాలు జరుగుతాయని మైనింగ్ శాఖాధికారులు దాటవేత సమాధానంతో సరిపెట్టారు. నదిలో యంత్రాలున్నాయని స్థానికులు ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణం యంత్రాలను సీజ్ చేయాలని ఆమె అధికారులను ఆదేశించిచారు. కార్యక్రమంలో వేమూరు సీఐ పీవీ.ఆంజనేయులు, వేమూరు ఎస్ఐ రవికృష్ణ, కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గాజుల్లంక ఇసుక క్వారీ వద్ద ఆర్డీఓ పరిశీలన మైనింగ్ అధికారుల తీరుపై ఆవేదన -
కూలీల వలసలు నివారించాలి
యర్రగొండపాలెం: తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజలు కూలీ పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఈ ప్రయాణంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని గడ్డమీదిపల్లె గ్రామానికి చెందిన కూలీలు బొప్పాయి కోతల కోసం వెళ్తూ పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామానికి సమీపంలోని హైవే రోడ్డుపై జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే మంగళవారం ఆయన గడ్డమీదిపల్లెకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతులకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. దీంతో రైతులు అప్పుల పాలయ్యారని, ఈ కారణాలతో ఎకరాలకొద్దీ ఉన్న రైతులు సైతం కూలీ పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులు కూడా సక్రమంగా జరగడం లేదని, ఆ నిధులను కూడా కూటమి నాయకులు మెక్కేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పనులు కల్పించకపోవడంతోనే గడ్డమీదిపల్లెకు చెందిన 300 కుటుంబాలు వలసలు వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థవుతోందన్నారు. మృతుల కుటుంబాలను పరిశీలిస్తే కూలీ పనుల కోసం దూర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారనే విషయం అర్థం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం యర్రగొండపాలెం మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే వలస వెళ్లక తప్పడం లేదన్నారు. వలసలు నివారించాలంటే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుకు వెంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి, ప్రాజెక్ట్‌కు నీళ్లు వదలడమే సరైన మార్గమన్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వినుకొండ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
కార్డులు జారీ చేయకుండా ‘సుఖీభవ’ ఎలా?
లక్ష్మీపురం: గుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏలా అమలు చేస్తారని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌలురైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చెప్పటం నమ్మదగ్గ విషయం కాదన్నారు. గత సంవత్సరం జారీ చేసిన గుర్తింపు కార్డులకు కాల పరిమితి ముగిసిందనీ, ఈ ఏడాది కొత్తగా కౌలుగుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంజుల రెడ్డి, పీవీ జగన్నాథం మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ మాట్లాడుతూ అప్పుల బాధతో చనిపోయిన కౌలురైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్‌తేజకు వినతిపత్రం అందజేశారు. కౌలు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారిని ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపడతామని జిల్లా జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు కంచుమాటి అజయ్, కౌలురైతుల సంఘం నాయకులు బి.రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా.. జేసీకి వినతిపత్రం -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
రేపల్లె: బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని సీడీపీఓ సుచిత్ర చెప్పారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఉప్పుడి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిశోరి వికాసం సమ్మర్ ప్రత్యేక క్యాంపులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను గ్రామీణులకు తెలియపరచాలన్నారు.. యువతికి 18 ,యువకునికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని చెప్పారు. బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమన్నారు. అలా చేస్తే రూ. లక్ష జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. 2 సంవత్సరాలు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడంతోపాటు ఐదు సంవత్సరాలు దాటిన వారిని పాఠశాలలకు పంపేలా బాధ్యత వహించాలన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం, విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. కిశోరి బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ పి. నాంచారమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సాహితీ సంబరాల్లో తెనాలి కవులు
తెనాలి: ఏలూరులో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీల్లో 48 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి జాతీయ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. తెనాలికి చెందిన కవి, రచయిత డాక్టర్ రంగిశెట్టి రమేష్‌కు కవిరత్న సాహితీ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ప్రముఖ సాహితీవేత్తలు, కళాకారుల సమక్షంలో సంస్థ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కార్యదర్శి ఈశ్వరి భూషణం, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఈ అవార్డును అందజేశారు. ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు భాషా సేవా సాహితీ పురస్కారం... ఇదే వేదికపై తెనాలికి చెందిన కవి, రచయిత, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగుభాషా సేవా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వృత్తిపరంగా గుంటూరు–2 ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆళ్ల నాగేశ్వరరావు, ప్రవృత్తిగా సాహితీ సేద్యం చేస్తున్నారు. వచన కవితా ప్రక్రియలో ఇప్పటికీ రోజుకో సామాజిక అంశంతో కవితను రాస్తున్నారు. డాక్టర్ ప్రజ్ఞాచారికి తెలుగు భాషా సేవా పురస్కారం తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీ రత్న డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారికి తెలుగు భాషా సేవా జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. చైతన్యవంతమైన భావ జాలంతో రచనలు చేస్తూ, తెలుగు భాష అభ్యున్నతికి తనదైన శైలిలో కృషి చేస్తున్నందుకు, ఆయన సాహితీ సేవలను గుర్తించి జాతీయ తెలుగు భాషా సేవా పురస్కారాన్ని ప్రదానం చేశామని నిర్వాహకులు వెల్లడించారు. -
వైభవంగా లక్ష్మీ నృసింహస్వామి జయంత్యుత్సవం
మంగళగిరి: శ్రీ నారసింహ చతుర్దశిని పురస్కరించుకుని సోమవారం శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి జయంత్యుత్సవం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. -
రోగికి కేసు షీట్ ఇవ్వాల్సిందే..!
గుంటూరు మెడికల్: రోగికి కేసు షీటు ఇవ్వాల్సిందేనని జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు అన్నారు. గుంటూరులోని గర్తపురి కన్జూమర్స్ కౌన్సిల్ ఆఫీసులో సోమవారం వైద్య వివరాలు, హాస్పిటల్స్ విధులపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి చేకూరి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ప్రకారం రోగ నిర్ధారణ, పరిశోధన వివరాలు రోగికి తప్పనిసరిగా వైద్యాధికారులు తెలియజేయాలని తెలిపారు. రోగి మరణిస్తే అన్ని కారణాలు ఆ కేసులో తెలపాలని చెప్పారు. వైద్యులు ఏ మందులు ఎప్పుడు వాడారు..నర్సింగ్ సిబ్బందికి చెప్పిన సూచనలు కేసులో తేదీల వారీగా ఉండాలని, చికిత్స వివరాలు సమగ్రంగా ఉండాలని తెలిపారు. రోగి గానీ, అతని బంధువులు గానీ మెడికల్ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో అందించాలని సూచించారు. రాజశేఖర్ మాట్లాడుతూ రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్ ప్రాక్టీషనర్కు ఏ మినహాయింపు, ఏ చట్టం ఇవ్వలేదని తెలిపారు. మొత్తం చికిత్స వివరాల ఫొటో కాపీలు హాస్పిటల్ వారు ఇవ్వాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ సభ్యుడు బీరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ హాస్పిటల్ వారు రోగికి వైద్య వివరాలను నిరాకరించడమంటే తన బాధ్యత నిర్వహణలో నిర్లక్ష్యమవుతుందని తెలిపారు. న్యాయస్థానాలు కోరినప్పుడు తప్పనిసరిగా సంబంధిత రోగి రికార్డులు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. బేబీ సరోజిని మాట్లాడుతూ వైద్యులు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు, కేసు షీటును సాక్ష్యాధారంగా కోర్టులో ఉపయోగించవచ్చని తెలిపారు. మునిపల్లె కవిత మాట్లాడుతూ రోగులకు చికిత్స చేసిన వివరాలను అందించడంలో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు. కేసు సీట్ బాధ్యత వైద్యులు, హాస్పిటల్ పైన ఉందని చాలా కేసుల్లో కోర్టులు తీర్పులు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు -
లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ
బాపట్ల: రైతుల నుంచి లక్ష్యం మేరకు ధాన్యం సేకరించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. ధాన్యం సేకరణపై అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం అధికంగా సాగవుతున్న నేపథ్యంలో 30 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం విధించిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,038 మంది రైతుల నుంచి 25,300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. అకాల వర్షం హెచ్చరికల నేపథ్యంలో రైతులకు నష్టం జరగకుండా వెంటనే ధాన్యం సేకరించాలని ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని ఆరు గోదాముల్లో నింపాలన్నారు. ప్రతిరోజూ 3వేల మెట్రిక్ టన్నుల సేకరణ జిల్లా వ్యాప్తంగా 70 రైస్ మిల్లులు ఉన్నాయని, అయితే ప్రస్తుతం 30 మిల్లుల్లో పోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వాటి నుంచి మాత్రమే సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ్మవరంలో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాము ఖాళీగా ఉందన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాలనుంచి సేకరించి ధాన్యాన్ని తమ్మవరం గోదాముకు తరలించాలన్నారు. ప్రతిరోజు 3000 మెట్రిక్ టన్నులకు తగ్గకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని అధికారులు, మిల్లర్ల యజమానులను ఆయన ఆదేశించారు. పీడీఎఫ్ బియ్యం సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. పౌర సరఫరాల సంస్థ జీఎం పి.శ్రీనివాసరావు, పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామకృష్ణ, డీసీఓ శ్యాంసన్, రైస్ మిల్లర్ల యజమానులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
భావదేవుడు
యుగయుగాల దేవుడు.. జనసందోహం నడుమ ఊరేగింపుగా వెళ్తున్న భావదేవుడు బాపట్ల: భావపురి నడిబొడ్డున కొలువుతీరిన భావదేవుడి రథోత్సవం సోమవారం సాయంత్రం వైభవంగా జరిగింది.రూ.1.50కోట్లతో నిర్మించిన నూతన రథంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీసమేత శ్రీక్షీరభావన్నారాయణ స్వామివారికి సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అలయ అర్చకుల సమక్షంలో అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై పట్టణంలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం నుంచి 1432వ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహించారు. కిటకిటలాడిన వీధులు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలిరావడంతో రథంబజార్ సెంటర్ భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. స్థానిక భావన్నారాయణ స్వామి దేవాలయం నుంచి రథం బజార్ సెంటర్ మీదుగా ఆంజనేయస్వామి దేవాలయం వరకు రథోత్సవం నిర్వహించారు. ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత భక్తులు స్థానిక భావన్నారాయణస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి రథానికి కొబ్బరి కాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైభవంగా భావదేవుడి రథోత్సవం జనసందోహంగా మారిన రథంబజార్ ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు -
పిట్టా..పిట్టా మా ఊరికొచ్చావా?
● ఆవాసం మార్చిన విదేశీ పక్షులు ● వెలమవారిపాలెంలో సహకరించని ప్రకృతి ● మైలవరం గ్రామానికి రాక ● పక్షులను ఆత్మబంధువులుగా భావిస్తున్న గ్రామస్తులు ● ఖండాంతరాలు దాటి వస్తున్న పిట్టలు పొడవు ముక్కు.. సొగసైన కాళ్లు .. తీక్షణ చూపు.. మెరిసే ఛాయ.. ప్రకృతి ఒడిలో పక్షులు.. ఊరొచ్చిన విహంగాలు అవే గ్రామీణుల ఆత్మ బంధువులు.. విదేశాల నుంచి వచ్చిన అతిథులు అద్దంకి: జీవ వైవిధ్యం లేకుంటే ప్రకృతి మనుగడ అసాధ్యమే.. మనుషులు.. జంతు జాలాలను ప్రేమించి సంరక్షించకుంటే పర్యావరణ పరిరక్షణ కష్టమే. ఇలాంటి ప్రకృతి సత్యాన్ని బాపట్ల జిల్లా వాసులు ఎన్నో తరాలుగా అనుసరిస్తున్నారు. నైజీరియా.. కొరియా ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన చలి వాతావరణం నెలకొంటుంది. అందుకే ఆయా దేశాల్లో సంచరించే పక్షులు ప్రతి ఏటా బల్లికురవ మండలం వెలమవారిపాలేనికి తరలివస్తుంటాయి. ఇక్కడ సంతానోత్పత్తి అయిన తర్వాత తిరిగి తమ దేశాలకు ఎగిరి పోతుంటాయి. కానీ ఈ ఏడాది వెలమవారిపాలెంలో పక్షులు నివసించేందుకు గత మూడేళ్లుగా సరైన వాతావరణం లేకుండా పోయింది. ముఖ్యంగా అవి నివసించే చెట్లు నేలమట్టం కావడంతో తల్లడిల్లిపోయాయి. అందుకే ఈ పక్షులు రూటు మర్చాయి. తమకు అనువుగా ఉండే చుట్టు పక్కల ప్రాంతాలను అన్వేషించి విజయం సాధించాయి. 500 విహంగాల సందడి బల్లికురవ మండలం వెలమావారిపాలేనికి పక్కనే.. అద్దంకి మండలం మైలవరం వాటికి అనువైన ప్రదేశంగా మారింది. మొదట్లో తక్కువ సంఖ్యలోనే ఇక్కడకు చేరుకున్న పక్షులు.. ఈ ఏడాది తమ మందీ మార్బలంతో.. అక్క చెల్లెళ్లు, బంధుమిత్రులతో కొలువుదీరాయి. ప్రస్తుతం 500కు పైగా పక్షులు గ్రామానికి చేరుకోవడంతో స్థానికులంతా వాటిని అతిథులుగా.. పక్షి రాజులుగా భావించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాటి రాక శుభ సూచికంగా భావిస్తున్నారు. సాధారణంగా ఈ పిట్టలు డిసెంబర్ నెలాఖరులో వచ్చి జూలై నెల నాటికి తాము పొదిగిన పిల్లలకు రెక్కలు రాగానే తిరిగి తమ దేశాలకు పయనమై వెళ్లేవి. అయితే ఈ సంవత్సరం మే నెలలో రావడంతో నవంబరు నెల వరకు ఇక్కడే ఉండే అవకాశం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు. సమృద్ధిగా నీరు–నీడ.. మైలవరం గ్రామంలో నిండు కుండలా ఉండే పెద్ద చెరువుపై ఈ పక్షులు మనసు పారేసుకున్నాయి. సమీపంలో గుండ్లకమ్మ నది, మరి కొంత దూరంలో శింగరకొండ క్షేత్రానికి సమీపంలో భవనాశి చెరువు కూడా ఉండటం విశేషం. గ్రామంలోని చెట్లపై తమ గూళ్లు నిర్మించుకొని.. ఆహారం కోసం నిత్యం సుమారు యాభై కిలో మీటర్ల మేర ప్రయాణించి సాయంత్రానికి తమ నివాసాలకు చేరుకుంటాయి. అలాగే స్థానిక చెరువులో కూడా చేపల వేట సాగిస్తుంటాయి. ముందుకాడ కొన్నే వచ్చేయి మూడేళ్ల మించి మా ఊరికి ఈ పిట్లలొత్తన్నాయి. అయ్యి భలే గోల చేత్తాయి. మునుపు వెలమవారిపాలెంలో కనిపించేయి. ఇప్పుడేమో మా ఊళ్లోకే వత్తన్నాయి. మా పిల్లోళ్లు.. ఆటిని చూసి కుశాల పడతున్నారు. –సత్యనారాయణ గవర్నమెంటోళ్లు కాపాడాల ఈ పిట్టలు మా పిల్లోళ్లతో సమానమే. ఏడ నుంచే ఈడ కొత్తన్నాయంటే పాపం.. వాటికేం కట్టమొత్తాదో. ఆటి జోలికెవురైనా ఎలితే ఊరుకోం. ఈడ చెరువులో నీళ్లు బాగుండాయి. మేత కూడా ఉంది. గవర్నమెంటోళ్లు ఈటిని కాపాడాల. – చావలి శ్రీనివాసరావు -
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిలిపివేయాలి
నరసరావుపేట: పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునవ్యవస్థీకరణ ప్రక్రియతోపాటు ఏ విధమైన స్పష్టమైన జీఓలు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాస రెడ్డి, ఎం.మోహనరావు డిమాండ్‌చేశారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏఓకు వినతిపత్రం సమర్పించారు. తొలుత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ జీఓ 117 రద్దు చేసి దాని స్థానంలో కొత్త జీఓ విడుదల చేసి పాఠశాలలను పునవ్యవస్థీకరించాలని కోరారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాన్ని కొనసాగించాని, తరగతిలో విద్యార్థులు 45 మించితే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైస్కూలులో విద్యార్థుల సంఖ్య 300 దాటితే అదనపు పీడీ పోస్టు కేటాయించాలన్నారు. బదిలీల జీఓ విడుదల చేసి వేసవి సెలవులలో ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ఎస్.జి.టి.లకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టాలన్నారు. జిల్లాలో సీనియారిటీ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, బదిలీలు, పదోన్నతులు ప్రక్రియలు వేర్వేరుగా నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ ఖాసీం పీరా, సహఅధ్యక్షులు ఏ బాగేశ్వరిదేవి, జేవీడీ నాయక్, కోశాధికారి ఎం.రవిబాబు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్, జిల్లా ఇన్చార్జి టీఎస్ఎన్ మల్లీశ్వరరావు, జిల్లా కార్యదర్శిలు ఉషాశౌరి రాణి, టి.వెంకట్, కె.తిరుపతిస్వామి, ఆర్.నాసర్‌రెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ ధర్నా -
పోలురాధా పందేలు అదరహో!
