
జీవనోపాధి మెరుగుపరుచుకోవాలి
డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు
కర్లపాలెం: స్వయం సహాయక సంఘాలలోని మహిళలు తమ జీవనోపాధులు మెరుగుపరుచుకోవాలని డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు చెప్పారు. కర్లపాలెంలోని భవిత గ్రామ సమైఖ్య సంఘం సభ్యులతో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు మంగళవారం రాత్రి సమావేశమై సూక్ష్మ రుణ ప్రణాళికపై చర్చించారు. పీడీ మాట్లాడుతూ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలను వినియోగించుకుని చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కుటీర పరిశ్రమల లాంటివి స్థాపించుకుని వాటిని అభివృద్ధి చేయటం ద్వారా ఆర్థికంగా లబ్ధిపొందాలని చెప్పారు. 2025–26 సంవత్సరానికి సంబంధించిన సూక్ష్మ ప్రణాళికలను సంసిద్ధం చేసుకోవాలని చెప్పారు. గ్రామ సమైఖ్య సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలని చెప్పారు. కార్యక్రమంలో సీసీ రాఘవ, వీవోఏలు రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, నూరా, డ్వాక్రా మహిళలు తదితరులు ఉన్నారు.