
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్–2025
గుంటూరుఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నా యి. ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సు ల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాకినాడలోని జేఎన్‌టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2025ను నిర్వహిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు 41,319 మంది విద్యార్థులు హాజరు కాను న్నారు. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షలకు 34,148, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 7,106, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 65 మంది ఉన్నారు. వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలను కలుపుకుని మొత్తం 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షల జరగనున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో
41,319 మంది విద్యార్థులు
ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 41,319 మంది హాజరు కానున్నారు.
● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 25,692 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 21,551, అగ్రికల్చర్, ఫార్మసీ 4,100, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 41 మంది ఉన్నారు.
● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 11,126 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 9,198, అగ్రికల్చర్, ఫార్మసీ 1,912, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 16 మంది ఉన్నారు.
–బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల పరిధిలో మొత్తం 4,501 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 3,399, అగ్రికల్చర్, ఫార్మసీ 1,094, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు ఎనిమిది మంది ఉన్నారు.
విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి
● విద్యార్థులు ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్‌లో విద్యార్థి కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలి.
నిముషం ఆలస్యమైనా నో.. ఎంట్రీ
ఏపీ ఈఏపీ సెట్‌కు హాజరు కానున్న విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు అనుమతిస్తారు. ఉదయం 9.00 గంటలు, మధ్యాహ్నం 2.00 గంటల తరువాత నిముషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్ష జరిగే రోజున కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిముషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి.
19, 20 తేదీల్లో అగ్రికల్చర్,
ఫార్మసీ ప్రవేశ పరీక్షలు
21 నుంచి 27 వరకు
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా
హాజరు కానున్న 41,319
మంది విద్యార్థులు
మూడు జిల్లాల్లో 22 పరీక్ష కేంద్రాలు
నిముషం ఆలస్యమైనా నో... ఎంట్రీ