చినగంజాం: కడవకుదురు గ్రామ దేవత పోలేరమ్మ తిరునాళ్లను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల న్యూ జూనియర్ నాటుబండి పోలురాధా ఎడ్ల పందేలు ఆదివారం సాయంత్రం ప్రారంభం కాగా సోమవారం వేకువజాము వరకు నిర్వహించారు. పోటీల్లో పలు ఎడ్ల జతలు పాల్గొనగా అత్యంత ఉత్కంఠంగా కొనసాగాయి. అనంతరం నిర్వాహకులు ఎడ్ల జతల యజమానుల విజేతలను ప్రకటించి వారికి అందజేశారు. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం పెదపూడి గ్రామానికి చెందిన ఆలా హరికృష్ణ యాదవ్ ఎడ్ల జత 5605.2 అడుగుల దూరం లాగి మొదటి స్థానం సాధించింది. కేకే కన్స్ట్రక్షన్స్కు చెందిన బత్తిన కోటేశ్వరరావు రూ.30,116 అందజేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడు గ్రామానికి చెందిన రామినేని శ్రీనివాసరావు ఎడ్ల జత 5100 అడుగులు లాగగా ద్వితీయ బహుమతి సాధించింది. రావి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారుడు రావి శ్రీనివాసరావు రూ.25,116 అందజేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన చెరుకూరు ఉషారాణికి చెందిన ఎడ్ల జత 5060.7 అడుగులు లాగి మూడో స్థానాన్ని సాధించాయి. కేశన వెంకట్రావు రూ.20,116 నగదు బహుమతి అందజేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణకు చెందిన ఎడ్ల జత 4868.5 అడుగులు లాగి నాలుగో స్థానం సాధించగా అడుసుమల్లి బ్రదర్స్ రూ.15,116 నగదు అందజేశారు. బాపట్ల జిల్లా బోయినవారిపాలేనికి చెందిన పిన్నబోయిన మహీంద్ర ఎడ్ల జత 4825.8 అడుగులు లాగి ఐదో స్థానం సాధించగా కేసన పిచ్చయ్య జ్ఞాపకార్థం రూ.10,116 నగదు అందజేశారు. బాపట్ల జిల్లా మున్నవారిపాలేనికి చెందిన కుమ్మరి నాగ శ్రావణి, చెరుకుపల్లికి చెందిన యలమందల వెంకట గోపాలకృష్ణకు చెందిన ఎడ్ల జతలు 4792.5 అడుగులు లాగి 6వ స్థానం సాధించగా కేసన చలపతిరావు, నాగరత్నం జ్ఞాపకార్థం కుమారులు రూ.7,516 నగదు బహుమతి అందజేశారు. పోటీలకు యాంకర్‌గా తంగడ హాసన్ వ్యవహరించారు. -
రోగుల సేవలో నర్సులది కీలకపాత్ర
మంగళగిరి: రోగులకు వైద్య సేవలందించడంలో నర్సుల పాత్ర కీలకమని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా సోమవారం ఎయిమ్స్ ఆధ్వర్యంలో నర్సులు వాక్‌థాన్ నిర్వహించారు. ఎయిమ్స్ వెస్ట్ గేటు వద్ద డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత దాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిమ్స్ నుంచి వాక్‌థాన్‌గా మంగళగిరి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ చేరుకుని, అంబేడ్కర్ విగ్రహ సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సులు ప్రజలకు అత్యవసర పరిస్థితిలో అందించాల్సిన వైద్య సేవలు, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ డెమో చేసే విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ రోగులకు వైద్యం అందించే సమయంలో డాక్టర్లతో పాటు నర్సుల పాత్ర ఎంతో విలువైనదని కొనియాడారు. రోగికి సపర్యలు చేస్తూ వ్యాధి నయమయ్యేందుకు నర్సులు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం వాక్‌థాన్‌లో భారీగా పాల్గొన్ననర్సింగ్ విద్యార్థినులు -
నీటి కుంటలో పడి బాలుడు మృతి
చిమ్మిరి బండ ఎస్సీ కాలనీలో విషాదం మార్టూరు: ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చిమ్మిరిబండ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన దుడ్డు తిమోతి కుమారుడు కార్తీక్ (8) ఆదివారం సాయంత్రం తన తాతతో కలిసి గేదెలను మేపడం కోసం పొలం వెళ్లాడు. ఈ క్రమంలో గేదెలు కొండను ఆనుకొని ఉన్న కుంటలో నీరు తాగడానికి దిగాయి. గేదెలను కుంటలో నుంచి వెలుపలికి తోలడం కోసం కుంటలోకి ఒంటరిగా దిగిన కార్తీక్ అలాగే నీటిలో మునిగిపోయాడు. కొంతసేపటికి స్థానికులు నీటి కుంటలో దిగిన కార్తీక్ కోసం గాలించగా అప్పటికే మృతి చెందిన బాలుడు శవమై తేలాడు. ఆడుతూ పాడుతూ తమ ముందు చలాకీగా తిరిగే చిన్నారి శవమై ఇంటికి రావడంతో కుటుంబంతోపాటు ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. -
నేడు పొగాకు రైతులకు మేరుగ పరామర్శ
చినగంజాం: నియోజకవర్గంలో ఇటీవల మృతిచెందిన.. ఆత్మహత్యాయత్నం చేసిన పొగాకు రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మంగళవారం నియోజకవర్గానికి రానున్నారు. తొలుత వీరన్నపాలెంలో అప్పుల బాధతో మృతి చెందిన ఉప్పుటూరు సాంబశివరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఇంకొల్లు మండలం దుద్దుకూరులో రుణాల బాధతో ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిల్లా శ్యాంసన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఒంగోలు కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న శ్యాంసన్‌తో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన వెంట వైఎస్సార్ సీపీ పర్చూరు ఇన్చార్జ్ గాదె మధుసూదనరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి, ఆయా మండలాల కన్వీనర్లు పాల్గొంటారన్నారు. ఆయా కార్యక్రమాల్లో నియోజక వర్గంలోని పార్టీ నాయకులు హాజరు కావాలని కోరారు.ఘనంగా బుద్ధ జయంతిఅమరావతి: బుద్ధ జయంతి వేడుకలను ధాన్యకటక బుద్ధవిహార ట్రస్టు చైర్మన్ డాక్టర్ వావిలాల సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక పాత మ్యూజియంలోని మహా చైత్యం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ వావిలాల మాట్లాడుతూ 2569 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు నడయాడిన అమరావతి నగరం దక్షిణ భారతదేశంలో బౌద్ధ ధర్మానికి కేంద్ర బిందువుగా కొనసాగిందన్నారు. సాక్షాత్తు గౌతమ బుద్ధుడు తన మొదటి కాలచక్ర క్రతువులు అమరావతి నుంచే ప్రారంభించారని బౌద్ధ సాహిత్యకారుల నమ్మకమన్నారు. అందుకే ఇక్కడ బుద్ధుని అస్థికలతో కూడిన మహా చైత్యం అనే గొప్ప కట్టడాన్ని నిర్మించారన్నారు. తొలుత మహాస్థూపం వద్ద ప్రత్యేక పూజాకార్యక్రమాలు, బౌద్ధమత ప్రార్థనలు నిర్వహించారు. నిమ్మా విజయసాగర్ బాబు, కోలా వెంకటేశ్వర రావు, యోగాశ్రమ నిర్వాహకులు కోనూరు అప్పారావు ప్రపుల్ల రాణి, గిరి స్వామి, పలువురు బౌద్ధమతస్తులు పాల్గొన్నారు.ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలునరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా పరిధిలో 30 పరీక్ష కేంద్రాలలో మొదటి సంవత్సరం పరీక్షకు 93.34 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 87.99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్–3 ప్రశ్నపత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జూనియర్ ఇంటర్‌కు 3,132 మంది జనరల్ విద్యార్థులకుగాను 2,945మంది హాజరయ్యారు. 