
రాష్ట్రస్థాయి పవర్ లిప్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంప
సత్తెనపల్లి: స్థానిక పవర్ హౌస్ ఫిట్‌నెస్‌లో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పల్నాడు జిల్లా నుంచి జట్టు ఎంపిక ఆదివారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఆర్‌పీ ఆనంద్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి 2 జూన్ వరకు రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఏక్విపైడ్ పోటీలు జరుగుతాయి.కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సెక్రటరీ పసుపులేటి సురేష్, ప్రెసిడెంట్ జిమ్ రాజు, జి.రమేష్, కత్తి పవన్‌కుమార్, ఎం.రాహుల్‌గౌతమ్, సయ్యద్ మస్తాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, శాంతయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి సురేష్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో పథకాలను సాధించి పల్నాడు జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.
ఎంపికై న జట్ల వివరాలు ఇలా..
సబ్ జూనియర్: 43 కేజీలు కత్తి పల్లవి (గురజాల), 53 కేజీలు కె.కార్తిక్ (గురజాల), 66 కేజీలు ఎం.వినయ్ వెంకట శివ(సత్తెనపల్లి) జూనియర్ విభాగం: 53 కేజీలు ఎం.సాయి గగన్ (సత్తెనపల్లి),74 కేజీలు ఎన్. శరత్(కంకణాలపల్లి), 74 కేజీలు పి.శ్రీహర్ష రమేష్ చౌదరి (కంకణాలపల్లి), 83 కేజీలు పసుపులేటి వంశీ కృష్ణ (సత్తెనపల్లి),120 కేజీలు ఎల్. శివనాగేశ్వరరావు(గుడిపుడి) ఎంపికయ్యారు.