
హామీలను తుంగలో తొక్కుతున్న కంపెనీలు
మంత్రులు, శాసన సభ్యులు, అధికారుల సమక్షంలో రైతుల పొగాకు నూటికి నూరు శాతం కొనుగోలు చేస్తామని అంగీకరించిన కంపెనీలు అనంతరం ప్లేటు ఫిరాయించాయి. పొగాకు రంగు బాగోలేదని, నల్లగా ఉందని, పచ్చ ఆకు తగులుతుందని సాకులు చెబుతూ పొగాకు చెక్కులను వెనక్కి పంపిస్తున్నారు. ఒకటి రెండు కొట్టుడు, అడుగు ఆకులు అసలు కొనుగోలు చేయమంటూ తెగేసి చెబుతున్నారు. చెక్కులు తిరగ తొక్కమని చెప్పడం, కాటాల్లో తరుగు పెట్టడం, ధరలో కోత పెట్టడం వంటి చర్యలు చేస్తున్నారు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.