154 మంది ఒకేషనల్ విద్యార్థులకుగాను 122మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విద్యార్థులు 413 మంది నమోదు కాగా 364 మంది, ఒకేషనల్ విద్యార్థులు 70మందికి గాను 61 మంది హాజరయ్యారు. జిల్లా పరిధిలో ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి కె.సుచరిత తెలిపారు.సమస్యలను వారంలో పరిష్కరిస్తాంకొల్లిపర(తెనాలి): తమకు అందిన ప్రతి సమస్యను వారంలో పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో మంత్రి సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహతో కలిసి 200 వినతులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా బియ్యం కార్డుల దరఖాస్తులే ఉన్నాయి. అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా కోటి 46 లక్షల మందికి రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. -
భావన్నారాయణస్వామి ఆశీస్సులతో దేశం సుభిక్షం
బాపట్ల: శ్రీ భావన్నారాయణ స్వామి ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం స్వామివారి రథోత్సవాన్ని కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాపట్ల భావపురి కాలనీలో కొలువైన శ్రీ మత్యుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ క్షీరభావన్నారాయణ స్వామి 1432వ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నాయని తెలిపారు. రూ.1.50కోట్లతో నూతన రథాన్ని తయారు చేయించామన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవం అనంతరం నూతన దివ్య రథంలో నగరోత్సవం నిర్వహించడం శుభపరిణామన్నారు. స్వామి వారి ఆశీస్సులతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. స్వామివారి దివ్య రథ నగర ఉత్సవంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం కొండయ్య, గుడి వంశ పారంపర్య ధర్మకర్త రమణబాబు, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి -
14న విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా
గుంటూరుఎడ్యుకేషన్: విద్యారంగంతో పాటు ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు మూడవ దశ పోరాటంలో భాగంగా ఈనెల 14న విజయవాడలో తలపెట్టిన ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కన్నావారితోటలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడారు. 117 జీవో రద్దుతో పాటు, పాఠశాల విద్యారంగంలో పూర్వ విధానాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయకుండా, తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడం సరైనది కాదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. బదిలీల్లో అన్ని కేడర్ల వారీగా ఖాళీలు చూపుతామని చెప్పి, ప్రస్తుతం ప్రతి మండలంలో కొన్ని ఖాళీల చొప్పున బ్లాక్ చేసేందుకు నిర్ణయించడం తగదని పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు సయ్యద్ చాంద్ బాషా, మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:20, ఉన్నత పాఠశాలలో 45 మందికి రెండవ సెక్షన్, ప్రాథమికోన్నత పాఠశాలకు కనీసం ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలల్లో సైతం గందరగోళ పరిస్థితులను తెచ్చారని విమర్శించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఉదాసీనత విడనాడనాడకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ మూడు జిల్ల్లా శాఖల ప్రధాన బాధ్యులు మహమ్మద్ ఖాలీద్, ఉస్మాన్, విజయబాబు, సీనియర్ నాయకులు జి.దాస్, ఎస్ఎస్ఎన్ మూర్తి, చక్కా వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ చెట్టిపోగు లక్ష్మణ్ కుమార్, మాలకొండయ్య, పి.శివరామకృష్ణ పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవ లింగారావు -
నూతన రథం.. స్వామికి అంకితం
● ఘనంగా పునుగు రామలింగ మల్లేశ్వరస్వామి రథోత్సవం ● సంవత్సరాల తర్వాత రథంపై దర్శనమిచ్చిన స్వామివారు ● ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడి చీరాల అర్బన్: పట్టణంలోని పేరాలలో వేంచేసియున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగ మల్లేశ్వరస్వామి రథోత్సవం సోమవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణలో వైభవోపేతంగా సాగింది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల సహకారంతో నూతన రథాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు ఎమ్మెల్యే ఎంఎం మాలకొండయ్యకు దేవస్థాన అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి దేవదాయ శాఖ కృషి చేస్తుందన్నారు. అంకితభావంతో సేవలందిస్తున్న అధికారులను అభినందించారు. వేగంగా విస్తరిస్తున్న చీరాల పట్టణానికి ఆధ్యాత్మికంగా కేంద్రంగా ఉన్న పునుగు రామలింగ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి మరింత సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన రథానికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణల నడుమ రథాన్ని ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పెద్ద రథంపై ఉత్సవ మూర్తులు ఊరేగుతూ దర్శనమివ్వడంతో తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
మహిళను కబళించిన లారీ
చినగంజాం: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇరువురిని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైన సంఘటన సోమవారం చినగంజాం జాతీయ రహదారిపై కడకుదురు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఈపూరుపాలెం గ్రామం చేనేత పురికి చెందిన కొండ్రుపాటి ప్రభుదాసు అతనితో కలిసి అదే గ్రామానికి చెందిన కారంపూడి పద్మ(45) ఫంక్షన్లకు వంట పనిచేస్తుంటారు. ఈ క్రమంలో చినగంజాం వెంకటేశ్వర కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన వివాహ ఫంక్షన్లో వంట చేసి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఎంత్రీ హోటల్ సమీపంలోకి వెళ్లగానే.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఇరువురు రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయంకాగా పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుదాసుకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చీరాల వైద్యశాలకు తరలించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న చినగంజాం తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు పరిస్థితి గమనించి పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్ఐ శీలం రమేష్.. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి భర్త భిక్షాలు చేనేత కార్మికుడు కాగా అతడు గతంలోనే మృతి చెందాడు. ఆమె కుమార్తె శివపార్వతి వివాహితురాలు. తల్లి మృతితో సంఽఘటనా స్థలానికి వచ్చిన ఆమె భోరున విలపించడం చూపరులను కలచివేసింది. వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మృతి వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు -
పన్నెండు గంటల నిర్విరామ నృత్య ప్రదర్శన
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక మార్కెట్ కూడలిలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విజయమాధవి సేవ సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయమాధవికిశోర్ ఆధ్వర్యంలో జరగ్గా, 12 గంటలపాటు రత్నాచార్యులు, నృత్య కళాకారులు చేపట్టిన నృత్యాలు అలరించాయి. అనేక మంది కళాకారులు, వారి శిష్యుల అద్భుత నృత్య ప్రదర్శనలు చక్కటి హావ భావాలతో ప్రదర్శించారు. అనంతరం నాట్యాచార్యులను, కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో సినీ నటులు రాగిణి, నాగమణి, టి.రజినీరెడ్డి, సీనియర్ గుండె వైద్యులు రామారావు, హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసమూర్తి ప్రసంగించారు. -
‘రెడ్ బుక్’ పోలీసింగ్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ రెడ్ బుక్ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తోంది. రాజ్యాంగం ప్రకారం పౌరులకు ఉండాల్సిన హక్కులను కాలరాసి అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతును నొక్కుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా పల్నాడు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళలను సైతం వడదలకుండా అధికార పార్టీ నేతల ఆదేశాలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, సానుభూతిపరులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. మరికొందరినైతే ఏ కేసు లేకపోయినా రోజుల తరబడి పోలీసు స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెడుతున్నారు. గట్టిగా అడిగితే స్థానిక ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నామంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శనివారం మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్‌రెడ్డి అరెస్ట్ సైతం అదే కోవలో జరిగింది. నిరాధార ఆరోపణలతో టీడీపీకి అనుకూలంగా మారిన వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని విడదల రజిని చిలకలూరిపేట రూరల్ సీఐను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. ‘నీకెందుకు చెప్పాలి’ అంటూ మాజీ మంత్రి, బీసీ మహిళా నేత అనే స్పృహ కూడా లేకుండా అమర్యాదగా వ్యవహరించాడు. ‘ఎక్కువ మాట్లాడితే నీపై కేసు పెట్టాల్సి ఉంటుందంటూ’ బెదిరింపు ధోరణికి దిగాడు. ఈ వ్యవహారం చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఓ మహిళా మాజీ మంత్రికి సైతం రక్షణ లేదని, సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. రోజంతా కారులో తిప్పుతూనే... శ్రీకాంత్‌రెడ్డిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన తరువాత ఉదయం ఎఫ్ఐఆర్ కట్టినట్టు తెలుస్తోంది. అప్పటికే కేసు నమోదై ఉంటే విడదల రజిని ‘ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో’ చెప్పమన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చూపేవారన్న వాదన వినిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుంచి వాహనంలో రోజంతా తిప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు వర్తించే సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే రిపోర్టులో తీవ్రతను పెంచి రిమాండ్‌కు పంపే కుట్ర పన్నినట్టు శ్రీకాంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు తెలిపారు. ఇప్పటికే శ్రీకాంత్‌రెడ్డిపై చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో పలు కేసులు నమోదు చేశారు. ఎలాగైనా బీసీ మహిళా నేత విడదల రజినిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిసి ఆమె వర్గంపై కేసులు పరంపర కొనసాగిస్తున్నారు. 65 ఏళ్ల పైబడిన ఆమె మామ విడదల లక్ష్మీనారాయణ, మరిది విడదల గోపి, పీఏలు రామకృష్ణ, ఫణి, సోషల్‌మీడియా యాక్టివిస్టులు రాకేష్ గాంధీ, రెడ్డిగారి అమ్మాయి సుధారాణి, పాలేటి కృష్టవేణి.. ఇలా అందర్ని అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మరోవైపు విడదల రజినిపై సైతం అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న పల్నాడు పోలీసులు తప్పుడు ఫిర్యాదులతో జైలుపాలు చేసే కుట్ర అడిగితే ఎమ్మెల్యేల ఒత్తిడితో తప్పడం లేదని తప్పించుకునే ప్రయత్నం విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్ విషయంలోనూ అదే తీరు మాజీ మంత్రి అనే స్పృహ లేకుండారజినీతో సీఐ దురుసు ప్రవర్తన సీఐ సుబ్బనాయుడు తీరును ఖండిస్తున్న ప్రతిపక్షాలు, మహిళలు సీఐ తీరుపై మండిపాటు... మాజీ మంత్రి విడదల రజినిపై చిలకలూరిపేట సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ మహిళ అనే స్పృహ లేకుండా సీఐ దురుసుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఇప్పటికై నా ముగింపు పలకాలని, లేకపోతే ప్రజలలో వ్యతిరేకత మరింత పెరిగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఐ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేసి ఖండించారు. ప్రభుత్వం ఆ సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. -
రైతుల చితిమంటల పొగ
చినగంజాం: రైతుల ఆశల్ని కూటమి ప్రభుత్వం నీరు గారుస్తోంది. చెమటోడ్చి సేద్యం చేసిన పంటకు గిట్టుబాటు కల్పించడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో అన్నదాతల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ముఖ్యంగా పొగాకు రైతుకు ఆత్మహత్యలే శరణ్యంగా కనిపిస్తోంది. గత సీజన్లో గిట్టుబాటు ధర కల్పించడంలో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవ చూపడంతో రైతులు లాభాలు గడించారు. అయితే, ఈ ఏడాది సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. ప్రధానంగా కౌలు ధరలు పెరగడం అశనిపాతంగా మారింది. ఎన్నో ఆశలతో సాగు చేసినా.. గిట్టుబాటు ధర వెక్కిరింతగా మిగిలింది. గతేడాది రూ. 15 వేలకు పైగా పలికిన పొగాకు ధర ఈ ఏడాది రూ. 10 వేలు మించడం లేదు. బాపట్ల జిల్లా పరిధిలో పర్చూరు, అద్దంకి డివిజన్ల పరిధిలో రైతుల అధికంగా నల్లబర్లీ సాగు చేపట్టారు. అయితే, పొగాకు కంపెనీలు కొనుగోలు చేయకుండా ముఖం చాటేస్తున్నాయి. రైతుల ఆందోళన బాట పొగాకు రైతులకు పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆందోళనలు తీవ్రమయ్యాయి. పర్చూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ గాదె మధూసూదనరెడ్డి ఆధ్వర్యంలో ఇంకొల్లు కేంద్రంగా రాస్తారోకో, బైక్ ర్యాలీ, నిరసనల కార్యక్రమాలను నిర్వహించారు. రైతు, కౌలు రైతు సంఘాలు సదస్సులు, సమావేశాలు, అధికారులకు వినతి పత్రాలు వంటివి చేపట్టారు. దీంతో స్పందించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు, పర్చూరు శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావులు పొగాకు కొనుగోలు కంపెనీలు, బోర్డు అధికారులు, రైతు సంఘం నాయకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. పొగాకు కొనుగోలు చేయాలని కంపెనీలకు సూచించారు. ఇందులో భాగంగా మే 6న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయ సహకారం) బుడితి రాజశేఖర్ పర్చూరు మండలంలోని ఉప్పుటూరులో స్థానిక శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పొలాల్లో పర్యటించారు. పొగాకు రైతులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం తక్షణమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని రైతులంతా కోరారు. వెంటనే స్పందించిన రాజశేఖర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, పొగాకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా పొగాకు వ్యాపారులను ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇది ఉత్తుత్తి హామీగానే మిగిలింది. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు గత ప్రభుత్వ హయాంలో అధిక లాభాలు -
హామీలను తుంగలో తొక్కుతున్న కంపెనీలు
మంత్రులు, శాసన సభ్యులు, అధికారుల సమక్షంలో రైతుల పొగాకు నూటికి నూరు శాతం కొనుగోలు చేస్తామని అంగీకరించిన కంపెనీలు అనంతరం ప్లేటు ఫిరాయించాయి. పొగాకు రంగు బాగోలేదని, నల్లగా ఉందని, పచ్చ ఆకు తగులుతుందని సాకులు చెబుతూ పొగాకు చెక్కులను వెనక్కి పంపిస్తున్నారు. ఒకటి రెండు కొట్టుడు, అడుగు ఆకులు అసలు కొనుగోలు చేయమంటూ తెగేసి చెబుతున్నారు. చెక్కులు తిరగ తొక్కమని చెప్పడం, కాటాల్లో తరుగు పెట్టడం, ధరలో కోత పెట్టడం వంటి చర్యలు చేస్తున్నారు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
కుంభాభిషేకానికి రానున్న ‘మేనక’
అద్దంకి: శ్రీ శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న మహా కుంభాభిషేకానికి మేనక అనే పేరు గల ఏనుగుతో జలాభిషేకం చేయించడానికి ఫారెస్ట్, దేవస్థాన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫారెస్టు శాఖ ఆధీనంలో ఉండే ఏనుగును శింగరకొండ రప్పించనున్నారు. ఇక్కడ ఏనుగుకు అవసరమైన వసతులు సక్రమంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అధికారులు దేవస్థాన పరిసర ప్రాంతాలను ఆదివారం తనిఖీ చేశారు. ఫారెస్ట్ బీట్ అధికారి రమేశ్ మాట్లాడుతూ కుంభాభిషేకంలో గల యాత్రలో భాగంగా ఏనుగుతో జలాభిషేకం చేయాల్సి ఉన్నందున ఈ తనిఖీలు చేశామని తెలిపారు. ఆయన వెంట ఫారెస్ట్ రేంజ్ అధికారి ఈ.రమణారావు, సెక్షన్ అధికారి యం.వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ బీట్ అధికారి కె.రమేశ్, దేవస్థాన ఈఓ తిమ్మనాయుడు ఉన్నారు.పవర్ లిఫ్టింగ్‌లో షబీనాకు 4 స్వర్ణాలుమంగళగిరి: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో దేశం తరఫున పాల్గొన్న షేక్ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధానిలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 180 కేజీలు, ఓవరాల్ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్ లిఫ్టింగ్ కోచ్ షేక్ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన షబీనాను రాష్ట్ర, జిల్లా అసోషియేషన్ ప్రతినిధులు అభినందించారు.వైభవంగా బ్రహ్మోత్సవాలుపొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం పంచామృత స్నపన, తిరుమంజనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భావనారాయణ స్వామి అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. గజ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఘనంగా నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవంతాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనంలో ఉదయం 9 గంటలకు సర్వగ్రహ దోష నివారణ, దృష్టి దోష నివారణ కోసం లక్ష్మీ నారసింహస్వామి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించామని, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్వామి వారి కల్యాణం, మల్లె పుష్పార్చన ఉత్సవాలు నిర్వహించామని అనంతరం తీర్ధ ప్రసాద గోష్టి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. -
జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
బాపట్ల టౌన్: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆదివారం జిల్లా పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు, చొరబాటుదారులను నిరోధించి, నిషేధిత, పేలుడు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే ముఖ్య ఉద్దేశంతో తనిఖీలను చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే విధంగా సంఘ విద్రోహుల చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పోలీసు బృందాలు ఆకస్మికంగా ఆయా ప్రదేశాల్లోకి ప్రవేశించి అనుమానితుల లగేజీలు, బ్యాగులు, ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. గుర్తింపు కార్డులు, ప్రయాణ గమ్యం, ఉద్దేశం తదితర వివరాలను సేకరించినట్లు వివరించారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యంగా, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజల రక్షణకు దృఢమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో ట్రాక్‌ల వెంట, పార్సిల్లను, లగేజీలలో అనుమానాస్పద వస్తువులను గుర్తించేందుకు జాగిలాలతో తనిఖీ చేసినట్లు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లలో ముమ్మరం -
నల్ల బర్లీ పొగాకు రైతులను ఆదుకోవాలి
బాపట్ల జిల్లా రైతు సంఘం డిమాండ్ జె.పంగులూరు: జిల్లాలో నల్లబర్లీ పొగాకును తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతుల్ని ఆదుకోవాలని బాపట్ల జిల్లా రైతు సంఘం కార్యదర్శి తలపనేని రామారావు, సీనియర్ నాయకులు కందిమళ్ల రామకోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం పంగులూరులో విలేకర్లతో మాట్లాడారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘాల పోరాటాల ఫలితంగా గత నెల 29న గుంటూరులోని లాం యూనివర్సిటీలో పొగాకు కంపెనీల యజమానులు, రైతు సంఘాల నాయకులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సమావేశం అయ్యారని తెలిపారు. ఇందులో మంత్రి అందరితో చర్చించి గత నెల 30వ తేదీ నుంచి పొగాకు కొనుగోలు చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. కొనుగోలును పరిశీలించేందుకు నలుగురు అధికారులను నియమించడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఇది జరిగి 12 రోజులు అవుతున్నా ఎక్కడా విధి విధానాలు అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. కంపెనీ ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి గ్రేడ్ చేయించి, మంచి పొగాకు మాత్రమే తీసుకెళుతున్నారని ఆరోపించారు. సరుకు బాగుంటేనే గేటు పాస్‌లు ఇస్తున్నారని, ఇలాగైతే తాము పొగాకు అమ్ముకోలేమని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలు ఈ నెల 6న పర్చూరు మండలం వీరన్నపాలేనికి చెందిన కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడని రైతు సంఘం నేతలు తెలిపారు. 9న ఇంకొల్లు మండలం దుద్దుకూరు చెందిన మరో కౌలు రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు ఆదుకోవడం పోయి మీనమేషాలు లెక్కపెడుతోందని విమర్శించారు. ఈ సంవత్సరం నల్లబర్లీ పొగాకు 75 మిలియన్ కేజీల దిగుబడి వచ్చిందనే విషయం అటు కంపెనీలకు, ప్రభుత్వానికీ తెలుసన్నారు. కానీ 55 మిలియన్ కేజీల పొగాకు ఎగుమతులకు మాత్రమే ఆర్డర్లు వచ్చాయని కంపెనీ యజమానులు చెబుతున్నారని వివరించారు. మిగిలిన 20 మిలియన్ కిలోల పొగాకును ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా, పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని, ఇందుకోసం రూ. 300 కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా నల్లబర్లి పొగాకు కొంటామని కంపెనీలు చెప్పడంతో రైతులు అత్యధిక సంఖ్యలో సాగు చేశారని వివరించారు. కంపెనీ మాటలు నమ్మిన కౌలు రైతులు లక్షలాది రుపాయలు అప్పులు తెచ్చి, పెట్టుబడులు పెట్టి సాగు చేశారని వివరించారు. అయితే, తెల్లబర్లీ పొగాకు కొంత కొనుగోలు చేశారని, నల్లబర్లీ పొగాకును మాత్రం ఇంత వరకు కొనుగోలు చేయలేదని రామారావు, రామకోటేశ్వరరావు తెలిపారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
పిడుగురాళ్ల: పట్టణ శివారు అయ్యప్పస్వామి దేవస్థానం దగ్గర హైవే పక్కనున్న సేఫ్టీ రైలింగ్‌ను కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌కు చెందిన బాణావత్ అరవింద్, సోనియాల వివాహం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు కోసం చీరాల సముద్ర తీరానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పక్కనున్న రైలింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైడ్ రైలింగ్‌ను ఢీకొట్టిన కారు తప్పిన ప్రమాదం -
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ?
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాంధీ గురజాల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సిద్ధాడపు గాంధీ ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట సీఐ మాట్లాడిన మాటలు సరైనవి కావని ఖండించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కృష్ణవేణిని కూడా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఇబ్బందులు గురి చేస్తోందని ఆరోపించారు. సీఐ మాజీ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజనీని కారులోంచి అక్రమంగా బలవంతంగా బయటకు నెట్టారని, ఆయనపై సీఎం, డెప్యూటీ సీఎంలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం కూటమి నాయకులు మానుకోవాలని, ప్రజలకు అభివృద్ధి పనులు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే తరహాలో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే రానున్న ఎన్నికల్లో వారే బుద్ధి చెబుతారని కూటమి నాయకులను హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, వేముల చలమయ్య, జె. రమణ, నారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను ఎస్జీటీలకే ఇవ్వాలి
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుభాని సత్తెనపల్లి: ఎస్జీటీలుగా పని చేస్తూ ఒక్క పదోన్నతి కూడా పొందని వారు 30 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రాథమిక పాఠశాలలకు వారిని ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ఎం సుభాని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్లను పీఎస్‌హెచ్‌ఎంగా నియమించడం వల్ల వారికి సబ్జెక్ట్ మీదే పట్టు ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల్లో అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాలంటే ఎస్జీటీలకే అనుభవం ఉందన్నారు. మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హతను బట్టి +2, హైస్కూల్, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తిని బట్టి అందరిని భర్తీ చేయాలని కోరారు. వీటిల్లో ఎస్జీటీలను నియమించకూడదని తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్జీటీలు వేల సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. బదిలీల్లో ఖాళీలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయని, ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో ఒక ఎస్జీటీ బదిలీ కోసం జిల్లాలో ఖాళీగా ఉన్న అన్నీ స్థానాలను ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది సమయంతో కూడుకున్న అంశమని, ఎస్జీటీలకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్జీటీలకు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు.