ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా పి.నాగేశ్వరరావు
బాపట్ల: ఏపీ ఎన్జీవో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పి.నాగేశ్వరరావును ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. బాపట్ల జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ యూనిట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో సోమవారం జరిగింది. తొలుత డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ప్రదర్శనగా ఉద్యోగులు ఎన్జీవో హోమ్‌కు చేరుకున్నారు. జిల్లాలోని ఏడు తాలూకాల నుంచి వచ్చిన 300 మంది ఏపీ ఎన్జీవో సంఘ సభ్యులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు షరీఫ్ వ్యవహరించారు. జిల్లాలోని 17 పదవులుగాను 17 నామినేషన్లు మాత్రమే రాగా ఏకగీవ్రంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్ష, కార్యదర్శులు వీరే...
జిల్లా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులుగా పి.నాగేశ్వరరావు, కార్యదర్శిగా బి.ప్రసాదరావు, కోశాధికారిగా డి.నాగేశ్వరరావు, సహాధ్యక్షుడిగా చింత శేషుబాబు ప్యానల్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో పల్నాడు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కిలారు జగదీశ్వర్‌రావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి శ్యామ్ సుందర్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్ బాబు, కార్యదర్శి ఆర్.సి.హెచ్.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


