
విద్యార్థి అదృశ్యం
మూడు రోజులుగా లభించని ఆచూకీ
కారంచేడు: కారంచేడు పాలేటివారి బజారుకు చెందిన ఓ విద్యార్థి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఎప్పుడూ ఇల్లు కదలని అతడు అదృశ్యం కావడంపై పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మీనిగ జయప్రకాష్‌కు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు సామ్యేల్ ప్రణీత్ చీరాల లోని ఒక ప్రైవేటు స్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో ఇంటి వద్దనే ఉంటున్న బాలుడు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. మూడు రోజులుగా బంధువులు, స్నేహితుల వద్ద విచారించామని చెబుతున్నారు. ఆదివారం సామ్యేల్ వాడుతున్న సైకిల్ పర్చూరు గ్రామంలోని ఉప్పుటూరు వంతెన వద్ద స్టాండ్ వేసి ఉండటం గమనించామని పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఆచూకీ తెలిసిన వారు 9515640934, 9542618260 నంబర్లకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.