
వైఎస్ జగన్‌తోనే సుపరిపాలన సాధ్యం
గుంటూరు ఎడ్యుకేషన్:ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన వైఎస్. జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో శనివారం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. పార్టీ న్యూజిలాండ్ కన్వీనర్ నెల్లూరి బుజ్జిబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సాంబశివారెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర పథాన ముందుకు దూసుకెళ్లిందని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఆయన సుపరిపాలన అందించారని కొనియాడారు. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలే కాకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం వైఎస్ జగన్ నాయకత్వానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. బుజ్జిబాబు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత వైఎస్ జగన్ పరిపాలన చరిత్రలో మరపురాని ముద్ర వేసిందని పేర్కొన్నారు. 17 మెడికల్ కళాశాలలు, పోర్టులు, విద్య, వైద్యంతో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌లో జరిగిన సమావేశానికి ఆన్‌లైన్‌లో గుంటూరుకు చెందిన జి. శాంతమూర్తి హాజరయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ న్యూజిలాండ్ ఎన్నారై కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.