
సాక్షి టీవీ జిల్లా ప్రతినిధిపై దాడి చేసిన వారిపై చర్యలు
బాపట్ల : సాక్షి టీవీ గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కలెక్టర్ వద్ద మంగళవారం కొద్ది సేపు నిరసన వ్యక్తం చేసి జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, ఎస్‌బీ సీఐ నారాయణకు వినతిపత్రం అందించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రతికా విలేకరులపై దాడులు హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టుగా భావించాలని సూచించారు. సమాచారాన్ని సేకరించేందుకు వెళ్లిన అశోక్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సాక్షి బాపట్ల ప్రతినిధి, బి.రమణారెడ్డి అసోసియేషన్ నాయకులు గోపిశెట్టి రాఘవ, వేజండ్ల శ్రీనివాసరావు, సృజన్‌పాల్, వెంకట్, అంజయ్య, దాసు, మరియదాసు, బత్తుల సురేష్, చీమలదిన్నె నారాయణ, షాజహాన్, చంటి, చెన్నకేశవరెడ్డి, వీరేష్, యాసిన్, పొటికలపూడి జయరామ్, వాసు, బొగ్గవరపు శివ, శీలం సాగర్ తదితరులు ఉన్నారు.