
గుర్తుతెలియని మృతదేహానికి పోస్టుమార్టం
మార్టూరు: గుర్తుతెలియని మృతదేహానికి మార్టూరు పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం చేయించిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. మార్టూరు ఏఎస్‌ఐ మహబూబ్ బాషా మరో కానిస్టేబుల్‌తో కలిసి ఓ మృతదేహాన్ని ఆటోలో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతదేహం ఉన్న విషయం తెలుసుకున్న కొంతమంది విలేకరులు అక్కడికి చేరుకునేసరికి .. దహన సంస్కారాలు చేసేందుకు పంచాయతీ సిబ్బంది మృతదేహాన్ని ఆటోలో ఎక్కిస్తూ కనిపించారు. వివరాల కోసం ప్రయత్నించిన విలేకరులకు పోలీసులు సమాచా రం ఇవ్వకుండా తీసుకొని వెళ్లారు. శవ పంచనామాలో పాల్గొన్న ఆసుపత్రి సిబ్బందికి పోలీసులు ఫోన్‌చేసి మీడియాకు సమాచారం చెప్పవద్దని ఆదేశించినట్లు తెలిసింది. కొంతసేపటికి ఎస్‌ఐ సైదా విలేకరులకు ఫోన్‌చేసి ఆ మృతదేహం ఓ బిచ్చగాడి దని మీరు రాయటానికిఏమీ లేదన్నారు.