సుఖమయ జీవనానికి యోగా దోహదం
బాపట్ల: మానవాళి సుఖమయ జీవన విధానానికి యోగా ఎంతగానో దోహద పడుతుందని బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. మూడు రోజులుగా బాపట్ల మండలం జిల్లెళ్ళమూడిలో జరుగుతున్న జాతీయస్థాయి యోగాసన చాంపియన్ షిప్ ముగింపు సందర్భంగా సోమవారం జరిగిన సభకు నరేంద్ర వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారతీయతలో యోగా అంతర్భాగమన్నారు. పోటీల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి అనీషా భౌమిక్‌కు చాంపియన్ ఆఫ్ చాంపియన్ షిప్ ట్రోఫీని ఎమ్మెల్యే, నిర్వాహకులు కలిసి అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్ యోగా ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్, ప్రధాన కార్యదర్శి మృణాల చక్రవర్తి, రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్షుడు కూన కృష్ణదేవరాయులు, చైర్మన్ కళ్లం హరినాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్, వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, అసోసియేషన్ కోఆర్డినేటర్ శ్రీమన్నారాయణ, సభ్యులు శీలం శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీనారాయణరెడ్డి నాగరాజు, వీరభద్రయ్య, ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


