పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

May 14 2025 2:02 AM | Updated on May 14 2025 2:02 AM

పథకాల

పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రేపల్లె: రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ ఏడీ నాంచారయ్య అన్నారు. పట్టణంలోని పశు వైద్యశాలలో పశు యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన దాణాను మంగళవారం ఆయన పంపిణీ చేసి, మాట్లాడారు. పశువులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. యజమానులు తమ పశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్‌, పశు వైద్యాధికారి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు

20న రాష్ట్ర స్థాయి

ఎద్దుల పోటీలు

కారంచేడు: ఈ నెల 20వ తేదీన గ్రామ దేవత స్వర్ణమ్మ తల్లి తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎద్దుల పరుగు పందెం పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి రూ. 20 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాలుగో బహుమతి రూ. 5 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు దుర్గారావు 77308 30949, సాయికిరణ్‌ 63001 50488, నంగనం తేజ 80742 60245 ఫోను నంబర్లలో సంప్రదించాలని కోరారు.

కోడి గుడ్ల లారీ బోల్తా

జె.పంగులూరు: మండల పరిధిలోని ముప్పవరం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం అదుపు తప్పిన కోడి గుడ్లు లారీ బోల్తా పడింది. బోయపాలెం నుంచి టంగుటూరు వెళుతుండగా, ముందున్న వాహనాన్ని క్రాస్‌ చేయబోయి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌తోపాటు లారీ క్యాబిన్‌లో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కోడిగుడ్లు రోడ్డుపై పడి పగిలిపోయాయి. అప్రమత్తం అయిన హైవే సిబ్బంది ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చేశారు.

గుర్తు తెలియని వ్యక్తి

మృతదేహం లభ్యం

అద్దంకి: మండలంలోని శింగరకొండ దేవస్థానం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు సీఐ సుబ్బరాజు మంగళవారం తెలిపారు. అతడి వయసు సుమారు 45 – 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికై నా మృతుడి ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.

పథకాలను రైతులు  సద్వినియోగం చేసుకోవాలి 
1
1/1

పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement