బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

May 23 2025 2:31 AM | Updated on May 23 2025 2:31 AM

బాపట్

బాపట్ల

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025
వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 512.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,459 క్యూసెక్కులు విడుదలవుతోంది.

కొనసాగుతున్న సదరం క్యాంప్‌

తెనాలిఅర్బన్‌: వికలాంగుల ధ్రువపత్రాల పున:పరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్‌ గురువారం కొనసాగింది.

సుఖీభవ లబ్ధిదారుల నమోదు

నూజెండ్ల: నూజెండ్ల రైతుసేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల నమోదు చేపట్టారు. ఇప్పటివరకు 13,175 మంది వివరాలు నమోదు చేశారు.

ఇంకొల్లు–పర్చూరు (పాత మద్రాసు) రోడ్డు ఆధునికీకరణ పనులకు గత ప్రభుత్వం రూ.22 కోట్ల నిధులు మంజూరు చేసి 19 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డుఽ పనుల్లో 28 శాతం పూర్తి చేసింది. ఇంకొల్లులో సిమెంట్‌ రోడ్డు నిర్మాణంతోపాటు రహదారిలో ఉన్న కల్వర్టు పనులను దాదాపుగా పూర్తిచేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది ముగుస్తున్నా రోడ్డుపై తట్టమట్టి పోయలేదు. ఇటీవల వర్షాలు కురవడంతో మరింత అధ్వానంగా తయారైంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ దారిలో ఇంకొల్లు మొదలు ఇడుపులపాడు, వంకాయలపాడు, దగ్గుపాడు, నూతలపాడు, ఎర్రగుంటపాలెం, పర్చూరుతోపాటు పలు గ్రామాలున్నాయి.

ఈ దారిగుండా అటు పర్చూరు నుంచి చిలుకలూరిపేట, గుంటూరు, విజయవాడతో పాటు పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్‌కు ఇటు ఇంకొల్లు నుంచి చైన్నె– కోల్‌కతా జాతీయరహదారి మీదుగా ప్రకాశం, నెల్లూరు, చైన్నె, తిరుపతి జిల్లాకు వెళ్లవచ్చు. మండలానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి పలుమార్లు రోడ్లు భవనాల శాఖ డీఈ, కాంట్రాక్టర్‌తో మాట్లాడి నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలని కోరారు. ఆ శాఖ సీఈ రోడ్డును పరిశీలిస్తారని, ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని జేఈ శ్రీకాంత్‌ ఆరునెలల కిందట చెప్పినా ఇప్పటికీ పురోగతి లేదు.

శ్రద్ధ చూపని పచ్చనేత ...

నూతలపాడు–మార్టూరు, పర్చూరు యద్దనపూడి, ఇంకొల్లు, నాగట్లతో పాటు పలు రహదారులు ఇప్పటికే గుంతలమయంగా మారాయి. వర్షాలు పెరిగితే పూర్తిగా రాకపోకలు స్తంభించే అవకాశముంది. ఇప్పటికే ఈ రోడ్లలో పది కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఎన్నికల్లో ఓట్లేయించుకొన్న నియోజకవర్గ పచ్చనేత ప్రకృతి వనరులను కొల్లగొట్టడంలో చూపిస్తున్న శ్రద్ధ ఇక్కడి రోడ్లను మరమ్మతు చేయించడంలో చూపడం లేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

9

న్యూస్‌రీల్‌

పనులు వెంటనే మొదలు పెట్టాలి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి

అవకతవకలు లేకుండా చూడండి

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

రేషన్‌ డీలర్ల నాయకులతో సమీక్ష

బాపట్ల జిల్లాలో రోడ్లు అధ్వానం

ఏడాది పాలన ముగుస్తున్నా

రోడ్లకు మరమ్మతులు లేవు

ప్రధాన రహదారి పనులను

గాలికి వదిలిన కూటమి

గుంతలమయంగా ఇంకొల్లు,

పర్చూరు ప్రధాన రహదారి

19 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు

రూ. 22 కోట్లు కేటాయించిన

గత ప్రభుత్వం.. అప్పటికే

28 శాతం పనులు పూర్తి

మరింత అధ్వానంగా

నూతలపాడు–మార్టూరు రోడ్డు

పర్చూరు–యద్దనపూడి రోడ్డుది

ఇదే పరిస్థితి

దుస్థితిలో ఇంకొల్లు– నాగట్ల రోడ్డు

‘గత ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ప్రభుత్వం ఒక్క రోడ్డును రిపేరు చేయలేదు. మేము అధికారంలోకి రాగానే రోడ్లను అద్దంలా మారుస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక కొత్త రోడ్ల నిర్మాణం సంగతి దేవుడెరుగు ఉన్న రోడ్ల గుంతలను పూడ్చకుండా గాలికి వదిలేశారు. అధికారం దక్కాక బోడిమల్లన్న చందంగా వ్యవహరిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, బాపట్ల

ఇంకొల్లు– పర్చూరు రోడ్డు అధ్వానంగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రోడ్డు ప్రమాదాలతో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నియోజకవర్గంలోని నూతలపాడు–మార్టూరు, పర్చూరు యద్దనపూడి, ఇంకొల్లు, నాగట్లతోపాటు పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. తక్షణం ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

– గాదె మధుసూదన్‌రెడ్డి,

వైఎస్సార్‌సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త

ఇంకొల్లు– పర్చూరు రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తిచేయాలి. వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు ఇచ్చింది. 28 శాతం పనులు పూర్తయ్యాయి. అధికారులు, కాంట్రాక్టర్‌తో సకాలంలో పనులు పూర్తి చేయించలేక పోయారు. రోడ్డు మరింతగా దెబ్బతినడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాలు పడడంతో రోడ్డు మరింత గుంతలమయంగా మారుతోంది.

– భవనం శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ, ఇంకొల్లు

బాపట్ల1
1/10

బాపట్ల

బాపట్ల2
2/10

బాపట్ల

బాపట్ల3
3/10

బాపట్ల

బాపట్ల4
4/10

బాపట్ల

బాపట్ల5
5/10

బాపట్ల

బాపట్ల6
6/10

బాపట్ల

బాపట్ల7
7/10

బాపట్ల

బాపట్ల8
8/10

బాపట్ల

బాపట్ల9
9/10

బాపట్ల

బాపట్ల10
10/10

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement