
విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం
పర్చూరు(చినగంజాం): విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటన గురువారం పర్చూరు నెహ్రూనగర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. నెహ్రూనగర్ కాలనీకి చెందిన నల్లబోతుల రాజాకు చెందిన పూరింటిలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పంటుకుంది. దాంతో పూరిల్లు పూర్తిగా తగులబడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఇంటిలోని నగదు, వెండి ఆభరణాలు, విలువైన కాగితాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి, సకాలంలో అగ్నిమాపక యంత్రం రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి అదుపులోనికి తీసుకొని వచ్చారు. సుమారు రూ.లక్షపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
రూ.లక్షకు పైగా నష్టం

విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం