
సాగర్ కుడి కాలువకు తాగునీటి విడుదల
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు గురువారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలతో కుడి కాలువ 2, 3వ గేట్లు ద్వారా 5,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. తాగునీటి అవసరాల నిమిత్తం 4 టీఎంసీలను రోజుకు 5,500 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని అధికారులు సూచించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ నుంచి విడుదలవుతున్న నీరు