రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం

May 14 2025 2:02 AM | Updated on May 15 2025 2:36 PM

బాపట్

రైతు సంక్షేమానికి తూట్లు

మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున
 

పర్చూరు(చినగంజాం): రాష్ట్రంలో రైతులు అధైర్యపడొద్దని ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని.. మనోధైర్యంతో మెలగాలని.. వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు ఉప్పుటూరు సాంబశివరావు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంకొల్లు మండలం దుద్దుకూరుకు చెందిన మరో రైతు బిల్లా శ్యాంసన్‌ కుటుంబాలను పర్చూరు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డితో కలసి నాగార్జున పరామర్శించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తోందన్నారు. వీరన్నపాలేనికి చెందిన ఉప్పుటూరు సాంబశివరావు బీసీ కులానికి చెందిన పేదవాడు అని.. కౌలుకు తీసుకున్న డబ్బులు కట్ట లేక, పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆనాడు దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిలు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండుగ అనే ధోరణిలోని పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేదలు వ్యవసాయం చేస్తూ.. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అయినా ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ ఇక్కడకు వచ్చినా ఎలాంటి సహాయం అందలేదంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి రూ.2 వేల కోట్లు పొగాకు రైతుకిచ్చి ఆదుకున్నారన్నారు. రైతులకు రైతు భరోసా అందించి జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మభ్యపెడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు భరోసా అందించి అండగా నిలవాలని కోరారు. రైతుల తరఫున పోరాడేందుకు మాజీ సీఎం జగన్‌ ఈ ప్రాంతానికి రావాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు.

జగన్‌ ఆదేశాలతో పర్యటనలు 
అనంతరం పర్చూరు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెళ్లి రైతుల బాధలు తెలుసుకొని వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో తాత్సారం చేయకుండా తక్షణమే కంపెనీల ద్వారా కొనిపించడమో లేదా స్వయంగా ప్రభుత్వం కొనుగోలు చేయడమో చేయాలని కోరారు. ఐదేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని.. తిరిగి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారంతా సుఖపడతారన్నారు.

ఆయా గ్రామా ల్లోని పొగాకు నిల్వలను వారు పరిశీలించారు. పార్టీ నాయుకులు భవనం శ్రీనివాసరెడ్డి, మార్టూరు, కారంచేడు మండల కన్వీనర్‌ పఠాన్‌ కాలేషావలి, జువ్వా శివరాంప్రసాద్‌, గర్నెపూడి రవిచంద్‌, ముప్పాళ్ల రాఘవయ్య, పాదర్తి ప్రకాష్‌, బిల్లా డేవిడ్‌ వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాపట్ల1
1/2

రైతు సంక్షేమానికి తూట్లు

బాపట్ల2
2/2

రైతు సంక్షేమానికి తూట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement