
పర్చూరు బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం
పర్చూరు(చినగంజాం): పర్చూరు బస్టాండు వద్ద వర్షపు నీటిలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వర్షపు నీటిలో ఉన్న మృత దేహాన్ని బయటకు తీశారు. అక్కడ పడి ఉన్న విధానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంచనామా నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టుం నిమిత్తం పర్చూరు వైద్యశాలకు తరలించారు.
కారు బోల్తా : వ్యక్తికి గాయాలు
చినగంజాం: మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ గాయాలపాలైన సంఘటన చినగంజాం– ఉప్పుగుండూరుల మధ్య జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. దర్శి గ్రామానికి చెందిన వెదురు చెన్నారెడ్డి శనివారం చీరాల నుంచి ఒంగోలు వైపు కారు డ్రైవింగ్ చేస్తూ వెళుతున్నాడు. చినగంజాం టోల్ ప్లాజా దాటిన తరువాత సాయిబాబ విగ్రహం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌లోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. డ్రైవర్ చెన్నారెడ్డికి స్వల్ప గాయాలు కావడంతో హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పర్యాటకుడిపై దాడి.. కేసు నమోదు
చీరాల: సముద్రతీరంలో సేదతీరేందుకు వచ్చిన వ్యక్తిపై కొందరు దాడి చేసి గాయపరచిన సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం చీరాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వేటపాలెం మండలం సంపత్‌నగర్‌కు చెందిన యనుముల వీరాస్వామి అతని కుటుంబంతో శుక్రవారం రామాపురం సముద్రతీరానికి వెళ్లారు. అదే సమయంలో వారి పక్కన సముద్రస్నానం చేస్తున్న కొందరు యువకులు గోల చేస్తూ ఇబ్బందిగా ప్రవర్తించడంతో వీరాస్వామి వారించాడు. ఆవేశానికి గురైన యువకులు అతనిపై దాడి చేయగా అడ్డుకోబోయిన అతని కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నకరికల్లు: ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శనివారం జరిగింది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొలిమి బడే సాహెబ్ (69) పొలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. గ్రామశివారులో ఇటుక బట్టీల వద్ద రోడ్డు దాటుతుండగా చిలుకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఆతనికి తీవ్రగాయాలు కాగా, నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్ తెలిపారు.

పర్చూరు బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం

పర్చూరు బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం