దాడుల్లో బట్టబయలు | - | Sakshi
Sakshi News home page

దాడుల్లో బట్టబయలు

May 19 2025 2:42 AM | Updated on May 19 2025 2:42 AM

దాడుల

దాడుల్లో బట్టబయలు

సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025

చీరాల అర్బన్‌: పాలు కల్తీ.. నూనె కల్తీ.. పప్పు దినుసులు కల్తీ.. ఎటు చూసినా విషాహారం.. ఏ హోటల్‌లో తిందామన్నా విచ్చలవిడిగా రంగులు వాడిన పదార్థాలు దర్శనమిస్తున్నాయి. విషతుల్యమైన మాంసం, చేపలు, రొయ్యలు, మరగబెట్టి మళ్లీవాడే నూనెలు, పాడైపోయిన దినుసులు వాడుతూ తయారు చేసిన ఆహారాన్ని అధిక ధరలకు అమ్మేస్తున్నారు. విషాహారంతో అమాయక ప్రజలను వ్యాపారులు ఆస్పత్రులకు పంపుతున్నారు. చీరాల పట్టణంలో ఆహార పదార్థాల్లో కల్తీ పెరిగినా అధికారులు, పాలకులు కన్నెత్తి చూడటం లేదు.

రంగుల గరళం

ముఖ్యంగా చిన్నారులను టార్గెట్‌ చేస్తున్న వ్యాపారులు పలు పదార్థాల్లో ప్రమాదకరమైన రసాయనాలతో ఉన్న రంగులు కలుపుతూ అంటగడుతున్నారు. వీటిని తింటే జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చీరాల నియోజకవర్గంలో బహుళ అంతస్తుల్లో నిర్వహిస్తున్న వెజ్‌, నాన్‌వెజ్‌ రెస్టారెంట్లు 15 ఉన్నాయి. పలావు పాయింట్లు, చికెన్‌ పకోడి, బిర్యాని పాయింట్లు, జాతీయ రహదారి వెంబడి నిర్వహించే షాపులు సుమారు వంద వరకు ఉన్నాయి. చీరాల, వేటపాలెం మండలాల్లో చిన్న చిన్న షాపులు, తోపుడు బండ్లపై పెట్టిన బిర్యానీ పాయింట్లు 50 వరకు ఉన్నాయి. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా బిర్యానీ పాయింట్లు వెలిసి ప్రజారోగ్యానికి హానికరంగా మారాయి.

ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ తప్పనిసరి

హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ శాఖ నిబంధనలు మేరకు ఆహారం తయారు చేయాలి. 2006లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, చీరాల, బాపట్లకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా ప్రతి నెలా 12 శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. ఆ నివేదికల ఆధారంగానే కేసులు నమోదు చేసి జరిమానా, శిక్షలు విధిస్తారు.

అనుమతులు తప్పనిసరి

ఆహారానికి సంబంధించిన వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన కార్యాలయం ఒంగోలులో ఉంది. లైసెన్స్‌ కోసం ప్రభుత్వానికి నిర్ణీత రుసుం చెల్లిస్తే అధికారులు పరిశీలించి జారీ చేస్తారు. అయితే, చాలా వరకు లైసెన్స్‌లు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నట్లు సమాచారం.

న్యూస్‌రీల్‌

ఆహారంలో విచ్చలవిడిగా రంగుల వాడకం జీర్ణకోశ వ్యాధులకు గురయ్యే అవకాశం రెస్టారెంట్లలో రోజుల తరబడి ఫ్రిజ్‌ల్లో ఆహారం నిల్వ పప్పు దినుసుల్లో నాణ్యత డొల్ల ఫుడ్‌ కంట్రోలర్ల దాడుల్లో బయటపడుతున్న వాస్తవాలు

విష రసాయన రంగుల వినియోగం

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తరచూ నిర్వహించే తనిఖీల్లో కఠోర వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన రెస్టారెంట్లలోనూ ఆహారం నాణ్యతగా ఉండటం లేదు. చీరాలలో ఇటీవల పలు బిర్యాని పాయింట్లను పరిశీలించగా ఫ్రిజ్‌ల్లో నిల్వ ఉంచిన చేపలు, రొయ్యలు, చికెన్‌, మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పుదీనా చట్నీలు దర్శనమిచ్చాయి. అయితే, వీటిలో కలిపేందుకు వినియోగించే రంగుల డబ్బాలు, టేస్టింగ్‌ సాల్ట్‌ ప్యాకెట్లు చూసి విస్తుపోయారు. కిచెన్‌ అపరిశుభ్రంగా ఉండడం, వాడిన నూనెనే తిరిగి వాడటాన్ని గుర్తించి నిర్వాహకులకు నోటీసులు అందించారు. బస్టాండ్‌ వద్ద ఉన్న స్వీట్స్‌ కార్ఖానాను పరిశీలించారు. అపరిశుభ్రత, పప్పు దినుసులు కల్తీగా ఉన్నట్లుగా గుర్తించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. ఫుడ్‌ కలర్‌ను పరిమితికి మించి వాడుతున్నారు. ఒక కిలోకు 0.001 మిల్లీ గ్రాములు వాడాల్సి ఉన్నా.. దీనికి ఎన్నో రెట్లు అదనంగా వినియోగిస్తున్నారు.

పట్టణంలోని రెస్టారెంట్లలో ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్‌, రొయ్యలు, అల్లం.. వెల్లుల్లి పేస్ట్‌ వంటివి గమనించి నిర్వాహకులకు నోటీసులు అందించారు. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

చీరాల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో ఉన్న బిర్యానీ సెంటర్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఆహార లైసెన్స్‌లు లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిచెన్‌ అపరిశుభ్రంగా ఉంచడం, టేస్టింగ్‌ సాల్ట్‌, ఫుడ్‌ కలర్లను విచ్చలవిడిగా వాడుతుండటంతో చర్యలు తప్పవని హెచ్చరించారు.

చీరాల పట్టణంలోని హోటల్స్‌ ఇటీవల ఫుడ్‌ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ తనిఖీ చేపట్టారు. అపరిశుభ్రతతో పాటు పప్పు దినుసులు కొన్ని కల్తీవిగా గుర్తించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.

ఫుడ్‌ కలర్‌ ఎక్కువగా వాడితే ప్రమాదం

నిత్యం తినే ఆహారంలో ఫుడ్‌ కలర్‌ ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మాంసాహారం వడ్డిస్తున్నారు. తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిస్తున్నాం. నివేదికలు వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాం.

–జి.ప్రభాకరావు,

అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌

దాడుల్లో బట్టబయలు 1
1/5

దాడుల్లో బట్టబయలు

దాడుల్లో బట్టబయలు 2
2/5

దాడుల్లో బట్టబయలు

దాడుల్లో బట్టబయలు 3
3/5

దాడుల్లో బట్టబయలు

దాడుల్లో బట్టబయలు 4
4/5

దాడుల్లో బట్టబయలు

దాడుల్లో బట్టబయలు 5
5/5

దాడుల్లో బట్టబయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement