
వేమూరులో తిరంగా ర్యాలీ
వేమూరు: ఉగ్రవాదులను అంతం చేసేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్ భయపడి పోయిందని బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణం శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వేమూరులో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంలో మొక్కలు నాటారు. మానవహారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్ర చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, గ్రామ సర్పంచ్ సజ్జా లక్ష్మీ తిరుపతమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, జొన్నలగడ్డ విజయబాబు, ఉసా రాజేష్, బండారు సూర్యనారాయణ, తహసీల్దారు సుశీల, ఎంపీడీవో శ్రీమన్నారాయణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.