భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి
బాపట్ల: భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి సూచించారు. భూ పరిపాలన శాఖ అడిషనల్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లాలలోని అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం జరిగింది. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో రీ సర్వే కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. రేపల్లె డివిజన్‌కు సంబంధించి 100 మంది లబ్ధిదారులు డొంక పోరంబోకు భూములను ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారనే సమాచారం మేరకు వారి వివరాలు సేకరించాలని సూచించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి పట్టాల మంజూరు నిమిత్తం ప్రతిపాదనలు తయారు చేసి పంపాల్సిందిగా సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, సర్వేశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి


