
ఎల్‌ఐసీ పాలసీలపై జీఎస్టీని తీసి వేయాలి
సత్తెనపల్లి: పాలసీలపై జీఎస్టీ తీసి వేయాలని, పాలసీదారులకు బోనస్‌ను పెంచాలని ఎల్‌ఐసీ ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఐదు లాంతర్ల సెంటర్‌లో గల మాడా విశ్వేశ్వరరావు ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన లియాఫీ ఏజెంట్ల యూనియన్ మచిలీపట్నం డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాలసీదారులకు లోన్‌పై వడ్డీ రేటు తగ్గించాలని, ఏజెంట్లు అందరికీ మెడి క్‌లైమ్‌ను కుటుంబ సమేతంగా కల్పించాలని కోరారు. గ్రూప్ ఇన్స్యూరెనన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నంత కాలం కలిపించాలని డిమాండ్ చేశారు. సమాజంలో దిగువ తరగతి వారికి రూ. లక్ష పాలసీ ప్రవేశ పెట్టాలని మేనేన్‌మెంట్‌ను ఆయన కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సత్తెనపల్లి బ్రాంచి అధ్యక్షుడు మంచాల రమేష్ మాట్లాడుతూ ఎల్‌ఐసీ ఏజెంట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు అని, ఎల్‌ఐసీని బలోపేతం చేయడంలో కీలకమని తెలిపారు. ఏజెంట్లు అభివృద్ధికి సంస్థ కృషి చేయాలని కోరారు. సమావేశంలో డివిజన్ నాయకులు రవీంద్రరెడ్డి, అలిమియా, జగన్నాథం, రఘు, శ్రీనివాసరెడ్డి, మారుతి, సత్తెనపల్లి బ్రాంచి ఎల్‌ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు.
ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ
పాలసీదారులకు బోనస్ పెంచాలి